koodali

Friday, April 6, 2012

కొన్ని విషయాలు..........కొన్ని సందేహాలు....


ఓం.
స్రీ సీతారాములకు నమస్కారములు.
శ్రీ ఊర్మిళాలక్ష్మణులకు నమస్కారములు.
శ్రీ సువర్చలాఅంజనేయులకు నమస్కారములు.
ఏసుప్రభువుకు నమస్కారములు.

...........................
వ్యాస మహర్షి జనమేజయునితో చెప్పిన కొన్ని విషయాలు....

..ఆ
జగన్మాత నిత్యురాలు. ఎప్పుడూ ఉంటుంది..ఇప్పుడు ఏకరూపత్వాన్ని పొందింది. విభిన్నరూపాలలో ఉండేది తానే.నటుడు లోకరంజన కోసం రంగస్థలం మీద విభిన్న పాత్రలూ, రూపాలూ ధరిస్తాడు. కానీ తాను ఒక్కడే. .... కార్యకర్మానుసారంగా రూపంతోపాటూ నామధేయాలూ ఏర్పడుతూ ఉంటాయి....అని ఇంకా ఎన్నో విషయాలను చెబుతారు. ( మహిషాసుర వధ కధలో )
.................

దుర్గాదేవికి ఎన్నో రూపములు ఉన్నాయి.

సాత్విక, రాజస, తామస భావాలలో ...ఆ భావానికి తగ్గట్లుగా ఆమె భావం ఉంటుందనిపిస్తుంది.

విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరిస్తే పార్వతీదేవి అట.

విష్ణుమూర్తి అమృతమధన సమయంలో మోహినిగా అవతారం ధరించినప్పుడు శివుడు ఆమెను పార్వతీదేవిగా భావించటం జరిగిందని పండితులు చెబుతున్నారు.

ఒకే వ్యక్తిలో రెండు లేక మూడు శక్తులు ( భావాలు ) ( అంశలు ) ఉండటం ఆశ్చర్యం కాదు.

ఉదాహరణకు మానవులలోనే చూస్తే సాత్విక, రాజస, తామస తత్వాలు
ఒకే వ్యక్తిలో ఉంటాయికదా!


మరి అద్భుతమైన శక్తులు గల దేవతలకు ఎన్నో మహిమలు
ఉంటాయి.

.........................

బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్తస్తోత్రరత్నాన్ని ఇంద్రుడు అనర్ఘళంగా పఠించాడు......ఆ స్త్రోత్రంలో శ్రీ మహాలక్ష్మిని స్తుతించాడు. ఆ స్తుతిలో లక్ష్మి దేవి గురించిన ఎన్నో విషయాలు తెలుస్తాయి.

లక్ష్మీదేవి స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా కీర్తింపబడుతుందట.

దుర్గాదేవి కూడా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహంలో గృహలక్ష్మిగా ఉంటుందని ఇంకో దగ్గర చదివాను.


భార్యాభర్తలను పార్వతీపరమేశ్వరులుగాను లేక లక్ష్మీనారాయణులుగానూ భావిస్తారు.
........................

విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరిస్తే పార్వతీదేవి అట. ( ఈ విషయం గురించి ఇక్కడ కూడా కొన్ని వివరాలు ఉన్నాయి. )

వికీపీడియాలో ..... shiva......Relationship to vishnu..

( విష్ణుమాయ , విష్ణుదుర్గ వంటి నామములు లోకంలో ప్రచారంలో ఉన్నాయి కదా ! )
..................

రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశయే. ఇవన్నీ గమనించితే మనకు ఏ అర్ధం అవుతుందంటే దైవం ఒక్కరే. సందర్భాన్ని బట్టి ఒక పద్దతి ప్రకారం దైవం రూపాన్ని ధరిస్తారు అని .


భగవద్గీతలో శ్రీ కృష్ణుల వారు అర్జునునితో ....( విభూతి యోగంలో.) ...దేవతలలో ఇంద్రుడను , ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, రుద్రులలో శంకరుడను వాడను, పాండవులలో అర్జునుడును, మునులలో వేదవ్యాసమునీంద్రుడను....నేనీ జగత్తునంతను ఒక్క అంశము చేతనే వ్యాపించి యున్నాను .....అని చెప్పటం జరిగింది.


( శ్రీ కృష్ణుడు తాను ..... దేవతలలో ఇంద్రుడను, రుద్రులలో శంకరుడను వాడను, పాండవులలో అర్జునుడును, అని చూస్తే ....
ఇంద్రునిలో , అర్జునునిలో శివాంశ కూడా ఉన్నదేమో ? అనిపిస్తుంది..)

సుభద్రాదేవిలో దుర్గాదేవి యొక్క సాత్వికతత్వం ఉన్నదేమో? అనిపిస్తుంది.

(అంటే) గౌరీదేవి అంశ సుభద్రాదేవిలో ఉన్నదేమో?
అనిపిస్తుంది.

అందుకేనేమో శ్రీకృష్ణుని చెల్లెలయిన సుభద్రాదేవిని శక్తి అవతారంగా భావిస్తారు.

అర్జునునిలో విష్ణువు అంశ, రుద్రుని అంశ కూడా ఉన్నాయేమో ? అనిపిస్తుంది.

అర్జునుడు ఇంద్రాంశతో జన్మించాడు. ఇంద్రుడు దేవతలకు అధిపతి కదా !

ఇంద్రునిలో విష్ణువు అంశ, రుద్రుని అంశ కూడా ఉన్నాయేమో? అనిపిస్తుంది.


ఈ క్రింది విషయాలు చదవండి.

FORMS OF SHIVA FROM THE VEDAS:
(The Secret Wisdom of Indra Agni and Soma)

Indra, Agni and Soma are the Three Forms of Rudra (Shiva) in the Vedas.

