గ్రంధాలలోని ఒక కధలో ఒక స్త్రీ.. ఒక రాజు కొడుకు.. అక్రమంగా తిరగటం.. కధలో..
సామాన్యులు సరిగ్గా అర్ధం చేసుకోలేక, మంచిగా ఉన్నవారు నరకానికి పోవటం, చెడ్దపనులు చేసిన వాళ్లు స్వర్గానికి వెళ్లటం ఏమిటి? అని అనుకునే ప్రమాదముంది.
చెడు పనులు చేసిన వారు దయాభిక్షలా పుణ్యం ధారపోస్తే... స్వర్గానికి వెళ్ళవలసిన ఖర్మ మంచివారికి ఏమిటి? అనిపిస్తుంది.
..................................
రాజకుమారుడు చనిపోయేముందు ఆత్మ రక్షణ కొరకు బ్రాహ్మణుని కూడా చంపటం జరిగిందని ఒక దగ్గర విన్నాను.
రాజకుమారుని ఒక్క కత్తివేటుతో చంపి, తరువాత బ్రాహ్మణుడు తనను తాను చంపుకున్నట్లు మరొక దగ్గర చదివాను.
(అలాంటప్పుడు రాజకుమారుడు ఆత్మరక్షణ కొరకు బ్రాహ్మణుని ఎలా చంపగలడు?)
బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకుంటే కనుక, ఆత్మహత్య పాపం అంటారు కాబట్టి.. అలా కూడా బ్రాహ్మణున్ని నరకానికి తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారేమో?
............................................
రాజకుమారుడు మొదట్లో మంచిగా ప్రవర్తించేవాడని, తరువాత అతను దురలవాట్లకు లోనయ్యి రాజ్యంలోని స్త్రీలను కూడా వేధించేవాడని తెలుస్తుంది.....
రాజకుమారుడు వాళ్ళు తాము చేసిన పాపానికి పశ్చాత్తాపం చెందారో ? లేక ఎందుకో తెలియదు కానీ, తమ దీపారాధన పుణ్యాన్ని బ్రాహ్మణునికి కొంత ఇవ్వటానికి ముందుకు వచ్చారు.
రాజకుమారుని తల్లితండ్రి గతంలో చేసిన పుణ్యాల వల్ల.. ఇప్పుడు రాజకుమారుడు దీపారాధన చేసిన పుణ్యం వల్ల.. అతనికి తాను పొందిన పుణ్యంలో కొంత భాగాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలనే ఆలోచన వచ్చి ఉండవచ్చు.
బ్రాహ్మణుడు తన జీవితంలో చాలా పూజలు, దీపారాధనలు చేసిఉంటారు,
దుష్ప్రవర్తన కలిగిన రాజకుమారుని చంపటం ద్వారా ....రాజ్యంలోని స్త్రీలకు ఉపకారం కూడా జరిగింది. ఎలాగైతేనేమి బ్రాహ్మణుడు స్వర్గానికి వెళ్ళటం జరిగింది.
......................
మరికొన్ని ఆలోచనలు...........
ఆ రాజకుమారుడు భయపెట్టి ఆమెను లొంగదీసుకుని ఉండవచ్చు.
(అయితే, కధను గమనిస్తే ఆ స్త్రీ తాను కూడా ఇష్టంగానే రాజకుమారునితో ఉన్నట్లు తెలుస్తుంది.)
భార్య వేరే వారి మోజులో పడితే ఆ భార్యది కూడా తప్పే.
...........................
ఆ రాజకుమారుని తండ్రి.. పుత్ర ప్రేమతో తన కొడుకుకు సరైన బుద్ధి చెప్పకుండా అలా వదిలేయటం తప్పు...ఇంకా అతడేం న్యాయం చేస్తాడు ప్రజలకు?
.............................
ఆ స్త్రీ భయంతో రాజకుమారునితో ఉన్నదో? లేక ఇష్టపడి ఉన్నదో? తెలియదు.
నాకు ఏమనిపిస్తుందంటే, ఆ స్త్రీ ఇష్టంగానే రాజకుమారునితో ఉంటే, ఆ స్త్రీ యొక్క భర్త ఆమెను సరిగ్గా పట్టించుకోలేదేమో?
(అయితే, కొందరు మగవారు...ఆడవారు తమ జీవితభాగస్వామి ఎంత బాగా చూసుకున్నా కూడా పరాయి వాళ్ల మోజులో పడుతారు.)
........................
జీవితానికి పరమార్ధం మోక్షాన్ని పొందటం అనేది నిజమే కానీ, మనకు నాలుగు ఆశ్రమాలను పెద్దలు తెలియజేసారు.
గృహస్తాశ్రమంలో ఉండగా సన్యాసాశ్రమంలా కాకుండా, భార్యాభర్తలు అన్యోన్యంగా కూడా ఉండాలి.
భార్యాభర్త ఇద్దరూ ఇష్టపూర్వకంగా ఒకే విధంగా ఆలోచించుకుని చాలా నియమాలను పాటిస్తూ జీవిస్తే.. అది వేరే విషయం.
........................................
మనకు తెలియని అంతరార్ధాలు ఎన్నో ఉంటాయి. పైపైన తెలుస్తున్న వాటిప్రకారం నా అభిప్రాయాలను వ్రాయటం జరిగింది.
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment