koodali

Wednesday, July 23, 2014

ప్రాచీనులు అందించిన అద్భుతమైన విజ్ఞానం..మరియు. . శబ్దశక్తి..

 
ఈ  రోజుల్లో  కొందరు  భారతీయులు  మన   ప్రాచీనసంస్కృతిని  గురించి  ,  ప్రాచీనుల  గురించి  తేలికగా  మాట్లాడుతున్నారు.


  ఈ  మధ్య  ఒకరు  ఏమన్నారంటే,  మాయలు,  మంత్రాలను   తేలికగా  కొట్టిపడేస్తూ ,  ఆధునిక  సైన్సే  విజ్ఞానం  అన్నట్లు  మాట్లాడుతున్నారు.   చిత్రమేమిటంటే,  ఇలా  మాట్లాడేవాళ్ళు  కూడా   తమ  కోరికలు  తీరటం  కోసం  మంత్రాలతో  పూజలు  చేయించుకుంటారు. 



 మంత్రాలకు  చింతకాయలు  రాల్తాయా  ?   అని  కొందరు  అంటుంటారు.  ఇలా  అనటం    అవివేకం.  మంత్రాలు  కూడా  సైన్సులో  భాగమే.  అయితే  అది  ప్రాచీనులకు  తెలిసిన  అద్భుతమైన  సైన్స్. 



ప్రాచీనులు  ఎంతో  దైవభక్తితో  తపశ్శక్తితో  తెలుసుకున్న  మంత్రాలను  లోకానికి  అందించారు. బీజాక్షరాలతో  కూడిన  మంత్రమనే  శబ్దశక్తికి  ఎంతో  శక్తి   ఉంటుంది. 



 శబ్దానికి  ఎంతో  శక్తి  ఉంది. పశుపక్ష్యాదులు  గ్రహించగలిగే   కొన్ని  శబ్దాలను   మానవులు  గ్రహించలేరు. ఈ  విషయాలను   ఆధునికులు  కూడా  గుర్తించారు.

   ఉదా..అల్ట్రాసౌండ్ స్కానింగ్  గురించి  మనకు  తెలుసు.  ఈ  శబ్దశక్తితో (అల్ట్రాసౌండ్ ) ఆధునిక  కాలంలో   ఎన్నో  పనులను  చేస్తున్నారు  కదా  !

...........


కొంతకాలం  క్రిందట  విదేశీపాలకులు  ఈ  దేశాన్ని  దోచి  ఇక్కడి  సంపదతో  పాటు  ఎంతో  విలువైన  విజ్ఞాన గ్రంధాలను  కూడా  తమతో  తీసుకెళ్ళారట. ఆ  గ్రంధాలలోని  విషయాల  గురించి  బాగా  తెలిసిన  కొందరు  పండితులను  కూడా  తమ  దేశాలకు  తీసుకెళ్ళారట. 



ఏమో  ఎవరికి  తెలుసు  ?   అలా  తీసుకువెళ్ళబడిన  పండితుల  సంతానం  విదేశాలలో  వృద్ధి  చెంది  అక్కడి  జనజీవనస్రవంతిలో  కలిసిపోయారేమో  ?  ఇప్పటికీ  వారి  వద్ద  మనదేశపు  ప్రాచీనవిజ్ఞానం  భద్రపరచబడి  ఉందేమో  ?



మన  ప్రాచీన  గ్రంధాలలోని  గొప్పదనం   విదేశీయులకు  తెలుసు   కాబట్టి    ఎందరో   విదేశీయులు   మనదేశపు  గ్రంధాలలోని  విషయపరిజ్ఞానాన్ని   తెలుసుకోవటానికి   సంస్కృతాన్ని  నేర్చుకున్నారట.
 



 మన  దురదృష్టం   ఏమిటంటే ,  మన  దేశీయులలో  కొందరు  మాత్రం   మన  ప్రాచీన  విషయాలను  ఎగతాళి  చేస్తున్నారు.


  
తరతరాల  తరబడి  పరాయి  దేశ పాలనలో  ఉండటం  వల్లనో  లేక  మరేదైనా  కారణం  వల్లో  కానీ  చాలామంది  భారతీయుల్లో  బానిసత్వపు  ఆలోచనాధోరణి   అలాగే  ఉంది. 



  మనకు  ఏమీ  తెలియదు....  మన  పూర్వీకులకు  ఏమీ  తెలియదు..విదేశీయులకే  అన్నీ  తెలుసు...ఇలాంటి  బానిసత్వపు  ఆలోచనల  నుండి   బైటపడినప్పుడు   ఈ  దేశం  ఎంతో  అభివృద్ధిచెందుతుంది.
...................

మన  ప్రాచీన  విజ్ఞానం  గురించిన  అద్భుతమైన  విషయాల  గురించి    కొద్దిగానైనా   తెలుసుకోవాలంటే,  దయచేసి  ఈ  క్రింద   ఇవ్వబడిన  లింక్    చదవండి..


ప్రాచీనులు అందించిన అద్భుతమైన విజ్ఞానం... ... 

భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు..
ETERNALLY  TALENTED  INDIA  -  108 FACTS..









No comments:

Post a Comment