koodali

Friday, July 5, 2013

నేను కొంతకాలం క్రిందట దైవాన్ని నమ్మని నాస్తికవాదిని...


 పెద్దవాళ్ళు  ప్రసాదాన్ని  ఇచ్చినా  తీసుకోకపోవటం,     దైవం  , పురాణేతిహాసాల  గురించి   ఫ్రెండ్స్ తో  వేళాకోళంగా  మాట్లాడటం  ఇలా ..... ఉండేది  నా  ప్రవర్తన. 

  క్రమంగా  దైవం  అంటే  నమ్మకం  కలగటం మొదలయ్యింది. (  కొన్ని కారణాల  వల్ల  ) 

పురాణేతిహాసాలలోని  విషయాలను  క్రొత్త  కోణంలో  తెలుసుకుంటూ    క్రొత్తక్రొత్త   విషయాలను   తెలుసుకుంటున్న  కొద్దీ  ఆశ్చర్యంగా  అనిపించేది. 


 అయ్యో ! ఇంతకు  ముందు  వీటిని  అపార్ధం  చేసుకున్నాను  కదా  !  అనిపించేది.

పురాణేతిహాసాల  గురించి  తెలిసినంతలో  పాత టపాలలో  వ్రాశాను.  నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  ఈ  మాత్రం  వ్రాయగలుగుతున్నానంటే ,  అంతా  దైవం  దయ.

 జీవితంలో  ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  ఉంటాయో  ...ఎలా  ప్రవర్తించాలో...ఎలా  ప్రవర్తించకూడదో  పురాణేతిహాసాల  ద్వారా  పెద్దలు  మనకు  తెలియజేసారు.

  రామాయణం, భారతంలోని  విషయాలలో   ఎన్నో    కోణాలు  ఉంటాయి.  పురాణేతిహాసాలను  చదువుతున్నకొద్దీ ....  క్రొత్త  విషయాలు ( అర్ధాలు )  తెలుస్తుంటాయని  పండితులు  తెలియజేశారు.

  ప్రపంచంలో  ఉండే  అన్ని  విషయాల  గురించి  ప్రస్తావన  మహాభారతంలో  ఉన్నది. 

భగవద్గీత  గురించి  ఏమని   వర్ణించగలం...  భగవద్గీత   అత్యద్భుతమైన  గీత.

ఎన్నో  శాస్త్రాలు..... వైద్యశాస్త్రం,  ఆర్ధిక  శాస్త్రం,  ఖగోళ  శాస్త్రం,  రసాయనశాస్త్రం,   యంత్ర  శాస్త్రం, మానసిక  శాస్త్రం,   న్యాయశాస్త్రం,   లోహశాస్త్రం.......ఇలా  ఎన్నో  శాస్త్రాల  ద్వారా  ఎంతో  విజ్ఞానాన్ని  ప్రాచీనులు  మనకు  అందించారు.

దురదృష్టవశాత్తు  మనలో  కొందరు   ప్రాచీన  గ్రంధాలను  సరిగ్గా  అర్ధం  చేసుకోవటం  లేదు.

అయితే,  దైవాన్ని  పురాణేతిహాసాలను  విమర్శించేవారిని  చూస్తే  జాలిపడటం  తప్ప  ఏం  చేయగలం. 

 నేను  కూడా  నాస్తికవాదిగా  ఉన్నప్పుడు  దైవం  గురించి  పెద్దవాళ్ళు  ఎంత  చెప్పినా  వినిపించుకునేదాన్ని  కాదు.

ఎవరికైనా  తెలుసుకోవలసిన  సమయం  వచ్చినప్పుడు  తెలుస్తుందేమో.....

..........................


విదేశీయుల  రాక  మరియు   దండయాత్రల   పర్యవసానంగా    భారతదేశం  నుంచి  ఎంతో  సంపద  కొల్లగొట్టబడి,   విదేశాలకు  తరలిపోయింది. 

ఎన్నో  విలువైన  ప్రాచీన  విజ్ఞాన  గ్రంధాలను  కూడా  వాళ్ళు  తమ  దేశాలకు  తరలించుకుపోగా,   ఇక్కడ  ఉన్న  వాటిలో  కొన్నింటిని   నాశనం  చేశారు. 


 ఆ  విధంగా  తరతరాల  దోపిడీలో  మనం  ఎంతో  సంపదను  కోల్పోయాము.

  మెకాలే   విద్యావిధానాన్ని   భారతదేశంలో   ప్రవేశపెట్టేముందు   ఈ  దేశం  గురించి   అన్న  మాటలు  చాలా  మందికి  తెలుసు.

 ఇండియా  ఎంతో   సిరిసంపదలతో  ఉన్నదని ,  ఇక్కడ  బిచ్చగాళ్ళు  కనపడలేదని  ...అంటూ    మరెన్నో  విషయాలను  చెప్పటం   జరిగింది. 


Sunday Posts: Lord Macaulay's Speech on Indian Education: The ...


