koodali

Friday, November 21, 2025

నాకు కొన్ని సందేహాలు...అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా చేయించుకోవచ్చా?

 

 నాకు కొన్ని సందేహాలు కలిగాయి. 

నెలసరిలో ఉన్నప్పుడు దైవస్మరణ.. దైవనామస్మరణ.. చేస్తే దోషం కాదు కాని, మంత్రాలు.. స్తోత్రాలు.. చేయకూడదంటున్నారు కొందరు.

  కార్తికమాసంలో కొన్ని దేవాలయాల్లో ఎవరైనా నెలకు కొంత డబ్బు కడితే, నెలంతా అభిషేకాలు..పూజలు చేస్తున్నారు. ...

అలాంటప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలకు నెలసరి వస్తే అప్పుడు వాళ్ళ పేరు కూడా పూజలో చదువుతారు కదా....అప్పుడు వాళ్లు పూజ చేసినట్లే కదా..

మరి అలాంటప్పుడు దోషం ఉంటుందా? ఉండదా? అని సందేహం అనిపించింది. 

అర్చనలు చేయించుకునేటప్పుడు కూడా వేరే ఊళ్లలో ఉండే కుటుంబసభ్యుల పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తారు. 

పూజలో పేర్లు ఉన్న వాళ్ళు నెలసరిలో ఉంటే అప్పుడేమిటి?

 ఇలా పూజలు చేయించుకుంటే చేయించుకున్నవాళ్లకు, చేయించిన వాళ్లకు, చేసిన వారికి...కూడా దోషం వస్తుందా? అలా ఏమీ కాదా? 

పూజకు డబ్బు కట్టిన తరువాత, ఎవరి ఇంట్లో అయినా అకస్మాత్తుగా మైల పాటించే పరిస్థితి వస్తే,  ఆ సంగతి
ని వాళ్ళు   చెప్పకపోవచ్చు.

అంటుముట్టు..మైల ఉన్నాకూడా, దేవాలయంలో లేకుండా దూరంగా ఉంటే, వారి పేరుతో ఏ పూజ అయినా చేయించుకోవచ్చా? అలా చేస్తే ఏమైనా దోషం ఉంటుందా? ఉండదా? తెలియటం లేదు.

 ఇన్ని  సందేహాలు ఎందుకు అంటే, నెలసరి దోషం వల్ల చాలా కష్టాలు వస్తాయంటున్నారు అని.
....................

మేము చెన్నైలో ఉన్నప్పుడు,  అక్కడ దేవాలయంలో ..అర్చన కొరకు గోత్రనామాలు చెప్పకపోయినా కూడా,  స్వామిపేరుతో.. అని చెప్పి అర్చన చేసేవారు. 

పేర్లు చెప్పకుండా ఈ పద్ధతి సులభంగా అనిపించింది.

....................

గోత్రనామాలు చెప్పినా చెప్పకపోయినా,  దైవప్రీతి కొరకు.. జీవప్రీతి కొరకు ..కష్టాలు తొలగటానికి ..ఇలా దైవానికి ఎవరికి వారు మనస్సులో కూడా చెప్పుకోవచ్చు.

మన గురించి, మన ఆలోచనల గురించి..అన్నీ దైవానికి తెలుస్తాయి.

..........................

 నేను గమనించిన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు పూజలలో సుమారు అర్ధగంటకు పైగా ఈ గోత్రనామాలు ..కుటుంబసభ్యుల పేర్లను చదవటంతోనే సరిపోతుంది.

......................
ఈ పోస్ట్ కొంత సమయం తరువాత ఇక్కడ డిలిట్ చేయాలనుకుంటున్నాను.

 

No comments:

Post a Comment