koodali

Friday, July 18, 2014

ఓం...భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవుతోంది ........


ఓం.జగన్మాతాపితరులకు  నమస్కారములు.

నీటిపై తేలియాడుతూ రామాయణ ప్రవచనం.....

కొంతకాలం  క్రిందట.......శ్రీశైల  మహాక్షేత్రంలోని  శివాజీ  స్ఫూర్తి  కేంద్రం  వద్దనున్న  సూర్యబలిజ  నిత్యాన్నదాన  సత్రంలో  విజయనగరం  జిల్లాకు  చెందిన  సత్యజ్ఞానానంద  దశాశ్రమ  పీఠాధిపతి  శ్రీ  యోగానంద  మహాభారతి  స్వామి  జలస్థంభన  విద్యను  ప్రదర్శించారట.



మత్శ్యాసనంలో  నీటిపై  తేలియాడుతూ  రామాయణ  మహాకావ్యాన్ని  సుమారు  గంటకు  పైగా  ఉపన్యసించారట....గంటసేపు  నీటిపై  తేలియాడటం  ఎంతో   ఆశ్చర్యకరమైన   విషయం. 



 ఇలాంటివి    చూస్తుంటే    భారతీయ  విద్యలు  ఎంత  గొప్పవో  కదా  !  అని  ఆశ్చర్యంగా  అనిపిస్తుంది.  ఇంతటి  గొప్ప  విద్యలను  మనం  ఎంత  నిర్లక్ష్యం  చేస్తున్నామో  అని  బాధా  కలుగుతుంది.

.......................

ఇంకా  ఏమనిపిస్తుందంటే... ఈ నాటి విజ్ఞానం ఎక్కువగా భౌతిక పద్ధతి మీద ఆధారపడింది. పూర్వీకుల విజ్ఞానం భౌతికశాస్త్రాన్ని దాటి ఇంకా ముందుకెళ్ళింది అనిపిస్తుంది.
......................

కొన్ని సంఘటనలు చూస్తుంటే శారీరిక బలం కన్నా మానసిక బలం గొప్పదేమో అనిపిస్తుంది.

 ఉదాహరణకు.. .ఒక వ్యక్తి లారీనో లేక బస్సునో తాడుతో    కట్టి ఆ తాడును పళ్ళ మధ్య పట్టి ఉంచి లారీని కొంత దూరం లాగాడట. ఇంకొక  వ్యక్తి  తన  తల  వెంట్రుకలతో  లారీని   కొంత దూరం లాగాడట. 



ఆధునిక  సైన్స్ సూత్రాల   ప్రకారం   మనిషి  పళ్ళకు, వెంట్రుకల   లారీనో  , బస్సునో  లాగే  శక్తి  ఉండదు. అలా  లాగటానికి  ప్రయత్నిస్తే  వెంట్రుకలు  లేక  పళ్ళు  కుదుళ్ళతో  సహా  ఊడి  వస్తాయి.   మరి  లాగేవాళ్లు  ఎలా  లాగుతున్నారు? 



సాధారణ  వ్యక్తులే  తమ  బలమైన  సంకల్పశక్తితో  ఇలాంటి  అసాధ్యాలను  సుసాధ్యం  చేయగలుగుతున్నప్పుడు ,  ప్రాచీన  మహర్షులు   ఎన్నో  అసాధ్యాలను  సుసాధ్యం  చేయగలిగేవారనటంలో   ఎటువంటి  సందేహమూ  లేదు.

.................


పూర్వీకులు తమ తపశ్శక్తిని పెంచుకుని ఇలాగే ఎన్నో అద్భుతాలు చేసారా ? 


అంటే భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవుతోంది కదా ! అదే తపస్సు ద్వారా పొందే ఆధ్యాత్మిక దైవశక్తి కావచ్చు....
.............................

ఆధునిక  విజ్ఞానం  భౌతిక శక్తి మీదే  ఎక్కువగా  ఆధారపడింది.  ఉదా..ఇప్పటి  వాళ్లు  దూరంగా  జరిగే  విషయాల  గురించి  తెలుసుకోవాలంటే  టీవీలు,  ఫోన్లు ,  శాటిలైట్  సిస్టం  .. వంటి  భౌతిక  పరికరాలు  కావాలి .

అయితే ,  భక్తితో తపశ్శక్తితో దూరశ్రవణం, దూరదృష్టి..మొదలగు సిద్ధులను సాధించిన మహనీయులకు టీవీలు, ఫోన్లు వంటి భౌతిక సాధనాలతో పని లేదు.

వారు తమ మనోశక్తితోనే దూరంగా ఉన్న విషయాలను గ్రహించగలరు. ఇలాంటి శక్తులు కలిగిన మహనీయుల గురించి ...ఒక యోగి ఆత్మ కధ. ...గ్రంధములో   ఎన్నో   వివరములున్నాయి.

................................


భౌతిక శక్తి మీదే  ఎక్కువగా  ఆధారపడింది. కాబట్టి,   ఆధునిక విజ్ఞానంలో  సైడ్  ఎఫెక్ట్స్  ఎక్కువ  ..ప్రాచీన  విజ్ఞానంలో  సైడ్  ఎఫెక్ట్స్  తక్కువ  అనిపిస్తుంది.

ఆధునిక  శాస్త్రవేత్తలకు    శరీరం  గురించి  మాత్రమే   కొంతవరకు    తెలుసు. మనస్సు  గురించి  తెలిసింది  చాలా  తక్కువ.




