koodali

Monday, March 28, 2011

సంచార జివితము లాంటి మాది అసలు ఎ ప్రాంతం..

 

టపా నేను బ్లాగ్ మొదలు పెట్టిన క్రొత్తలో వ్రాశానండి. కొద్దిగా మార్పులు, చేర్పులూ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.

నేను ఇప్పుడు tranfersవల్ల రకరకాల రాష్ట్రములు తిరిగే మాలాంటి వారి కష్టాలూ గురించి రాయాలనుకుంటున్నాను అండి.


కొన్నాళ్ళ క్రితం తెలుగు ప్రజలు నలుగురు కలిస్తే మామూలుగా మీది ఊరు ?ఇలా కుశల ప్రశ్నలు వేసుకునేవారు. కాని ఇప్పుడు ఊరు అంటే దిక్కులు చూడాల్సిన పరిస్తితి. ఊరు అని చెపితే ఏమి కొంప మునుగుతుందో ఎవరికి తెలుసు మరి.


పూర్వము native place అనేది ఎలా ఉండేదంటే అప్పుడు ప్రజలు వ్యవసాయము, వ్యాపారము వల్ల ఒకే ప్రాంతములో ఉండిపోయెవారు. మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వల్ల ఆఫీస్ వాళ్ళ ఎక్కడకు పంపితే అక్కడకు వెళ్ళాల్సిన పరిస్తితి.

మేము ఇలా తిరుగుతూ ఉండటము వల్ల మా పిల్లలకు మా సొంత ఊరు అంటే పెద్దగా తెలియదు. ఎప్పుడయినా వెళ్ళ్తుంటాము అంతే. పిల్లలకు వాళ్ళు పెరిగిన చదువుకున్న ప్రాంతము తోనే attachment ఉంటుంది .


మేము మా పై అధికారులతో మాకు వేరే రాష్ట్రము వద్దు భాష కూడా రాదు , కావాలంటే మా రాష్ట్రము లోనే వేరే ఊరు వెయ్యండి మహాప్రభూ...... అన్నా కూడా వారు వినరు ,


మాఖర్మ ప్రకారము ముంబయొ వేశారంటే ఇక మాపని అంతే................ వెళ్ళకపోతే వీళ్ళు ఊరుకోరు, వెళ్తే అక్కడ వాళ్ళు మీరు ఎవరు? మమ్మల్ని దోచుకోవటానికి వచ్చారా లేక మా సంస్క్రుతి పాడు అయిపోతుంది మీ వల్ల అని వాళ్ళూ చావగొడతారు........................... ............................

ఏమిచెయ్యాలి అలా అని ,ఆఖరికి సొంత ఊరు వెళ్తే అక్కడ పెద్దగా ఏమీ తెలియదు. మా లాంటి వారికి నేటివిటీ కి భాష ఒక్కటే ఆధారమేమో. ఇంకొ 50 సంవత్సరములలో ఇంగ్లీష్ పుణ్ణ్యమా అని అది కూడా ఉండదులెండి. లేదంటే మా పెద్దవాళ్ళ ప్రాంతమే మాప్రాంతమని( బేస్) అనుకొవాలి.

అసలు బిజినెస్సు పెరగాలంటే ఆఫీస్ వాళ్ళకయినా మంచిగా ఆప్రాంత ప్రజలతో వాళ్ళ భాషలో మాట్లాడాలి.

ఉదాహరణకి బ్యాంక్స్ అనుకోండి,అక్క్డకు వచ్చేవారికి అందరికి ఇంగ్లీష్ రాదు కదా. ఇంకా బ్యాంక్ ఏమి అభివ్రుధ్ధి అవుతుంది.వీళ్ళుఅక్కడి భాష చచ్చీచెడీ నేర్చుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఉంటాయి.


నేను ఇదంతా ఎందుకు రాస్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే జనము మద్య గొడవలు ఉండవేమోనని.కాని ట్రాన్స్ఫర్స్ వల్ల మంచి కూడా ఉందండోయ్.అన్నీ ప్రాంతాల వారి మద్య స్నేహము పెరుగుతుంది.

మేము అది వరకు ఆంధ్రాలో ఉన్నప్పుడు పేపర్స్ లో మన ప్రాజెక్టులు తమిళనాడు తన్నుకు పోయింది, కర్నాటక కాకిలా ఎత్తుకుపోయింది ఇలాంటి వార్తలు చదివి,ఇంత అన్యాయమా అనిపించేది.

