koodali

Tuesday, January 16, 2018

ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది....



మానవ శరీరంలో ఆక్సిజన్ (65%), కార్బన్ (18% ), హైడ్రోజన్ (10% )నైట్రోజన్ ( 3% ) కాల్షియం ( 1.5 % ),ఫాస్ఫరస్ ( 1.0% ) ,పొటాషియం, సోడియం............ఇలా ఇంకా కొన్ని ఉంటాయట. వీటన్నిటితో శరీరం తయారవుతుందట.

విశ్వం అంతా కూడా ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. . ఇది అంతా బౌతికశాస్త్రం...... అంతే కానీ, దైవం అనిఎవరూ లేరు అంటారు కొందరు భౌతికవాదులు.

శరీరం ఆక్సిజన్, హైడ్రోజన్ వీటితో తయారయ్యే మాట నిజమే అయినా.........ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది, ఎన్నో భావాలను కలిగి ఉంటుంది.

అలాగే,  ఈ విశ్వం ఆవిర్భావానికి మూలకారణమైన ఆ మూలశక్తి ( ఆ ఆదిశక్తి ) మనిషి కన్నా...ఎంతోఊహాతీతమైన శక్తి గల పరమశక్తి అని ఆస్తికులు నమ్ముతారు. ఆ శక్తినే వారు దైవంగా భావిస్తారు.

* కొన్ని ఎలిమెంట్స్ తో తయారయిన మానవులే ఎంతో ఆలోచనా శక్తిని కలిగి ఉన్నప్పుడు , అనంత విశ్వాన్ని , అందులోని అన్ని తత్వాలను తనలో కలిగి ఉన్న ఆ ఆదిపరమశక్తికి అనంతమైన ఆలోచనా శక్తి ఉంటుంది.


అందువల్లే ఈ సృష్టి అంతా ఒక పద్దతి ప్రకారం తయారు కాబడింది.
 

సృష్టిలో చూడండి ...... ఏది ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఏర్పడి ఉంది.

అంటే ....... ఒక పక్షి గాలిలో ఎగరాలంటే దానికి
ఎలాంటి శరీర నిర్మాణం ఉండాలో అలాగే ఉంది.


ఒక చేప నీటిలో ఈదాలంటే తోక, మొప్పలు ఎలా ఉండాలో అలాగే దాని శరీర నిర్మాణం ఏర్పాటు చేయబడి ఉంది.


మొక్కలు సూర్యరశ్మి నుంచి పత్రహరితం తయారుచేసుకోవటం ......ఇవన్నీ ఎంతో పద్దతిగా ఏర్పడి ఉన్నాయి .


పెద్దచేపకు ఆహారంగా చిన్నచేపలు... వాటికి ఆహారంగా, చిన్న ప్రాణులు, వాటికి ఆహారంగా ఆల్గే వంటివిఇలా............ ఒక పద్దతి ప్రకారం అద్భుతంగా సృష్టి రచన సాగిపోవటం చూస్తూనే ఉన్నాము.

కొందరు దేవుడు ఉంటే చూపించండి అంటారు. గాలిని మనం చూడగలమా ? కేవలం ఫీలవుతాము అంతే.


శాస్త్రవేత్తలు విటమిన్స్ గురించి చెబుతారు. అవి ఉన్నాయన్నదీ నిజమే.....A,B,C,D.. .విటమిన్స్... ..వీటిని చూడాలంటే కుదురుతుందా ?


ఒక వ్యక్తి ఉన్నాడు . అతనికి ఎందుకో మామిడిపండు అంటే ఇష్టం లేక పుట్టినతరువాత ఎప్పుడూతినలేదు. 


 దాని రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదు.

ఆ వ్యక్తి మామిడిపండును తింటున్న తన స్నేహితునితో ఇలా అంటున్నాడు.

"మామిడిపండు రుచి ఎలా ఉంటుంది " ?

" తియ్యగా ఉంటుంది. "

"తియ్యగా అంటే పంచదార లాంటి తీపి రుచా ? లేక పనస పండు లాంటి తీపి రుచా " ?