4 comments:


  1. ఆ మనస్సు శక్తి ని కనుక్కుని అది అందరికి పంచి పెట్టె సామర్థ్యం కల 'ఏప్' గా సాధించి పెట్టె సామర్థ్యం ఆ ఆధునిక శాస్త్రజ్ఞుల కి మాత్రమె ఉంది.

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఆత్మలో పరమాత్మ ఉంటారు కాబట్టి, మనస్సు శక్తి కన్నా ఆత్మ శక్తి గొప్పదనిపిస్తోంది..

      .భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవుతోంది ... అదే తపస్సు ద్వారా పొందే ఆధ్యాత్మిక దైవశక్తి కావచ్చు....

      ఈ సృష్టిని సృష్టించిన దైవమే మొట్టమొదటి శాస్త్రవేత్త..... పూర్వకాలపు మహర్షులు దైవధ్యానం తపశ్శక్తితో ఎంతో విజ్ఞానాన్ని కనుగొని లోకానికి అందించారు. వాళ్ళని కూడా శాస్త్రవేత్తలు అనవచ్చు.
      ............................

      ప్రపంచానికి ఉపయోగపడే మంచి ఆవిష్కరణలను అందించే వారందరూ శాస్త్రజ్ఞులే.

      ఉదా.. ఎక్కువగా చదువుకోని ఒక పల్లెటూరి రైతు వ్యవసాయానికి ఉపయోగపడే ఎన్నో పనిముట్లను తయారుచేశాడని ఈ మధ్య వార్తలలో చదివాను. ఇలాంటి వారినీ శాస్త్రజ్ఞులు అనవచ్చు.

      ఆధునిక విజ్ఞానం కనుగొన్న కొన్ని ఆవిష్కరణల వల్ల ప్రపంచంలో కొన్ని జీవజాతులు నశించే స్థాయికి చేరుకున్నాయి. ఇలా అంటున్నందుకు కొందరికి కోపం రావచ్చు. అయితే, ఇలా వ్రాయటానికి కారణాలున్నాయి.

      కొన్ని సంవత్సరాల క్రిందట పల్లెటూర్లు వెళితే పరిశుభ్రమైన వాతావరణం, శుభ్రమైన నీటితో తామరపువ్వులతో కళకళలాడుతూ ఉన్న చెరువులు కనిపించేవి.

      ఇప్పుడు పల్లెటూరు వెళ్ళినా గుట్టలుగా పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు , పారిశ్రామిక విష రసాయనాలతో కలుషితమవుతున్న నదులు, సముద్రాల నీరు కనిపిస్తోంది.

      ఇంకా, గుట్టలుగా పేరుకుపోతున్న ఎలెక్ట్రానిక్ వ్యర్ధపరికరాలు వీటి నుంచీ వెలువడే విషవ్యర్ధాలు, కొత్త వస్తువుల కోసం వేగంగా తరిగిపోతున్న సహజవనరులు.....ఇవన్నీ చూస్తుంటే ఆధునిక విజ్ఞానం అంటే భయమేస్తోంది.


      ఇంకా, ఇప్పుడు ఆధునిక పరికరాల ద్వారా చూడటానికి విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన అసభ్యకరమైన విషయాలు ..సమాజంపై వాటి ప్రభావం... వాటిని అరికట్టలేపోతున్న వైనం....అందరికీ తెలిసిందే.


      మంచి ఉద్దేశంతో శాస్త్రజ్ఞులు కనుగొన్న కొన్ని ఆవిష్కరణలను కొందరు ప్రజలు తమ స్వార్ధానికి వాడుతున్నారు . ఇలాంటప్పుడు శాస్త్రజ్ఞుల తప్పు అంతగా లేకపోవచ్చు కానీ, కొన్ని ఆవిష్కరణలను ప్రపంచానికి అందించకుండా ఉండటమే మంచిదనిపిస్తుంది.
      .............................

      ఇక, మానసిక శక్తి గురించి ఆధునికులు తమదైన శైలిలో ప్రయోగాలు చేస్తే , సమాజంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించాలంటే ..?

      Delete
  2. పూర్వకాలంలో విజ్ఞానరహస్యాలు అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. చాలా కష్టపడి శ్రమించిన , సద్గుణవంతులైన వారిగా భావించిన శిష్యులకే గురువులు ఆ రహస్యాలను బోధించేవారు.

    అయితే అప్పుడు కూడా రాక్షసుల వంటి వారు దొంగ తపస్సులు చేసీ, దొంగవేషాలు వేసి విజ్ఞానాన్ని తస్కరించటానికి ప్రయత్నించేవారు. దేవతలు వారి ప్రయత్నాలను తిప్పి కొట్టి లోకానికి ప్రమాదం జరగకుండా కాపాడేవారు.

    ReplyDelete


  3. ఆధునిక విజ్ఞానం వల్ల కొన్ని లాభాలు కలిగాయనటంలో ఎటువంటి సండేహమూ లేదు.

    అయితే అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని గమనిస్తుంటే ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు.

    ఈ ప్రమాదాల నుండి ప్రపంచాన్ని కాపాడుకునే ఉపాయాలను అన్వేషించాలి.

    కొందరు ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రపంచానికి హానిని కలిగించని విజ్ఞానాన్ని అందించటానికి తపిస్తున్నారు.

    ఆధునిక విజ్ఞానం విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దటానికీ ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిద్దామండి.



    ReplyDelete