koodali

Wednesday, March 9, 2011

విజ్ఞానశాస్త్రం ద్వారా...............దైవాన్ని తెలుసుకోవటం............

"ఒక యోగి ఆత్మ కధ " గ్రంధంలోని కొన్ని విషయాలు .........

.భవిష్యత్ విజ్ఞాన శాస్త్రవేత్తలు,అసంఖ్యాకమైన దాని వివిధాకృతుల్లో ఏదో ఒక దాన్ని అన్వేషించడానికి మించి మరేమీ చెయ్యలేరు. ఆ విధంగా విజ్ఞానశాస్త్రం, చరమతత్వాన్ని చేరుకోలేక ఎప్పటికీ ప్రవాహస్థితిలోనే ఉండిపోతుంది.: నిజానికది , అప్పటికే సిధ్ధంగా ఉండి పని చేస్తున్న విశ్వానికి సంబంధించిన నియమాల్ని ఆవిష్కరించటానికి తగినదే కాని, నియమనిర్ణేతా ఏకైకసూత్రధారీ అయిన పరమాత్మను కనుక్కోడానికి అశక్తమయినది. గురుత్వాకర్షణ, విద్యుత్తుల ఘనమైన అభివ్యక్తులైతే తెలియవచ్చాయి కానీ అసలు గురుత్వాకర్షణ, విద్యుత్తు అన్నవి ఏమిటో ఏ మర్త్యుడూ ఎరగడు..


ఇంకొక దగ్గర...........
' ద మిస్టీరియస్ యూనివర్స్ * ( అంతుబట్టని విశ్వం ) అన్న గ్రంధంలో సర్ జేమ్స్ జీన్స్, " జ్ఞాన ప్రవాహం, యాంత్రికం కాని వాస్తవం వేపు ప్రయాణిస్తోంది: ఇప్పుడు విశ్వం, ఒక గొప్ప యంత్రంలా కాక, ఒక గొప్ప భావనలా గోచరించడం మొదలవుతోంది," అని రాశాడు. ..


ఈ విధంగా ఇరవయ్యో శతాబ్ది విజ్ఞానశాస్త్రం, అనాది వేదపాఠంలా ధ్వనిస్తోంది.
.

కనక, భౌతిక విశ్వమనేది ఏదీ లేదనీ, 'మాయే' దాని పడుగుపేకలనీ తెలిపే దార్శనిక సత్యాన్ని మానవుడు, విజ్ఞానశాస్త్రం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటే అలాగే తెల్సుకోనివ్వండి.

ఇంకొక దగ్గర...........

మానవుడి జాగృతిలో మెట్లుమెట్లుగా, ఈశ్వరుడు తన సృష్టిలోని రహస్యాల్ని, సరైన సమయంలో, సరైనచోట ఆవిష్కరించడానికి విజ్ఞానశాస్త్రవేత్తల్ని ఉత్తేజపరుస్తూ ఉంటాడు. ఈ విశ్వాన్ని, దైవప్రజ్ఞతో సంచాలితమయ్యే కాంతి అనే ఏకైక శక్తికి వివిధ రూపాల అభివ్యక్తిగా గ్రహించడానికి అనేక ఆధునిక ఆవిష్కరణలు మానవుడికి తోడ్పడతాయి. చలనచిత్రం, రేడియా, టెలివిజన్, రేడార్, కాంతివిద్యుద్ఘటం (ఫొటో ఎలక్ట్రిక్ సెల్ ).ఆశ్చర్యకరమైన " విద్యున్నేత్రం" ( ఎలక్ట్రిక్ ఐ ),పరమాణు శక్తులు అనే అధ్బుతాలన్నీ కాంతికున్న విద్యుతయస్కాంత దృగ్విషయం మీద ఆధారపడ్డవే..



సినిమా బొమ్మలు వాస్తవాలుగా కనిపించినప్పటికీ, అవి కేవలం వెలుగు నీడల కలయికలు మాత్రం అయినట్టు విశ్వసంబంధమైన రూపాలు కూడా వాస్తవికతా భ్రాంతి కలిగిస్తాయి. అసంఖ్యాక జీవరాశులు గల గ్రహగోళాలు, ఒకానొక విశ్వచలనచిత్రంలోని ఆకృతులే తప్ప మరేమీ కావు. మానవుడి జ్ఞానేంద్రియా లైదింటికీ తాత్కాలికంగా నిజమనిపించే ఈ అనిత్య దృశ్యాలు, మానవచైతన్యమనే తెరమీద ,అనంత సృజనాత్మక కిరణం ప్రసరింపజేసినవే.