" రెండూ కాదు. పంచదార తీపి రుచి వేరు, పనసపండు తీపి రుచి వేరు, మామిడి పండు తీపి రుచివేరు. "

"అంటే ఎలాంటి తీపి " ?

"ఎలాంటి తీపి అంటే . అలా చెప్పటానికి కుదరదు. నువ్వు కూడా మామిడి పండు తింటేనే ఆ రుచి నీకుసరిగ్గా తెలుస్తుంది."

అలాగే దైవాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవాలనుకొనేవాళ్ళు .......... వాళ్ళు కూడా ఆ మార్గంలో పద్దతిగా ప్రయత్నిస్తే కానీ దైవాన్ని తెలుసుకోవటం కుదరదు.

శరీరం రకరకాల ఎలిమెంట్స్ తో తయారయింది నిజమే కానీ............ అందులో ప్రాణం, చైతన్యం, బుద్ధి , మనసుఇవన్నీ ఎలా ప్రవేశించాయో మనకు తెలియదు.

ప్రాణం శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో ? ఎలా నిష్క్రమిస్తుందో ?

కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే  బాహ్యేంద్రియాల శక్తి సరిపోదని ,  అంతఃకరణ ద్వారా మాత్రమే తెలుసుకోగలమని పెద్దలు చెబుతున్నారు .

ప్రాచీనులు కొందరు, తపస్సు వంటి వాటి ద్వారా జీవుల పుట్టుకకుముందు, మరణానికి తరువాత జరిగేఎన్నో విశేషాల గురించి , ఇతరలోకాల గురించి ప్రాచీన గ్రంధాల ద్వారా తెలియజేసారు............ వాటి గురించి తెలుసుకునేంతస్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.

........................

పూర్వం కొందరు తల్లులు పిండాలను కుండలలో ఉంచి పెంచారు.. అని ప్రాచీన గ్రంధాలలో చదివి  వెక్కిరించిన వారే ............. .నేడు టెస్ట్ ట్యూబుల లో పిండాలను పెంచడాన్ని చూస్తున్నారు.

పూర్వం అభిమన్యుడు, ప్రహ్లాదుడు వంటి వారు తల్లుల గర్భంలో ఉన్నప్పుడే ఎన్నోవిషయాలు  నేర్చుకున్నారని చదివి వెక్కిరించిన వారే ....................... నేడు విదేశాల్లో కడుపుతోఉన్న తల్లులు కొందరు,  పుట్టబోయే పిల్లల కొరకు క్లాస్ లకు వెళ్ళి పాఠాలు వినటాన్ని చూస్తున్నారు.

అందుకని నా అభిప్రాయం ఏమిటంటేనండి, మనకు తెలియని విషయాలన్నీ అభూత కల్పనలు అనటం సబబు కాదు.

ఈ భూమిపై మనకన్నా ముందు,  మనకన్నా ఎంతో గొప్ప నాగరికత కలిగి ,ఎంతో గొప్పవిజ్ఞానవంతులైన మానవులు నడయాడారేమో ?ఎవరికి తెలుసు ?

కొన్నికారణాల వల్ల ఆ నాగరికత అంతర్ధానమై ఉండవచ్చు గదా!

విశ్వం పుట్టిన ఇన్ని కోట్ల సంవత్సరాల్లో .. గత 200 సంవత్సరాల్లో పుట్టిన మానవులే గొప్పవాళ్ళు . ఈఆధునిక విజ్ఞానమే గొప్పది ..అనుకోవటం తప్పు.

...................................................................

.
ఈ టపా రాసాక నాకు ఒక ఆలోచన వచ్చిందండి. రమణ మహర్షి గారు చెప్పినట్లు....... అసలు నేను అంటేఏమిటి ? అని.


 ఆక్సిజన్ వీటితో కూడిన శరీరమా ? లేక మనసా ? లేక ? నేను అంటే అసలు ఏమిటి ? ఏమో.........

అంతా దైవం దయ ....

**********

(Friday, June 10, 2011

ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది.)

 

.

Monday, January 15, 2018

అందరికి శుభాకాంక్షలు....మరి కొన్ని సంగతులు..

