koodali

Friday, July 13, 2018

అన్నా క్యాంటీన్లు ...


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నా  క్యాంటీన్లను  ప్రారంభించటం  మంచి  విషయం.

మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  

అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.

ఆకలిగా ఉన్నవాళ్ళకు ఆహారం  అందించటం ఎంతో గొప్ప విషయమని పెద్దలు తెలియజేసారు.

 తక్కువధరకు అందించటం వల్ల పేదవాళ్ళకు ప్రయోజనం కలుగుతుంది.


 ఈ రోజుల్లో అందరికీ చేయడానికి తగినంత పని లభించని పరిస్థితి ఉంది.

అలాంటప్పుడు ప్రభుత్వాలు తక్కువధరకు ఆహారాన్ని అందించటం సరైనదే.  పనిచేయాలన్నా ఆహారం అవసరం.
...................

ఇక్కడ   కొన్ని విషయాలు   చెప్పుకోవాలి. 

 సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు. 


   ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - 


ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  అన్నా  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 


  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  


ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన   అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో అత్యవసర పరిస్థితిలో, 


  ఉదా... కొన్ని కారణాల వాళ్ళ ,  సమయానికి  చేతిలో  సరిపడా  డబ్బు లేని  పరిస్థితిలో ఆకలితో నీరసం అనిపించినప్పుడు   తప్ప .... 


డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటే మంచిది.  


డబ్బున్నవాళ్ళు  పీనాసితనాన్ని  తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.

.............................

ప్రభుత్వాలు..ప్రజలకు  భోజనాన్ని అందించే పధకాలలో..  అక్షయ పాత్ర  వారు ఆహారాన్ని శుచిగా, రుచిగా తయారుచేసి అందించే పద్ధతి బాగుంది.

1 comment:

  1. "డబ్బున్న వాళ్ళు కూడా ఇలా చేస్తే , పేదవారికి ఆహారం సరిపోదు"

    ఆ కాంటీన్లు ఎక్కడ పెడతారు? బీదలు గుమికూడే ప్రాంతాలలో (ఉ. కూలీ/హమాలీ అడ్డా) కాంటీన్లు ఉంటే బాగుంటుంది.

    స్వచ్చంద సంస్థలు అన్నదానాలు చేసే ప్రదేశాలను జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఉ. హైదరాబాద్ హాస్పిటళ్లలో బీదరోగుల కుటుంబీకుల (attenders) కోసం హరేకృష్ణ వారు ఉచిత భోజన శిబిరాలు చేస్తున్నారు.

    ReplyDelete