koodali

Friday, May 13, 2016

మన దేశంలో ఎన్నో నదులు ఉన్నా కూడా...



భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఎంతో నీరు ఉంది.

 దురదృష్టం ఏమిటంటే ఆ నీటిని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం లేదు. 

ఎక్కువ  నీటి వసతి లేని సింగపూర్ , ఇజ్రాయిల్ వంటి దేశాలు వాళ్ళకు ఉన్న తక్కువ నీటినే సద్వినియోగం చేసుకుంటున్నారు.

  ఇజ్రాయిల్  దేశంలో కూడా అతి తక్కువ నీరుతో చక్కగా వ్యవసాయం చేస్తున్నారంటున్నారు.

 కొద్దికాలం క్రిందట ఆంధ్రప్రదేశ్లో కుప్పం ప్రాంతంలో ఇస్రాయిల్ వారి సలహాతో వ్యవసాయం చేసారు.


భారతదేశంలో  ఎన్నో TMC ల నీటి లభ్యత ఉన్నా కూడా సమర్ధవంతంగా వినియోగించుకోవటం చేతకాక గొడవలు పడుతున్నారు.

 నీటి యొక్క ప్రాముఖ్యత తెలిసి మన పూర్వీకులు నీటిని దేవతగా పూజించారు. నీటిని పాడుచేయకుండా సంరక్షించారు. నీటిని వృధా చేస్తే లక్ష్మీదేవి నిలవదన్నారు.

 నదులను దేవతలుగా పూజించే మన దేశంలో ప్రస్తుతం  జరుగుతున్నదేమిటంటే.. 

  నదులలో  డ్రైనేజీ వదలటం, పారిశ్రామిక వ్యర్ధాలను వదలటం ద్వారా నదులను  మురికి కూపాలుగా చేసేస్తున్నారు.

  ఉదా..అత్యంత పవిత్రంగా భావించే గంగా నది పరిస్థితి చూస్తే ..చాలా  బాధ కలుగుతుంది .  

 భారతదేశం వాళ్ళు ఇలా ఎందుకు తయారయ్యారో ?

***************
 పోస్ట్ పదేపదే మార్చటం కాకుండా కొత్తగా రాయాలనుకున్న విషయాలను వ్యాఖ్యల ద్వారా వ్రాస్తున్నాను.



8 comments:

  1. మరి కొన్ని విషయాలు..

    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు ఉన్నాయి. ఫ్లోరైడ్ ప్రాంతాలలో సాగుచేసిన పొలాలలో పండిన పంటను ఆహారంగా తీసుకున్నా ఫ్లోరైడ్ హాని ఉంటుందట.

    ఇంటి శుభ్రతకు, స్నానానికి, గిన్నెలు కడగటానికి ఫ్లోరైడ్ నీటిని వాడినా కొంచెం ఫరవాలేదు. ( గిన్నెలు కడిగిన తరువాత గిన్నెలను బోర్లించటం వలన ఫ్లోరైడ్ నీరు గిన్నెలలో నిలువ ఉండదు.)


    అయితే, ఫ్లోరైడ్ ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికి ప్రతి రోజు... త్రాగటానికి మరియు వంటకు రెండు బిందెల సురక్షిత నీటిని సరఫరా చేసినా చాలావరకు ఫ్లోరైడ్ బాధ తగ్గుతుంది.

    ప్రభుత్వాలు..నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికి రోజుకు కనీసం రెండు బిందెల నీరు ఇవ్వలేవా ?

    ReplyDelete
    Replies
    1. తినటానికి పప్పుదినుసులు ఏమైనా నానబెట్టినా ఫ్లోరైడ్ నీటితో కాకుండా శుద్ధి చేసిన నీటిలోనే నానబెట్టాలి.

      ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలను వ్యవసాయం కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చేయవచ్చు.


      Delete
    2. సింగపూర్ మొదలైన దేశాలలో సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి వాడుకుంటున్నారట. చెన్నైలో కూడా ఇలాంటివి ఉన్నాయి.

      అయితే ఇలా వచ్చిన ఉప్పును తిరిగి సముద్రంలో వదిలితే సముద్రంలో లవణ గాఢత పెరిగి సముద్రంలోని జీవులకు హాని కలిగే అవకాశం ఉందంటున్నారు.

