koodali

Monday, July 23, 2012

కొబ్బరి చిప్పలకు పెట్టే కుంకుమ బొట్లు ....


* పూజలలో   కొబ్బరి  కాయ   కొట్టిన  తరువాత  రెండు  చిప్పలకు   కుంకుమ బొట్లను    పెట్టి    ఆ  కొబ్బరి  చిప్పలను  దేవునికి  నైవేద్యంగా  సమర్పిస్తారు  చాలామంది..   

 కొందరయితే   చాలా  ఎక్కువ  కుంకుమను  చిప్పలకు  పెడతారు. 

 ఈ  మధ్య ,  మాకు  తెలిసిన  వాళ్ళు ,  మాకు  కొబ్బరి  చిప్పను  ప్రసాదంగా  ఇచ్చారు.  దానికి   మూడు  చోట్ల  దట్టంగా  కుంకుమ  బొట్లు  పెట్టారు. 


 కొబ్బరి  చిప్పను   అలాగే   పచ్చడి  చెయ్యటానికి  లేదా     వంటలో  ఉపయోగిస్తే  ఆ  కుంకుమ  కూడా   ఆహారపదార్ధాల లో  పడుతుంది  కదా  ! 


 చిప్పను   కడిగి  ఉపయోగించినా  కుంకుమ  యొక్క  ఎర్ర  రంగు  అలాగే   ఉంటోంది.   


 పూర్వం  అయితే  కుంకుమను  ప్రకృతి సహజమైన  రంగులతో  తయారు  చేసేవారట.  


ఈ  రోజుల్లో  కొందరు  కుంకుమలో  రసాయనిక  రంగు  కూడా  కలుపుతున్నారట  .   


  కొబ్బరితో  పాటు  ఆ  రసాయనాల  రంగులు   కూడా   వంటలో   వేస్తే     ఆరోగ్యానికి  హానిని  కలిగిస్తాయి.  


  * అందువల్ల , కుంకుమ  బొట్లను    కొబ్బరి  చిప్పకు  లోపల  తెల్లని  భాగం  మీద   కాకుండా ,   కొబ్బరి  చిప్పకు  బయట    పెడితే  , వంటలలో  కొబ్బరిని  వాడేటప్పుడు  ఆ  కుంకుమ  ఆహారపదార్ధాలలో    కలవదు  కదా  !  అనిపించింది. 


  ఇది  చిన్న  విషయంగా  అనిపిస్తుంది  గానీ,  రసాయనాలు  కొద్దికొద్దిగా  శరీరంలో  ప్రవేశించినా  ఆరోగ్యానికి  ప్రమాదమే  కదా  !
....................

* ఒకసారి  దేవునికి  నైవేద్యంగా  సమర్పించిన  కొబ్బరి  చిప్పలను  మరల  దేవునికి  నైవేద్యంగా  సమర్పించే  వంటలలో  వాడరు. ..
 
* దేవునికి  నైవేద్యంగా  సమర్పించే  వంటలలో  మరల  కొత్త  కొబ్బరి  కాయలను  కొట్టి  ఆ  చిప్పలను  వాడతారు. 

 
* ఒకసారి    నైవేద్యం  చేసిన  కొబ్బరి  చిప్పలకు  ......నైవేద్యం  చేయని  కొబ్బరిచిప్పలకు  తేడా  తెలియటానికి .... కొబ్బరి  చిప్పలకు  కుంకుమ  బొట్లు  పెట్టటానికి  గల  కారణాలలో  ఒకటి  అని  నాకు  అనిపించింది.  

 
* అంటే,  కుంకుమ  బొట్లు  పెట్టిన  కొబ్బరి  చిప్పలు  నైవేద్యం  చేసినవిగానూ  ,  కుంకుమ  బొట్లు  పెట్టని  చిప్పలు  నైవేద్యం  చేయనివి  అని.


* అయితే ,గుర్తు  తెలియటానికి  కుంకుమ బొట్లను  చిప్పలకు  వెలుపల భాగాన  పెట్టవచ్చు.


8 comments:

  1. బాగానే ఉంది. కాని, కుంకుమ బొట్టే యెండుకు, పసుపు బొట్టు పెట్టవచ్చును గదా? కానీ యీ రోజుల్లో కల్తీ లేని సరుకెక్కడ? పసుపూ కత్లీదే దొరుకుతోంది. మంచిది. ఆ బొట్లేవో కొబ్బరిచిప్ప వెలుపలనే ఉంచటం శ్రేష్టం. మంచి సలహా.

    ReplyDelete
    Replies
    1. .మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి , యీ రోజుల్లో ఎక్కువ సరుకుల్లో కల్తీ జరుగుతోంది.
      పాత రోజుల్లో అయితే, కుంకుమ, పసుపు వంటివి ఇంటి వద్దే తయారుచేసుకునేవారట.

      Delete
  2. మళ్ళీ ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటేనండి,

    మీరు వ్రాసినట్లు పసుపు బొట్లు పెట్టడం మంచి సలహా నండి. పసుపును ఎలాగూ ఆహారపదార్ధాలలో వాడతాము కాబట్టి ఫరవాలేదు.

    కుంకుమ ఆహారపదార్ధాలలో పడితే అనారోగ్యం కాబట్టి, ( కుంకుమ తయారీలో ఉపయోగించే కొన్ని పదార్ధాల వల్ల ) కుంకుమ బొట్లు పెడితే మాత్రం కొబ్బరిచిప్పలకు వెలుపల భాగాన పెట్టడమే మంచిది అనిపించింది.

    ReplyDelete
  3. మంచి విషయం చెప్పారు అండీ..

    ReplyDelete
    Replies
    1. సాయి గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  4. thanks for sharing the good one aanandam garu :)

    ReplyDelete
    Replies
    1. సీత గారు,మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete