koodali

Wednesday, April 24, 2013

ఓం మణిద్వీప వర్ణన మరియు...

 ఓం మణిద్వీప వర్ణన మరియు...

ఓం
మణిద్వీప  వర్ణన.

1. మహాశక్తి  మణిద్వీప నివాసిని ముల్లోకాలకు  మూల  ప్రకాశిని
మణిద్వీపములో  మంత్రరూపిణి  మన మనస్సులలో కొలువైయింది

2.సుగంధ పుష్పాలెన్నో వేలు  అనంత సుందర  సువర్ణపూలు
అచంచలంబగు  మనో సుఖాలు మణిద్వీపానికి  మహానిధులు

3.లక్షల  లక్షల  లావణ్యాలు  అక్షరలక్షల  వాక్  సంపదలు
లక్షల లక్షల  లక్ష్మీపతులు  మణిద్వీపానికి  మహానిధులు

4. పారిజాత  వన  సౌగంధాలు  సురాధినాధుల  సత్సంగాలౌ
గంధర్వాదుల  గానస్వరాలు   మణిద్వీపానికి  మహానిధులు
భువనేశ్వరీ  సంకల్పమే  జనియించే  మణిద్వీపం
దేవదేవుల  నివాసము  అదియే  కైవల్యం

5. పద్మరాగములు  సువర్ణమణులు  పది  ఆమడల  పొడవున  గలవు
మధురమధురమగు  చందనసుధలు  మణిద్వీపానికి  మహానిధులు

6. అరువదినాలుగు  కళామతల్లులు  వరాలనొసగే  పదారుశక్తులు
పరివారముతో  పంచబ్రహ్మలు  మణిద్వీపానికి  మహానిధులు

7. అష్టసిద్ధులు  నవనవ నిధులు  అష్టదిక్కులూ  దిక్పాలకులు
సృష్టికర్తలు  సురలోకాలౌ మణిద్వీపానికి  మహానిధులు

8. కోటి సూర్యులు  ప్రపంచకాంతులు  కోటి చంద్రుల  చల్లని  వెలుగులు
కోటితారకల  వెలుగుజిలుగులు  మణిద్వీపానికి  మహానిధులు

9. కంచుగోడల  ప్రాకారాలు  రాగిగోడల  చతురస్రాలు
ఏడామడల  రత్నరాసులు  మణిద్వీపానికి  మహానిధులు

10. పంచామృతమయ  సరోవరాలు  పంచలోహమయ  ప్రాకారాలు
ప్రపంచమేలే  ప్రజాధిపతులు   మణిద్వీపానికి  మహానిధులు

11. ఇంద్రనీలమణి  ఆభరణాలు వజ్రపు  కోటలు  వైఢూర్యాలు
పుష్యరాగ మణిప్రాకారాలు  మణిద్వీపానికి  మహానిధులు

12. సప్తకోటి  ఘనమంత్రవిద్యలు సర్వశుభప్రద  ఇచ్ఛాశక్తులు
శ్రీ  గాయత్రీ  జ్ఞానశక్తులు  మణిద్వీపానికి  మహానిధులు  ..భువ...

13. మిలమిలలాడే  రత్నపు రాసులు  తళతళలాడే  చంద్రకాంతములు
విద్యుల్లతలు  మరకతమణులు  మణిద్వీపానికి  మహానిధులు

14. కుబేర  ఇంద్ర  వరుణదేవులు  శుభాలనొసగే   అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు  మణిద్వీపానికి  మహానిధులు

15.  భక్తిజ్ఞానవైరాగ్య సిద్ధులు  పంచభూతములు  పంచశక్తులు
సప్తఋషులు  నవగ్రహాలు  మణిద్వీపానికి  మహానిధులు

16. కస్తూరి  మల్లిక  కుందవనాలు సూర్యకాంతి  శిలమహాగ్రహాలు
ఆరు ఋతువులు  చతుర్వేదాలు  మణిద్వీపానికి  మహానిధులు

17. మంత్రిణి  దండిణి  శక్తిసేనలు  కాళి కరాళి  సేనాపతులు
ముప్పదిరెండు  మహాశక్తులు మణిద్వీపానికి  మహానిధులు

18.సువర్ణరజిత సుందరగిరులు  అనంతదేవి  పరిచారికలు
గోమేధికమణి  నిర్మిత  గుహలు  మణిద్వీపానికి  మహానిధులు

19. సప్తసముద్రములనంత నిధులు   యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు  నదీనదములు మణిద్వీపానికి  మహానిధులు