      Delete
    3. మనిషికి రోజుకు గృహ అవసరాలకు పట్టణాలలో 150 లీటర్లు & పల్లెల్లో 100 లీటర్లు కావాలని కావేరి ట్రిబ్యూనల్ అంచనా.

      Delete

  2. సముద్రంలో వచ్చే మార్పులు భూవాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయంటారు. సముద్రంలో లవణ గాఢత హెచ్చితే సముద్రపు జీవులకు హానితో పాటు భూవాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.

    ఈ మధ్యకాలంలో ప్రజల కోరికలు విపరీతంగా పెరగటం వలన విచ్చవిడిగా నీటిని వాడుతున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం కూడా నీరు చాలా అవసరమవుతోంది.

    వర్షపు నీరు నదులలో కలిసి నదినీరు సముద్రంలో కలవటం... తరువాత ఎండలకు సముద్రపు నీరు ఆవిరి అయి వర్షాలు పడటమనేది ప్రకృతి సహజమైన చర్య.

    అయితే, ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారంటే, సముద్రంలో నదుల నీరు కలవటాన్ని వృధాగా చెపుతూ వీలైనంత వరకూ నదులనీరు సముద్రంలో కలవకుండా ఎక్కడికక్కడ ఆనకట్టలు కట్టేయాలంటూ చెబుతున్నారు.

    నదుల నీరు సముద్రంలో కలవకపోతే సముద్రపు నీటిలో లవణ సాంద్రత పెరిగి సముద్రంలోని జలచరాలకు హాని కలగటంతో పాటు, భూవాతావరణంపై కూడా ఆ ప్రభావం పడి వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

    అందువల్ల,మనుషులు తమ అవసరాలను తగ్గించుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలి కానీ ..నీరు సముద్రంలో కలవటం వృధాగా భావించటం సరైనది కాదు.

    ReplyDelete
    Replies
    1. ఈ రోజుల్లో సోలార్ విద్యుత్ వంటివి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి..క్రమంగా జలవిద్యుత్ విధానాన్ని తగ్గించుకోవచ్చు.

      Delete
    2. జల విద్యుత్ ఉత్పత్తి వలన నీరు ఖర్చు కాదండీ (non-consumptive use). నీరు మొత్తం టర్బైన్ల మీద పారుతూ కిందికి పోతుంది. ఎత్తు నుండి నీరు పడడం వలన ఉత్పత్తి అయ్యే kinetic energy టర్బైన్లు విద్యుత్తుగా మారుస్తాయి అంతే.

      సౌర విద్యుత్తు పర్యావరణ పరంగా శ్రేష్టం. బొగ్గు వాడకం తగ్గిస్తే మంచిది.

      పారిశ్రామిక రంగం నీటి వాడకంలో కూడా 97.5% నీరు తిరిగి వాడవచ్చును. అయితే కొన్ని పరిశ్రమలు చెత్త నీటిని నదులలో వదులుతారు ఇది హానికరం. అలా కాకుండా water treatment & ion exchange ద్వారా పరిశుభ్రం చేసి ఆ నీటిని ఉద్యానాలకు (ఆ నీరు తాగడానికి పనికి రాదు) వాడుటే మంచిది. ఇటీవలి కాలంలో ఇలా చేస్తేనే పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తోంది.

      నదీ జలాలు సముద్రంలో కలవడం వృధా కానే కాదు. బ్రిజేష్ ట్రిబ్యూనల్ తోలి నివేదికలో 16 వెకోఘ నీటిని ఖచ్చితంగా సముద్రంలో వదలాలని ఆదేశించింది.

      Delete
    3. జల విద్యుత్ ఉత్పత్తి వలన నీరు ఖర్చు అవుతుందని నా అభిప్రాయం కాదండి.

      నాకు తెలిసినంతలో... జలవిద్యుత్ కోసం నీటిని ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తారు.

      జలవిద్యుత్ కొరకు పెద్ద ఎత్తున నీటిని నిల్వ ఉంచటం వలన త్రాగునీరు, సాగునీరు కొరకు నీటిని వదలటంలో ఆలస్యం జరుగుతోంది.

      జలవిద్యుత్ తయారీ లేకపోతే ...పెద్ద ఎత్తున నీటిని నిలువ చేయటం ఉండదు కాబట్టి త్రాగునీటికి, సాగునీటికి ఎక్కువ నీరు లభిస్తుంది.

      Delete