koodali

Wednesday, December 12, 2012

తులసి మొక్క..



తులసి  మొక్క  గొప్పదనం  గురించి  పూర్వీకులు  మనకు  తెలియజేసారు.

తులసి  ఆరోగ్యానికి  కూడా  ఎంతో సహాయపడుతుంది.

 పువ్వులను,  అమ్మినట్లే   కొందరు    తులసి  పత్రాలను  అమ్ముతారు.  ఇలా  అమ్మే  వారి  వద్ద  తులసి  పత్రాలను  కొని ,  వైద్యానికి  వాడుకోవచ్చు.  లేక  దేవునికి  సమర్పించిన  తరువాత , ఆ  తులసిదళాలను  తీసుకుని  వైద్యానికి  వాడుకోవచ్చు.

చెన్నైలోని  కొన్ని   దేవాలయాల్లో   దేవునికి  సమర్పించిన  తులసి  మాలలను,  పత్రాలను    తరువాత  ప్రక్కన  ఉన్న  బుట్టలో  వేస్తారు.  భక్తులు  ఆ  తులసి  ప్రసాదాన్ని  తెచ్చుకోవచ్చు.

 చాలామంది  ఇళ్ళల్లో  తులసిని  పెంచుకుంటారు.  కొందరు  నేలపై  పెంచుకుంటారు.   నేలలో  పెట్టిన  తులసికి  స్థలం   బాగానే   సరిపోతుంది.

 ఈ రోజుల్లో  అపార్ట్మెంట్  ఇళ్ళు  పెరిగిపోయిన  తరువాత  కొందరు ,  తులసి  మొక్కలను  చిన్నచిన్న   ఇరుకైన   సిమెంట్  కుండీలలో  పెంచుతున్నారు.

ఈ  చిన్న   కుండీలలో  మొక్క  యొక్క  వేర్లు  పెరగటానికి  స్థలం  సరిపోక,  కొన్నాళ్ళకు  కుండీలోని  మట్టి   గట్టిపడి ,  మొక్కకు  పోషకాలు  సరిగ్గా  అందవు.  అప్పుడు  మొక్క  బలహీనంగా  పీలగా  తయారవుతుంది. 

 బలహీనంగా,చిన్నగా  ఉన్న  మొక్కకే   బోల్డు  గాజులు   తొడిగి , పండుగలప్పుడు పూజలు చేస్తుంటారు కొందరు ..
 మొక్క  చాలా  చిన్నగా  బలహీనంగా  ఉంటే ,  రెండు  గాజులను  తొడిగి, మరికొన్ని  గాజులను  తులసి మొక్కకు  ఎదురుగా  ఉంచి   కూడా  సమర్పించుకోవచ్చు  అని   నాకు  అనిపించింది.

   ( ఈ  విధంగా   రాయవచ్చో  రాయకూడదో  నాకు  తెలియదు.  ఒకరు  చాలా  చిన్న  మొక్కకే  బోల్డు  గాజులు  తొడగటం  చూసి, మొక్క  వంగిపోతుందేమోననిపించి  నాకు  కలిగిన  అభిప్రాయాలను  వ్రాసాను.  )

మొక్క వద్ద  ఉంచే  దీపపు వేడి  మొక్కకు తగలకుండా  దీపాన్ని ఉంచాలి  అని కూడా నాకనిపించింది.


తులసికి  పూజలు  చేయటం  మంచిదే    కానీ,  మొక్క   చక్కగా  ఏపుగా   పెరిగే  విధంగా    జాగ్రత్తలు  తీసుకోవటం  కూడా  ముఖ్యమే.

 కుండీకి  ఎండ  కూడా  సరిపడా  తగిలేలా   చూసుకోవాలి.   ఇలా  చక్కగా  పెంచుకుంటే ,  తులసిమొక్క    చక్కగా  పెరుగుతుంది.

ఇరుకు  సిమెంట్  కుండీల  కన్నా,  కొంచెం  పెద్ద  సైజ్  మట్టి కుండీల్లో   తులసిమొక్కను  పెంచుకుంటే  మొక్క  బాగుంటుంది.    మట్టి కుండీల సన్నటి రంధ్రాల  నుంచి  గాలి  బయటకు  ప్రసరించి  మొక్క  చక్కగా పెరుగుతుంది.


