koodali

Thursday, July 19, 2018

న్యాయానికి తరతమ భేదాలు ఉండవు...


 శ్రీ రాముల వారు అందరినీ గౌరవిస్తారు.

శబరి ఆప్యాయంగా ఇచ్చిన పండ్లను స్వీకరించారు . గుహుని తక్కువగా చూడలేదు. ఎంతో ఆప్యాయంగా చూశారు. 

జటాయువు యొక్క అంత్యక్రియలను నిర్వహించారు. అలాంటి రాములవారిని అపార్ధం చేసుకోవటం పొరపాటు.

ఇక రాముడు శంభూకుని సంహరించటం అంటే...నాకు ఏమనిపిస్తోందంటే..

కొందరు మంచి కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తారు.

 కొందరు మనసులో స్వార్ధపరమైన కోరికలతో, ఉద్దేశ్యాలతో తపస్సులు చేస్తూ పైకి మంచిగా కనిపిస్తారు.

ప్రహ్లాదుని వంటివారు రాక్షస జాతికి చెందినా  దైవ భక్తులై దైవానుగ్రహాన్ని పొందారు. .

కానీ కొందరు రాక్షసులు స్వర్గాన్ని , దేవతలను జయించాలని తపస్సులు చేసారు.

 తపస్సులు చేస్తున్నంత మాత్రాన అందరూ మంచివారే ఉంటారా ?

లోకాలను పీడించే వరాలను పొందటం కోసం రాక్షసులు కూడా తపస్సులు చేస్తారు . అంత మాత్రాన రాక్షసులు కూడా మంచివారు అయిపోతారా ?

శంభూకుడు స్వర్గాన్ని, దేవతలను జయించాలని తపస్సు చేస్తున్నాడట. ఇంకా ఏ స్వార్ధపు  కోరికలతో తపస్సు చేసాడో?

మరి, దేవతలు ఊరుకోరు కదా! 

అత్యాశ చెడ్దకోరికలతో తపస్సు చేయటం వల్ల  రాముల వారు శంభూకుని   వధించి ఉంటారు.

( శంభూక వధ ప్రక్షిప్తం అంటున్నారు కొందరు. . శంభూక వధ గురించి, వర్ణవ్యవస్థ గురించి .. గత టపాలలో వ్రాయటం జరిగింది. చర్చలు కూడా జరిగాయి. తిరిగి అవన్నీ చర్చించాలని నాకు లేదు. దయచేసి ఎవరూ కామెంట్స్ వ్రాయవద్దని మనవి. )

 శూద్ర స్త్రీ అయిన శబరి అందించిన ఎంగిలిపండ్లను స్వీకరించిన రామునికి శూద్రులనే భేదభావం ఉండదు.

రాముడు శూద్రులను చంపే వ్యక్తే అయితే,  శబరి తపస్సు చేసినప్పుడు చంపలేదు కదా ! శబరి కూడా శూద్ర స్త్రీయే.

(తపస్సు అంటే  ఒంటికాలుమీద  నిలబడి తపస్సు చేయటం మాత్రమే కాదు, ఏ పనినైనా  ఏకాగ్రత గా చేస్తే అది తపస్సే ..

శబరి ఎన్నో ఏళ్లు రామునికై ఎదురుచూసింది అలా భక్తితో ఎదురుచూడటం కూడా తపస్సే. )
*********
సనాతనధర్మం అంటరానితనాన్ని ప్రోత్సహించలేదు. సమాజంలోని కొందరు స్వార్ధపరులవల్ల అంటరానితనం వచ్చి ఉంటుంది.  

మతంగ ముని తండ్రి  దళితులని చదివాను. అయినా కూడా మతంగమునికి గొప్ప మునిగా పేరొచ్చింది.
 
ఈ క్రింది విషయాలను  గమనించగలరు.

* There is no caste-system in Vedas
agniveer.com

* Sabari's selfless service | Amruthakathalu#5 | Story of Sabari in Ramayana | Telugu stories - YouTube



............

 రావణుడు కూడా గొప్పవంశస్తుడే. శివభక్తుడు కూడా. అయితే, స్త్రీల పట్ల ఎన్నో అకృత్యాలు కూడా చేసాడు.

శివాంశసంభూతుడైన ఆంజనేయస్వామి వారు , రామునికి సీతాదేవిని అప్పగించమని  రావణునితో చెప్పినా అతడు  వినలేదు.  శ్రీరాముని చేతిలో హతమయ్యాడు.

ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, 

వాళ్ళు ఏ వంశస్తులు అని కాకుండా, ఎంత గొప్పవారైనా సరే, చెడ్డ పనులు  చేస్తే శిక్షించబడతారు,  అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు అని ... తెలుసుకోవాలి.

*******************
సీతారాముల వారసుల గురించి భారతంలో వివరాలు ఉన్నాయట. వారు  కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారనితెలుస్తోంది.

 రాముని వారసులు కౌరవుల పక్షాన పాల్గొనటం గురించి  కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ రాముల వారసులు ( నాకు తెలిసినంతలో 28 తరాల తరువాత వారు..)కౌరవుల పక్షంలో నిలవటం వెనుక వారి కారణాలు వారికి ఉండవచ్చు.

గొప్పవారైన భీష్ముల వారు కూడా కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నారు కదా! భీష్ముల వారు  కౌరవుల పక్షాన ఉండటానికి  వారి  కారణాలు వారికి ఉన్నాయి.

 భీష్ముల వారు  ప్రజలను  కాపాడటానికి కట్టుబడి ఉండటం వల్ల… ...పాండవులంటే ఇష్టం ఉన్నా కూడా, కౌరవుల పక్షాన ఉండవలసివచ్చింది.

శ్రీ కృష్ణుని బంధువులు మునిపట్ల వేళాకోళంగా ప్రవర్తించటం..  శాపం కారణంగా నశించారు. అప్పుడు శ్రీకృష్ణులవారు బంధువులను ఆదుకోలేదు.

  బంధువులయినంత మాత్రాన, వారు తప్పులు చేసినా సహించటం ఉండదు.

********
 శ్రీ రాముని వంశస్థులలో హరిశ్చంద్రుని తండ్రి అయిన  త్రిశంకువు  కూడా కొన్ని పొరపాట్లు చేయటం వల్ల కొంతకాలం శిక్షను అనుభవించారు.

ఇంద్రుడంతటి వారే కొన్ని పొరపాట్లు చేసి అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవించటం ... అనే విషయం కూడా  గ్రంధాలద్వారా తెలుస్తుంది.

ఎంత గొప్ప వారైనా సరే  ,  పొరపాట్లు చేస్తే అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది.


2 comments:


  1. లోకంలో, చెడ్డవాళ్ళ వల్ల మంచివాళ్లు కష్టాలు పడవలసిరావటం అనేది ఎంతో బాధాకరం.అందువల్ల లోకంలో చెడు ఉండకూడదు.

    అయితే, తప్పులు చేస్తున్నవారి వల్ల తప్పులు చేయనివాళ్లు కష్టాలు పడటం అనేది ఎన్నో సందర్భాలలో జరుగుతూనే ఉంది.

    అత్యాశతో పర్యావరణాన్ని పాడుచేస్తున్న కొందరు మనుషుల వల్ల ఎన్నో జీవజాతులు కష్టాలు పడుతున్నాయి.

    మత్తుమందులు తీసుకుని వాహనాలను నడిపే కొందరి వల్ల రోడ్దు ప్రక్కన వెళ్లే కొందరు మరణిస్తున్నారు.

    సిగరెట్లు త్రాగే కొందరి వల్ల ప్రక్కనున్నవారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది.

    విచ్చలవిడిగా లైంగికసంబంధాలతో తిరిగే వారి వల్ల వారి జీవితభాగస్వాములకు కూడా రోగాలు వచ్చే అవకాశముంది.

    ఇలాంటప్పుడు.. భార్యాభర్తలలో ఎవరికైనా ఏ తప్పూ చేయకపోయినా, పొరపాటున ఎయిడ్స్ వంటి జబ్బులు వస్తే జబ్బు వచ్చిన జీవితభాగస్వామిని చూసుకోవాలా? వదిలేయాలా?

    ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి? సమాధానం సరిగ్గా దొరకని ప్రశ్నలూ ఉంటాయి.

    చెడు కారణంగా సమాజంలో సమస్యలు వస్తాయి. అందుకే ప్రపంచంలో చెడు పోవటానికి అందరూ చేతనైనంతలో ప్రయత్నించాలి.

    ReplyDelete
  2. నాకు తోచిన విషయాలను వ్రాసుకున్నాను. ఇప్పుడు ఈ విషయాలపై చర్చించాలని అనుకోవటం లేదు. దయచేసి కామెంట్స్ వ్రాయవద్దని కోరుతున్నానండి.

    ReplyDelete