koodali

Thursday, July 31, 2014

చరిత్ర కాలాన్ని నిర్ణయించటంలో........

  
నేటి  పంచాంగకర్తలు,   ఆధునిక  పరికరాల  సహాయం  లేకుండానే  నక్షత్రాలు,  గ్రహాల  స్థితిగతులను  బట్టి,   జ్యోతిష  విజ్ఞానం  ఆధారంగా  లెక్కలుగట్టి ...రాబోయే  గ్రహణాల  గురించి   పంచాంగాలలో  సంవత్సరానికి  ముందే  వివరంగా  చెప్పగలుగుతున్నారు  .  వారు  చెబుతున్న  సమయానికే  గ్రహణాలు  సంభవిస్తున్నాయి.
 
 తిధులు,  నక్షత్రాలు,  గ్రహాలు  ఉన్న  స్థితి  ఆధారంగా    రామాయణ  కాలంలో   జరిగిన  సంఘటనల  యొక్క  వివరాలను  వాల్మీకి  మహర్షి   చక్కగా  పొందుపరిచారంటున్నారు. 

ఆ  వివరాల  ఆధారంగా    ఇప్పటి  వాళ్ళు  రామాయణం   జరిగిన  కాలాన్ని  అంచనా  వేయగలుగుతున్నారు.  

 ఇవన్నీ  గమనిస్తే  ప్రాచీనులు  అందించిన  జ్యోతిషం  ఆధారంగా  చరిత్రకాలాన్ని  కూడా  తెలుసుకోవచ్చని  చక్కగా  తెలుస్తోంది.

........................

ఒకసారి  విక్రమాదిత్యుడు  ధ్యానము చేయగా   అయోధ్యా నగరం  యొక్క  పురాతన  కట్టడాలు   కళ్ళముందు  గోచరించగా  ఆ  ప్రకారం  వారు  ఆ కట్టడాలను ..నిర్మించారని అంటారు.

చరిత్ర   గురించి  తెలుసుకోవాలంటే   ఇలాంటి  అద్భుత  విషయాల  గురించి  కూడా  తెలుసుకోవాలి.

దురదృష్టమేమిటంటే,   కొందరు  ఆధునికులు   ఇలాంటి  విషయాలను  నమ్మము . అంటారు. తమకు  తెలిసిన  కొద్ది  విషయాలే   విజ్ఞానం  తప్ప,....  తమకు  తెలియని  విషయాలు   విజ్ఞానమే  కాదంటారు.

ఆధునికులకు  తెలిసిన  విజ్ఞానం  సముద్రంలో  నీటిబొట్టంత .... తెలియని  విజ్ఞానం  మరెంతో  ఉంది . అని    గ్రహిస్తే  బాగుంటుంది.


( ఈ విక్రమాదిత్యుని  విషయం  ఓం చానల్  వారు  ప్రసారం  చేసిన  అయోధ్య గురించిన  విశేషాల ద్వారా తెలుసుకున్నది.) 
.................

ఆ మధ్య,  నాసా  వాళ్ళు   తాము  తీసిన   రామసేతు  చిత్రాలను  విడుదల  చేసారు.

ఈ  మధ్యనే   ఇంకో  వార్త  వచ్చింది.  ప్రాచీన  కాలంలో  సముద్రంలో మునిగిపోయిన  ద్వారకా  నగర  ఆనవాళ్ళను  గుర్తించామని  ఆధునిక  శాస్త్రజ్ఞులు  ప్రకటించారు.

కొన్ని  లింక్స్..

NASA Images Find 1,750,000 Year Old Man-Made Bridge


Dwaraka - A LOST CITY RECOVERED - ISKCON Desire Tree


................................

సింధు  నాగరికత  శిధిలాలలో  రధాలు,  గుర్రాలు  మొదలైన  వాటి  ఆనవాళ్ళు  లభించనంత  మాత్రాన  ..రామాయణం, భారతం  వంటివి  సింధు  నాగరికతకు  తరువాతే  జరిగాయి ... అని  ఆధునిక  చరిత్రకారులు  భావించటం  సరికాదనిపిస్తుంది.
.......................

 కొన్ని సింధు లోయ ముద్రలు స్వస్తిక్ గుర్తు కలిగి ఉన్నాయి.  హిందూ మతానికి సంబంధించిన కొన్ని ఆధారాలు ప్రాచీన హరప్పా సంస్కృతికి ముందు కూడా ఉన్నాయి.  శివలింగాన్ని పోలిన కొన్ని గుర్తులు కూడా హరప్పా శిథిలాల్లో కనిపించాయి.వీరి చిహ్నాలలో ముఖ్యమైనది పద్మాసనం లో కూర్చున్న ఒక బొమ్మ, మరియు దాని చుట్టూ ఉన్న వివిధ జంతువులు. శివుడి రూపమైన పశుపతి విగ్రహంగా దీన్ని భావిస్తున్నారు. 


 ఈ  పేరాలోని  సింధు  నాగరికతకు  సంబంధించిన  విషయాలు అంతర్జాలం  నుండి  సేకరించినవి... ) 
..........................