వ్రాసిన  విషయాలలో  ఏమైనా  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

వ్రాసిన  విషయాలలో  తప్పులు  ఉంటే ,  ఎవరైనా  సలహా  చెప్పగలరు.  (  వారికి  అభ్యంతరం  లేకపోతే. .)




10 comments:

  1. వనజవనమాలి గారు మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
    Replies
    1. తులసి ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది.
      ------------------------
      అమెరికాలో తులసిని హోలీ బేసిల్ (Holy Basil) అంటారు. నీళ్ళల్లో మరగబెట్టి టీ గ త్రాగుతారు.

      Holy basil is a plant. It is originally from India and is used in Ayurvedic medicine as an “adaptogen” to counter life’s stresses. It is considered a sacred plant by the Hindus and is often planted around Hindu shrines. The Hindu name for holy basil, Tulsi, means "the incomparable one." Medicine is made from the leaves, stems, and seeds.

      Holy basil is used for the common cold, influenza ("the flu"), H1N1 (swine) flu, diabetes, asthma, bronchitis, earache, headache, stomach upset, heart disease, fever, viral hepatitis, malaria, and tuberculosis. It is also used for mercury poisoning, to promote longevity, as a mosquito repellent, and to counteract snake and scorpion bites.

      Holy basil is applied to the skin for ringworm.

      In cooking, holy basil is often added to stir-fry dishes and spicy soups because of its peppery taste. Cookbooks sometimes call it "hot basil."

      How does it work?
      Chemicals in holy basil are thought to decrease pain and swelling (inflammation). Other chemicals might lower blood sugar in people with diabetes.

      There is interest in using holy basil seed oil for cancer. Beginning research suggests that the oil can slow progression and improve survival rate in animals with certain types of cancer. Researchers think this benefit may be explained by the oil’s ability to act as an antioxidant.

      Delete
    2. చాలా చక్కటి విశేషాలను తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

      తులసి విత్తనాల నుంచి కూడా ఆయిల్ తీస్తారంటే ఆశ్చర్యంగా ఉందండి.

      Delete
  2. పై నా వ్యాఖ్యలో సమాచారం Web MD నుండి సేకరించినది. మీకు ఇంకా సమాచారం కావాలంటే Holy Basil తో గూగుల్ చెయ్యండి.

    anrd గారూ తులసి గురించి పోస్ట్ వేసినందుకు థాంక్స్.

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా కృతజ్ఞతలండి.

      Delete
  3. తులసిని గురించి మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి .తులసి మొక్కను తూర్పు దిశలో మన కుడి చేతి మార్గంలో పెట్టుకోవడం (నాటుకోవడం ) లేదా దక్షిణ దిశలో పెంచడం ప్రసస్థమ్ అని చెప్తారు వాడిన తులసి కొమ్మలు ఎండబెట్టి పాడే పౌడర్ గా చేసి చిన్న చిన్న పూసలుగా తయారు చేసి తులసి మాలలు గా అమ్ముతారు . ధనుర్మాసం లో తులసి మాలలు మెడలో వేసుకుని వెంకటేశ్వర దీక్ష చేస్తారు ..ఆ మాలలు మెడలో ధరిస్తే చాలా ప్రశాంతంగా వుంటుంది. తులసి ఆకులను ఆడవారు కోయకూడదు అని చెప్తారు.

    ReplyDelete
    Replies
    1. రుక్మిణిదేవిగారు, మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసానండి. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      తులసిని గురించి మీరు తెలియజేసిన విషయాలకు కృతజ్ఞతలండి. అయితే, తులసి ఆకులను ఆడవారు కోయకూడదు అని చెప్తారు. అనే విషయం గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.

      Delete
    2. రుక్మిణిదేవిగారు, మీ వ్యాఖ్యను ఇప్పుడే చూసానండి. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు దయచేసి క్షమించండి.

      తులసిని గురించి మీరు తెలియజేసిన విషయాలకు కృతజ్ఞతలండి. అయితే, తులసి ఆకులను ఆడవారు కోయకూడదు అని చెప్తారు. అనే విషయం గురించి నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.

      Delete