koodali

Thursday, July 18, 2013

మన ప్రాచీన గ్రంధాలలో ఎంతో విజ్ఞానం.........

 
మన  ప్రాచీన  గ్రంధాలలో  ఎంతో  విజ్ఞానం  మరెన్నో  విశేషాలు ఉన్నాయి  కాబట్టే  విదేశీయులు ఎన్నో  గ్రంధాలను   తమ  దేశాలకు తీసుకువెళ్ళి , సంస్కృతం  నేర్చుకుని వాటిని  పరిశోధిస్తున్నారు.
............................


  భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ ఇలా అన్నారు..  


ఒక  సూత్రంలో మణులు కూర్చినట్లు  ఈ జగత్తంతా నాలో  ఇమిడి  ఉన్నది. 

శ్రీ కృష్ణ  భగవానుడు  చెప్పినట్లు  అనంతం  నుంచి  అణువు  వరకూ  జగత్తంతా ఒక  సూత్రంలో  బంధింపబడింది. దీనినే  ఆధునిక  శాస్త్రవేత్తలు  Super  String   అంటున్నారు.

.......................


భూమి  గుండ్రంగా  ఉన్నదని  వేదకాలం  నుంచే  మనకు  తెలుసు.

  గోళం  అంటే  గుండ్రనిది అని  అర్ధం కదా! భూమి  గుండ్రంగా ఉన్నదని భారతీయులకు తెలుసు.

ఋగ్వేదంలో  1.33.8  మంత్రంలో ఇలా ఉంది...

"  చక్రాణాసః పరీణహం  పృధివ్యా...

భూమి  యొక్క  వృత్తపు  అంచున  ఉన్నవారు  అని  భావం.

భూమి  తన  కక్ష్యలో  తాను  తిరుగుటకు  23  గంటల  56  నిమిషాల  4.1  సెకన్ల  కాలము   పడుతుందని  ఆనాడే  చెప్పారు. 


 ఇది  ఆధునిక  కాలగణనకు ఖచ్చితంగా సరిపోతుంది కదా!
................


పురాతనమైన  వేదవిజ్ఞానంలోనే సూర్యకిరణాలలో  ఏడురంగులున్నాయని  చక్కగా  వివరింపబడింది.

అశ్వం అంటే  కిరణం  అని  కూడా  అర్ధం. సూర్యుని  కిరణాలలో  పలురంగులు  దాగి  ఉన్నాయని  ప్రాచీనులు  తెలియజేశారు.
....................


కాంతి  వేగమును  లెక్కించిన  ప్రాచీనులు........

"యోజనానాం సహస్రం ద్వే ద్వేశతే ద్వే చ యోజనే!
ఏకేన  నిమిషార్ధేన క్రమమాణ  నమోస్తుతే  !! "



అనగా  అర  నిమిషానికి  2202  యోజనాల  దూరం  ప్రయాణించు  ఓ  కాంతికిరణమా  నీకు  నమస్కారము.  అని  భావం. 


 యోజనం=  9  మైళ్ళ  160  గజాలు. 

ఇవన్నీ  ఆధునికులు  కనుగొన్న  కాంతివేగానికి  దాదాపు  సమీపంగానే  ఉన్నవి.


(  ఇక్కడ  నేను  గ్రంధము  లోని  చాలా  వివరాలను   వ్రాయలేదు.  )

......................


గురుత్వాకర్షణ  సిద్ధాంతం........... 

సిద్ధాంత  శిరోమణి  ( భాస్కరాచార్యుడు)  అనే  గ్రంధములో  భువనకోశం  అనే అధ్యాయంలో  6వ  శ్లోకంలో  గురుత్వాకర్షణ  శక్తి  గురించి  చాలా  చక్కగా  వివరించారు.

ఆకృష్టిశక్తిశ్చ మహీతయా  యత్  స్వస్థం / గురు  స్వాభిముఖం స్వశక్త్యా
ఆకృప్యతే తత్పతతీవభాతి/ సమే  సమంతాత్ క్వ పతత్వియం  ఖే 11

భూమి  ఆకాశంలో  ఉన్న  వస్తువులను  సహజంగా  స్వశక్తితో  ..తనవైపుకు  ఆకర్షిస్తుంది.ఈ  ఆకర్షణ  వల్ల  అన్ని  వస్తువులు  భూమిపై  పడతాయి.....అని  తెలియజేశారు. 

జగద్గురువు  ఆదిశంకరుల  వారు  వారి  ప్రశ్నోపనిషత్  భాష్యంలో  అపానశక్తి  గురించి  వ్రాస్తూ...

ఒక  వస్తువును  పైకి  ఎగురవేస్తే  దానిని  భూమి  ఎట్లు  ఆకర్షిస్తుందో ..అటులనే  పైకిలాగబడే  ప్రాణశక్తిని  అపానశక్తి  కిందకు  లాగుతోంది  (  3-8  శ్లో  ) అని  చెప్పారు. 


...............

వేద  రుషులు  ఖగోళ  శాస్త్రానికి  సంబంధించిన  గణనలో....

