koodali

Monday, July 2, 2018

ఓం.. శ్రీ సీతారాములు...మరికొన్ని విషయములు..* శ్రీదేవీభాగవతము  గ్రంధములో  శ్రీరామకధ గురించి క్లుప్తముగా .. కొన్ని వివరములు ఉన్నాయి కానీ, 

  రామపట్టాభిషేకం తరువాత సీతాదేవి అడవులకు వెళ్ళటం ..వంటి విషయాలు లేవు.(నాకు తెలిసినంతలో). 


* వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్రామాయణంలో శ్రీరామ పట్టాభిషేకం వరకు మాత్రమే చెప్పబడినదని, 

యుద్ధకాండలో ఫలశ్రుతి శ్లోకాలు ఉన్నాయి  కాబట్టి,
  ఉత్తరకాండ ప్రక్షిప్తం.. అని కొందరు భావిస్తున్నారు.

నిజంగానే ఉత్తరకాండ ప్రక్షిప్తమా? లేక ఉత్తరకాండలో కొంత భాగం ప్రక్షిప్తమా? 
లేక ఇంకా ఎక్కడైనా ప్రక్షిప్తాలు జరిగాయా?
..అనే విషయాల గురించి సందేహాలు కలిగాయి.


*  గాయత్రి రామాయణం శ్లోకాలలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి లవకుశులకు జన్మనివ్వటం గురించిన శ్లోకం ఉన్నది.


* తులసీదాసు గారు వ్రాసిన రామాయణంలో లవకుశులు జన్మించటం గురించి ఉన్నది కానీ, 

పట్టాభిషేకం తరువాత , కొందరు  వేసిన నిందల వల్ల  సీతమ్మను అడవులకు పంపేయటం.. అనే     విషయాలు  లేవట. 

అయితే , కొందరు తులసీదాసువారి రామాయణంలో లవకుశుల ప్రసక్తి ఉన్నట్లు చెప్పటం లేదు. 

ఏం జరిగిందన్నది దైవానికి తెలుస్తుంది.

 ****************
ఇక్ష్వాకువంశ చరిత్ర ద్వారా.. రాముని  పుత్రులైన  కుశలవుల   పేర్లు, వారి తరువాత  రాజుల గురించి కూడా తెలుస్తున్నది.

 శ్రీ మద్భాగవతం మరియు  కొన్ని గ్రంధములలో ఇక్ష్వాకువంశం రాజుల గురించి  వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

***********

తులసీదాసు వారు శ్రీరాముని పరమభక్తుడు. ఈయన రామాయణాన్ని హిందీమూలంలో అందించిన తొలి కవి. 

అలాగే రాముని భక్తుడు అయిన ఆంజనేయునిపై హనుమాన్ చాలీసాను కూడా రచించారు.

వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించారు తులసీదాసు.దీనికి శ్రీరామచరితమానస్ గా నామకరణం చేశారు.

తులసీదాసు గారు దైవదర్శనాన్ని పొందిన మహాభక్తులట.

*********

సీతారాములు పడ్డ కష్టాలు ఎన్నో........

తెల్లవారితే పట్టాభిషేకం అనుకుంటే..దాని బదులు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయవలసి రావటం..

అరణ్యవాసం ముగింపుకు వచ్చిందిలే అనుకుంటే ..అంతలోనే సీతాపహరణం జరగటం..

సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఎన్నో కష్టాలు పడి భార్యను వెదికి తెచ్చుకున్నారు.

ఈ ఆధునికకాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా చేయగలరు ? 

కొంతమంది భార్యను వెదకటం మాని మరొక వివాహం చేసేసుకుంటారు.

****************

శ్రీరామవనవాస సమయంలో రామునితో పాటు సీతాదేవి వనాలకు వెళ్లే అవసరం లేకపోయినా, భర్త కొరకు సీతాదేవి కూడా రాజభోగాలను వదలి అడవికి వెళ్ళటం జరిగింది.


