koodali

Sunday, January 21, 2018

గ్రహణసమయంలో వచ్చే ప్రభావం గురించి...

 గ్రహణసమయంలో కొన్ని హానికారకకిరణాలు వెలువడతాయని  ప్రాచీనుల అభిప్రాయం కావచ్చు.

  గ్రహణ సమయములో దర్భ వాడమని ప్రాచీనులు తెలియజేసారు.

గ్రహణం సందర్భంగా పదార్ధాలపై దర్భను వేస్తారు.

 గ్రహణం తరువాత గృహాన్ని శుద్ధి చేసుకుంటారు.

దర్భలో రేడిఏషన్ తగ్గించే గుణం ఉందని  ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్నారట.


Darbha Grass or Kusha Grass blocks X-Ray & other Radiation..


Dharbha Kusa Grass Blocks X Ray Increases Phonetic Vibrations ...
.................................... 

సూర్యగ్రహణం సమయంలో సూర్యుణ్ణి డైరెక్ట్ గా చూడకూడదని , ప్రత్యేకమైన సాధనాల ద్వారా మాత్రమే చూడాలని, లేకపోతే కళ్ళకు ప్రమాదమని ఆధునిక శాస్త్రవేత్తలే చెబుతారు.

మామూలుగా గ్రహణం లేని సమయాలలో సూర్యుని చూడటం విషయంలో అన్ని జాగ్రత్తలు చెప్పరు.

ఈ విషయాన్ని గమనిస్తే సూర్యగ్రహణం సమయంలో ప్రత్యేకమైన కిరణాల శక్తి వెలువడుతుందని తెలుస్తోంది కదా ! 

**********************
కొందరు ఏమంటారంటే, గ్రహణసమయములో  తగు జాగ్రత్తలు తీసుకోకున్నా  తమకు అనారోగ్యం రాలేదని చెబుతారు.  


 కొ
న్నిసార్లు అనారోగ్యం బైట పడటానికి .. కొన్ని సంవత్సరాల సమయం కూడా పట్టవచ్చు.


ఉదా.. గ్రహణ సమయంలో ఎక్స్ రేస్, అల్ట్రా వయొలెట్ కిరణాలు రేడియేషన్ ఎక్కువగా విడుదల అవుతాయని కొందరు అంటున్నారు. 

రేడియేషన్ వల్ల కాన్సర్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

అయితే, కాన్సర్ వచ్చిందని గుర్తించటానికి కొందరిలో10 ఏళ్ళు పట్టవచ్చు. కొందరిలో 40 ఏళ్ళు కూడా పట్టవచ్చు.

అంటే , అల్ట్రావయలెట్ కిరణాల వల్ల రేడియేషన్ కు  గురయ్యి  కాన్సర్ వస్తే తెలియడానికి కొన్ని ఏళ్ళు  పట్టవచ్చు.

  గర్భంలో ఉన్న పిండం చాలా డెలికేట్ గా ఉంటుంది. కాబట్టి, తొందరగా రేడియేష న్ కు గురయ్యే ప్రమాదముంది.

గ్రహణ సమయంలో గర్భవతులు జాగ్రత్తలు తీసుకోకపోతే,  పిండం రేడియేషన్ కు గురయ్యి,  ఆ వ్యక్తి  పెద్దయ్యాక  కొన్నేళ్ళకు కాన్సర్ వచ్చినా ఆ జబ్బు ఎందుకు వచ్చిందనే విషయం ఎవరికీ తెలియదు.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రాచీనులు గర్భవతులకు  కొన్ని జాగ్రత్తలు చెప్పి ఉంటారు. 

జాగ్రత్తలు  మేము పాటించం .. అంటే ఎవరేం చెయ్యగలరు ? ఎవరి ఖర్మ వారిది అనుకోవటం తప్ప.  

అయితే, అందరి విషయంలోనూ ఒకేలా జబ్బులు వస్తాయని చెప్పలేం. వారివారి తట్టుకునే శక్తిని బట్టి పరిస్థితి ఉంటుంది.

  అనేక కారణాల వల్ల    ఈ రోజుల్లో కాన్సర్ వంటి   వ్యాధులు ఎక్కువయ్యాయన్నది  నిజం.

అనారోగ్యం రావటానికి , రాకపోవడానికి అనేక కారణాలుంటాయి.

ఉదా..   కొందరికి  వ్యాధులు తొందరగా వస్తాయి. కొందరికి రావు.   రెసిస్టెంట్ పవర్ ఎక్కువ ఉన్నవాళ్ళు తట్టుకోవచ్చు. 


అయితే చుట్టుప్రక్కల వైరల్ ఫీవర్లు ఉన్నప్పుడు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు.

అలాగే  గ్రహణ సమయంలో   వచ్చే మార్పులను తట్టుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తెలియజేసారు.  


గ్రహణసమయంలో ఆహారం తినకూడదని, గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసారు.

***************


 ప్రాచీనులు చెప్పిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించటం కన్నా, వారు తెలియజేసిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.


అయితే,  సమాజంలో కొన్ని మూఢనమ్మకాలు, ఆచారవ్యవహారాలలో కొన్నిసార్లు  విపరీత ధోరణులు  ప్రవేశించాయి. 

