koodali

Wednesday, July 25, 2012

కరెంట్ లేని సమయంలో ఫ్యాన్స్ శుభ్రం చెయ్యాలంటే , ముందు స్విచ్ తీసి .....


ఈ  రోజు  మధ్యాహ్నం  నేను  ఫ్యాన్లు  శుభ్రం  చెయ్యాలని  అనుకున్నాను.   అప్పుడు  కరెంట్  లేదు. 

 నిచ్చెన  వేసుకుని  పని  మొదలు  పెట్టబోతుండగా ,  ఫ్యాన్  స్విచ్  తీసి   ఉందేమో  చూడాలని  సడన్  గా   గుర్తు  వచ్చింది .  

చూస్తే  ఫ్యాన్  స్విచ్  వేసే  ఉంది.  అప్పుడు    స్విచ్  తీసి  ఫాన్  శుభ్రం  చేసాను. 

 ఒకవేళ  ఫ్యాన్  శుభ్రం  చేస్తుండగా  చటుక్కున  కరెంట్  వస్తే  ప్రమాదం  కదా  !

  మాది  చెక్కనిచ్చెన  కూడా  కాదు.  అల్యూమినియం  నిచ్చెన.

  కరెంట్  షాక్  సంగతి  ఎలా  ఉన్నా,   సడన్ గా  కరెంట్  వస్తే  ఆ  కంగారులో  క్రిందపడే  అవకాశం  కూడా  ఉంది.

స్విచ్  తియ్యాలని  సమయానికి  గుర్తు  రావటం  దైవం  యొక్క  దయయే.  

*  ఇలాంటి  సంఘటనలు  జరిగినప్పుడు    ఏమనిపిస్తుందంటే,  మన  చేతుల్లో  ఏమీ  లేదు.     అంతా  దైవం  దయ....అనిపిస్తుంది..

  నా  అనుభవం   మీకు  కూడా  చెప్పాలనిపించి  ఈ  టపా  రాసాను. 

 ఈ  రోజుల్లో  కరెంట్  తరచూ  పోతోంది.

 కరెంట్  ఎప్పుడు  పోతుందో  ?  ఎప్పుడు  చటుక్కున  తిరిగి  వస్తుందో  ?  ఒక్కోసారి  చెప్పలేం.  

అందుకని    ఇల్లు  బూజు   దులిపేటప్పుడు,  ఫ్యాన్స్  శుభ్రం  చేసేటప్పుడు   జాగ్రత్తగా  ఉండాలి.  

శుభ్రం  చేసే ముందు  లైట్స్,  ఫ్యాన్స్  స్విచ్ లు  తీసి  శుభ్రం  చేయాలి. 

పనికి సహాయంగా   పెట్టుకున్న  వాళ్ళు  శుభ్రం  చేస్తే ,  ముందు  జాగ్రత్తగా  స్విచ్  తియ్యమని  వాళ్ళకు  కూడా  చెప్పాలి.


11 comments:

  1. అవును అండీ. చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేక పోతే ప్రమాదమే...
    ( కానీ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా ? )

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    * బాగా చెప్పారు....మీరు వ్రాసిన రెండు అభిప్రాయాలు నిజమే.

    ReplyDelete
  3. నిత్యజీవితంలో ఇలాంటి చిన్న చిన్న సూచనలే, కొన్ని సార్లు జీవితాన్ని కాపాడతాయ్ , బాగా రాశారండి.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఇందుకే కాబోలు అనుభవాలే జీవితపాఠాలు అని పెద్దలు అంటారండి.

      Delete
  4. మరొక ముఖ్యవిషయం:
    fridge శుభ్రం చేసే ముందు switch తీసి వేయటం మరచి పోకండి.
    తడిబట్టతో fridge doors శుభ్రం చేస్తూ మనిషి shock కొట్టి చనిపోయిన సంఘటన చదివినట్లు బాగా గుర్తు.

    ReplyDelete
    Replies
    1. ఫ్రిజ్ కూడా స్విచ్ తీసే శుభ్రం చేయాలని నాకు తెలియదు. మీ సూచనకు కృతజ్ఞతలండి.