.
 సంక్రాంతి  పర్వదినములలో  సూర్యారాధనకు  ఎంతో  ప్రాధాన్యత  ఉన్నది. 

 సూర్యుడు  ఆరోగ్యప్రదాత. సూర్యరశ్మి వల్ల  చక్కటి  ఆరోగ్యం  చేకూరుతుంది. 

సంక్రాంతి పర్వదినముల సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి .
 
************************
ఈ పోస్టులో క్రింద వ్రాసిన విషయాలు చాలాకాలం తరువాత ఇక్కడ వేసాను.

ఇక్కడ పోస్ట్ చాలా స్థలం ఉందని , ఇంకో టాపిక్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ వ్రాయటం జరిగింది. 
 
 
 .......................

  * స్త్రీల సమస్యల పరిష్కారం కొరకు మాట్లాడటం మంచిది కాని, స్త్రీలు కొన్ని దుస్తులే వేసుకోవాలనే దానికి సపోర్ట్ చేసి అదేపనిగా మాట్లాడటం వల్ల స్త్రీలకు, సమాజానికి ఏం లాభం?
............................

* స్త్రీల వస్త్రధారణ గురించిన విషయం గురించి ఈ మధ్య ఒకరు ఏమన్నారంటే, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో స్త్రీలు నగ్నంగా తిరిగినా కూడా,  అక్కడ అత్యాచారాలు జరగటం లేదని, తనకు బాగా తెలిసినట్లు చెప్పారు. 
 
అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? సమాజంలో అందరికి పైకి తెలియని విషయాలు కూడా ఉంటాయి.

అయితే, దుస్తులు చక్కగా వేసుకోవటం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని వారి అభిప్రాయమా ఏమిటో?

దుస్తులు సరిగ్గా వేసుకుంటే మంచిదే కదా..

 ...............................
 
* ఇంకా ఏమన్నారంటే,  
 కొన్ని దేవాలయాలలో కొన్ని స్త్రీ ప్రతిమలు చాతీ భాగం కప్పుకోకుండానే ఉంటాయి. అలాగని అవి చూసి వచ్చిన వాళ్లు ఉద్రేకపడి బయటకు వచ్చి అత్యాచారాలు చేస్తున్నారా....అన్నట్లు మాట్లాడారు.  వాళ్ళ మాటలు వాళ్లు అన్నదన్నట్లు నేను రాయలేదు కానీ, అలా అన్నారు.
 

తల్లి యొక్క చీర పమిట గాలికి పక్కకు తొలగితే చూసిన మగపిల్లలు తప్పుగా అనుకోరు. వారిలో ఎలాంటి చెడుభావనలు కలగవు. దేవాలయంలో దేవతామూర్తులను చూసినా చెడుభావనలు కలగవు.

 గర్ల్ ఫ్రెండ్ లేక వేరే స్త్రీ యొక్క దుస్తులు పక్కకు తొలగితే, కొందరు మగవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉండే అవకాశం ఉంది.
..............................

 చాలా దేవతామూర్తులకు చీర పమిటతో వస్త్రధారణ ఉంటుంది. కొంతమంది స్త్రీలు తలపైనుంచి కప్పుతూ ఉత్తరీయాన్ని ధరించేవారట.

చాతీభాగాన్ని కప్పుతూ ఉండే దుస్తులను స్థనపట్ట, కంచుకి అనేవారట.

 పాతకాలంలో చాలామంది స్త్రీలు చాతీభాగాన్ని వస్త్రంతో చుట్టుకునేవారట. కొందరు అలా చేయకున్నా కూడా, పమిటను భుజాల చుట్టూ కప్పుకునే పద్ధతి ఉండేది. 

దేశంలో ఇప్పటికీ అనేక విధాలైన వస్త్రధారణ, చీరలోనే అనేక పద్ధతులు ఉన్నాయి. పంజాబి డ్రెస్ ఉంది. 

