koodali

Sunday, September 7, 2025

ఎప్పటికైనా..

 
భారతదేశం ఎంతో సుందరమైనది. ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్న దేశం. కొన్ని విదేశాల్లో అందంగా ఉన్నా కూడా ,  అక్కడ కొన్ని చోట్ల విపరీతమైన చలి కూడా ఉంటుంది. భారతదేశంలో వాతావరణం ఎండాకా
లం, వర్షాకాలం, చలికాలం తట్టుకోలిగే విధంగానే ఉంటుంది. 

అయితే ప్రజలు ఈ దేశాన్ని శుభ్రత లేకుండా మురికిగా చేయటం బాధాకరం. ఎక్కడపడితే అక్కడ చెత్తవేయటం, కిళ్లీలు ఉమ్మటం..మలమూత్రాలు చేయటం చేస్తున్నారు. ఇలా చేసేవారిని శిక్షించటం, జరిమానాలు వేస్తేనే వారు మారతారు. 
ప్రభుత్వాలు కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాలి. 

చెట్లు ఎక్కువగా నాటి పెంచటం,రోడ్లు, పార్కులు శుభ్రం చేయటం, పరిసరాలు అందంగా ఉంచటంలో అనేకమంది కార్మికులను నియమిస్తే ఎందరికో ఉపాధి లభిస్తుంది.


మన భారతదేశం ఎప్పటికైనా ఇలా శుభ్రంగా ఉంచుకోగలమా? ఈ లింక్ లో  చూడండి... దీనికి సంబంధించిన ఫొటోలు ఈ పోస్ట్ క్రింద 
కూడా ఉన్నాయండి.

Beautiful Village Giethoorn of Netherlands |

విదేశాల్లో వాళ్లు తమ దేశాన్ని ఎంత అందంగా ఉంచుకున్నారో..మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము? ఎవరి వద్ద నుండి  అయినా చెడును నేర్చుకోకూడదు కాని, మంచిని నేర్చుకోవచ్చు.

 పరిసరాలు శుచిగా, శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రాచీనులు తెలియజేసారు.

చండీగఢ్ కొంత శుభ్రంగా ఉంటుందంటారు. అలా శుభ్రంగా ఉండటానికి అక్కడ పనిచేసిన ఒక కమిషనర్ గారు..
ఇతర సిబ్బంది కూడా కారణట. వారు ప్రజలలో శుభ్రత గురించి ఎప్పటికప్పుడు అవగాహన తెస్తూ చైతన్యవంతులను చేస్తూ చిన్నపిల్లలకు  కూడా శుభ్రత గురించి చెబుతూ ఎంతో కృషి చేసారట.

ప్రజలు, కమీషనర్ గారు..
సిబ్బంది చెప్పినవి విని పాటించటం కూడా గొప్ప విషయమే. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు అందరూ సరిగ్గా పాటిస్తేనే ఏదైనా బాగుంటుంది.
..................................
 కొందరు మైకుల ద్వారా పెద్దగా శబ్దాలు పెడుతున్నారు. వార్తలు చెప్పేవారు కూడా ఎందుకో గట్టిగా అరుస్తూ  వార్తలు చెబుతున్నారు.
..................................

  ఇతరదేశాల వాళ్లు భారతీయులను వెళ్ళిపొమ్మంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే ఎక్కడికో వెళ్లి మాటలు పడే పరిస్థితి ఉండదు కదా..

భవిష్యత్తులో విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో? తమ తరువాత తమ పిల్లల పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందో? (భయపడుతూ బతకాలేమో?) ఇవన్నీ విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
................
 

ఎవరైనా గొప్పవాళ్లం అనుకుంటే.. వారు తమ గొప్పతనంతో  తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు.  తామూ బాగుండవచ్చు.

........................

మన దేశంలో చిన్న పరిశ్రమలు నెలకొల్పితే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తిరిగివస్తారు. మన యువత కూడా ఐటీ రంగంలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేయటానికి ముందుకు రావాలి..

ఐటీలో ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారో అని భయపడటం కన్నా, స్వంతంగా వ్యవసాయ రంగం, వ్యాపారం, కుటీర పరిశ్రమలు ఉపాధిపొందటం చెయ్యాలి.
...............

 ఇరుగుపొరుగు దేశాలనుండి అనేకమంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్ఠిరపడుతుంటే, మన వాళ్లు ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్నారు. 

ఎన్నో సంవత్సరాలనుండి విదేశీయులు వస్తుంటే ఎందుకు సమర్ధవంతంగా అడ్దుకోలేదో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలి.
...........

జనాభా అదేపనిగా పెరిగితే అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టం. భారతదేశంలో జనాభా ఎక్కువ..భూమితక్కువ. కొన్ని విదేశాల్లో జనాభా తక్కువ.. భూమి ఎక్కువ. 

యంత్రాల వినియోగం పెరిగిన ఎక్కువైన తరువాత ప్రపంచం అంతటా నిరుద్యోగం ఎక్కువవుతోంది.

యంత్రాలతోనే ఎక్కువగా పనులు చేయించుకుంటున్న ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టమే. కష్టమైన పనులను యంత్రాలతో చేయించి, మిగతా పనులను మనుషులే చేయాలి.
.............

మనుషులు బతకటానికి అవసరమైన గాలి, నీరు, సూర్యరశ్మితో కూడిన వాతావరణం, ఆహారానికి అవసరమైన మొక్కలు, చెట్లు..వంటివెన్నో దైవమే ఏర్పాటు చేసారు. అయినా మనుషులు సరిగ్గా బతకలేకపోతున్నారు.

