koodali

Monday, March 7, 2011

కొన్ని విషయాలలో అనుకున్నదొకటి.........అవుతున్నదొకటి.


ఆధునిక విజ్ఞానం వల్ల లాభాలు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటారు. అదే సమయంలో నష్టాలను కూడా విస్మరించకూడదు కదా !

నేనూ ఒకప్పుడు ఆధునికవిజ్ఞానాన్ని బాగా అభిమానించిన వ్యక్తినే.

అయితే దీనివల్ల వస్తున్న వ్యతిరేకఫలితాలు చూస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని భావించటం తప్పు కాదు కదండి.

ఈ విజ్ఞానం వల్ల కష్టమైన పనులు చేసిపెట్టే యంత్రాలు అందుబాటులోకి రావటం, పరిమితంగా వాడే వాహనాల వల్ల ఉపయోగాలు, ఎవరైనా వ్యక్తులు భూకంపాలు లాంటి ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు కనిపెట్టే పరికరాలు అందుబాటులోకి రావటం, వైద్యరంగంలో కొన్ని లాభాలు ఇలా .... ఈ విజ్ఞానం వల్ల కొన్ని లాభాలు పొందుతున్న మాట నిజమే.


అదే సమయంలో కొన్ని పరిశోధనల వల్ల ప్రపంచానికి జరిగిన నష్టాలను కూడా పరిశీలించాలి.


అణుశక్తి, ప్లాస్టిక్ ఇలాంటివి కనుగొనటం వల్ల ........ వాటివల్ల పొందుతున్న లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల .......... అవన్నీ భూమిలో కలిసిపోయి భూమి , నీరు విషపూరితం అవటం, ఇంకా, ............ వాయు కాలుష్యం ,...........నదులలో , సముద్రాలలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్ధాలు ఇవన్నీ ఇప్పుడు అందరికీ తెలిసిన విషయాలే.

ఆ మధ్య చమురు ప్రమాదవశాత్తూ సముద్రంలో ఒలికిపోయినప్పుడు ఆ చమురు తెట్టు సముద్రంలో చాలా దూరం వ్యాపించి అందులోని మూగజీవులు అందులో చిక్కుకుపోయాయి.

వాటి ఒళ్ళంతా చమురు తెట్టుతో నిండి కళ్ళు కూడా కనిపించక విలవిల్లాడటం మీడియాలో చూసి చెప్పలేనంత బాధను కలిగించింది.

మానవుల అంతులేని కోరికలకోసం ఇలా మూగజీవులను కష్టపెట్టే అధికారం ఎవరిచ్చారు ?

అన్ని దేశాలు కుప్పలుగా ప్రోగుచేసుకుంటూన్న ఆయుధాలు ఆధునిక విజ్ఞానం అందించిన ఆపదలే.

వాటి గురించి పేదదేశాలు కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తోంది. మరి ప్రక్క దేశాలు ఆయుధాలు ప్రోగుచేస్తోంటే ఎవరైనా తప్పక కొనాలిగదా !

మనకి ఇష్టం లేకపోయినా ......... పేదవారికి తిండి కూడా లేకపోయినా రక్షణ కొరకు అవి కొనాలిగదా .......... అంతే కాదు వాటితో ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయమే.....


ఇప్పుడు ప్రపంచ ఇంధన కొరతను తీర్చడం కొరకు. .చంద్రునిపైన హీలియం కొరకు ప్రయత్నిస్తున్నారు .

మనకు దాని గురించి పూర్తి విషయాలు తెలియవు. దాని వినియోగం పెరిగాకా కొన్ని సంవత్సరాలు గడిచాక అప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ అనుభవంలోకి వస్తాయి.


అప్పుడు పరిస్థితి చెయ్యి దాటి పోతుంది. అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం ?

ఇప్పుడు చూడండి....అణువ్యర్ధాలను, ప్లాస్టిక్ వ్యర్ధాలను, " E " ......వ్యర్ధాలను వదిలించుకోవటానికి వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు.


ఇంకా, వేగంగా ఖాళీ అవుతూన్న ఖనిజ సంపదకు , పర్యావరణం కలుషితమవటానికి , గ్లోబల్ వార్మింగ్ కు ఎవరు బాధ్యత వహిస్తారు ?

