koodali

Friday, July 15, 2011

ఆది అయినా .....అంతమయినా.......,అంతులేని వేదాంతమయినా.....అంతా నీవన్నావు.....


ఓం.

ఈ రోజు గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, ఇంకా, ఆదిపరాశక్తిపరమాత్మను... గురువుగా కూడా భావించవచ్చు .

శ్రీ దత్తాత్రేయుని ఒక అవతారమే శ్రీ శిరిడి శాయి బాబా అంటారు.

నాకు ఏమనిపిస్తుందంటే..

మతాలు వేరైనా భక్తులు పూజించే దైవం యొక్క పేర్లలో చాలా పోలిక కనిపిస్తుంది అని.... ఇంకా, .పేర్లలో చిత్రమయిన పోలికలు, విశేషాలు చూడండి.

మనకు ఎన్నో మతాలున్నాయి. ఒకే మతంలో కూడా భేదాలు ఉన్నాయి.

ఉదా.. హిందూ మతంలో శైవులు, వైష్ణవులు ఉంటారు. వారు పూజించే భగవంతుని పేరులో పోలిక చూడండి.

" శివుణ్ణి ... ఈశా " అని కూడా అంటారు.

" విష్ణువును ... వటపత్ర శాయి " అని కూడా పిలుచుకుంటారు.

శాయీ అన్న పేరును త్రిప్పి పలికితే ఈశా అని వస్తుంది.

ఈశా...శివుడు ..త్రిప్పి పలికితే ..శాయీ...విష్ణువు..

విష్ణుమూర్తి పేరు ... శివుని పేరులో ఎంత పోలిక ఉందో. కదా !


తిరగవేసి అంటే ఉదా...మనం " శాయీ శాయీ " అని గబగబా పలికితే " ,ఈశా ఈశా " అనిపిస్తుంది.

అలాగే ...." ఈశా ఈశా " అని గబగబా పలికితే " శాయీ శాయీ " అని కూడా వస్తుంది....

( వాల్మీకి మహర్షిగా మారకముందు " .రామ నామాన్ని మరామరా " అని పలికినట్లు. ఇంతకు ముందు ఒక టపాలో వ్రాశానండి. )

ఇంకా , పేర్లలో చిత్రమయిన విశేషాలు చూడండి.

రామ.....అంటే విష్ణుమూర్తి

రమా....అంటే లక్ష్మీదేవి.

 
. ఇంకా , కొన్ని ప్రధాన మతముల వారు దైవాన్ని పిలిచే పేర్లలో కూడా చాలా పోలిక కనిపిస్తుంది.

" కబీరు దైవాన్ని సాయీ " అని పిలిచేవారట.

అందుకే మహల్సాపతి షిరిడి సాయిని .. సాయీ అని పిలిచారట.

ఆ పిలుపును మనము " శాయీ...లేక సాయీ" అని కూడా వ్రాసుకోవచ్చు.

శాయి అన్న నామంలో విష్ణువు, శివుడు ఉన్నారు.. ఇక అమ్మవారిని కూడా చూడొచ్చు.

" శాయి " లో .. " యి " కారము అమ్మవారికి ప్రతీక...

 
ఇంకా " ఈశా" అంటే శివుడు " అంట " ఈశి ".. అంటే అమ్మవారు అని " విన్నట్లు గుర్తు. ఈవిధంగా " శాయి " నామంలో అమ్మవారిని అయ్యవారిని.. భావించవచ్చు.

ఇక " సాయే " అన్న పదాన్ని తిరగవేస్తే " యేసా " ( " ఏసు " ) అని వస్తుంది.

" యేసా " అన్న పిలుపును తిరగేసి పిలిచితే... "సాయే " అని వస్తుంది.

అంటే " యేసే ... సాయి " . "సాయే ..
యేసు " . ఏ పేరుతో పిలిచినా దైవం ఒకరే అనిపిస్తోంది కదూ !

పరమేశా ! అన్నపిలుపులో యేసా ! అన్న పిలుపు కూడా వినవచ్చు.

ఇంకా , " రహీం " అన్న పదాన్ని గబగబా పలికితే.... " హ్రీం " అన్నట్లు అనిపిస్తుంది.

రాముడు అయినా , రహీము అయినా ,....

 క్రీస్తు అయినా, కృష్ణుడు అయినా,....

 యేసు అయినా ఈశుడు అయినా ,..........
సాయి అయినా , యేసు అయినా ......

దైవం ఒక్కరే.....


అన్ని మతాల వారు పూజించుకునే సూర్యుడు, చంద్రుడు అందరికీ ఒకరే . అలాగే ఎన్ని పేర్లతో పిలుచుకున్నా అందరికీ దైవం ఒకరే.

శ్రీశ్రీ మహావతార్ బాబాజీ,శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ కబీరు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, వంటి ఎందరో పెద్దలు ... పరమత సహనాన్ని బోధించారు.

ఈ కలికాలంలో ఎందరో హిందువులకు దొరకని శ్రీరామలక్ష్మణుల అద్భుత దర్శనం తానీషా
కు లభించింది.

ఇంకా ఈ కాలంలో అమరనాధ్ గుహను ముస్లిం మతము వారే కనిపెట్టడం జరిగింది.

 దైవం ఒక్కరే.
.....


ఒకే మతంలో కూడా గొడవలు పడుతుంటారు. అలా కాకుండా ఎవరి మతాన్ని , ఆచారాలనూ వారు గౌరవించుకుంటూ .. ఇతరుల మతాలనూ వారి ఆచారాలను గౌరవిస్తే, సమాజంలో గొడవలు ఉండవు.

" ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలో ....బాబాజీ, క్రీస్తు , వీరిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసని చెప్పబడింది.

వీరిద్దరూ ప్రపంచంలో యుద్ధాలు, జాతి విద్వేషాలు, మతపరమయిన పక్షపాతాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారట.

ఇంకా, "శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము " గ్రంధములో ఎన్నో గొప్ప విషయాలున్నాయి.

అందరూ ప్రశాంతముగా జీవించాలని కోరుకుంటూ.......

వ్రాసిన దానిలో తప్పులు ఉంటే క్షమించమని దైవాన్ని కోరుకుంటూ.......

ఇంకా,
మనకు దైవ భక్తి, శ్రద్ధ తగ్గినప్పుడు, అహంకారం ,కోపం వంటి దుర్లక్షణాలు పెరిగినప్పుడు మన ఆలోచనల్లో పొరపాట్లు వస్తాయి.

అలా కాకుండా మనం సత్ప్రవర్తనను పెంచుకుంటే దైవమే మనకు పొరపాట్లు లేని ఆలోచనలు కలిగిస్తారు.

అలా ప్రవర్తించటానికి ప్రయత్నిద్దాం..

 

2 comments:

  1. మతాలు వేరైనా భక్తులు పూజించే దైవం యొక్క పేర్లలో చాలా పోలిక కనిపిస్తుంది
    ------------
    చిత్రంగా ఉంటుంది కదండీ.

    ReplyDelete
  2. మతాలు వేరైనా దైవం ఒకరే కాబట్టి ............. అలా పోలిక కనిపిస్తుందేమోనండి.

    ReplyDelete