భూమికి,  చంద్రునికి  మధ్య  దూరం,  చంద్రుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,

భూమికి  సూర్యునికి  మధ్య  దూరం,  సూర్యుని  వ్యాసానికి  108  రెట్లు  ఉందని,


సూర్యుని  యొక్క  వ్యాసం  భూమి  వ్యాసానికి  108  రెట్లు  ఉందని  తెలియజేశారు.


ఈ వేద గణన  ఆధునిక  సాంకేతిక  విశ్వగణనలో  లభించిన  భూమికీ,  చంద్రునికీ,  భూమికీ  సూర్యునికీ  ఉన్న  దూరంతో  దాదాపు  సరిపోయింది.

.............................


ప్రపంచంలోనే  మొదటి  ఆనకట్ట  భారతదేశంలోనే  నిర్మించబడిందని  మీకు  తెలుసా !

 ఇది  కలవై  ఆనకట్ట  .తమిళనాడులో  కావేరీ  నదిపై  నిర్మించబడింది.  క్రీ.శ. 2 వ  శతాబ్దంలో  చోళరాజు  కరికాలచోళుడు  కాలంలో  నిర్మించబడిందట. 

 దీని  నిర్మాణంలో  సిమెంట్  మొదలైన  బైండింగ్  మెటీరియల్  ఏదీ  ఉపయోగించబడలేదు.

క్రీ. పూ.4వ  శతాబ్దంలోనే  నేటి  గుజరాత్  రాష్ట్రంలో  అతి  పెద్ద  సుదర్శన  జలాశయం  నిర్మించబడింది.  ఇవి  ఆనాటి  విజ్ఞానానికి  నిలిచి  ఉన్న  తార్కాణాలు.

..........................


అతి  ప్రాచీన  ఓడరేవు  లోతల్.....( సింధూ నాగరికత). 

క్రీ,పూ, 2400  సంవత్సరం  నాటికి  సింధూ నాగరికతలో  ప్రాముఖ్యం  కలిగిన  ఓడరేవు.  ఆనాటి  లోతల్  నగరం  చక్కటి  ప్రణాళికతో  నిర్మించబడింది.

దిక్సూచి...
ఇక్కడి  త్రవ్వకాలలో  షెల్ కంపాస్  లోహశాస్త్రానికి  సంబంధించిన  పరికరాలు  లభించాయి. ఇక్కడి నాగరికత  ప్రశస్తమైనది. ఓడల  విశ్రాంతికి  ప్రత్యేక  డాక్ లు  ఉండేవి. 

.......................


జె.పి  బోస్.  ఈయన  గొప్ప  శాస్త్రవేత్త.  మొక్కలు  మానవులలానే  స్పందిస్తాయి,  రోదిస్తాయి,  హర్షిస్తాయి.  అని  ప్రపంచంలో  తొలిసారిగా  నిరూపించిన  శాస్త్రవేత్త.

 ఈయన భౌతిక  శాస్త్రవేత్తే  కాకుండా వృక్షశరీరధర్మశాస్త్రం  మీద  కూడా  పరిశోధనలు  చేసి  150  పరిశోధనా  వ్యాసాలను  ప్రపంచవ్యాప్తంగా  అనేక  సభలలో  సమర్పించారు.

పరిశోధనల  కోసం  ఎన్నో  పరికరాలను  నిర్మించుకున్నారు.  వాటిలో  ముఖ్యమైనది  క్రిస్కోగ్రాఫ్. ఇది  ఒక  వస్తువును  10  మిలియన్ల  రెట్లు  పెద్దది  చేసి  చూపిస్తుంది.

.........................

.......
గణితంలో  దిట్టలు...భారతీయులు....

ప్రసిద్ధ  శాస్త్రవేత్త  ఐన్ స్టీన్  ఏమన్నారంటే, మనం  భారతీయులకు  ఎంతో  రుణపడిఉన్నాం. భారతీయులే  ప్రపంచానికి  గణితంలో  సులభంగా  లెక్కించే  దశాంశపద్ధతిని  కనుగొన్నారు.  అదే  లేకపోతే  ఎన్నో  వైజ్ఞానిక  పరిశోధనలు  సాధింపబడేవి  కాదు.  అన్నారట. 


 సున్నాను  గురించి  ప్రపంచానికి తెలియజేసింది  భారతీయులే. 

.............................


ఈ  టపాలోని  విషయాలను .. వివేకానంద  లైఫ్ స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారి  "భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే  గ్రంధము  నుంచి  సేకరించి  వ్రాయటమైనది.  వారికి  కృతజ్ఞతలు.

ఆ  గ్రంధములోని  విషయాలను  టపాలో  వ్రాయటం  పట్ల    వారికి  ఏమైనా  అభ్యంతరం  ఉంటే  దయచేసి  తెలియజేయగలరు.

ప్రాచీన యంత్ర  శాస్త్రం, అగస్త్యుని విద్యుత్ ఉత్పత్తి విధానం , వేప, పసుపు కోసం యుద్ధాలు , తులసీ మాహాత్మ్యం ... వంటి  ఎన్నో  విశేషాలున్నాయి.  ఆసక్తి  ఉన్నవారు  
"భారతీయ ప్రతిభా విశేషాలు  108 నిజాలు " అనే గ్రంధమును  చదవగలరు.



No comments:

Post a Comment