 ఆహారం,ఇల్లు, వైద్యం, విద్య, రక్షణ..ఇలా నిత్యావసరాలు బాగుంటే చాలు చక్కగా బ్రతకవచ్చు. అయితే, అనేకకోరికలతో విలాసాలనే నిత్యావసారాలుగా చేసుకుని వాటికోసం అదేపనిగా కష్టపడుతున్నారు. 

కొందరు మనుషులు సరిగ్గా బతకలేకపోవటానికి బలవంతులైన కొందరు బలహీనులను అణచివేయటం కూడా కారణమే.కొందరు చెడ్దవాళ్ళు ఇతరులను బాధిస్తూ పెత్తనం చేస్తున్నారు.
.............

కంపెనీల్లో ఒక పనికి ఎక్కువ జీతాన్ని ఇచ్చి (సుమారు లక్షన్నర అనుకోండి..) ఒక్కరితో ఎక్కువ పనిచేయించటంటం కన్నా, అదే పనికి ఇద్దరిని నియమించి ఒక్కొక్కరికి లక్ష ఇస్తే, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. 

వ్యక్తులు అలసిపోరు కాబట్టి పనిలో నైపుణ్యత పెరుగుతుంది. విపరీత పనిగంటలు తగ్గి సమయం మిగులుతుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబసంబంధాలు కూడా బాగుంటాయి.

విపరీతంగా ధరలు పెంచకుండా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

.......................
ఈ రోజుల్లో ఉద్యోగాలంటూ స్త్రీలు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తుంటే విపరీతమైన పనివల్ల అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. స్త్రీలలో గర్భసంచి వ్యాధులు బాగా పెరిగాయి.

 స్త్రీలు అంద
రికి  ఉద్యోగాలు కావాలని  ఎవరినైనా బ్రతిమలాడటం కన్నా,  దర్జాగా  కొందరు స్త్రీలు కలసి చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. తమకు సదుపాయంగా ఉండేటట్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పనిగంటలు ఏర్పాటుచేసుకోవచ్చు. 

అందరూ స్త్రీలే  ఉంటారు కాబట్టి, లైంగిక వేధింపులు వంటివాటి బారినుండి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు.

డబ్బు బాగా ఉన్న స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి సమాజసేవ చేయవచ్చు. పేద వారు పైకి రావటానికి సాయం చేయవచ్చు. అంటే విద్య, వైద్యం వంటి విషయాల్లో తమకు తోచిన సాయం చేయవచ్చు. వారికి చదువు చెప్పవచ్చు. చక్కటి సలహాలను అందించవచ్చు. 

రకరకాల చీరలు, నగలు ధరించినా కలగని సంతోషాన్ని ఇతరులకు సాయం చేయటంలో పొందవచ్చు...ఎంతో పుణ్యం కూడా వస్తుంది.
.................

ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వార్తలు చదివాను. కొన్ని చోట్ల కొందరు స్త్రీలను కొందరు బాస్ లు బెదిరిస్తున్నారట. ఉద్యోగం ఊడకుండా ఉండాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా తమ కోరికలు తీర్చాలని అడుగుతున్నారట. తప్పని పరిస్థితిలో కొందరు స్త్రీలు లొంగిపోతున్నారట. ఇలాంటివి ఎంతో బాధాకరం.

 తల్లుల మాట చాలా మంది పిల్లలు వింటారు కాబట్టి,  తల్లులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని,  నైతికవిలువలతో జీవించాలని నేర్పించితే వారు వినే అవకాశం ఉంది.

.................

 కొందరిలో ఎందుకో తెలియదు కాని,  పాపభీతి లేకపోవటం, అత్యాశ, సోమరితనం, స్వార్ధం..వంటి లక్షణాలు పెరిగాయి.

ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు గమనిస్తే, మనుషులకు నైతికవిలువలు ఎంత అవసరమో తెలుస్తుంది.

ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బయట ఎక్కువసార్లు తినకుండా ఇంటిభోజనం తినాలి. శారీరికంగా, మానసికంగా దేశానికి  మంచి పౌరులు తయారవ్వాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు తప్పనిసరిగా వీలు కుదుర్చుకుని పిల్లలకు నైతిక విలువలను నేర్పించాలి. ఇందుకు గృహిణి యొక్క సహాయసహకారాలు ఎంతో ముఖ్యం.

మంచి పౌరులను తయారుచేయటం ఎంతో గొప్పవిషయం. ఉపాధ్యాయులు కూడా పిల్లలకు నైతిక విలువలు పెంపొందేలా కృషిచేయాలి.

  నైతికవిలువలు కలిగిన మంచి పౌరులు ఉంటే ...కుటుంబాలు తద్వారా సమాజమూ అన్నీ బాగుంటాయి.

నైతికవిలువలు కలిగిన 
వారు  మంచిగా ప్రవర్తిస్తారు. అశ్లీల చిత్రాలు దేశమ్మీదకు వదిలి డబ్బు సంపాదించరు,  ఇతరులను మోసం చేయరు , నేరాలుఘోరాలు చేయరు. ధరలు విపరీతంగా పెంచి ఇతరులను దోచుకోరు. 

*నైతికత ఉన్న పౌరులు ఉన్నసమాజం దానికదే బాగుంటుంది.
 ................
* అన్నింటికి దైవమే దిక్కు.అంతా బాగుండాలి.
 ........................

Beautiful Village Giethoorn of Netherlands |

How to visit Giethoorn, Netherlands, a charming village ...
Visit Giethoorn, the picturesque Dutch village with no roads ...

 

No comments:

Post a Comment