 బ్రిటిష్ వాళ్ళు  ఇండియాకు  రాకముందు  కూడా  కొన్ని  విదేశీ  దాడులు  జరిగాయి.  అయినప్పటికి ,   మెకాలే  కాలానికి  కూడా   ఇండియాలో  అంత  సిరిసంపదలు  ఉన్నాయంటే ......


 విదేశీయులు  భారతదేశంలో  ప్రవేశించి  దాడులు  జరగకముందు  ఈ  దేశం  ఎంత  గొప్పగా ఉండేదో  కదా!

 భారతదేశం  ఆర్ధికంగా  ఇప్పుడిలా  వెనకపడి  ఉండటానికి  అనేక  కారణాలున్నాయి.  అందులో  కొన్ని...

1.  మనలో  ఎక్కువమందికి    మన  పూర్వీకులన్నా , మన  ప్రాచీన  సంస్కృతి  అన్నా,   చులకన  భావం   ఉంది....


.మనకేమీ  తెలియదని..... విదేశాల  వాళ్ళకే  అన్నీ  తెలుసు .... అనుకుంటూ  గిల్టీగా  ఫీలవుతుంటారు . 

2. మనలో  ఐకమత్యం  తక్కువ.  భారతదేశం  తరతరాలుగా  విదేశీదాడులకు   గురవుతోందంటే   ఇలాంటి    కారణాలు  ఎన్నో  ఉన్నాయి.

ఇప్పటికీ  భారతదేశం  నుంచి  సంపద  విదేశాలకు    తరలిపోతూనే  ఉన్నది. రకరకాల మార్గాలలో  మరియు   విపరీ
తమైన   మేధావుల  వలస  రూపంలో...
.........................


ఆధునిక  కాలంలో  ప్రపంచం  ఎదుర్కొంటున్న.....  నైతికవిలువల  క్షీణత,  ఆర్ధిక  సంక్షోభం,  నిరుద్యోగం,   గ్లోబల్  వార్మింగ్  వంటి  పర్యావరణ  సమస్యలు   ...

ఇలాంటి  ఎన్నో   సమస్యల నుండి  ప్రపంచం  బైటపడాలంటే  మన  పురాణేతిహాసాలు  మరియు  ప్రాచీన  విజ్ఞానం  ద్వారా  చక్కటి  పరిష్కారాలు  లభిస్తాయి.


6 comments:

  1. అయ్యా మీరు కూడా మెకాలే రూపొందించిన విదానం లోనే కదండి చదువుకున్నది. అతను అలా చెయ్యకపోతే విద్య అంతా కొంతమంది చేతుల్లోనే ఉండేది.

    ప్రాచిన విద్య ఉపయోగించి కనీసం మీరు ఉద్యోగం సంపాదించగలరా?

    భారతదేశం బ్రిటీష్ వారు రాక ముందు సిరిసంపదలు దేశం అన్నారు. ఎప్పుడైనా శూద్రులు,నిమ్నకులాలు అనే వాళ్ళు అప్పుడు ఎన్ని భాదలు అనుభవించారో ఆలోచించారా?

    ReplyDelete
    Replies
    1. ఆహా! ఏంచెప్పారండి.'అన్నీ మన వేదాల్లో ఉన్నాయష' అన్న సంగతి అగ్నిహోత్రావధాన్లు ఎప్పుడో తెలుసుకొన్నారు.

      Delete
    2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
      మేము ఊరు వెళ్ళి వచ్చాము.
      ఆలస్యంగా జవాబు వ్రాస్తున్నందుకు మన్నించండి.

      మెకాలే విద్యావిధానం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అవసరాలు తీరటానికి ఉద్యోగస్తులను ( గుమాస్తాలను ) తయారుచేయటానికి బాగా పనికొచ్చింది. స్వాతంత్రోద్యమ సమయంలో పాల్గొన్న ఉద్యమకారులను అణచివేయటానికి కూడా మన ఉద్యోగస్తులనే ఉపయోగించేవారు.

      మీ ఉద్దేశంలో
      విద్య అనే పదానికి అర్ధం ఏమిటో నాకు తెలియదు కానీ, మెకాలే విద్యావిధానం రాకముందు కూడా ఈ దేశం ప్రజలు సిరిసంపదలతో ఉండేవారు. కళాశాలకు వెళ్ళి చదివితేనే విద్య కాదు.

      పూర్వకాలపు రైతులు ఏ కళాశాలలో చదవకపోయినా పెద్దల ద్వారా తరతరాలనుంచి తెలుసుకున్న విజ్ఞానంతో అద్భుతంగా పంటలను పండించి సమాజానికి అందించి తామూ చక్కగా జీవించేవారు.

