koodali

Thursday, December 13, 2012

శంకరాచార్యుల వారికి స్త్రీలంటే ఎంతో గౌరవం .....


*  ఆదిశంకరాచార్యుల వారి  ప్రశ్నోత్తర రత్న మాలికలోని   కొన్ని  విషయాలను  గురించి,  కొందరు  ఏమనుకుంటారంటే,  శంకరాచార్యుల  వారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఉన్నదేమో  ? అని  అపోహపడతారు.


*ఈ  విషయాల  గురించి  నాకు  తెలిసింది  చాలా  తక్కువ.  నాకు  తెలిసినంతలో , నా  అభిప్రాయాలను  వ్రాయాలనిపించి  వ్రాస్తున్నాను. 


* ఆదిపరాశక్తిని  ఎంతగానో  ఆరాధించిన   శంకరాచార్యులవారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఉండదు.


* ఆదిశంకరాచార్యుల  వారు శిష్యులకు  బోధించినది   ఈ “ ప్రశ్నోత్తరీ మణిరత్నమాల ” అనుకుంటున్నాను.


*  ప్రశ్నోత్తర రత్న మాలికలోని  ఈ  విషయాలను  గమనించితే,   శంకరులవారికి  స్త్రీలంటే  చిన్నచూపు  ఎంతమాత్రం  లేదని  తెలుస్తుంది.

* Who is  the friend  for  a  family  man  ?
a.  His  wife.


* Who  is  God  whom  we  can  see  ?
a.   Mother. 


* Who  is the  teacher  fit  to  be  worshipped  ?
a.  Father.


* Who  is  a  brahmachari  (  unmarrieD  lad  doing austerities ) ?
a.  He  avoids  contact  with  women  and  is  safe  from  such  contacts.


తల్లిని  కనిపించే  దైవంగా  ,  భర్తకు  జీవితంలో  స్నేహితురాలిగా  భార్యను  చెప్పటం  బాగుంది.

* వారు  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండమని  చెప్పినది  వివాహం  కాని బ్రహ్మచారులు,   ..వంటి  కొందరిని   ఉద్దేశించి    చెప్పారని  అనిపిస్తున్నది.
.......................

* పై  విషయాలను  గురించి,    నాకు తోచిన  అభిప్రాయాలను  క్లుప్తంగా  చెప్పుకోవాలంటే,,

* వివాహం  కాని  బ్రహ్మచారులైన  పురుషులు ,  స్త్రీలకు  తగుమాత్రం  దూరంగా  ఉండాలి. లేకపోతే.........వారి  విద్యాభ్యాసం  కుంటుపడి,  వారి  భవిష్యత్తు  అంధకారమయ్యే  ప్రమాదముంది.
 

* తపస్వులైన  పురుషులు  స్త్రీలకు  తగుమాత్రం  దూరంగా  ఉండాలి. లేకపోతే......వారి  తపస్సుకు  భంగం  కలిగి , అప్పటివరకు  సంపాదించుకున్న  తపశ్శక్తిని  కోల్పోవలసివస్తుంది. అప్పుడు   తపస్సు  ద్వారా  వారు  పొందాలనుకున్న ప్రయోజనాలు  నెరవేరవు  కదా  !


*( గృహస్తుల  వంటి వారు   కూడా  కోరికలను  సిద్దింపజేసుకోవటానికి ,  కొన్నిసార్లు  తపస్సులు    చేస్తుంటారు....ఇలాంటివారు  కూడా   దీక్షా  సమయంలో  స్త్రీలకు  కొంతవరకు   దూరంగా  ఉండాలి. అయితే,  దీక్షావిధికి  సంబంధించిన  సహాయం, ఆహారాన్ని  తయారుచేసి అందించటం, అనారోగ్యం  కలుగకుండా  చూసుకోవటం..మొదలైన  సేవల  విషయంలో  భార్య  సహాయాన్ని    పొందవచ్చు  అనుకుంటున్నాను...)
..................................


