koodali

Thursday, September 8, 2016

1.దృష్టిలోపం తగ్గటానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులు....2.కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి....





ఆసక్తి ఉన్నవారు లింక్స్ వద్ద చూడగలరు.

   Ayurveda For Improving Eyesight
ayurveda-foryou.com/treat/improve-eyesight.



       Ayurvedic Remedy for Eye Sight Improvement | Ayurpedia

      ************************

      ఇంతకుముందు నాకు కళ్లజోడు లేదు. ఈ  మధ్యనే కళ్ళజోడు అవసరం పడింది. 

       బై  ఫోకల్  మరియు  ప్రొగ్రెస్సివ్ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి.

       బై ఫోకల్ నుండి కొన్ని లక్షణాలను ప్రొగ్రెస్సివ్ నుండి కొన్ని లక్షణాలను తీసుకుని కొత్తరకం కళ్ళజోడు తయారుచేస్తే బాగుంటుంది అనిపించింది.

      అంటే కళ్ళజోడును బై ఫోకల్ విధానంలోనే ఉంచి  మధ్యలో విభజన గీత ప్రదేశంలో మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందనిపించింది.

       అంటే కళ్ళజోడు అంతా ప్రొగ్రెస్సివ్ విధానం కాకుండా కళ్ళజోడు అంతా బై ఫోకల్ పద్ధతిలో తయారుచేసి ... విభజనగీత  వద్ద మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే బాగుంటుందని నాకు అనిపించింది.

       ప్రొగ్రెస్సివ్లో దృశ్యాన్ని చూడటానికి కళ్లు తమకు తామే సర్దుకోవలసి ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త దృశ్యాన్ని చూసినప్పుడల్లా కళ్లు అలసిపోయే అవకాశం ఉందనిపించింది.

      అదే బై ఫోకల్ మధ్యలో కొద్ది భాగానికి మాత్రం ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కలిగిస్తే కళ్ళకు కలిగే శ్రమ గణనీయంగా  తగ్గుతుందనిపించింది.

      ఇలాంటి  విధానం సరైనదో కాదో నాకు తెలియదు.నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.
      ...................... 

      రీడింగ్ గ్లాసెస్ తో కొందరికి దూరపు దృశ్యాలు సరిగ్గా కనిపించవట.

      మొదట్లో  నాకు రీడింగ్ గ్లాసెస్  ఉండేవి. నా విషయంలో రీడింగ్ గ్లాసెస్తోనే దగ్గర దృశ్యాలు, దూరపు దృశ్యాలు కూడా చక్కగా కనిపించేవి.

      ( బహుశా అప్పుడు నాకు ఉన్న దూరదృష్టి, దగ్గరదృష్టి కూడా  1.5 రీడింగ్ గ్లాసెస్ కు సరిపోయి ఉంటుంది.)

      అయితే కళ్ళజోడు షాప్ వాళ్ళు రీడింగ్ గ్లాసెస్ తో దూరపు దృశ్యాలు చూడకూడని చెప్పటంతో డాక్టర్ వద్దకు వెళ్లి బై ఫోకల్ వేయించుకున్నాను.

       బైఫోకల్ నాకు అనీజీగా ఉండటంతో ప్రొగ్రెసివ్ మార్చాను ప్రొగ్రెసివ్ ఇంకా అనీజీగా ఉండేది. ఇలా కళ్లజోడ్లు మార్చటంతో కళ్లు అలసి దగ్గరదృష్టిలోపం మరికొంచెం పెరిగింది. కొద్దిగా మెడనొప్పులు కూడా వచ్చాయి.

      ............................


      ఇంకో విషయం ఏమిటంటే,  రీడింగ్ గ్లాసెస్ తో దూరపు వస్తువులను చూడకూడదని కొందరు అంటారు.


      ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే ,  కొందరు  దూరపు వస్తువులను సరిగ్గా చూడలేని  వాళ్ళకు ఇచ్చే  కళ్ళజోడుకు విభజనగీత  ఉండదు. అద్దం అంతా ఒకే పద్ధతిలో ఉంటుంది. 

        వీళ్లు ఆ అద్దాలతోనే దూరపు వస్తువులనూ చూడగలరు..దగ్గర వస్తువులనూ చూడగలరు.

       ఈ విషయాన్ని గమనిస్తే ఏమనిపిస్తుందంటే ...

      . కొందరు   ఒకే అద్దంతో దూరపు  మరియు దగ్గర వస్తువులను చూస్తున్నప్పుడు ( వాళ్ళు అలా చక్కగా చూడగలిగినప్పుడు)..

