చిన్నపిల్లలు వాళ్ళకువాళ్ళు చేత్తో తీసుకుని సరిగ్గా తినలేరు. చిన్నపిల్లలు పెద్దవారిలా గబగబా నమిలి తినలేరు. నిదానంగా తింటారు. అలాగని పిల్లలకు ఆహారాన్ని కుక్కి అదేపనిగా బోలెడు తినిపించకూడదు.
వాళ్ళకు ఎంతకావాలో అలాగ తల్లి దగ్గరుండి ఓపికగా తినిపించాలి. అందుకు ఎక్కువ సమయమే పడుతుంది.
అయితే, ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు.
అయితే, ఈ రోజుల్లో చాలామంది తల్లులు ఉద్యోగాల కొరకు వెళ్ళటం వల్ల పిల్లలకు చక్కగా తినిపించటానికి కూడా సమయం ఉండటం లేదు.
పిల్లలను డేకేర్ సెంటర్లలో
వేస్తున్నారు. లేదంటే చిన్నప్పుడే స్కూల్లో వేస్తున్నారు. పిల్లలను త్వరగా
అక్కడ దింపాలని ఉదయాన్నే వాళ్లకు హడావిడిగా ఏదో కుక్కి తినిపిస్తారు.
ఇంట్లో ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ చేయలేరు కదా..
ఇంట్లో ఉండే తల్లులు కూడా కొందరు ఈ విషయంలో ఓపికగా చేయటం లేదు. చిన్నపిల్లలు ఏమీ చేయలేరు కదా..
కొందరు పిల్లలు ఉదా..3 సంవత్సరాల చిన్నపిల్లలు నాకు
తినిపించమని పెద్దవాళ్ళను అడిగినా, నువ్వే తినాలంటూ తినిపించకుండా ఉండే
పెద్దవాళ్ళను నేను చూసాను..
పాపం చిన్నపిల్లలు తమకు తాము సరిగ్గా తినలేని
వయస్సు వాళ్ళది...అలా అర్ధాకలితో ఉంటే బాధ అనిపిస్తుంది. ఈ సమస్యలకు
పరిష్కారం ఎప్పుడో?
చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు.
చాలామంది పిల్లలు తినటం విషయంలో విసిగిస్తారు. ఆ వయస్సు పిల్లలు చాలామంది అలాగే ఉంటారు.
కొందరు తల్లులు మాత్రం ఓపికగా
మాటలు చెబుతూ తినిపిస్తారు. ఇలాంటి గొప్ప తల్లులు అభినందనీయులు.
No comments:
Post a Comment