 * శంకరాచార్యుల  వారు,  తల్లి  మరణించిన  సందర్భంలో,   తానే  వచ్చి   అంత్యక్రియలు  నిర్వహించారని  విన్నాను.  సన్యాసాన్ని  స్వీకరించిన  వ్యక్తి  తన  తల్లికి  అంత్యక్రియలు  చేయకూడదని  అప్పటి  వారు   కొందరు  అన్నారట.

*అయితే,,సన్యాసస్వీకారం  అప్పుడు   గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారని  అంతర్జాలంలో వ్రాసారండి. . అలా ఇచ్చినమాట  ప్రకారం  వారు   తల్లి  పట్ల  తన  బాధ్యతను  నిర్వర్తించారనిపిస్తుంది. దీనిని  బట్టి  చూస్తే,  తల్లి  అంటే   వారికి  ఎంతో  గౌరవం  అని  మనం  తెలుసుకోవచ్చు.

* ఒక సారి  ఆదిశంకరాచార్యుల  వారు  భిక్షకు  వెళ్ళినప్పుడు , పేదరాలైన  ఒక  స్త్రీ  భిక్ష  వేయటానికి  ఇంట్లో  ఏమీ  లేక,   ఒక  ఉసిరికాయను  భిక్షగా  సమర్పించగా ,  ఆ  ఇల్లాలి  పరిస్థితికి  జాలి  కలిగి  అప్పటికప్పుడు  కనకధారా  స్తోత్రాన్ని  పఠించి   శ్రీ  మహాలక్ష్మి అమ్మవారి   అనుగ్రహాన్ని  పొంది  బంగారు  ఉసిరి పండ్ల  వాననే  కురిపించారంటారు. 

* ఇవన్నీ  గమనిస్తే  వారికి  స్త్రీలంటే  గొప్ప  గౌరవం   అని  తెలుస్తుంది.


....................................
* పూర్వం    కొందరు  తపస్వులు,  మహర్షులు    స్త్రీ  విషయంలో  పొరపాట్లు  చేసి, అప్పటివరకూ   కష్టపడి  సాధించిన  ఎంతో  తపశ్శక్తిని  పోగొట్టుకున్నారు.  ఉదా....విశ్వామిత్రుల  వారు.

* తపస్వులు  తపస్సులు  చేసేటప్పుడు  ఎంతో  నిగ్రహంగా   ఉండాలి.  ఇంద్రుడు  వంటివారు  తపస్వుల   నిగ్రహాన్ని  పరీక్షించటానికి  అప్సరసలను   పంపటం   వంటి   ఎన్నో  పరీక్షలను  పెడతారు. ఈ   పరీక్షలో  నెగ్గినవారికే  తపోఫలం  లభిస్తుంది.

 
* ఇక  గృహస్తుల  విషయంలో ,   వివాహమైన  పురుషుడు  ధర్మపత్నితో  సంసారాన్ని  సాగించటం  వరకూ  ఎవరూ  అభ్యంతరం  చెప్పరు. . భార్యాభర్తలు  అర్ధనారీశ్వరులన్నారు  కదా ! పెద్దలు. 

* అయితే,   ఒక  సంసారాన్ని  నిర్వహించాలంటేనే  కొన్ని  కష్టాలుంటాయి.   ఇక  ఎక్కువమంది  స్త్రీలతో  భాంధవ్యాలను   పెంచుకుంటూ  పోతే  పురుషులకు  బాధ్యతలు,  కష్టాలు    పెరగటం  తప్ప,  సుఖమేమీ  ఉండదు.
* అందుకని  గృహస్తులు  కూడా  పరాయి  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండాలి. 


* ఇక  పురాణేతిహాసాల్లో  చూస్తే , కొందరు   స్త్రీలు  అనుకున్నంత  అబలలు  కాదని  తెలుస్తుంది.  శ్రీ  రాముని  వనవాసానికి  పంపించే  విషయంలో  చాడీలు  చెప్పిన  మంధర,  రావణునికి  చాడీలు  చెప్పి  సీతాదేవిని   అపహరించటానికి  కారకురాలైన   శూర్పణఖ  స్త్రీలే.