20.మానవ మాధవ దేవగణములు కామధేనువు  కల్పతరువులు
సృష్టిస్థితిలయా కారణమూర్తులు మణిద్వీపానికి  మహానిధులు

21.కోటి ప్రకృతుల  సౌందర్యాలు  సకలవేదములు  ఉపనిషత్తులు
పదారురేకల  పద్మశక్తులు  మణిద్వీపానికి  మహానిధులు

22. దివ్యఫలముల  దివ్యాస్త్రములు  దివ్యపురుషులు  ధీరమాతలు
దివ్యజగములు  దివ్యశక్తులు మణిద్వీపానికి  మహానిధులు

23. శ్రీ  విఘ్నేశ్వర  కుమారస్వాములు జ్ఞానముక్తి  ఏకాంతభవనములు
మణినిర్మితమగు  మండపాలు  మణిద్వీపానికి  మహానిధులు

24. పంచభూతములు  యాజమాన్యాలు  వ్యాళసాలం  అనేకశక్తులు
సంతాన  వృక్షసముదాయాలు  మణిద్వీపానికి  మహానిధులు

25. చింతామణులు నవరత్నాలు నూరామడల  వజ్రరాసులు
వసంత  వనములు  గరుడపచ్చలు మణిద్వీపానికి  మహానిధులు

26. దుఃఖము  తెలియని  దేవీసేవలు  నటనాట్యాలు  సంగీతాలు
ధనకనకాలు  పురుషార్ధాలు మణిద్వీపానికి  మహానిధులు

27. పదునాల్గు , లోకాలన్నిటిపైనా సర్వలోకమను  లోకము  గలదు
సర్వలోకమే  ఈ  మణిద్వీపము సర్వేశ్వరికది  శాశ్వత స్థానం

28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల  మంచముపైన
మహాదేవుడు  భువనేశ్వరితో  నివసిస్తాడు మణిద్వీపములో

29.మణిగణ ఖచిత  ఆభరణాలు చింతామణి  పరమేశ్వరి  దాల్చి
సౌందర్యానికి  సౌందర్యముగా  అగుపడుతుంది  మణిద్వీపములో

30. పరదేవతను  నిత్యము  కొలిచి  మనసర్పించి  అర్చించినచో
అపారధనము  సంపదలిచ్చి  మణిద్వీపేశ్వరి  దీవిస్తుంది....2...

31. నూతనగృహములు  కట్టినవారు మణిద్వీపవర్ణన  తొమ్మిదిసార్లు
చదివిన  చాలు  అంతా  శుభమే అష్టసంపదల  తులతూగేరు ....2...

32.  శివ కవితేశ్వరి  శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన  చదివిన చోట
తిష్టవేసుకొని  కూర్చొనునంటా  కోటి శుభాలను  సమకూర్చుకొనుటకై
దేవదేవల  నివాసము అదియే  కైవల్యం...భు.....

మంగళహారతి

శ్రీ  త్రిపురసుందరికి  మణిద్వీపవాసినికి !
మంగళమ్  జయమంగళమ్  నిత్య  శుభమంగళమ్   !!
ఓంకార  రూపిణికి  హ్రీంకార వాసినికి  శ్రీం ,బీజవాహినికి
మంగళమ్  జయమంగళమ్  నిత్య శుభమంగళమ్  !!
ఆపదలు  బాపేటి  సంపదలనొసగేటి  శ్రీనగరవాసినికి  !
మంగళమ్  జయమంగళమ్  నిత్య  శుభమంగళమ్ !!
వేదాలు  నాదాలు  శిరసొంచి  మొక్కేటి శ్రీ రత్నసింహాసినికి !
మంగళమ్ జయమంగళమ్ నిత్య  శుభమంగళమ్ !!
................

వ్రాసిన  విషయాలలో  అచ్చుతప్పులు  వంటి  పొరపాట్లు  ఉన్నచో  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
...........................................

మణిద్వీప  వర్ణన  గురించి  అంతర్జాలంలో  వెతుకుతుంటే  ఈ  క్రింది  లింక్స్  కనిపించాయి. ఆసక్తి  ఉన్నవారు  చూడవచ్చు.


1.  Manidweepam varnana by Gummuduru Umarani
Manidweepam varnana by Gummuduru Umarani
 
2.  Mani Dweepa Varnana in Telugu - Scribd
 

Mani Dweepa Varnana in Telugu - Scribd
...............................................................

Mani Dweepa Varnana in Telugu - Scribd ...ను  నేను  పూర్తిగా  చదవలేదు. కొంచెం  చదివి  బాగుందని  ఇక్కడ  ఇస్తున్నాను.

