మేము వినాయక నిమజ్జనం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే..ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ఆకులు, పువ్వులు ఉన్నాయి. చెత్త కూడా పడేసి ఉంది. దుర్వాసన వస్తోంది.
ఇక ఆ నీటిలో నిమజ్జనం చేయలేక ఇంటికి వచ్చి చిన్న బకెట్లో నీళ్ళు పోసి ఆ
నీటిలో నిమజ్జనం చేసి నీటిని చెట్ల వద్ద పోసాను. ఎవరికైనా దగ్గరలో మంచి
నీరు చెరువు ఉంటే అక్కడ కూడా కలపవచ్చు.
ఊరేగింపు సమయంలో కొందరు పులిహోరను పంచిపెడుతూ వెళ్తారు. ఎందుకో కొన్ని పులిహోర పాకెట్లను అలా పక్కనే వదిలి పెట్టేసినట్లుంది.
ఆ నీటిని మొక్కల వద్ద పోస్తే మనం అక్కడ మట్టిలో నడుస్తాము కదా..అని సందేహాలు రావచ్చు..చెరువు నీటిలో నిమజ్జనం చేసినా చెరువునీటిలో నిలబడతారు, చెరువు నీటిని పనులకు వాడుకుంటారు, చెరువు నీటిని స్నానానికి కూడా ఉపయోగిస్తారు కదా..అనిపించింది. మరీ ఎక్కువ ఆలోచిస్తే అయోమయం అవుతుంది. కొంతవరకే ఆలోచించగలం.
..............
పాతకాలంలో వినాయక చవితి సందర్భంగా కొందరు తమ పిల్లలను మొక్కలు, చెట్ల వద్దకు తీసుకువెళ్ళి పత్రిని సేకరించేవారు. ఆ విధంగా ఎంతో విలువైన 21 రకాల పత్రి గురించి పిల్లలకు తెలిసేది. పూజ తరువాత ఆ పత్రిని చెరువులలో కలపటం వల్ల ఆ ఆకులలోని మెడిసినల్ గుణాలు నీటిలో కలిసేవి.
పాతకాలంలో వినాయక చవితి సందర్భంగా కొందరు తమ పిల్లలను మొక్కలు, చెట్ల వద్దకు తీసుకువెళ్ళి పత్రిని సేకరించేవారు. ఆ విధంగా ఎంతో విలువైన 21 రకాల పత్రి గురించి పిల్లలకు తెలిసేది. పూజ తరువాత ఆ పత్రిని చెరువులలో కలపటం వల్ల ఆ ఆకులలోని మెడిసినల్ గుణాలు నీటిలో కలిసేవి.
పాతకాలంలో సంక్రాంతికి భోగి రోజున ఇంట్లోని పాత చెక్క సామాను విరిగినవి, పాడైనవి ఉంటే భోగిమంటలో వేసేవారు. ఆ విధంగా ఇల్లు శుభ్రం అయ్యేది. ఈ రోజుల్లో కొందరు భోగిమంటలో రబ్బరు టైర్లను కూడా వేస్తున్నారు. ఇందువల్ల పొల్యూషన్ పెరుగుతుంది.
టెక్నాలజి పేరుతో ప్లాస్టిక్ ..వంటివాటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంటే.. వాటిని విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరింత పొల్యూషన్ పెంచుతున్నారు.
.............
సోషల్ మీడియా వల్ల విపరీతధోరణి మరింత పెరిగింది. మీడియాలో ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒక్కటి చెప్పాలని కొందరు ఎప్పుడూ ఏదో చెబుతూ ఉన్నారు.
మన దేశంలో చాలా మందికి అత్యాశ పెరిగింది. ఎంతసేపూ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే పిచ్చి పెరిగింది. తల్లితండ్రి పిల్లలను చంపటం, భార్యాభర్తల అక్రమసంబంధాలు..ఒకరినొకరు క్రూరంగా చంపుకోవటాలు ఎక్కువయ్యాయి.
మీడియా ద్వారా అశ్లీలమైన, భయంకరమైన వ్రాతలు, దృశ్యాలు ప్రసారాల ప్రభావం చాలా ఉంటుంది. మూఢనమ్మకాలను ప్రచారం చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి వాటిని ఎందుకు బాన్ చెయ్యటం లేదో అర్ధం కావటం లేదు.
అశ్లీలత, భయానకమైన విషయాలు, మూఢనమ్మకాలు..ఇలాంటివి మీడియాలో రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి శిక్షించాలి.
మన దేశంలో చాలామంది శుభ్రతను పాటించటం లేదు. అశుభ్రంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపైన కూడా కేసులు పెట్టి శిక్షించాలి.
ఈ రోజుల్లో చాలా విషయాల్లో వేలం వెర్రిలా ఏది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా తయారవుతోంది.
ఎలాగోలా డబ్బు సంపాదించటం..విపరీతంగా ఆస్తులు పోగేయటం..విపరీతంగా వస్తువులను కొనేయటం..రకారకాలు వండుకుని విపరీతంగా తినటం...చేస్తున్నారు. మా డబ్బుతో మేం కొనుక్కుంటాం.. అనటానికి వీల్లేదు.
విపరీతమైన వస్తు వినియోగం వల్ల పర్యావరణం పాడవుతుంది. అమూల్యమైన ఖనిజ సంపద తరిగిపోతుంది. ఈ ప్రపంచం ఏ కొద్దిమందికి సంబంధించినది కాదు. అన్ని జీవులకు సంబంధించినది.
...............
ఏమైనా మనకు అర్ధం కాకుంటే, మన కష్టసుఖాల గురించి కొందరు మనుషులతో చెప్పుకోవటం కంటే, దైవానికే చెప్పుకోవటం మంచిది.
సమాజంలో
బ్రతుకుతున్నప్పుడు సాటి మనుషుల తో కూడా మంచిగా ఉండాలి. కష్టసుఖాలలో
సాటి మనుషుల సహాయసహకారాలు కూడా అవసరమే కానీ, మనుషులు కొంతవరకే చేయగలరు.
దైవము సర్వశక్తివంతులు. వారు తలచుకుంటే ఏమైనా చేయగలరు. మానవప్రయత్నం
సరిగ్గా చేస్తుంటే, దానికి తగ్గ ఫలితాన్ని దైవమే అందిస్తారు.
పండుగలు, పూజలు కూడా కొందరు తమకు తోచినట్లు చెబుతుంటే, చేసేవాళ్లు తమకు తోచినట్లు చేస్తున్నారు. ఆచారవ్యవహారాల పేరుతో ప్రజలను భయపెట్టటం కూడా ఎక్కువయ్యింది.
ఈ రోజుల్లో ఎవరికి ఏమీ చెప్పేటట్లు లేదు. దైవమే అందరిని సరైన దారిలోకి తీసుకురావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
......................
ఇక్కడ వ్రాసిన కొన్ని విషయాలు ఇంతకుముందు పోస్టులలో వ్రాసినవే.
ఈ పోస్టును
కొంతకాలం తరువాత ఇక్కడ తొలగించే ఆలోచన ఉంది. కాబట్టి, ఎవరైనా వ్యాఖ్యలను
వ్రాస్తే వాటిని కూడా డిలిట్ చేస్తాను కాబట్టి దయచేసి అపార్ధం
చేసుకోవద్దండి.
No comments:
Post a Comment