సినిమా ప్రేక్షకుడు తల పైకి ఎత్తి ,తెరమీది బొమ్మలన్నీ నిరాకారమైన ఒక కాంతికిరణం ద్వారానే కనిపిస్తున్నట్టు చూడవచ్చు. వన్నెవన్నెల జగన్నాటకం కూడా అదేమాదిరిగా, ఒక విశ్వ మూలం తాలూకు ఏకైక శ్వేతకాంతి నుంచే వెలువడుతోంది. దేవుడు తన పిల్లల కోసం, అనూహ్యమైన చాతుర్యంతో తన గ్రహ ప్రదర్శన శాలలో " అధికతమ బ్రహ్మాండ "వినోదాన్ని ప్రదర్శిస్తున్నాడు : వాళ్ళనే నటీనటుల్నీ ప్రేక్షకుల్నీ చేస్తున్నాడు..


నాకు ఏమని అనిపిస్తుంది అంటే ..... ఆధునిక విజ్ఞానం వల్ల ప్రాచీన గ్రంధాలలో చెప్పబడిన విజ్ఞానం నిజమని క్రమంగా నిరూపించబడుతోంది. ఉదా.....పసుపు, వేప వల్ల లాభాలు ఈ నాటి శాస్త్రవేత్తలు కనిపెట్టిన తర్వాతే కదా గట్టిగా నమ్ముతున్నారు. ఇలా ఎన్నో నిరూపించబడ్డాయి.

ఆటంబాంబులు కనిపెట్టడం వల్ల కూడా పరోక్షంగా లాభం జరిగింది. ఎలాగంటే ఆ అణు బాంబుల భయంతో ప్రజలు దైవాన్ని నమ్ముకుని పూజలు చేస్తున్నారు కదా.....

ఈ నాటి శాస్త్రవేత్తలలో ఎందరో దైవభక్తులు ఉన్నారు.

అయితే కొద్దిమంది ఇతరులు మాత్రం తాము తెలుసుకొన్న విజ్ఞానాన్ని చూసి , తాము విశ్వం గురించి అంతా తెలుసుకున్నాము........ఇక దైవం అంటూ ఎవరూ లేరు అంటూ పిడివాదం చేస్తారు.

ఇంకా, తమకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో తమకు విశ్వరహస్యాలన్నీ తెలిసిపోయాయని భావించి అసలు దేవుడు ఎక్కడున్నాడు ? ఉంటే చూపించండి ? అని మాట్లాడటం ....ఇవన్నీ హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయటం లాంటివి. అది చాలా తప్పు.


ఈ అనంత విశ్వంలో అతి చిన్నవారైన మానవులకే ఇన్ని ఆలోచనలు, తెలివితేటలు ఉన్నప్పుడు ఈ అనంత విశ్వానికి మూలంగా భావిస్తున్న ఆ మహా శక్తికి మన ఊహకు కూడా అందని ఎన్నో ఆలోచనలు తెలివితేటలు తప్పకుండా ఉంటాయి కదా...

తాను సృష్టించిన మానవునికే ఇన్నితెలివితేటలను ఇచ్చిన ఆ శక్తి తనకు తెలివితేటలు లేకుండా ఉంటుందని భావించటం ఎంత హాస్యాస్పదం.........

ఈ భూమి మీద ఉన్న ........ రహస్యాలను తెలుసుకోవటానికే మనిషికి అసాధ్యం. ఇంకా లెక్కపెట్టలేనన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, బ్రహ్మాండాలు కలిగిన అనంత విశ్వం యొక్క రహస్యాలు తెలుసుకోవటం అంతకంటే అసాధ్యం.

వాటి గురించి అంతగా ఆలోచించటం బదులు ......... ఈ భూమిమీదనే పరిష్కరించవలసిన సమస్యలు మనకు చాలా ఉన్నాయి కదా అని ..

No comments:

Post a Comment