      ( రైతులు, చేనేత రంగాలు, ఇతర చేతి వృత్తుల వాళ్ళు అప్పులతో ఇప్పటిలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అప్పుడు లేదు. )

      అలాగే వాణిజ్య రంగం, ఇతర రంగాలు ఉచ్చ స్థితిలో ఉన్న కాలమది. చేతి వృత్తుల వారు ఏ కళాశాలలో చదవకపోయినా అద్భుతమైన కళాప్రజ్ఞను కలిగి ఉండేవారు. అగ్గిపెట్టెలో పట్టే చీరలను తయారుచేయగలిగిన నిపుణులు కొందరయితే, ఏ సిమెంట్ అవసరం లేకుండా పటిష్టంగా కట్టడాలను నిర్మించే కౌశలం కొందరిదయితే, ఇప్పటిలా పర్యావరణానికి హాని కలిగించని విధంగా వస్తువులను తయారు చేసేవారు అప్పటివాళ్ళు. చేతివృత్తుల వాళ్ళ నైపుణ్యం విద్య కాదా !



      Delete
  2. ఉద్యోగం అంటే మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు కానీ, ఉద్యోగం అనే పదం కన్నా ఉపాధి అన్న పదం వాడటం సరైనది. .

    తప్పకుండా ! ప్రాచిన విద్య ఉపయోగించి తప్పకుండా ఉపాధిని పొందగలం. వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు, ఇవన్నీ ప్రాచీన విద్యలే. ఇవన్నీ చేయటానికి ఆధునిక చదువులు అవసరం లేదు.

    అయితే ఇప్పుడు పరిస్థితి ఏమయ్యిందంటే , ఈ రోజుల్లో ఆధునిక విజ్ఞానం పేరుతో ప్రాచీన విద్యలను కనుమరుగు చేసేస్తున్నారు. వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు ఇలా అన్ని రంగాలను ప్రజల చేతుల నుంచి లాగేసి కొందరు పెట్టుబడిదారుల చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమయ్యేటట్లు వ్యవస్థలో మార్పులుచేర్పులు జరుగుతున్నాయి.

    అందువల్ల వల్ల అన్ని రంగాల వారు కొందరు పెట్టుబడిదారుల సంస్థల క్రింద పనిచేయక తప్పని పరిస్థితి వచ్చింది. రైతులు పూర్వం తామే స్వయంగా విత్తనాలను, సేంద్రియ ఎరువులను తయారుచేసుకునేవారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఏముంది ? పూర్వం రైతులు ఆత్మహత్యలు ఉండేవి కాదు. ( దీనికి సాక్ష్యం మెకాలే ప్రసంగమే )

    ఈ రోజుల్లో మనదేశంలో ఎంతమందికి ఉపాధి లభిస్తోంది ? ఆధునిక విద్యావిధానంలో బాగా చదువుకున్న యువతలో కూడా ఎందరో ఉపాధి లభించక నలిగిపోతున్నారు. ( యంత్రాలే అన్ని పనులను చిటెకెలో చేసి పడేస్తుంటే ఉద్యోగాలు అందరికి ఎలా లభిస్తాయి ?


    ఈ రోజుల్లో నిరుద్యోగులు ఉపాధి కోసం బడాకంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడవలసి వస్తోంది. సంపద కొందరి చేతుల్లో కేంద్రీకృతమై మిగిలిన ప్రజలు వారి వద్ద పనిచేయవలసి వస్తోంది. వాళ్ళకు నచ్చితే ఉద్యోగమిస్తారు. ఎప్పుడయినా ఆరోగ్యం బాగోలేక కొన్నాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోనుంచి తీసివేస్తారు.

    ప్రాచీన కాలంలో అన్ని రంగాల ప్రజలు ఉపాధి కోసం ఇతరులను దేబిరించకుండా దర్జాగా బ్రతికేవారు.

    ReplyDelete

  3. ఋగ్వేదంలో ......

    ఒక కుటుంబంలోని వారే భిన్నవృత్తులను స్వీకరించినట్లు ఋగ్వేదంలో చెప్పబడిందట.

    .. ఏ వృత్తి నీచంగా చూడబడలేదు. చర్మకారులను, చర్మాలను బాగుచేసేవారిని కూడా సంఘములో తక్కువ జాతివారుగా ఎంచలేదు........ ఇలా చెప్పబడిందట.

    తరువాత కాలంలో మనుషులలో స్వార్ధం పెరగటం మరియు తెలిసితెలియనితనం వల్ల సమాజంలో అంటరానితనం మరియు కొన్ని మూఢాచారాలు వ్యాప్తిలోకి వచ్చాయని అనిపిస్తుంది.

    ఋగ్వేదంలో ఉన్న విషయాన్ని గమనిస్తే , అప్పట్లో సమాజంలో ఎవరినీ తక్కువగా చూడలేదని తెలుస్తోంది కదా !

    గిట్టనివారు కొందరు ప్రాచీన గ్రంధాలలో కొన్ని ప్రక్షిప్తాలను కూడా కలిపి ఉంటారనుకోవటంలో ఎటువంటి సందేహమూ లేదు.

    ReplyDelete


  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.
    మేము ఊరు వెళ్ళి వచ్చాము.
    ఆలస్యంగా జవాబు వ్రాస్తున్నందుకు మన్నించండి.
    నిజమే, అన్నీ వేదాల్లో ఉన్నాయి.
    వేదాలు, పురాణేతిహాసాలలోని అర్ధాలను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతే అది మన తప్పు.

    ReplyDelete