koodali

Friday, March 25, 2011

రోగి ముఖాన్ని , ఇతర శారీరక లక్షణాలను గమనించీ,........... రోగాన్ని కచ్చితంగా చెప్పగలిగే వైద్యులు ...

 

రోజుల్లో వ్యాధులను కనుగొనటానికి స్కానింగ్ చేసే విధానాలు అవీ ఉపయోగిస్తున్నారు.

కానీ పూర్వం రోగి ముఖాన్ని పరిశీలించి , ఇతర శారీరక లక్షణాలను గమనించీ, రోగాన్ని కచ్చితంగా చెప్పగలిగే నైపుణ్యం గల వైద్యులు ఉండేవారట.

ఆయుర్వేదంలో అలాంటి విధానాలు ఉన్నాయట.

ఋగ్వేదమునకు ఉపవేదము...........ఆయుర్వేదము.

ఆయుర్వేదశాస్త్రము ప్రకారం నాడీనిదానము ప్రధానముగా ఉండేది. ............. ప్రకారము రకరకాల పధ్ధతుల ద్వారా వైద్యులు రోగాన్ని కచ్చితంగా కనుక్కుని తగిన వైద్యాన్ని చేసేవారట.

సనాతనవైద్యవిధానమే ప్రకృతి చికిత్సా విభాగము. ఇందులో కూడా చాలా పధ్ధతులున్నాయి.

ఎందరో విదేశీయులు కూడా వీటి గొప్పదనాన్ని గ్రహించి , పరిశోధించి తిరిగి మనకు అందించారట.

సూర్యుడు ఆరోగ్యప్రదాత. చంద్రుడు ఓషధులకు అధిపతి. సూర్యరశ్మిలో ఎండపెట్టిన వస్తువులు పురుగు పట్టకుండా చాలాకాలం నిలువ ఉంటాయని మనకు తెలిసిన విషయమే. .

మొక్కలు సూర్యుని నుంచి ఎంతో శక్తిని పొందుతాయి.

ఋషులు, అందరి ఆరోగ్యం కొరకు సూర్య నమస్కారములు, ఆదిత్య అర్చనలు,ఉపవాసములు ........ ఇవన్నీ ఆచారవ్యవహారాలుగా అందించారు.

దేహము, తన్ను తాను రోగాలబారినుండీ రక్షించుకునే .,శక్తివంతంగానే............ దైవం అన్ని జీవులను సృష్టించటం జరిగింది.

అయితే మనిషి అలాంటి సూర్యరశ్మికి, చంద్రునికి, స్వచ్చమైన గాలికి, సహజప్రకృతికి క్రమక్రమంగా దూరమవుతూ రోగాలు తెచ్చుకుంటున్నాడు.

ఇప్పుడు మనిషి యంత్రాలకు అలవాటుపడి క్రమంగా తన సెన్సిటివ్ నెస్ ను కోల్పోతున్నాడు.

పూర్వం వైద్యులు తమకు తెలిసిన విజ్ఞానం ద్వారా ముఖాన్ని పరీక్షించి రోగాన్ని కనుక్కొనే శక్తిని కలిగి ఉండేవారు.

ఇప్పుడు యంత్రాల సహాయం లేనిదే రోగి యొక్క రోగం ఏమిటన్నది సరిగ్గా చెప్పలేని పరిస్థితి.

అంటే మనిషి తెలివి రానురానూ పెరుగుతోందా ? తగ్గుతోందా ?

పూర్వం ఎన్ని లెక్కలయినా ఆలోచించి ఠకీమని చెప్పే మనిషి కాలిక్యులేటర్స్ వచ్చాక తన తెలివిని ఉపయోగించటం తగ్గించేశారు.

అలా యంత్రాలపైన అతిగా ఆధారపడటం వల్ల........... కొంతకాలానికి తన తెలివిని
,నిశితమైన పరిశీలనా శక్తిని కోల్పోయే అవకాశం ఉంది.


ఇక ఆయుర్వేద మందుల విషయానికి వస్తే ఆయుర్వేదంలో గొప్ప మందులున్నాయి.

మాకు తెలిసిన ఒకామె 70 సంవత్సరాల ఆమెకు లావుపాటి కళ్ళజోడు ఉండేది. ఆమె ( రాగి చెంబులో గోవు పంచితము పోసి తరువాత.......... ) మందు తయారు చేసి వాడటం ద్వారా......... ఇప్పుడు కళ్ళ జోడు లేకుండా చక్కగా చదవగలుగుతున్నారు.

అయితే ఇలాంటివి వైద్యుల పర్యవేక్షణలోనే చెయ్యాలి. లేకపోతే కళ్ళకు ప్రమాదం.

ఇంకొకరు మూత్రపిండాల వ్యాధి బాగా ముదిరిన వారు మందులకీ తగ్గక ఆఖరికి ఆయుర్వేదం వాడి ఇప్పుడు బాగా కోలుకుంటున్నారు.

ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, .......... రోజుల్లో మోసం చేసేవారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. కాబట్టి సరియైన నిపుణులైన వైద్యుల వద్దకే వెళ్ళాలి.


పాత కాలంలో వైద్యులు ........... ఎముకలు విరిగిన రోగి విషయంలో కూడా ఎక్కడ ఎంతమేరకు విరిగిందో .......... ఆయుర్వేద శాస్త్రీయ పధ్ధతుల ద్వారా కనుగొని చక్కటి చికిత్స చేసేవారట.


ఇప్పుడు యంత్రాల పైన ఆధారపడి అదే గొప్పగా భావిస్తున్నాం. యంత్రాల వాడకం వల్ల వచ్చే రేడియేషన్ కూడా శరీరానికి హాని కలిగిస్తుంది.

అదే పూర్వపు విధానంలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

మన అజ్ఞానం వల్ల ఇలాంటి ఎంతో విలువైన విషయాలు కలిగిన ప్రాచీన గ్రంధాలను మనం కోల్పోయాము............ ఇప్పటికయినా ఉన్న విలువైన విజ్ఞానాన్ని కాపాడుకోవటం మన కనీస ధర్మం..

నాకు ఇంకా ఏమనిపిస్తుందంటేనండి, రోజుల్లో, ప్రతి దానికీ రకరకాల రసాయనాలను వాడటం వల్ల .............. ఆయుర్వేద వైద్యంలో వాడే గోవు పంచితము, పసుపు , ఉసిరి ........... వంటి పదార్ధములు తమ సహజ లక్షణాలను , శక్తిని కోల్పోతున్నాయేమో అని.... .........


మనం వాడే గాఢమైన రసాయనిక మందులవల్ల పంటలు, నీరు, భూమి సారాన్ని కోల్పోయి
...తద్వారా మనమూ బలహీనులమయ్యే ప్రమాదముంది.

 

3 comments:

  1. అటువంటి వైద్యులు మీకు తెలిసినవారు వుంటే తెలుపగలరు?

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి.
    ఈ రోజుల్లో పాతకాలం వాళ్ళలా కూలంకషంగా ఆయుర్వేదం గురించి తెలిసినవాళ్ళు అంటే........... ఏమోనండి.......... అయితే కొందరి పేర్లు వినే ఉంటారు మీరు ఏల్చూరి నారాయణ రావు గారు. ఇంకా......... ఇలా............ఎందరో టి.వి లో ఆయుర్వేదం గురించి చెబుతున్నారు కదా ........ ఎందరో గొప్పవైద్యులు ఉంటారు. అందరి పేర్లు రాయలేకపోయినందుకు దయచేసి, వారు నన్ను క్షమించాలి. కొందరు గొప్ప వైద్యుల పేర్లు మనకు తెలియకపోవచ్చు కూడా.........

    ఈ టపాలో రాసిన కొన్ని విషయాలు "ఆరోగ్య సుధాకరము " అన్న పుస్తకము లోవి....... రచయిత.........డా ׀׀ వి.వి రామరాజు గారు. ( కాకినాడ ) . కొన్నేళ్ళ క్రితం మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు వీరు మాకు తెలిసినవాళ్ళింటికి వచ్చారండి. ఈ పుస్తకంలో " ముఖలక్షణములను బట్టి రోగం కనుక్కోవటం " గురించి వివరములు ఉన్నాయి. ఇంకా విదేశీయులు ఈ విషయం గురించి వ్రాసిన విషయాలు నెట్ లో చూడాలంటే ......"...Iris Diagnosis...".. "Iridology.".'.............. లో చూడవచ్చండి

    .ఈ టపాలో నేను వ్రాసిన కళ్ళజోడు తీసివేసిన ఉదాహరణ లో ఆమె హిందీ ఆమె. ఆస్థా టి.విలో రాందేవ్ బాబా గారు చెప్పే విషయాలు ఫాలో అవుతారు. నిజంగానే ఆయుర్వేద మందు వాడటం వల్ల కళ్ళజోడు అవసరం లేకుండా స్పష్టంగా పేపర్ చదవగలుగుతున్నారు. రెండో ఉదాహరణలో చెప్పిన వాళ్ళు కూడా కిడ్నీ పాడయ్యి , ఎన్నో హాస్పటల్స్ తిరిగి ఆయుర్వేద మందువల్ల ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే వారు వెళ్ళిన డాక్టర్ గారి పేరు నాకు తెలియదండి. ...

    ReplyDelete
  3. కృతజ్ఞతలండి.
    మీకు తెలిసిన వివరాలు తెలియజేశారు.

    నాకు తెలిసి, కీ.శే. డా. కోటేశ్వర రావు గారు (రాజమండ్రి) అటువంటివారు. అటువంటి వారు కొసం చూస్తున్నాను.
    బహుశ,అటువంటివారు ప్రచారాలకు దూరంగా ఉంటారు.
    భవిష్యత్ లొ అటువంటి వారు మీకు ఎవరైనా కలిస్తే/తెలిస్తే తెలుపగలరు.

    ReplyDelete