ఈ ఆధునిక విజ్ఞానం వల్ల జరుగుతున్న వినాశనం వల్ల మానవులు, ఇతర జీవులు పడుతున్న బాధలకు ఎవరు జవాబు చెబుతారు ?

ఈ ఆధునిక విజ్ఞానంతో ఏదైనాసరే ......... సాధించగలం అనుకోవటం పెద్ద భ్రమ.

గొప్ప సూర్య తుఫానులు వచ్చి శాటిలైట్ వ్యవస్థలు నాశనం అవటం , గ్రహశకలాలు భూమిని ఢీ కొనడం ........... ఇలాంటి వాటి విషయంలో .............. దైవమనే మహాశక్తిని నమ్ముకోవటం తప్ప....... ఎవరు మాత్రం ఏం చేయగలరు ?


ముందుముందు వస్తుందంటున్న టెక్నాలజీ విషయంలో కూడా ఎంతో ఆలోచించాలి శాస్త్రవేత్తలు . వారు దానివల్ల జరిగే మంచి గురించే ఆలోచిస్తారు.


కానీ ఆ టెక్నాలజీ వినాశకర వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రపంచానికి కలిగే లాభాలకన్నా నష్టాలే ఎక్కువ.

మనవల్ల ప్రపంచానికి మంచి జరగకపోయినా ఫరవాలేదు...........చెడు జరగకుండా ఉంటే చాలు.......

* ఈ విశ్వాన్నే సృష్టించిన దైవం ......... గొప్ప శాస్త్రవేత్త,......... సైంటిస్టులకే ..... సైంటిస్ట్...... వారు.

ఆ ఆదిగురువు....... ఈ నాటి శాస్త్రవేత్తలకు పొరపాట్లు లేని మంచి ఆలోచనలను కలిగించాలని, ఆ విధంగా వారు .......... ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీని కనుగొనాలని కోరుకొందాము.

 

7 comments:

  1. ప్రతీ వస్తువు లోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. వేటిని తీసుకోవాలీ అనేది తీసుకునే వాళ్ళ విజ్ఞత బట్టి ఉంటుంది. ఆ విజ్ఞత ని పెంపొందించటానికి చూడాలి కానీ అసలు కొత్త సంగతులు కోసం పరిశోధనలు చెయ్యటం మంచిదికాదు అనటం భావ్యం కాదేమో అని అనిపిస్తుంది.

    మన పురాణాల్లో ఒక కధ ఉంది నాకు సరిగ్గా గుర్తు లేదు. సముద్రాన్ని చిలుకుతుంటే వరుసాగ్గా విషము, అమృతము వస్తాయి. విషము వచ్చిందని ఆపేస్తే అమృతము వచ్చేది కాదు గదా.

    ReplyDelete
  2. .కృతజ్ఞతలండి.
    మీరు సరిగ్గానే చెప్పారు. కొత్త సంగతులను కనుక్కోకూడదని నా అభిప్రాయం కాదండి. ఈ టపా పోస్ట్ చేసాక ఆలోచించి మళ్ళీ కొంచెం విషయం కలపటం జరిగింది లాస్ట్ లో..........

    ఇంకో విషయం చెప్పాలండి. సరిగ్గా మీరు చెప్పినట్లే .......క్షీరసాగరమధనం జరిగినప్పుడు, విషం రావటం , ఆ తరువాత అమృతం రావటం విషయం......... టపాలో రాద్దామనుకున్నానండి నేను. అయితే వ్రాయటం మరిచిపోయాను. గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలండి.

    అదేమిటో చాలాసార్లు టపా పోస్ట్ చేసాక మళ్ళీ మార్పులు, చేర్పులు చేయవలసి వస్తుంది నాకు ........

    ఇలాంటప్పుడు నాకు ఏమనిపిస్తుందంటేనండి ఈ టపాలో తప్పులు రాస్తే మళ్ళీ సరిదిద్దుకోవటానికి చక్కగా అవకాశం ఉంది. అదే జీవితంలో తప్పు చేస్తే అంత అవకాశం ఉండదు కదా అని.

    ఉదా. ఎవరైనా పొరపాటున కారు యాక్సిడెంట్ చేసారనుకోండి సరిదిద్దుకునే అవకాశం ఉండచ్చు,........ ఉండకపోవచ్చు కదా........

