koodali

Friday, July 14, 2017

ఉగ్రవాదం , యుద్దోన్మాదం ..అనేవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావు....

 
సమాజంలో సమస్యలకు ఎన్నో కారణాలున్నాయి. 

ఉగ్రవాదం వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవలసిందే. 

ఉగ్రవాద సమస్యకు మతం కారణం కాదు. సాటి మనుషులను హింసించమని  ఏ మతమూ చెప్పదు...

అంతేకాక ఒకే మతంలో కూడా శాఖా భేదాలతో ఒకరినినొకరు హింసించుకోవడాలు జరిగాయి.

ఉగ్రవాదం, యుద్దోన్మాదం ..అనేవి ఏ ఒక్క దేశానికో పరిమితం కావు. ఇవి ప్రపంచ సమస్యలు. 

ఈ సమస్యలకు కారణాలు అనేకం.  ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రతి దేశం తనను తాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకోవాలి. 

నైతికవిలువలు పెరగాలి . అవినీతి, ఆర్ధిక అసమానలు తగ్గాలి, నిరక్షరాస్యత..వంటివి పోవాలి. 

దేశంలో ప్రజల మధ్య ఐకమత్యత పెరగాలి.. ఇలాంటి విజయాలు  సాధించినప్పుడు దేశం బలమైన శక్తిగా ఎదుగుతుంది. 

దేశానికి హాని చేయటంలో పరాయి వాళ్ళతో పాటు కొందరు స్వదేశీయులూ కూడా కారణం అవుతున్నారు. 

కొందరు స్వదేశీయులు సొంత లాభం కోసం విదేశాలకు సంపదను తరలించటం కూడా దేశ ఆర్ధికవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇలాంటి వారినందరినీ శిక్షించాలి.

దేశంలోని అంతర్గత సమస్యలపై విజయాన్ని సాధించినప్పుడు బయటనుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవటం పెద్ద సమస్య కాదు. 

అయితే,  కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో  మాత్రం  కాలక్రమేణా  సమాధానం  లభిస్తుంది.
************
మనుషుల్లోని ..అసూయాద్వేషాలు , అహంకారం, అత్యాశ, అధికార దాహం, అభద్రతాభావం, ఆధిపత్య ధోరణి, ఆడంబరత్వం, పోటీతత్వం, తానే గొప్పగా ఉండాలనుకోవటం, ఇతరుల ఉన్నతిని భరించలేనితనం, సోమరితనం.....ఇలాంటి లక్షణాల వల్ల ప్రపంచంలో ఎన్నో సమస్యలు వస్తాయి.

 (అయితే, కొన్ని సందర్భాలలో ఇతరులను సరిగ్గా అర్ధం చేసుకోకపోవటం వల్ల కూడా సమస్యలు వస్తాయి.)

*************
చిత్రమేమిటంటే, కుటుంబంలో సమస్యలకు, ఇరుగుపొరుగు సమస్యలకు, దేశాల మధ్య సమస్యలకు ఎన్నో పోలికలుంటాయి.
అందువల్లే సమాజంలో ఎన్నో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. 

**************
  ప్రతికూల లక్షణాలున్న కొద్దిమంది వ్యక్తుల వల్ల వారితో పాటూ సమాజానికి  కూడా  ఎంతో హాని జరుగుతుంది.

 అందువల్ల,  పెద్దలు చెప్పిన సామ,  దాన, భేద,  దండోపాయాలతో చెడును నిర్మూలించాలి.

అయితే, ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు చెడును పూర్తిగా నిర్మూలించటం  సాధ్యపడకపోవచ్చు.. 

అలాంటప్పుడు  దైవంపై భారం వేసి మన ప్రయత్నాలను  చేయటం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది.


1 comment:

  1. పెద్దలు చెప్పిన సామ, దాన, భేద, దండోపాయాలతో చెడును నిర్మూలించాలి.
    అయితే , అందరిలోనూ అన్నీ చెడ్ద లక్షణాలూ, అన్నీ మంచి లక్షణాలే ఉండకపోవచ్చు. ఒకే వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు, కొన్ని చెడ్ద లక్షణాలూ ఉండవచ్చు.

    పరిస్థితిని బట్టి కూడా వ్యక్తులలో మంచి, చెడు మారే అవకాశాలూ ఉంటాయి. చెడు లక్షణాలను వదిలించుకోవటం అంత తేలిక కాదు.

    కొన్నిసార్లు మన మనస్సే మన మాట వినకుండా మారాం చేస్తుంది. ...ఇక, ఎవరినైనా మార్చటం అనేది అంత సులభం కాదు.

    అయితే, ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు చెడును పూర్తిగా నిర్మూలించటం సాధ్యపడకపోవచ్చు..

    అలాంటప్పుడు దైవంపై భారం వేసి మన ప్రయత్నాలను చేయటం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది.

    ReplyDelete