ఇప్పుడు ఏమి అనిపిస్తుందంటే వాళ్ళ తప్పేముంది. మనకి తెలివిగా చేతరాదు..వాళ్ళ భాష అన్నా వాళ్ళకి చాలా గౌరవము.మనకి ఇంగ్లీష్ అంటేనే ఇష్టము కదా మరి.మనము వాళ్ళ దగ్గర చాలానేర్చుకోవాలి.

మనకు ప్రాంతము ట్రాన్స్ఫర్ అయితే ప్రాంతముతో అటాచ్మెంట్ పెరుగుతుంది. వాళ్ళతో friendship మనపిల్లలకు చదువు చేప్పే టీచర్స్, వీటన్నింటితో అనుభంధము ఏర్పడుతుంది.

ఇక భగవంతుని ఆలయాలు ఎక్కడ ఉన్నా అవి అందరివీ కదా...
మన జీవితములో మనము ఎక్కడ ఉంటే ప్రాంతము కూడా ఒక భాగము కదా మరి.


విధముగా ఒక ప్రాంతము ప్రజలు వేరే ప్రాంతము వెళ్ళటము వల్ల కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు.స్నేహము పెరగా వచ్చు.... వెళ్ళటము ఒక లిమిట్ దాటితే అపార్ధాలూ పెరగవచ్చు.

ఏది ఏమయినా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే గొడవలు రావు. కాని అదేదో సామెత చెప్పిన్నట్లు అన్ని ప్రాంతములు సమానముగా అభివ్రుద్ది చేసేవారే కనపడుటలేదు....అదే జరిగితే ప్రజలు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే హాయిగా ఉంటారు. వేరే చోటకి ఎందుకు వెళ్తారు?


సరే ఆఖరికి మా తెలుగు గాలి, మా తెలుగు మట్టి, మాతెలుగు తిండి, మాతెలుగు స్వర్గం అనుకుంటూ ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ ఏమి అడుగుతున్నారంటే మీది ప్రాంతము రాయలసీమనా, కోస్తానా, తెలంగాణానా, ఉత్తరాంధ్రానా............అని.

ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉంటుందో విడిపోతుందో నాకు తెలియదు గాని మనము ఇలా ఒకరినొకరు తిట్టుకోవటము చాలా భాధగా ఉందండి...ఇలా తిట్టుకోకుండా గౌరవముగా సమస్య సాల్వ్ అయ్యే మార్గమే లేదా......మిగతా రాష్ట్రముల వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారేమోనని.........


ఉద్యోగస్తులను దూరంగా ఎక్కడెక్కడికో బదిలీలు చేస్తూంటారు.

నాకు ఏమనిపిస్తుందంటేనండి ....... వారిని ఇతర రాష్ట్రాలు అలా బదిలీ చేయకుండా వారి సొంత జోను లోనే రకరకాల ఊళ్ళకి బదిలీలు చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది.

ఇలా ఒకే జోనులో స్థిరపడటం వల్ల మాది ఫలానా ప్రాంతం అని చెప్పుకోవటానికి ధైర్యంగా ఉంటుంది.

ఎందుకంటే , ఇలా ఉద్యోగాల పేరుతో ఊళ్ళు పట్టుకుని తిరగటం వల్ల ఎక్కడైనా ప్రాంతాల మధ్యన గొడవలు జరిగినప్పుడు ............ ఇలా ఊళ్ళు తిరిగే వారికి ............... వారిది ప్రాంతమని చెప్పుకోవాలో తెలియక దిక్కులు చూడవలసి వస్తుంది. వారికి, తాము ప్రాంతానికి చెందుతామో తెలియక అయోమయంగా ఉంటుంది.

నేను ఇలా రాస్తున్నందుకు నాకు విశాలహృదయం లేదనీ, నాది సంకుచిత మనస్తత్వమనీ అనుకుంటే నేనేమీ చెప్పలేనండి. ప్రపంచంలో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టే .........

అసలు ఎక్కడయినా స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకుంటే బాగుంటుంది కదా !

చాలామందికి తమ ప్రాంతంలోనే ఉద్యోగం చెయ్యాలని ఉన్నా బదిలీల వల్ల అలా చెయ్యలేక పోతున్నారు.

జననీ , జన్మభూమి ఎంతో గొప్పవని శ్రీ రాముల వారు చెప్పటం జరిగిందట..


No comments:

Post a Comment