చరిత్ర  గురించి  చరిత్రకారులలో  ఎన్నో  బేధాభిప్రాయాలున్నాయి.  చరిత్ర  గురించి  తెలుసుకోవటానికి   ఆధునిక  సైన్స్ ద్వారా  కూడా ప్రయత్నం  చేస్తున్నారు.  

కార్బన్  డేటింగ్   విధానంలో   కొన్నిసార్లు  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉందట.   
..................................

అనేక  కారణాల  వల్ల    చరిత్రను  విశ్లేషించటంలో  పొరపాట్లు  వచ్చే  అవకాశం  ఉంది.

ఇప్పటి  2014  సంవత్సరంలో  కూడా  ప్రపంచంలోని  కొన్ని  తెగలవారికి  ఆధునిక  విజ్ఞానం  గురించి  తెలియదు.  

ఉదా...  10 Tribes That Avoided Modern Civilization..
( The Surma People, Peruvian Tribe .... )  


పట్టణాలకు  కొద్ది  దూరంలో  ఉండే   అడవుల్లో  నివసించే  కొన్ని  ఆటవిక  తెగల  వారికి  కూడా  ఆధునికపరికరాలైన  ఫ్రిజ్,  వాషింగ్ మెషీన్ , కంప్యూటర్..వంటి  వాటి   వాడకం  గురించి  తెలియకపోవచ్చు. 

ఇప్పటికీ    కొందరు   మట్టితో  కట్టుకున్న  ఇళ్ళలో  నివసిస్తూ ...  చెక్కతో  చేసిన  వస్తువులు,  మట్టితో  చేసిన  వస్తువులు  మాత్రమే  వాడుతున్నారు. 


భవిష్యత్తులో  కొన్ని  వేల   లేక  లక్షల    సంవత్సరాల  తరువాత  చరిత్రకారులు   భూమిపై  పరిశోధనలు  చేస్తే...?


ఉదా..   ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్ ,  కంప్యూటర్.. వంటి వాడకం   తెలీని   ప్రాంతములో  త్రవ్వకాలు  జరిపితే.....

...  ఆ  శిధిలాలలో  ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్, కంప్యూటర్..  వంటివి  కాకుండా  చెక్కతో  చేసిన  వస్తువులు, మట్టితో  చేసిన  వస్తువులు  లభించాయనుకోండి,   వాటి  ఆధారంగా   2014  సంవత్సరములో   ప్రపంచంలో  ఫ్రిజ్,  వాషింగ్ మెషిన్ , కంప్యూటర్.. లేవని  చరిత్రకారులు  నిర్ణయించకూడదు కదా  !
...................................

గత కొద్ది  కాలం నుంచి ,  విదేశాల్లో  ఎందరో  భారతీయులు  నివసిస్తున్నారు.  వారిలో  హిందువులూ  ఉంటారు . వారి వద్ద  వేద  సంస్క్రతికి  చెందిన  చిహ్నాలు  ఉంటాయి.

 భవిష్యత్తులో  కొన్ని  వేల , లక్షల   సంవత్సరాల  తరువాత   అక్కడ   భూమిలో  త్రవ్వకాలు  జరిపితే  ?  అక్కడ 
వేద  సంస్క్రతికి  చెందిన  చిహ్నాలు  దొరికాయనుకోండి.

    20 , 21 వ శతాబ్ద  మధ్య కాలంలో   పశ్చిమ దేశాల్లో   హిందూ నాగరికత   వెల్లివిరిసింది . .. అని భవిష్యత్  చరిత్రకారులు భావిస్తే ...అది  కొంత వరకు  మాత్రమే  నిజం . 

....................

కొంతకాలం  క్రిందట  మనదేశంలో  జరిగిన  విదేశీదండయాత్రలలో  ఎన్నో  దేవాలయాలు ,  పురాతన  కట్టడాలు    ధ్వంసం చేయబడ్డాయి. 

 విదేశీ  దండయాత్రలలో  నాశనం  అయిన  ఎన్నో  దేవాలయాలను  అహల్యాబాయ్  హోల్కర్  అనే  ఆమె  పునర్నిర్మింపజేశారంటారు.  

  ఇలా,  కట్టడాల పునర్నిర్మాణం  అంటే ,  ప్రాచీన  కట్టడాలలోని  రాళ్ళు..  + ఆధునిక  వస్తువులు  కూడా  కలిపి  పునర్నిర్మాణం  జరుగుతుంది. 


ఇలాంటి  కట్టడాల  ప్రాచీనతను  గుర్తించవలసివచ్చినప్పుడు   కట్టడము  యొక్క   కాల  నిర్ణయంలో  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉంది.
............................ 

  ఇలా  అనేక  కారణాల  వల్ల  చరిత్రలో  కాలాన్ని  నిర్ణయించటంలో  పొరపాట్లు  జరిగే  అవకాశం  ఉంది.

  చరిత్రకు సంబంధించి  కాలాన్ని  నిర్ణయించటంలో    ప్రాచీనులు  తెలియజేసిట్లు  జ్యోతిష  శాస్త్రాన్ని  కూడా  ఆధారంగా  తీసుకుంటే  చక్కటి ఫలితాలు  వచ్చే  అవకాశం  ఉంది.



No comments:

Post a Comment