Indra is Tamas (Darkness or inertia), and relates to the highest forms of Shiva. Agni is Rajas (Passion) and relates to the Fiery Quality of Tapas and Rajas, Passion. Soma represents the Truth and is Sattva-Guna.

These are also the Three Qualities of Brahman (Shiva) as:

Sat (Truth) or Indra
Chid (Consciousness) or Agni
Ananda (Bliss) or Soma.


................

శ్రీపాదశ్రీవల్లభసంపూర్ణచరితామృతములో ద్రౌపది గురించిన వివరములున్నాయని ఇంతకు ముందు టపాలో వ్రాసాను.
ఇంకా కొన్ని కధలలో ...... కొందరు దేవీమూర్తులు శాపం కారణంగా అలా ద్రౌపదిగా జన్మను ధరించారని చెబుతున్నారు.

ఒకప్పుడు యమ, వాయు, అశ్వినీదేవులు కూడా ఇంద్రునిగా బాధ్యతలను నిర్వర్తించారట.

మరిన్ని వివరములు ఇక్కడ ఉన్నాయండి........
The fascinating story behind Draupadi Devi's birth - Tattvavaada ...

( Vayu by name Rochana, Yama by name Satyajith, Ashwini Gods by name Trishala and Vibhu respectively occupied the post of Indra in Swaarochisha, Uttama, Raivata and Tapas Manwantara. )


 
ద్రౌపదిలో  పార్వతీ దేవి అంశ  ఉంటే  శివుని  అంశ  కూడా  ఉన్నట్లే  అనుకోవచ్చేమో..ఎందుకంటే ,  పార్వతీపరమేశ్వరులు  అర్ధనారీశ్వరులు  కదా  !.


..............
పైన వ్రాసినవి ఒకదానికొకటి పొంతన లేనట్లు కొందరికి అనిపిస్తుందేమో ?
కానీ పైన వ్రాసిన విషయాలను క్రోడీకరించి చదివి విశ్లేషించుకోవాలి.
.............

పురాణేతిహాసాలలోని కధలను కొందరు అవహేళన చేస్తారు. కానీ అలా చేయటం తప్పు. ఎందుకంటే, ...

పురాణేతిహాసాలలోని కధల ద్వారా ఏది ధర్మం ? ఏది అధర్మం ? వంటి ..... ఎన్నో ఎన్నో విశేషాలను ... తెలియజేయటానికే . దేవతలు ఇలా చేసారు అనిపిస్తుంది.

పురాణేతిహాసాల ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.


( లోకంలోని ఎన్నో ఎన్నో విషయాలు, ఎంతో విజ్ఞానం ... ఆ కధల ద్వారా తెలుస్తాయి. )


ఉదాహరణకు...నీతికధల ద్వారా పిల్లలకు నీతులను బోధించేటప్పుడు ..పిల్లల మనస్సులకు హత్తుకునేటట్లు చెప్పాలనుకునే .పెద్దలు కొందరు ....

ఆ కధలలోని మంచి మరియు చెడ్డ పాత్రలను తామే నటించి చూపిస్తూ ఆ కధలను చెబుతారు కదా ! .


అలా చెడ్డ పాత్రలను నటించటం వల్ల ఆ పెద్దవాళ్ళ మర్యాదకేమీ భంగం కలుగదు కదా !

అలాగే, .పురాణేతిహాసాలలోని పాత్రలను దేవతలు ..... తామే పోషిస్తూ..... ఆ కధల ద్వారా లోకంలోని ధర్మాధర్మాలను ప్రజలకు తెలియజేసారు అనిపిస్తుంది.

అందువల్ల మనం తెలుసుకోవలసింది ఏమంటే..... ధర్మాధర్మాలను మనం తెలుసుకోవాలి...... అంతేకాని ఆ కధలలోని పాత్రధారులను ( దేవతలను ) మనం తప్పుపట్టకూడదు.
..................

రావణాసురుని లేదా దుర్యోధనుని ఇంకా భూమి మీద రాక్షసులను, చెడ్డ శక్తులను సంహరించాలంటే దైవానికి చిటికెలో పని.

కానీ అలా చంపకుండా .....రామాయణం, భారతం వంటి ఇతివృత్తాల ద్వారా....ఎన్నో కధలను, అందులో పాత్రధారులను కల్పించి ,... వారి జీవితాల ద్వారా ... వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? .....

....ఏది ధర్మం ? ఏది అధర్మం ?
వంటి ఎన్నో విషయాలను, విజ్ఞానాన్ని ...పురాణేతిహాసాల ద్వారా ,.దైవం లోకానికి అందించటం జరిగిందని నాకు అనిపిస్తుంది..

నాకు తెలిసింది సముద్రంలోని నీటి బొట్టులోని కొద్దిభాగం మాత్రమే. పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.,.


2 comments:

  1. మీరు టపా లొవాక్యనిర్మాణ పద్దతి మార్చుకొవాలి.వాక్యం కు వాక్యం కు ఆంత వైడింగ్ ఇవ్వటం సాంప్రదాయం కాదు దీనివలన టపాపఠనం ప్రక్రియ కొనసాగింపుకు ఆంతరాయంగావున్నది.ఒక పెరా కూడ ఆంత ఖాళి ఇవ్వరు దయ చెసి మీరు ఇది గమనించి ఒక సారి ప్రివ్యూ చూసుకొనగలరు.ఆన్యదాభావించవలదు.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరన్నది నిజమే కానీ , దూరం దూరంగా వ్రాస్తే సులభంగా అర్ధమవుతుందని అలా వ్రాస్తున్నాను. మీ సూచనను గుర్తుంచుకుంటానండి..

    ReplyDelete