koodali

Sunday, November 9, 2025

స్త్రీలు నెలసరి వాయిదా మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...

 

ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాల వల్ల వత్తిడి పెరిగి ఆడవాళ్ళకు నెలసరి సరిగ్గా రావటం లేదు. 

చదువుల వత్తిడి వల్ల చాలామంది అమ్మాయిలకు మూడునెలల వరకు నెలసరి రాకుండా ఉంటున్నాయి.

ఈ నెలసరి అంటుముట్టు గొడవల వల్ల పండుగలు, పూజలు, శుభకార్యాలను కూడా ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది.

 నెలసరి వస్తుందేమో? అని భయపడుతూ ఉండవలసి ఉంటుంది.

ముందురోజు పూజకు సామాగ్రి కొనుక్కున్నా, పూజ చేస్తున్నా, ఫంక్షన్ జరుగుతున్నా కూడా సడన్ గా తమకుకానీ, తమ కుటుంబసభ్యులకు కానీ నెలసరి వస్తే ఏం చేయాలి? పూజ పూర్తి అవకపోతే మళ్ళీ చేయాలా? ఇలా ఎన్నో సందేహాలతో ప్రశాంతతే ఉండదు. 

ఈ విషయాల వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
..............................

 ఈ రోజుల్లో  చాలారకాల పూజలను చాలామంది చేస్తున్నారు కదా..

 పూజలప్పుడు  కొందరు నెలసరి వాయిదా వేయటానికి మందులు వేసుకొంటున్నారు. ఇందువల్ల తరువాత చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఉదా..కొందరు కొన్ని వారాలు కొన్ని పూజలు చేస్తామనుకుంటారు. మధ్యలో నెలసరి రాకూడదని మందులు వేసుకుంటారు. 

అలా అక్కరలేదు. నెలసరి వచ్చినా కూడా... తరువాత వారం ఆ పూజను కంటిన్యూ చేయవచ్చు. 

...........................

వివాహం వంటి శుభకార్యాల్లో లగ్నపత్రిక, వివాహం..ఇలా ఎన్నో సందర్భాలుంటాయి. 

అన్ని సందర్భాల్లో ఇంట్లో వారికి, బంధువులకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరదు.

 జన్మకొకసారి చేసుకునే వివాహంలో 
నెలసరి వల్ల పాల్గొనకుండా ఉండాలంటే ఇంట్లో కుటుంబసభ్యులకు ఎంతో బాధగా ఉంటుంది.

వివాహం అంటే వధువుకు మాత్రం నెలసరి రాకుండా 
ముహూర్తం నిర్ణయించుకుంటే మంచిది. 

వధువు విషయంలో కూడా వివాహం సమయంలో అన్ని వేడుకలకు నెలసరి రాకుండా ఉండాలంటే కుదరకపోవచ్చు. 

ఇలాంటి సందర్భాలలో టెన్షన్ వల్ల నెలసరి ముందే కూడా వచ్చే అవకాశముంది....అలాంటప్పుడు ఏం చేయలం...
..............

సంతానం కలిగే వయస్సులో ఉన్న స్త్రీలు ఈ టాబ్లెట్స్ బాగా వాడితే పుట్టే పిల్లలకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చు. అందువల్ల, జాగ్రత్తగా ఉండాలి.

నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా..మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.

అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.

.......................... 

 ప్రాచీనులు చెప్పినట్లు  ఖచ్చితంగా పాటించాలంటే.... నెలసరిలో ఆడవాళ్లు చదువులు, ఉద్యోగాల కొరకు కూడా బయటకు వెళ్ళకూడదు.  

 మరి చదువులు, ఉద్యోగాలని నెలసరి రోజుల్లో బయటకు వెళ్ళి కలిపేస్తే కూడా పాపమే కదా..

కాలానుగుణంగా మారక తప్పదంటూ స్త్రీలు చదువులు, ఉద్యోగాలకు నెలసరి రోజుల్లో కూడా వెళ్తున్నారు.  ఈ రోజుల్లో అలా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుంది 
..బయటకు వెళ్తే దోషంకాదు..అంటారు. 

 ...................................

మరొక్కసారి చెబుతున్నాను. ..హిందూ స్త్రీలు ....నెలసరి అంటుముట్టు భయంతో నెలసరి వాయిదా ...మందులు వేసుకుని, ఆరోగ్యం పాడుచేసుకోవద్దు...జాగ్రత్తలు తీసుకోవాలి.

అనారోగ్యం వస్తే కష్టం....ఆరోగ్యం ఉంటేనే ఏమైనా చేయగలరు.

 

No comments:

Post a Comment