koodali

Wednesday, July 3, 2013

పురాణేతిహాసాలు , చరిత్ర ..... గురించి కొన్ని విషయాలు.



 పురాణేతిహాసాలు  రామాయణము,  భారతము,(భగవద్గీత ) ... ద్వారా  ఎన్నో  చక్కటి  విషయాలు  తెలుస్తాయి.

మరియు   శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ  చరితామృతము  గ్రంధములో  కూడా   ఎన్నో  చక్కటి  విషయాలు  ఉన్నాయి.
....................................................


భారతం,  రామాయణం  నిజంగా  జరిగినవా ? కాదా ? అని కొందరు  సందేహపడుతుంటారు. 


 ఈ  మధ్య  శాటిలైట్  చిత్రాల సమాచారం  ద్వారా  రామాయణకాలంలో  సముద్రంలో   నిర్మించిన  వారధి  మరియు  భారతకాలం  నాటి    ద్వారకానగర  సమాచారం  లభించింది.

  పూర్వ  కాలం  నాటి  రామసేతు,  మరియు  ద్వారకా  నగర  విశేషాలు  ఇప్పటికి  ఎలా  ఉన్నాయి   ?  అని   కూడా కొందరికి  అనుమానాలు  వస్తాయి.

 మంచుయుగం  ముందటి   డైనోసార్ల  ఎముకలు,  శిలాజాలు  ఇప్పటికి    లభించటం ...... వాటి  ఆధారంగా  డైనోసార్ల  కాలం నాటి  పరిస్థితిని  శాస్త్రవేత్తలు    నిర్ణయిస్తున్నారు  కదా  ! 

 మంచుయుగం  ముందటి  డైనోసార్ల  అవశేషాలే  ఇప్పటికీ  లభిస్తున్నప్పుడు  ,   నాగరికత  ఏర్పడిన  నాటి  రామసేతు,  ద్వారకానగర    నిర్మాణాలు    చక్కగా  ఉండటంలో  ఎటువంటి  ఆశ్చర్యము   లేదు.


  విదేశాల  వారు  వారి  ప్రాచీన  కట్టడాలను  ఎంతో  జాగ్రత్తగా  రక్షించుకుంటారు.  మన  దేశం  వారికి  పురాతన కట్టడాలంటే  నిర్లక్ష్యం  ఎక్కువ.  మనం  కూడా  ప్రాచీన  కట్టడాలను  రక్షించుకోవాలి.

దయచేసి ఈ  క్రింది  లింక్స్  చూడగలరు........

Amazing facts about - Ancient India: Scientific Dating of Ramayan Era  


Science & Technology in Mahabharatha: Material evidence ...

 

The Holy Science - Wikipedia, the free encyclopedia



Rama Setu - An Engineering Marvel of 5076 BCE - YouTube


Shocking Truth of Ram Setu - YouTube

...............................................

 
పూర్వం  భూమి  అంతా  ఒకే
ఖండముగా    ఉండేదని   కొన్ని    గ్రంధాల  ద్వారా  తెలుస్తుంది. 

  ఆధునిక  పరిశోధకులు  కూడా ,   పూర్వం  భూమి  అంతా  ఒకే  ఖండముగా  కలిసి  ఉండి  ఉండవచ్చని ఒప్పుకున్నారు.  దానిని  గోండ్వానా లేండ్  అనే  పేరుతో  వ్యవహరిస్తున్నారు.

భూమి  అంతా  ఒకే  ఖండముగా  ఉన్నప్పుడు  భూమి  మీది   ప్రజలు  మరియు  నాగరికతలో  ఎంతో  సారూప్యం  ఉంటుంది.

 ఖండాలు  విడిపోయిన  తరువాత  చరిత్రకారులు    భూమిలో  త్రవ్వకాలు  జరిపితే ,  దొరికిన  చారిత్రిక  ఆధారాల  మధ్య  ఎన్నో  పోలికలు  ఉంటాయి.  అయితే,   వాటి  ఆధారంగా  చరిత్రకారులు   నిర్ణయించే  విషయాలలో  తప్పులు  వచ్చే  అవకాశం  ఉంది.

 ఎందుకంటే  ఇప్పుడు  విడివిడిగా  ఉన్న  ఖండాలు  పూర్వం   ఒకే  ఖండముగా  ఉండేవన్న  విషయం  ఇంతకుముందు  తెలియదు  కాబట్టి.
 
 ......................... 

పూర్వం భారతదేశము, ఆఫ్రికా,   ఆస్ట్రేలియా  ఖండాలతో    కలిసి ఉన్నప్పుడు    ఒక పెద్ద భూఖండముగా    ఉన్నదని , దానిని   లిమూరియా  అంటారనే  మరొక  వాదన కూడా ఉంది.
.................... ...............
డైనోసార్లు  ఉన్న  కాలంలో  మానవులు  కూడా  ఉన్నారని  తెలిసే  శిలాజాల  గుర్తులు  లభించాయని  కూడా   కొందరు   పరిశోధకులు  చెబుతున్నారు. (  ఇది  ఎంతవరకు  నిజమో  మనకు  తెలియదు. )
........................................
ఋగ్వేదంలో  ......


 ఒక  కుటుంబంలోని  వారే  భిన్నవృత్తులను  స్వీకరించినట్లు 
గ్వేదంలో  చెప్పబడిందట.  నేను  కవిని,  మా  తండ్రి  వైద్యుడు,  మా  తల్లి  ఒడ్లు  దంచేది......

.. ఏ  వృత్తి  నీచంగా  చూడబడలేదు.   చర్మకారులను,  చర్మాలను  బాగుచేసేవారిని  కూడా    సంఘములో  తక్కువ  జాతివారుగా  ఎంచలేదు........ ఇలా   చెప్పబడిందట.

  తరువాత  కాలంలో  మనుషులలో  స్వార్ధం  పెరగటం  మరియు  తెలిసితెలియనితనం  వల్ల  సమాజంలో  అంటరానితనం  మరియు  కొన్ని  మూఢాచారాలు  వ్యాప్తిలోకి  వచ్చాయని  అనిపిస్తుంది. 
......................................


ప్రస్తుతం  ఉన్న  రూపములో  ,  ప్రమాణములో రామాయణ,  మహాభారత  కావ్యములు  ఒక  వాల్మీకి,  వ్యాసరచితములు  మాత్రమే  కావని  పలువురి  అభిప్రాయము. 

ఎన్నో  సంవత్సరాలుగా  ఈ  రెండు  కావ్యములలో అనేకమంది  కవులు  తమ  రచనలను  కూడా  చేర్చి  ఉంటారని  కొందరు  భావిస్తున్నారు. .....
.........................................


ఆధునిక  విజ్ఞానం  మరియు  చరిత్రకు  సంబంధించిన  విషయాల  నిరూపణలో  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి.  


సైన్స్   గురించి శాస్త్రవేత్తల  మధ్య ...... చరిత్ర  గురించి  చరిత్రకారుల  మధ్య  ఎన్నో  అభిప్రాయభేదాలు  ఉంటుంటాయి. .

ఆర్యుల  జన్మ  స్థానం  గురించి ......స్వామి దయానంద  గారి  ప్రకారం  ఆర్యులు  టిబెట్  నుంచి  వచ్చారు.

 లోకమాన్య  బాలగంగాధర  తిలక్  గారి  అభిప్రాయం  ప్రకారం  ఆర్యులు  ఉత్తరధృవం  నుంచి  వచ్చారు.


 ఫ్రొఫెసర్  మాక్డొనల్  గారి  ప్రకారం  ఆర్యులు  డాన్యూబ్ (  యూరోప్ )  నుంచి  వచ్చారు.  

 భారతీయులు,  పర్షియా  వారు  ఒకే  ఆర్యజాతికి  చెందిన  వారని  కొందరి  అభిప్రాయం. 

ఇలా  భిన్నాభిప్రాయాలు    ఉన్నాయి. 
 ..........................................

సింధు  నాగరికత  నిర్మాతల  గురించి  కూడా  ఎన్నో  అభిప్రాయాలు  ఉన్నాయి. 
ఉదా..  శాస్త్రాధారముల  ప్రకారం  పరీక్షించగా  ఈ  నాగరికతను  భిన్నజాతులవారు  కలిసిమెలసి  నిర్మించినట్లు  తెలిసిందట.


ఏదీ  నిర్ధారణగా  తేలనందున,.....

  ఫాదర్  హీరాన్  సింధు  నగరాలను  ద్రావిడులు  నిర్మించారని  ఆన్నారు.


డా.  లక్ష్మణ్  స్వరూప్,  కాంతి  స్వరూప్   ఆర్యులే  దీనిని  నిర్మించారని  అన్నారు.

మొహంజదారో  నగరము  ఏడుపొరలుగా   ( అంతస్థులుగా  )  బయటపడిందట.  ఒక్కొక్క  పొరకు  500  సంవత్సరముల  చొప్పున దాని  కాలాన్ని  క్రీ.పూ.  3500  సంవత్సరములకు  నిర్ణయించడమైనది.
.............................................. 


భారత దేశానికి  ప్రధమముగా  వలస  వచ్చిన  ఆర్యజాతులలో  ద్రావిడులు  ఒకరని  
కొందరు  చరిత్రకారుల  అభిప్రాయము.

   కొందరు  ఆర్యులు  తమను  ద్రావిడులుగా  పిలుచుకొన్నారని  మరి కొందరు   చరిత్రకారుల  అభిప్రాయము.

ద్రావిడులు  మధ్య  ఆసియాలోని   సీధియన్స్ కు  సంబంధించిన  వారని,  ఈ  రెండు  జాతుల  మధ్య భాషాసంస్కృతులకు  సంబంధం  ఉన్నదని  డా.  కాల్డ్వెల్  అభిప్రాయపడ్డారు.
..........................................