ఇలాంటి వాటిని గమనించి విచక్షణతో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 

ఉదా..గర్భవతులు కాళ్ళు, చేతులు కదలకుండా నిటారుగా పడుకోవాలని ఈ  మధ్య  కొందరు చెబుతున్నారట.

గర్భవతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గానీ, కాళ్ళు చేతులు కదలకుండా నిటారుగా పడుకోవాలంటూ.. విపరీతధోరణితో ఆలోచించటం మూఢత్వం అవుతుంది.

************* 
గ్రహణము సమయములో గంగా స్నానము చేస్తారు కుదిరిన వాళ్ళు.

 గంగానది నీటిలో మలినాలను శుద్దిచేసే శక్తి ఎంతో ఎక్కువగా ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన్నారట.

Mystery Factor Gives Ganges a Clean Reputation : NPR


*******************

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రం యొక్క ఆటుపోట్లలో హెచ్చుతగ్గులు ఉండటం తెలిసిన విషయమే. 

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో నేరాలు ఎక్కువగా జరగటాన్ని కొందరు పోలీసులు అంగీకరించారు. ఈ విషయాన్ని వ్యతిరేకించే వారూ ఉన్నారు. 

డార్విన్ సిద్ధాంతం గురించి కూడా  శాస్త్రవేత్తలలోనే   అంగీకరించేవారూ, వ్యతిరేకించేవారూ ఉన్నారు. 

గ్రహణసమయంలో వచ్చే ప్రభావం గురించి ఇప్పటివరకు ఆధునిక విజ్ఞానం కనిపెట్టలేకపోవచ్చు. భవిష్యత్తులో కనుగొంటుందేమో ?

******************

అయితే,  కొందరు ఆధునికులు.. ప్రాచీనులు చెప్పిన విషయాలను హేళనగా మాట్లాడుతున్నారు. 

ఆధునిక విజ్ఞానానికి ముందే ప్రపంచంలో సైన్స్ ఉన్నది. 

సృష్టిలోనే సైన్స్ ఉన్నది. ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన దైవమే గొప్ప శాస్త్రవేత్త. 


2 comments:

  1. దైవ సృష్టితో పోల్చుకుంటే మానవులు సాధించిన సాంకేతికత ఏపాటిది ?

    దైవం ప్రసాదించిన గాలిని పీల్చి బ్రతుకుతూ .... దైవ సృష్టి లోని పదార్ధాలతో సాంకేతికతను అభివృధ్ధి చేసుకుని కూడా , కొందరు నాస్తికులు దైవం లేరు అనటం ఎంతో బాధాకరం.

    సాంకేతికత ఇంత అభివృద్ధి చెందటం వెనుక దైవభక్తి గల ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్రవేత్తలందరూ నాస్తికులు కారండి.

    మన ప్రాచీన కాలము నాటి సైన్స్ గొప్పతనము గురించి ఈ నాటి శాస్త్రవేత్తలు కనిపెట్టి చెబుతున్నందుకు నిజముగా ఈ నాటి సైంటిస్ట్స్ ను మనము గౌరవించాలి .
    ..................


    ఈ సృష్టి భగవంతుని creation. దీనిపై సర్వహక్కులూ ఆయనవే....ఇందులోని పదార్దములతో మనము కొత్త వస్తువులను కనిపెట్టి దేవుడు అని ఎవరూ లేరు అనటం అన్యాయము.
    ................................

    దయచేసి ఈనాటి శాస్త్రవేత్తలు కొందరు దేవుడు లేడన్న వాదన వదిలేసి , గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాలో ఆలోచిస్తే పుణ్యం చేసిన వాళ్ళవుతారు....

    అలాగే మీరు ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ తయారు చేస్తే బాగుంటుంది.





    ReplyDelete
  2. కొందరు ఏమంటారంటే, ఎక్కడో దూరంగా ఉన్న సూర్యుని ప్రభావం భూమిపై మానవులపై ఎలా ఉంటుందని అంటారు.

    గ్రహణ సమయంలో సూర్యుని ప్రభావం భూమి మీద ఉన్న మనుషులపై ఎలా పడుతుందని వాదిస్తారు.

    సూర్యుడు ఎక్కడో సుదూరంలో ఉన్నా కూడా ఎండ పడి శరీరం చురుక్కుమనటం జరుగుతోంది కదా!

    ఇంకా సూర్యుని ప్రభావం ఎన్నో విధాలుగా ఉంటుంది.

    సూర్యగ్రహణం సమయంలో సూర్యుణ్ణి డైరెక్ట్ గా చూడకూడదని , ప్రత్యేకమైన సాధనాల ద్వారా సూర్యుని చూడాలని ఆధునిక శాస్త్రవేత్తలే చెబుతారు.

    గ్రహణ సమయంలో సూర్యుని డైరెక్ట్ గా చూస్తే కళ్ళకు ప్రమాదమనీ చెబుతారు.

    మామూలుగా గ్రహణం లేని సమయాలలో సూర్యుని చూడటం విషయంలో అన్ని జాగ్రత్తలు చెప్పరు.

    ఈ విషయాన్ని గమనిస్తే సూర్యగ్రహణం సమయంలో ప్రత్యేకమైన శక్తి వెలువడుతుందని తెలుస్తోంది కదా !

    అలాగే సూర్య, చంద్ర గ్రహణాల గురించి ఇంకా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి.



    ReplyDelete