koodali

Monday, April 16, 2012

చాయలకు ప్రాణం వస్తే. ....

ఈ మధ్య నేను

SHANI DEV KI KATHA - YouTube ..

లో చూస్తుంటే నాకు కొన్ని చిత్రమైన ఆలోచనలు వచ్చాయి.

ఆ దైవ విగ్రహాలను చూస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. గుడిలోని విగ్రహమూర్తులు గుడిలో ఉండగానే మనం ఆ విగ్రహమూర్తులను ( వాటి యొక్క ప్రతిబింబాలను ) కంప్యూటర్ లో చూడగలుగుతున్నాము కదా ! . అంటే అసలు విగ్రహం గుడిలోనే ఉంది . దాని ప్రతిబింబం మాత్రం టీవీల్లోనూ, కంప్యూటర్లోనూ చూడగలుగుతున్నాము.


మనుషులను, ప్రకృతిని చాయాచిత్రాలుగా తీసే విధానాన్ని ( వీడియో తీయటం ద్వారా ) శాస్త్రవేత్తలు కనిపెట్టారు కదా !
ఉదా...సినిమాలు చూస్తే ,అందులోని అసలు నటీనటులు తమ ఇళ్ళలోనే ఉంటారు.. కానీ అదే సమయంలో సినిమాహాల్లో మాత్రం ఆ నటీనటుల చాయాచిత్రాలు కదులుతాయి ,మాట్లాడతాయి కదా !


అలాగే అసలు సీతాదేవి సురక్షితంగా ఉండగా ....అగ్నిదేవుడు సృష్టించిన ఛాయాసీత ( సీతాదేవి యొక్క ప్రతిబింబం ) లంకలో ఉండి ఉండవచ్చు కదా ! అనే చిత్రమైన ఆలోచన కలిగింది.


అయితే ఇక్కడ సినిమాలలో అయితే నటీనటులు అంతకుముందు తాము ప్రదర్శించిన హావభావాలే చాయాచిత్రాలుగా తిరిగి కనిపిస్తాయి.


ఛాయాసీత విషయంలో మాత్రం చాయాసీత ఏర్పడిన తరువాత ఆ 
ఛాయ యొక్క హావభావాలు ఇతరులకు కనిపిస్తాయి.


అంటే ఉదాహరణకు .. దేవతలు ., ప్రతిబింబాలకు ప్రాణం పోసారేమో ? అనిపిస్తుంది. ఉదా.. సీతాదేవి యొక్క ,ఒక ప్రతిబింబానికి ప్రాణం పోస్తే, ఆ ప్రతిబింబం యొక్క రూపం ,
ఛాయాసీతగా సజీవంగా ఎదుటివారికి కనిపించి ఉండవచ్చు కదా ! ( ఛాయాసీత.. రావణుడికి .. అసలు సీతగా కనిపించినట్లుగా ) ..అనిపించింది.


తోచింది వ్రాసాను. వ్రాసిన వాటిలో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను..


5 comments:

  1. బాగుంది. కథ అయినా కల్పన అయినా.. ఊహ అయినా..ఆలోచన అయినా అక్షరీకిస్తున్నారు. వెల్ డన్ !

    చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  2. ఒకసారి దీనిని చదవండి!
    http://telugubhaavaalu.wordpress.com/2012/03/04/%E0%B0%B8%E0%B1%80%E0%B0%A4%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%B0%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7/

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి. మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసానండి. .
      తెలుగు భావాలు వారి బ్లాగులో టపా కూడా చదివానండి. సీతారాముల గురించి ఫణీంద్ర గారి బ్లాగులో వచ్చిన వ్యాఖ్య కారణంగా తెలుగు భావాలు వారు ఆ టపా వ్రాసారన్నారు.

      నిజమే , కొందరు పురాణేతిహాసాలలోని సంఘటనలను అపార్ధం చేసుకుంటున్నారు. వారు అలా అపార్ధం చేసుకుంటూ చేసిన వ్యాఖ్యల వల్ల మనకు బాధగా అనిపిస్తుంది. అయితే ఆస్తికులకు కూడా కొన్ని ధర్మసందేహాలు కలుగుతుంటాయి.

      నేనూ ఒకప్పుడు ( కొద్ది కాలం... ) నాస్తికవాదిని లెండి. అప్పుడు నాకు కూడా పురాణేతిహాసాలలోని సంఘటనలు తెలుసుకున్నప్పుడు అనేక సందేహాలు కలిగేవి.

      అయితే జీవితంలో మార్పులు చేర్పులు సహజం కదా !

      నేను మరల ఆస్తికవాదిని అయ్యాను.

      తరువాత పురాణేతిహాసాలలోని సందేహాలను తీర్చుకోవాలని గట్టిగా అనిపించింది.

      పండితుల ద్వారా తెలుసుకున్న విషయాల వల్ల నా సందేహాలు కొన్ని తీరాయి. గ్రంధాలలోని విషయాలను విశ్లేషించటం, పండితుల ద్వారా తెలుసుకున్న విషయాలను విశ్లేషించటం వల్ల , నాకు కలిగిన అనేక సందేహాలు తీరాయి. ( అంతా దైవం దయ. )

      ఇప్పటికీ కొన్ని ధర్మసందేహాలు ఉన్నా, వాటి గురించి పెద్దగా ఆత్రుత చెందనవసరం లేదు అనిపిస్తోంది. ఎందుకంటే , అన్నం ఉడికిందా ? లేదా ? అని చూడటానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలు. అన్నం అంతా పట్టుకుని పరీక్షించనవసరం లేదు కదా !

      అలాగే పురాణేతిహాసాలలోని ధర్మసందేహాలు కొన్ని తీరి సందేహనివృత్తి అయిన తరువాత ... ఇక మిగతా సందేహాల గురించి పెద్ద వర్రీ అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే ఒకసారి నమ్మకం ఏర్పడిన తరువాత ఇక సందేహానికి తావెక్కడ.

      మనకు జవాబు తెలియనంత మాత్రాన వాటిని సందేహించనవసరం లేదని , ఆ సందేహాల వెనుక కూడా సరైన సమాధానం ఉంటుందన్న గట్టినమ్మకం ఏర్పడింది.

      అందువల్ల .. పురాణేతిహాసాల గురించి నాకు తెలిసినంతలో ఇతరులకూ చెప్పుకోవాలని ఇలా టపాల్లో వ్రాస్తున్నానండి. అంతా దైవం దయ..

      నేను ఇంతకుముందు పురాణేతిహాసాలను అపార్ధం చేసుకున్నందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను...

      పురాణేతిహాసాలలో చెప్పబడ్డ విషయాలు అనంతం. వాటిల్లో నాకు తెలిసింది సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే...

      Delete
  3. బ్లాగుల్లోనూ, బయట కూడా పురాణేతిహాసాల్లోని విషయాల గురించి ఇంకా ఎన్నో విషయాల గురించి , ఎందరో తమ అభిప్రాయాలను చక్కగా తెలియజేస్తున్నారు. అందువల్ల ఎన్నో చక్కటి విషయాలను తెలుసుకునే అవకాశం అందరికీ కలుగుతోంది.

    అలా తమకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదములండి. ...నేను బ్లాగులో ఈ మాత్రం వ్రాయగలుగుతున్నానంటే దైవం దయ వల్ల మరియు ఎందరో పండితులు , పామరుల ద్వారా తెలుసుకున్న విషయపరిజ్ఞానం వల్లనే.

    ReplyDelete