ఇలా   అంతర్జాలంలోని   లింక్స్ ను  బ్లాగ్  లో  సూచించవచ్చో  లేదో  నాకు  తెలియదు.  ఎవరికైనా  అభ్యంతరం  ఉంటే  చెప్పగలరు.


25 comments:

  1. పై పుస్తకంలోని 7 వ పేజీలో ప్రస్తావించిన బ్రహ్మశ్రీ భమిడిపాటి అచ్యుతరామ సోమయాజులు గారు మా తాత గారు అని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నాను.

    ReplyDelete

  2. మీకు కృతజ్ఞతలండి.
    మీరు వ్రాసిన విషయం చదివిన తరువాత నాకు ఎంతో ఆనందం కలిగింది. అంతా దైవం. దయ.

    మీ బ్లాగ్ లో ఎన్నో చక్కటి విషయాలను వ్రాస్తున్నారు. బ్లాగ్స్ ద్వారా మీ అందరి పరిచయభాగ్యం కలగటం నా అదృష్టంగా భావిస్తున్నానండి. అంతా దైవం దయ.


    ReplyDelete

  3. ఈ మణి ద్వీపం ఇప్పటి మనీ ద్వీపమైన అమెరికా నాండీ ?


    జిలేబి

    ReplyDelete
  4. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
    మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను.. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

    మణిద్వీపానికి .........మనీద్వీపమైన అమెరికాకు అస్సలు పోలికే ఉండదండి.

    మణిద్వీపమంటే సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి అయిన పరమాత్మ యొక్క నివాసస్థానమైన అత్యద్భుతమైన ప్రదేశం.

    లక్ష్మీదేవివిష్ణుమూర్తుల యొక్క లోకం వైకుంఠం.
    సరస్వతిదేవిబ్రహ్మదేవుల యొక్క లోకం సత్యలోకం.
    పార్వతిదేవిపరమేశ్వరుల యొక్క లోకం కైలాసం.

    మహాదేవిమహాదేవులయిన భువనేశ్వరిదేవిభువనేశ్వరుల యొక్క లోకం మణిద్వీపం.

    మణిద్వీపం పరమ పవిత్రమైన పరమాద్భుతమైన ప్రదేశం.


    ReplyDelete
    Replies
    1. Chala chala bhagundhi Sir amma gurinchi cheppadam manasuku chala santosham ga vundhi

      Delete
  5. Replies
    1. మీకు కృతజ్ఞతలండి.

      మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూశాను.. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.


      Delete
  6. Request to mention Manideepa varnana Parayana vidanam

    ReplyDelete
  7. ఈ స్తోత్రం సంస్కృత భాషలో తెలుగు లిపిలో ఎక్కడ దొరుకుతుంది?

    ReplyDelete
  8. Chalaa dhanyavaadaalandi
    Mani dveepam kosam vivarinchinanduku

    ReplyDelete
  9. Sairam Saibandhu. Excellent devotional work done by you. It is very very useful to each and every devotee but in my opinion, in this materialistic world, in this Kali Yuga everybody has to read it inorder to overcome from hurdles, sorrows etc.........Sri Sachidananda Samardha Sadguru Sainadh Maharaj Ki Jai. Shirdisaibabapadarenu A.K.R.L.V.Prasad Ongole.

    ReplyDelete
  10. Sairam, Madam Karthheka masam lo thalaku nuna rayakudadhani antaru adi nijamena. Karthhekamasam ala chayali. Dani vidhi vidhanamulu kasatha naku chappandi

    ReplyDelete
  11. Idi PDF ga download chese options unta cheppagalaru

    ReplyDelete
  12. mistake unnavi please correct this


    25 . Navaratnalu Not Navarathrulu and 28 pancham paina not mancham paina please correct this i am sorry

    ReplyDelete
  13. Excellent
    చదువుతుంటే....అలా అలా ఓలలాడుతూ భక్తి మైకం కమ్ముతూ ఆసాంతం హృద్యంగా ఆ మణి ద్వీపమే సాక్షిత్కరించినట్లు గా అద్భుతంగా ఉంది. శిరందాస్ శ్రీనివాస్

    ReplyDelete
  14. Chala bhagunadi naku manidweepam ante mana India

    ReplyDelete
  15. 25. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు
    వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు

    ఈ శ్లోకం ఒక్కటి సవరించ గలరు
    Tq

    ReplyDelete
  16. అందరికీ ధన్యవాదములండి.

    ReplyDelete