koodali

Wednesday, May 11, 2016

సాయిబాబా వ్యతిరేక ప్రచారం సరైనది కాదు...


సాయిబాబాను పూజించవద్దని కొద్దికాలం నుండి కొందరు ప్రచారం చేస్తున్నారు.  ఈ ప్రచారం సరైనది కాదు.

ఎందరో హిందువులు  షిర్డి సాయిని పూజిస్తున్నారు.

 శివుడు, విష్ణువు, బ్రహ్మ త్రిమూర్తుల మధ్య భేదం లేదు.. అని సనాతనధర్మం తెలియజేస్తే . ....  పాతకాలంలో కొందరు పండితులమని చెప్పుకున్నవారు  శైవులకు వైష్ణవులకు మధ్య గొడవలు సృష్టించారు. హిందువుల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి.

 హిందూ మతంలో దైవాన్ని ఎన్నో రూపాలతో పూజించుకోవచ్చు. ముక్కోటి దేవతలు ఉన్నారంటారు.

 సాయిని పూజించవద్దని  అనటం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. 

 సాయిని పూజించవద్దంటూ , సాయి విగ్రహాలు తొలగించాలని అనటం వల్ల హిందువులలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం కాదు.

సాయిని పూజించే వారు ఎవ్వరూ మతం మారటం లేదు. హిందూ మతంలోనే ఉంటూ పూజలు చేసుకుంటున్నారు.

 షిర్డి సాయి గురించి ఎన్నో విషయాలు శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము అనే గ్రంధములో  ఉన్నాయి. ఆ విషయాలు చదివితే షిర్డి సాయి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. 
........................

దత్తాత్రేయుల వారు 24 గురువుల గురించి తెలియజేసారు. గురువును దైవంగా భావించమన్నారు పెద్దలు. 

దత్తాత్రేయుల వారికి వందనములు. ఆది శంకరాచార్యుల వారికి వందనములు. షిర్డి సాయి వారికి  వందనములు.

 షిర్డి సాయి తన భక్తులకు వినాయకునిగా, శ్రీ రామునిగా, శివునిగా దర్శనమిచ్చారంటారు. 

షిర్డి సాయి  మహిమలు ఎన్నో మాకు అనుభవంలోకి వచ్చాయి.

 షిర్డిసాయి భక్తులు ఎందరో కూడా  సాయి మహిమలకు సంబంధించి  తమకు కలిగిన అనుభవాలను తెలియజేసారు. షిర్డి సాయిని వ్యతిరేకించటం సరైనది కాదు.

సాయి సాయి 

1 comment:

  1. ఆది శంకరులను ఆరాధించేవారు షిర్డి సాయిని ఆరాధించకూడదు అని కొందరు అంటున్నారు. అలా అనే హక్కు ఎవరికీ లేదు.

    మేము ఆది శంకరులనూ ఆరాధిస్తాము షిర్డి సాయినీ ఆరాధిస్తాము.

    ReplyDelete