ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.
ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.
ప్రపంచంలో జరుగుతున్న హింస చాలా బాధగా ఉంది.
ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ, పాపాలు చేసి అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు.
డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.
మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది.
సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు.
ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి. హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.
ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా, నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం? వారి సంగతి దైవం చూసుకుంటారు.
కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.
ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది...
అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు.
మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.
కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి.
అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి.
**************
మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో?
అయితే, యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు, అమాయకజీవులు.. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది.
దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది.
గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.
అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు.
కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.
మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి. దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.
...............
ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి. దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.
అంతా దైవము దయ...
oka link.... గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...
No comments:
Post a Comment