koodali

Wednesday, April 3, 2013

వైద్యం ...కొన్ని సంగతులు .......


నాకు  చిన్నప్పుడు  టాన్సిల్స్ వల్ల  చాలా  ఇబ్బందిగా  ఉండేది. టాన్సిల్స్ వల్ల  గొంతులో  చాలా  నొప్పి,   జ్వరం  వచ్చేవి. అల్లోపతి   మందులు  వాడాము  .  వాటివల్ల  తాత్కాలికంగా   రిలీఫ్ గా   అనిపించినా  మళ్ళీ  నొప్పి  వచ్చేది.   డాక్టర్ గారిని  అడిగితే    టాన్సిల్స్  ఆపరేషన్  చేయటం   ఒక్కటే  మార్గం .  అని  చెప్పారు.


 ఇక  చేసేదేమీ  లేక   ఏడవతరగతి  పరీక్షలు  అయిన  తరువాత  సెలవల్లో  ఆపరేషన్ చేయించుకుందామని   సిద్దమవుతుండగా  ఒక  హోమియో  డాక్టర్  మాకు  పరిచయమయ్యారు.  వారు  టాన్సిల్స్ కు  ఆపరేషన్  అవసరం  లేదని  చెప్పి  తాను  మందులు  ఇస్తాను  వాడమన్నారు.


 ఆ హోమియో  డాక్టర్  గారు  ఇచ్చిన  మందులను  వేసుకున్నాను.  అంతే  టాన్సిల్స్  బాధ  పూర్తిగా  తగ్గిపోయింది.  ఇప్పటివరకు  టాన్సిల్స్  వల్ల  ఎప్పుడూ  ఇబ్బంది  ఎదురవ్వలేదు.

...........................

 వివాహం   తరువాత  కొన్ని  సంవత్సరాలు  హైదరాబాద్ లో  ఉన్నాము.  


 నా  భర్త  స్నేహితుడు  ఒకతను ,  ప్రముఖ  హోమియో  వైద్యులయిన  జి. ఎల్. ఎన్  శాస్త్రి  గారి  గురించి   చెప్పారు. 

  మేము   అనారోగ్యం  వస్తే   శాస్త్రి  గారి  వద్దకు   వెళ్ళేవాళ్ళం.   వారు  ఎంతో  చక్కటి  మందులను  ఇచ్చేవారు. వారు  ఇచ్చిన  మందులు   ఎంతో  చక్కగా  పనిచేసేవి. 

.................................

 మా  అబ్బాయికి  చిన్నతనంలో  ఒకసారి  బాగా  విరేచనాల  వల్ల  అనారోగ్యం  వచ్చింది.  అప్పుడు  అల్లోపతి  డాక్టర్ గారి  వద్దకు  వెళ్తే  పరిస్థితి  కొంచెం  సీరియస్ గా   ఉందని  చెప్పి   మందులిచ్చారు.  

మాకు  భయం  వేసి  సికింద్రాబాద్  వినాయకుని   ప్రార్ధించుకున్నాము.  దైవం  దయవల్ల   అబ్బాయి  త్వరగా   కోలుకున్నాడు.
 (  అప్పటికి  శాస్త్రిగారి   గురించి  మాకు  తెలియదని  నాకు  గుర్తు. )

మాకు  జి.ఎల్.ఎన్ శాస్త్రి  గారి  గురించి  తెలిసిన  తరువాత  మాకు  తెలిసిన  వాళ్ళబ్బాయికి    విరేచనాల  వల్ల  బాగా  అనారోగ్యం  వచ్చింది.  అల్లోపతి  మందులకు  తగ్గలేదు. 


వాళ్ళు  మా  వద్దకు  వచ్చి   శాస్త్రి  గారి  అడ్రస్   తీసుకుని   వెళ్ళి  హోమియో  మందులు  వాడారు.   ఆ  అబ్బాయి  త్వరగా  కోలుకున్నాడు.

చిన్నపిల్లలకు  అనారోగ్యం  వస్తే  ఎంతో  కంగారుగా  ఉంటుంది.  వాళ్ళు  కోలుకున్న  తరువాత   పెద్దవాళ్ళకు  మనశ్శాంతిగా  ఉంటుంది.

............................. .......


  ఈ  రోజు  వార్తాపత్రిక   చదువుతుంటే    ప్రముఖ  హోమియో  వైద్యులయిన  డాక్టర్  జి.  ఎల్.  ఎన్  శాస్త్రి  గారు  నిన్న  పరమపదించారని  చదివాను.  చాలా  బాధనిపించింది.  మేము  వారి  వద్ద  ఎంతో  విలువైన  వైద్యసహాయాన్ని  పొందాము.

వారి  ఆత్మకు  శాంతి  కలగాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.



2 comments:

  1. హోమియో లో చాలా వాటికి మంచి పరిష్కారాలు ఉన్నట్లు తెలుస్తుంది.

    ReplyDelete


  2. .మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను కొద్దిసేపటి క్రితమే మీ వ్యాఖ్యను చూశాను. రిప్లై ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

    అవునండి. హోమియో లో చాలా వాటికి మంచి పరిష్కారాలు ఉన్నాయి.


    ReplyDelete