koodali

Saturday, September 12, 2015

అంతరార్ధాలను గ్రహించాలి.


ప్రాచీన గ్రంధాల ద్వారా పెద్దలు ఎన్నో విషయాలను అందించారు.  

పురాణేతిహాసాలను  అపార్ధం చేసుకోకుండా సరిగ్గా అర్ధం చేసుకోవాలి.

మహాభారతం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

పెద్దలు కొబ్బరి తింటే మంచిది అని తెలియజేసారనుకోండి.

 కొబ్బరి బొండాన్ని చూసి.. దీన్ని ఎలా  తింటారు ? ఈ పెద్దలు ఇలాగే చెబుతారు. అని ఎగతాళిచేయకూడదు.

 కొబ్బరి బొండాం పీచు వలిచితే లోపల ఉన్న తీయటి కొబ్బరి కనిపిస్తుంది. 

అలాగే పురాణేతిహాసాలను పైపైన చూసి అపార్ధం చేసుకోకుండా అంతరార్ధాలను గ్రహిస్తే చక్కటి విషయాలు అవగతమవుతాయి.

**********
ఏ పనిలోనైనా గతంలో చేసిన కర్మల ప్రకారం ప్రస్తుత ఫలితాలు ఉంటాయి. బాగా చదివితే మంచిమార్కులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే మంచిమార్కులు రావు. అలాగే, గతజన్మలో మంచిపనులు చేస్తే తరువాత జన్మలో మంచిజీవితం,గతంలో చెడుపనులు చేస్తే ఫలితంగా కష్టాలు వస్తాయి.అయితే,వర్తమానంలో మంచిగా ఉండటం ద్వారా మంచిగాఉండవచ్చు.
 
అంతా దైవం దయ.
 

No comments:

Post a Comment