koodali

Monday, September 21, 2015

మహాభారతం పట్ల .. కొన్ని అభిప్రాయాల గురించి ....

 
కొంతకాలం క్రిందట  వేణువు బ్లాగులో  మహాభారతం  గురించి...రంగనాయకమ్మ అనే ఆమె  యొక్క కొన్ని అభిప్రాయాలను ప్రచురించారు.  వాటి గురించి నా అభిప్రాయాలు కొన్ని... 
...............

వాళ్ళ అభిప్రాయం ...

 ‘భూదేవికేం క్షమ ఉంది? జన నాశనం చేసి, బరువు తగ్గించమని కోరింది కదా? అదేనా భూదేవి క్షమ?’
***********
నా  అభిప్రాయం..

భూదేవికి ఉన్న క్షమ చాలా గొప్పది. అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది .

 తల్లికి తన పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. పిల్లల తప్పులను తల్లి  ఎంతో ఓపికగా క్షమిస్తుంది. 

అయితే పిల్లలు  పాపాలు చేస్తూ ఉంటే పిల్లలను సరైన దారిలోకి తేవటానికి తల్లి దండించటం కూడా జరుగుతుంది కదా!

భూమిపై పాపాత్ములు పెరగటం వల్ల ఆ భారాన్ని తాను మోయలేకపోతున్నానని చెప్పి జననాశనం చేయమని భూదేవి  కోరటం జరిగిందంటారు.

జరిగిన యుద్ధంలో  పాపాలు  చేసిన వాళ్ళు , వాళ్లకు సహకరించిన వారు  ఎందరో శిక్షను అనుభవించారు. ఆ విధంగా ఎంతో  భూభారం తగ్గింది.

..................
వాళ్ళ అభిప్రాయం ... 

 అమృతం, అశుచిత్వం:  ఆదిపర్వంలో ఉదంకుడు  పేడ తింటాడు.  అది పేడ కాదనీ, అమృతమనీ తర్వాత  గురువు చెప్తాడు. 

ఈ సందర్భంలో ఆ  రచయిత్రి విశ్లేషణ- 

 ‘‘మాయలతో మంత్రాలతో తయారుచేసే కట్టు కథలు కూడా అందులో పెట్టుకునే హద్దులకే లోబడివుండాలి. అమృతాన్ని పవిత్రమైనదని ఒక పక్క చెపుతూ, అది తినడం వల్ల అశుచి అయినట్టు ఇంకో పక్క చెపితే , ఆ అతకనితనం కట్టుకథకి కూడా పనికి రాదు.’’

***********
నా  అభిప్రాయం.. 

ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి . 

నలదమయంతి కధలో నలుడు లఘుశంకకు వెళ్ళి వచ్చిన తరువాత కాళ్ళుచేతులు శుభ్రం చేసుకోకపోవటం వల్ల  అశుచిత్వం కలిగి, కలికి  తన ప్రభావం చూపించటానికి  అవకాశం లభించిందని అంటారు.

ఉదంకుని అశుచి  విషయంలో ఎలా అర్ధం చేసుకోవచ్చంటే,

  ఉదంకుడు గోమయం తిన్న తరువాత రాజు వద్దకు వెళ్ళటానికి చాలా సమయం పడుతుంది. దారిలో ఉదంకుడు కాలకృత్యాలు  తీర్చుకుని ఉండవచ్చు.

 ప్రయాణ బడలిక వల్లో లేక  మరేవైనా కారణాల వల్లనో కాలకృత్యాల తరువాత  ఉదంకుడు కాళ్ళుచేతులు శుభ్రం చేసుకోకుండా ఉండవచ్చు. ఆ విధంగా ఉదంకుడు  అశుచి అయి ఉండవచ్చు. 

జరిగిన విషయం గుర్తు లేకపోవటం వల్ల , పేడ తినటం వల్లనే  తనకు అశుచి వచ్చిందని ఉదంకుడు భావించి ఉండవచ్చు.



No comments:

Post a Comment