* పై  విషయాలను  గమనించితే,  పురుషులు  కొన్ని  సార్లు,  స్త్రీల  విషయంలో   తగుమాత్రం  దూరంగా  ఉండాలి  .అని  తెలుస్తుంది..  

*  శంకరాచార్యుల  వారు  స్త్రీల  విషయంలో  జాగ్రత్తగా  ఉండమని  చెప్పినది , వివాహం  కాని బ్రహ్మచారులు,   ..వంటి  కొందరిని   ఉద్దేశించి   చెప్పారని  అనిపిస్తున్నది.


* శంకరాచార్యుల  వారు, 
తల్లిని  కనిపించే   దైవంగా , భర్తకు  చక్కటి  స్నేహితురాలిగా  భార్యను  చెప్పటాన్ని  గమనించితే,  వారికి  స్త్రీలంటే  ఎంతో  గౌరవం  అని  తెలుస్తుంది.
.................................
* ఆదిశంకరాచార్యుల వారి  ప్రశ్నోత్తర రత్న మాలికలోని   కొన్ని  విషయాలను  గురించి,
అంతర్జాలంలో  ఈ  లింక్స్  ద్వారా  తెలుసుకోవచ్చు..........

prasnottara ratna malika of adi sankaracharya - gleanings from ...

Prashnottara Ratna Malika | Vedanta Spiritual Library

Hinduism EBooks: Prasnottara Ratna Malika of Adi Sankaracharya ...


* నేను  పై  విషయాలను  ఎవరితోనూ  పోటీ  కోసం  వ్రాయలేదండి.  ఆదిశంకరాచార్యుల  వారికి  స్త్రీలంటే  ఎంతో  గౌరవం . అని  ప్రజలకు  తెలియజేయాలన్నది  నా  తాపత్రయం.


  * వ్రాసిన  విషయాల్లో  పొరపాట్లు  ఉన్నచో  దయచేసి   క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 

7 comments:

  1. Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. మీ ప్రతీ పోస్ట్ చక్కగా ఉంటాయి.
    సరళంగా చక్కగా వివరిస్తున్నారు.
    అభినందనలండి.

    ReplyDelete
  3. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. అంతా దైవం దయ.

    మీరందరూ వ్రాసే విషయాలు కూడా ఎంతో బాగుంటాయండి.

    ReplyDelete
  4. ఆదిశంకరాచార్యుల వారి ప్రశ్నోత్తర రత్న మాలికను ఇద్దరు బ్లాగర్స్ వారికి అర్ధమైనట్టు వివరించారు.. ఆదిశంకరాచార్యుల గురించి పెద్దగా తెలియకపోవటం వలన నాకు రెండు పోస్ట్స్ informative గానే అనిపించాయి. కాకపోతే ఇద్దరు వ్యక్తులు ఒకటే గ్రంథం/పుస్తకం చదివినప్పుడు వారి అభిప్రాయాలు వారు రాయడం జరిగినట్టుంది. Thanks for this post అనురాధ గారు.

    ReplyDelete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    శంకరాచార్యుల వారు, తల్లిని కనిపించే దైవంగా , భార్యను స్నేహితురాలిగా గౌరవించమని పురుషులకు స్పష్టంగా చెప్పటం జరిగింది.

    అందువల్ల, పర స్త్రీల విషయంలో పురుషులు ఒకింత జాగ్రత్తగా ఉండాలని వారి అభిప్రాయం అని నాకనిపిస్తోందండి.

    పర స్త్రీల విషయంలో పురుషులు జాగ్రత్తగా ఉంటే స్త్రీలకూ మంచిదే కదా !

    ReplyDelete
  6. Can you send me your email address to kavithalahari@yahoo.com anuraadha gaaru? Thank you!

    ReplyDelete