      Delete
  5. మన ఫ్యూజు గట్టిదైతే స్విచ్చులదేముందండి? దేవుని మీద భారం వేసి తడిబట్టలతో ఫ్యాను శుభ్రం చేసినా ఏమీ కాదండి.
    :D :))) :)))

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      మీ అభిప్రాయం కరెక్టేనండి. దైవం దయ వల్ల ఆయువు గట్టిగా ఉంటే , ప్రమాదాల్లో కూడా హాని జరగదు.

      అదేదో దేశంలో ఎన్నో అంతస్తుల పైనుంచి పడ్డ పిల్లవాడు నిక్షేపంగా బ్రతికాడట. ( చిన్న దెబ్బలు మాత్రం తగిలి. )

      Delete
  6. ఒక చిన్న సందేహం...

    స్విచ్ తియ్యాలని సమయానికి గుర్తు రావటం దైవం యొక్క దయ అయితే, అదే లాజిక్ ప్రకారం...

    షిర్డీ ప్రయాణంలో బస్సు యాక్సిడెంట్ లో పోతే అది దైవం యొక్క ద్వేషంగా భావించాలంటారా?

    ReplyDelete
  7. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    అలా యాక్సిడెంట్లో చనిపోవటం ఎంతో బాధాకరమైన విషయమే.

    అయితే, ఆయువు తీరిపోతే , దైవదర్శనానికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా ఏదో విధంగా మరణం సంభవించేదేమో ?

    దైవదర్శనానికి బయలుదేరి ప్రాణాలు కోల్పోవటం వల్ల, దైవం వారికి ఉత్తమలోకాలనో, మోక్షాన్నో ప్రసాదిస్తే అది దైవం దయే నేమో .... అని నాకు అనిపించిందండి..

    జీవులు ఎప్పటికైనా మరణించటం అనివార్యమే అయినా , వారి పూర్వకర్మానుసారం మధ్యలోనే ప్రయాణం ముగిసినప్పుడు వారి ఆప్తులకు ఎంతో బాధాకరమైన విషయమే.

    బలరామ కృష్ణుల గురువుగారు సాందీపని మహర్షి. ....
    వారి పుత్రులు చనిపోగా , ఆ పుత్రులను యమలోకం నుంచి తిరిగి తెచ్చి , మహర్షికి ఆనందాన్ని కలుగజేస్తారు బలరామకృష్ణులు..

    భారత యుద్ధంలో కౌరవులతో పాటు పాండవుల సంతానం కూడా ప్రాణాలను కోల్పోయారు.

    శ్రీకృష్ణభగవానుడు ఉప పాండవులను, అభిమన్యుని రక్షించలేదు.... కానీ, పరీక్షిత్తుని తిరిగి జీవింపజేసారు.

    రక్షించగలిగే శక్తి ఉండీ కూడా , ఉప పాండవులను, అభిమన్యుని ఎందుకు కాపాడలేదో ? పరీక్షిత్తుకు ఎందుకు ప్రాణాన్ని పోసారో ? వారి వారి పూర్వకర్మలేమిటో ? ఇలా జరగటం వెనుక అంతరార్ధాలేమిటో ? ఇవన్నీ కృష్ణపరమాత్మకే తెలియాలి.

    అలాగే ఇప్పటి వారి జననమరణాల వెనుక ఉన్న అసలు రహస్యాలు కూడా పరమదైవానికే తెలుస్తాయి.

    ReplyDelete
  8. యాక్సిడెంట్స్ వంటివి జరిగినప్పుడు కొందరు చనిపోయినా , అదే యాక్సిడెంట్ లో కొందరికి ఏమీ కాదు.

    ప్రమాదాల్లో హాని జరగకుండా చక్కగా ఉన్నవారు ఎందరో , తాము అలా సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడటానికి గల కారణం దైవం దయ ... అనే భావిస్తారు.

    కొందరి జీవితాల్లో ఒకరకంగా, మరి కొందరి జీవితాలలో మరొకరకంగా సంఘటనలు జరగటానికి గల కారణాలు భగవంతునికే తెలియాలి.

    ReplyDelete