    ReplyDelete
  3. నాకు ఇంకో విషయం గుర్తు వచ్చిందండి.......... అమృతం కొరకు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో విషం వచ్చింది కదా.........
    అప్పుడు లోక రక్షణార్ధం , పరమేశ్వరుడు ఆ విషాన్ని స్వీకరించటానికి పార్వతీదేవి కూడా ఒప్పుకోవటం జరిగింది. అలా వారి దయ వల్ల , ఆ విషం వల్ల లోకానికి ఏ ఇబ్బందీ కలుగలేదు అని..

    ReplyDelete
  4. క్షీరసాగరమధనం గురించే మాట్లాదక్కర్లేదు. మన ఇంట్లోనే కొన్ని పనులు చేద్దమనుకున్టాము. కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు. చేద్దామనుకున్న పని చేస్తాము. ఇష్టం లేని వాళ్ళు అయిష్టం గానే దాన్ని తీసుకుంటారు. ఒకప్పుడు మనకే నచ్చాడు కానీ ఆ అయిష్టాన్ని మనమే దిగమింగుకుని కూర్చుంటాము.

    మందులు తయ్యారు చేసే కంపెనీలు మందులు తయ్యారు చేస్తారు. అవి బయట అమ్మటానికి మొదట జంతువుల మీద ప్రయోగించి చూస్తారు. అది సక్సెస్ అయితే మనుషుల మీద ప్రయోగించి అది సక్సెస్ అయితే అప్పుడు అమ్మకానికి బయటకోస్తుంది.
    దీనిలో సక్సెస్ అంటే నూటికి 80 మంది బాగుపడితే చాలు. అంటే 20 మందికి అది నష్టమే కదా. అందుకని మందులు కనిపెట్టకుండా, వాడకుండా ఆపుతామా?

    ఇంతకీ చెప్పొచ్చే దేమంటే కొత్త సంగతులు కోసం పరిశోధనలు చెయ్యటం మంచిదికాదు అనటం భావ్యం కాదేమో అని.

    ReplyDelete
  5. కృతజ్ఞతలండి.
    నేనేమీ క్రొత్త ప్రయోగాలు చెయ్యవద్దనటం లేదండి. .నా అభిప్రాయం ఏమిటంటేనండి, కొత్త పరిశోధనల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వీలయినంత తక్కువగా ఉండాలని.........

    *.అంటే ఎకోఫ్రెండ్లీ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనుగొనాలనీ టపా ఆఖరులో రాశానండి.......

    ఈ నాటి ఆధునికవిజ్ఞానం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా...........

    అదే ప్రాచీన విజ్ఞానం వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి కావు.
    ఇంగ్లీష్ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ .......... ఆయుర్వేద , హోమియో మందుల వల్ల ఉండవు.

    అలాగే వేప ,పసుపు ............... పంటలకు, వంటలకు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు ఉండవు. ............... అదే రసాయనిక ఎరువుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూనే ఉన్నాము కదండి.

    తామరాకులను, మర్రి ఆకులను పొట్లాలు కట్టడానికి ఉపయోగించటం మంచిది... ప్లాస్టిక్ మంచిదికాదు.....ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయి కదండి............

    .పూర్వం పర్యావరణం ఇంతగా కలుషితం అవలేదు కదండి.. నా బాధ అది.........

    ReplyDelete
  6. నేనేమీ క్రొత్త ప్రయోగాలు చెయ్యవద్దనటం లేదండి. .నా అభిప్రాయం ఏమిటంటేనండి, కొత్త పరిశోధనల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వీలయినంత తక్కువగా ఉండాలని.........
    -----
    మనము అందరమూ ఒప్పుకుంటాము దానికి.

    ReplyDelete
  7. సోలార్ పవర్ వినియోగం గురించి పరిశోధనలు జరగటం అందరికి సంతోషాన్ని కలిగించే విషయం. పెట్రోఇంధనపు వనరులు వేగంగా తగ్గిపోతుండటం వల్ల గానీ, పొల్యూషన్ పెరగటం గానీ కారణమేదైనా ఇంధన అవసరాల కొరకు సోలార్ పవర్ ఉపయోగించటం గురించి గట్టిగా పయత్నిస్తున్నారు కదండి. అన్ని రంగాలలోనూ ఇలా ఎకోఫ్రెండ్లీ టెక్నాలజీ వస్తే బాగుంటుందండి.....

    ReplyDelete