పురాణేతిహాసాలను  గమనిస్తే   కులాలను  బట్టి   అంటరానితనం  పాటించాలని  ఏమీ  చెప్పలేదని  చక్కగా  తెలుస్తుంది.

 పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలి...అని...  ప్రాచీనుల  ఉద్దేశం  అని  తెలుస్తుంది. 

ఈ  విషయాల  గురించి  ఈ  టపాలో  వ్రాయటం  జరిగింది. 


పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాల... 
..............

వ్రాసిన విషయాలలో ఏమైనా  పొరపాట్లు ఉంటే  దయచేసి  క్షమించాలని దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 
 

4 comments:

  1. ఆర్యులు ఉత్తరధృవప్రాంతంనుండి భారతదేశానికి వలసవచ్చారనే సిథ్థాంతం తప్పు. ఇది యెప్పుడో పరాస్తం అయిన పాట. శ్రీకోట వేంకటాచలంగారు 'ఆర్యుల ఉత్తరధృవనివాస ఖండనము' అనే‌ గ్రంధం అనేక దశాబ్దుల క్రిందటే వ్రాసారు.

    భారతదేశం ఒక వలసదారుల ప్లాట్‌ఫారం అని చెప్పటనికి ఉపయోగించున్న ఆర్యులు ఉత్తరధృవప్రాంతంనుండి భారతదేశానికి వలసవచ్చారనే సిథ్థాంతం మనవాళ్ళు బాగా తలకెక్కించుకున్నారు కాని దానిని ఆధునిక చరిత్రకారులు త్రోసిపుచ్చిన విషయానికి మాత్రం మనజనం ప్రాచుర్యం కల్పించలేదు. దానికి కొందరి స్వార్థప్రయోజనాలే‌ కారణం.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. ఈ విషయాల గురించి చరిత్రకారుల మధ్య అనేక భిన్నాభిప్రాయములున్నవి.

      నిజమేనండి, మీరన్నట్లు భారతదేశమే ఆర్యులకు జన్మస్థానము అనిపిస్తుంది........ ఇక్కడి ఆర్యులే ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళి ఉండవచ్చు.

      పురాణేతిహాసాలలో భారత దేశం గురించి గొప్పగా వర్ణించారు. ఇక్కడ జన్మనెత్తటమే గొప్ప అదృష్టం అని వర్ణించారు.....

      ఇవన్నీ గమనిస్తే భారతదేశమే ఆర్యులకు జన్మస్థానము అనిపిస్తుంది

      ఋగ్వేద రీత్యా ఆర్యులు ఏదో విదేశం నుండి వచ్చినట్లు లేదట.

      పంజాబ్ ఆర్యుల జన్మభూమి కావచ్చునంటున్నారు. ఇందుండియే ఆర్యులు పర్షియాకు వెళ్ళి ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి.

      ఆర్యులు మనదేశాన్ని ( గంగా మైదానాన్ని ) పుణ్యభూమి అని వర్ణించారు. కావున ఇదే వీరి జన్మస్థానమై ఉండవచ్చు.

      ద్రావిడులు ఇక్కడి స్థానికులు అని కొందరు అంటే,
      ద్రావిడులు వాయవ్య దిశనున్న ఖైబర్, బొలాన్ కనుమల ద్వారా భారతదేశములో ప్రవేశించారని కొందరి అభిప్రాయము.

      పూర్వం భారతదేశము, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలతో కలిసి ఉన్నప్పుడు ఒక పెద్ద భూఖండముగా ఉన్నదని , దానిని లిమూరియా అంటారనే వాదన కూడా ఉంది.

      భారతదేశ ప్రజల పూర్వీకులు అయిదు జాతుల వారై ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.

      Delete
  2. anta bagane chepparu kaani..... aryulu dravidulu ani rendu jatulu levu......anta okkate....idi bharata desha goppa tananni voppukoleni europian valasavadulu kanipeetina siddantam.........
    puranalalo kani inka ekkada kani aryulu ane padam vadaledu.......... asalu aryulu ane padam ledu...... sankrit lo arya ane padam gavrava sucakanga vadutaru....... dravida ane padam modata vadindi adishankara charyulu.......
    dravida ante dakshina bharata vasi.......

    ReplyDelete

  3. మి వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    నిజమేనండి, మీరన్నట్లు ఆర్యులు ద్రావిడులు అని రెండు జాతులు లేవు ... అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

    వీరి అభిప్రాయం ప్రకారం కొందరు ఆర్యులు తమను ద్రావిడులు అనే పేరుతో చెప్పుకున్నారట.

    దుర్గా దేవికి ఆర్య అనే నామము కూడా ఉందని చదివాను.

    ఆర్యా అనే పేరు గురించి ఈ లింక్ వద్ద ఎన్నో వివరములున్నాయి.
    Aryan - Wikipedia, the free encyclopedia

    ReplyDelete