koodali

Monday, July 21, 2014

సరోగసి .....................


ఈ రోజుల్లో  సరోగసి  గురించి ,  సరోగసి  మదర్స్  గురించి,   అద్దె  గర్భాల  గురించి  వార్తలను  వింటున్నాము  . 

పురాణేతిహాసాల్లో  ఇలాంటి  వాటిని  పోలిన  సంఘటనలు  ఉన్నాయి.   


ఉదా..శ్రీ  కృష్ణుని  సోదరుడైన  బలరాముని   విషయంలో  చూస్తే...

..దేవకీ దేవికి  సప్తమ  గర్భంగా  ఆదిశేషుని  అంశం  ప్రవేశించింది. అయిదవ  నెల  నిండగానే  యోగమాయ  తన  యోగశక్తితో  ఈ గర్భాన్ని  సంకర్షణ  చేసి  రోహిణీదేవి  గర్భంలో  ప్రవేశపెట్టింది . 


..దేవకీదేవికి  గర్భస్రావమయ్యిందని   వార్త  నగరమంతటా  వ్యాపించింది....

..తరువాత  కొన్ని  నెలలకు  రోహిణీదేవి  బలరాముని  ప్రసవించింది.

బలరామునికి 
సంకర్షణుడు   అనే  పేరు  కూడా  ఉన్నదంటారు.

సంకర్షణుడు (ఒక గర్భము నుండి మరియొక గర్భమునకు లాగబడిన వాడు)

 పై   విషయాలను   గమనిస్తే  ,మనకు  ఎన్నో  విషయాలు  తెలుస్తాయి.









2 comments:

  1. ఇది నాటి నుంచీ ఉన్నదే, ఇప్పుడు విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. మీరన్నది నిజమే,

    ReplyDelete