(సీతాదేవి శ్రీరామునితో వనవాసానికి వెళ్ళకపోయినట్లయితే... 

 రాముడు అడవుల్లో కష్టాలు పడుతుంటే,  సీత మాత్రం హాయిగా రాజభవనంలో ఉంది..అని కూడా కొందరు అనేవారేమో ?)


ఎన్నోకష్టాలకోర్చి, రాములవారుసీతాదేవిని...రావణాసురుని చెర నుండి రక్షించుకున్నారు.


* ఈ క్రమంలో ఎందరో రాక్షసులను సంహరించి లోకానికి మేలు చేసారు. 

*ఎన్నో విలువలతో కూడిన సీతారాముల జీవితాలు అందరికీ ఆదర్శం. 

*సీతారాములు ఆదర్శదంపతులు.

*************************


*శ్రీ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు .. ఎంతో పరాక్రమవంతులు. వానరులు కూడా దేవాంశసంభూతులట. 


సాధారణ దృష్టితో చూస్తే ఎంతో క్రూరులు, బలవంతులైన రాక్షసులు ఎక్కడ  ? సామాన్య బలం కలిగిన వానరులు ఎక్కడ ?

*ధర్మం.. అధర్మం పై విజయాన్ని సాధించిన కధ ఇది. 

*రామతత్వం.. రావణతత్వం పై విజయాన్ని సాధించిన కధ ఇది.

అందుకే రామాయణ పారాయణం ఎంతో శుభకరమని పెద్దలుతెలిపారు.

 ఎవరికయినా జీవితములో కష్టములు వస్తే ఆత్మహత్యలకు పాల్పడటం, లేక అధర్మాన్నిఆశ్రయించటం వంటి పనులు చేయకుండా..

* ఈ కధలను గుర్తు తెచ్చుకుని అంత గొప్పవాళ్ళే అన్ని కష్టాలు అనుభవించారు మనమెంత.. అని ధైర్యము తెచ్చుకోవాలి.

వారు ధైర్య, సాహసములతో ధర్మంగా విజయాన్నిఎలా సాధించారో మనమూ నేర్చుకోవాలి. 

*ఎక్కడయినా, ఎప్పటికయినా ధర్మమే గెలుస్తుంది ..అని తెలుసుకోవచ్చు.

* అంతా  భగవంతుని దయ.

************

ఆసక్తి ఉన్నవారు పైన  క్లిక్ చేసి చూడగలరు... 

*************
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే.. దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
3 comments:

 1. ఇక్కడ ఈ విషయాల గురించి నాకు స్పష్టత ఉన్నది. అయితే, నా అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లు వ్రాయలేకపోతున్నాను.

  కొన్నిసార్లు మన అభిప్రాయాలను ఇతరులకు ఎంత స్పష్టంగా చెప్పినా వారు సరిగ్గా అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకునే కొన్ని సంఘటనలు నిజజీవితంలో అనుభవమై ఉంటుంది.

  అలాగే ఇక్కడ కూడా నా అభిప్రాయాలను ఎంత స్పష్టంగా చెప్పినా కొందరు అపార్ధం చేసుకోవచ్చు. అందుకని నా అభిప్రాయాలన్నింటినీ వ్రాయటం లేదు.

  మనం తినే పదార్ధాల రుచి ఉన్నదున్నట్లుగా ఎదుటివారికి చెప్పలేము.

  ఎవరికి వారు ఆ పదార్ధాన్ని తిన్నప్పుడే ఆ పదార్ధపు రుచిని వారు ఆస్వాదించగలరు.

  కొన్ని అభిప్రాయాలు కూడా ఎవరికి వారు తెలుసుకున్నప్పుడే చక్కగా అర్ధమవుతాయి.

  ReplyDelete

 2. ధన్యవాదాలండి. అంతా దైవం దయ.

  ReplyDelete