      . రీడింగ్ గ్లాస్ వాడేవాళ్ళు ...వాటితో దూరపు వస్తువులను  కూడా చూడటానికి కూడా ఉపయోగిస్తే తప్పేమిటి  ? అనే సందేహం అనిపిస్తుంది.

       దృస్టి లోపం ఎక్కువ పెరిగినప్పుడు  ఎలాగూ బైఫోకల్  గానీ ప్రొగ్రెస్సివ్ గానీ ఇస్తారు.

      నాకు కళ్ళజోడు తయారీ గురించి తెలియదు. అయితే వివిధ కళ్ళజోడులను గమనించిన తరువాత నాకు తోచిన అభిప్రాయాలను వ్రాసాను.

       దైవం దయవల్ల నాకు ప్రస్తుతం దృష్టిలోపం ఎక్కువగా లేదు.

      అవసరమైనప్పుడు  రీడింగ్ గ్లాసెస్ వాడుతూ కళ్ళజోడు పవర్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను.




    6 comments:

    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను అప్పుడప్పుడు మీ బ్లాగ్ చూస్తున్నానండి.

      అయితే ఈ మధ్య కాలంలో చూడలేదు. పనివత్తిడి వల్ల కంప్యూటర్ జోలికి పెద్దగా రావటం కుదరలేదు.

      ఆయుర్వేదం చాలా గొప్పది అనిపిస్తోంది.

      మాకు తెలిసిన ఒకామె ఆయుర్వేదం ద్వారా రాందేవ్ బాబా చిట్కాలను ఆచరించి కళ్ళజోడు అవసరం లేకుండా చేసుకుంది.అయితే అవన్నీ ఆచరించాలంటే చాలా ఓపిక కావాలి.

      కళ్ళజోడు వల్ల చాలా లాభం ఉంది కానీ కళ్ళజోడు సరిగ్గా కుదరకపోతే కొన్ని సమస్యలూ ఉన్నాయి.



      ReplyDelete
    2. టపాలో ఇంకొక విషయం వ్రాయటం మర్చిపోయాను. టపాను పదేపదే మార్చకుండా ఇక్కడ వ్రాస్తున్నాను.

      బై ఫోకల్స్ కళ్ళజోడులో కొంతమందికి దూరపుదృశ్యాలు మరియు దగ్గరదృశ్యాలు బాగానే కనిపిస్తున్నా కూడా మధ్య దృశ్యాలు సరిగ్గా కనిపించవు.

      అందువల్ల మెడను వంచి లేక పైకి ఎత్తి చూడాలని సలహా ఇస్తారు. ఇందువల్ల మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది

      అంటే దూరదృష్టి, దగ్గర దృష్టి మాత్రమే కాకుండా మధ్య దృష్టి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి.

      ఇందుకోసం ఇంతకుముందు నేను వ్రాసినట్లు కళ్ళజోడు మధ్య గీత వద్ద కొంత భాగానికి ప్రొగ్రెస్సివ్ లక్షణాన్ని కల్పించితే మధ్యదృశ్యాలను కూడా చక్కగా చూడవచ్చు.
      ...................

      ఇంకో విషయం ఏమిటంటే, ట్రై ఫొకల్ అద్దాలు కూడా ఉంటాయట.

      అయితే ట్రై ఫోకల్స్ మధ్య విభజన గీతలు ఉంటాయా? ఉండవా? వాటి విధానం నాకు తెలియదు.

      ఒకవేళ వాటికి కూడా విభజన గీతలు ఉంటే ఆ విభజనగీతలు లేకుండా.. Distance... Near కు మధ్యన.. Intermediate ప్రదేశంలో ప్రొగ్రెసివ్ లక్షణాన్ని కల్పించితే బాగుంటుంది.

      ReplyDelete
    3. ( కళ్ళజోడు అంతా ఒకే అద్దంతో తయారుచేసి )ఇంతకు ముందు విభజన గీతలు ఉండే ప్రదేశంలో విభజన గీతలు లేకుండా ఆ భాగానికి అంటే Distance... Near కు మధ్యన.. Intermediate ప్రదేశంలో ప్రొగ్రెసివ్ లక్షణాన్ని కల్పించితే బాగుంటుంది.

      ReplyDelete

    4. రీడింగ్ గ్లాసెస్ తో దూరంగా కనిపించేవి చూడటం మంచిది కాదని నాకు అనిపిస్తోంది.

      అంటే, దూరదృష్టి పవర్.... రీడింగ్ పవర్ వేరేగా ఉండటం జరిగినప్పుడు కళ్ళు అలసిపోయి కళ్ళనొప్పి వస్తుందనిపిస్తోంది.


      ReplyDelete
    5. రీడింగ్ గ్లాసెస్ తో దూరపు వస్తువులను చూడటం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

      ReplyDelete