కొన్ని దేవతామూర్తులను, యక్షిణుల?  చిత్రాలను అలా ఎందుకు చెక్కారో..వాటిని ఎవరు అలా చెక్కారో.. అనేక కారణాలుండవచ్చు. అవన్నీ మనకు అందరికి సరిగ్గా తెలియదు..(దేవతలకు మనుషుల్లా శరీరాలుంటాయా?) 

 ఈ విగ్రహాల విషయంలో మనకు ఇంకా అర్ధంకాని విషయాలెన్నో ఉంటాయి.
 ..................

కొన్ని విదేశాలలో కూడా మగవారి శిల్పాలు నగ్నంగా ఉన్నాయి. అందుకు అర్ధం.. అక్కడ పురుషులు నగ్నంగా ఉంటారని కాదు. ఎందుకో అలా కొన్ని శిల్పాలున్నాయి.

 నాకు తెలిసినంతలో 1200.. ఆ కాలంలో కూడా  భారతదేశానికి విదేశీయులు రావటం, ఇక్కడ వారి ప్రభావం కూడా ఉందని చదివాను..

అంతకుముందు కూడా యవనులు, ఇంకా కొందరు..భారతదేశానికి వచ్చారట. అప్పట్లో వారి ప్రభావం కూడా దేశంలో ఉంది. విదేశీప్రభావం అనేక విషయాల పై
నున్నదని చదివాను.

 ************************
* స్త్రీల వస్త్రధారణ గురించిన విషయం గురించి మాట్లాడుతూ కామెంట్లు చేసిన వాళ్లు ...ఖజురాహో శిల్పాల గురించి కూడా ఏదేదో అన్నారు......
 
నా అభిప్రాయాల ప్రకారం,  ఖజురాహో వంటి దేవాలయాలు దేశంలో ప్రతిచోటా లేవు. అవి అప్పట్లో శృంగార విషయాల గురించి ప్రజలకు తెలియటానికి, కొత్తగా వివాహమైన వారు వెళ్ళి చూసి రావటానికి, అలా అతికొద్దిగా మాత్రమే ఉన్నాయి.
 
వాటిలో కొన్ని శిల్పాలు అభ్యంతకరంగా ఉంటే..

కొన్ని 
తప్పులు చేసేవాళ్లు పాతకాలంలోనూ కొందరు ఉంటారు, ఇప్పుడూ ఉంటారు. 

ఆ రోజుల్లో అలా శిల్పాలను చెక్కమని అప్పటి రాజులు చెప్పారేమో? శిల్పాలను అలా చెక్కటం వెనుక ఎన్ని ఆలోచనలు ఉన్నాయో?  

  ******************
 * దేశం ఎంతోకాలం విదేశీపాలనలో ఉంది. విదేశీయుల ప్రభావం దేశంపైన ఉన్నది. విదేశీదాడుల తరువాత స్త్రీలను బయటకు రానివ్వని పద్ధతులు వచ్చాయని  అంటారు.
********************* 

స్త్రీలలో కొందరు శరీరభాగాలు కనబడకుండా దుస్తులు వేసుకుంటారు. కొందరు శరీరభాగాలు కనబడినా ఫరవాలేదనే విధంగా దుస్తులు వేసుకుంటారు. స్త్రీలలోనూ, పురుషులలోనూ రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు.

మగవాళ్లలో కొందరు చెడ్దవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళుంటారు. స్త్రీలలో  కొందరు చెడ్డవాళ్లు, నేరాలు చేసేవాళ్ళుంటారు.

కుటుంబాలలో, సమాజంలోను సాటి స్త్రీలను ఏడిపించేవారుంటారు. 
 
* శ్రీరామునిపై 
మోజుపడి,  సీతాపహరణ విషయంలో రావణాసురుని ప్రోత్సహించిన శూర్పణఖ స్త్రీయే.
 
  మగవాళ్లు మంచిగా ఉండాలని చాలామంది అంటారు. మగవాళ్ళు అయినా ఆడవాళ్లు అయినా మంచిగానే ఉండాలి. 

ఎవరైనా చిన్నప్పుడు అమాయకమైన వాళ్లే. తరువాత ఎన్నో కారణాల వల్ల రకరకాలుగా మారతారు.

 సమాజంలో ఇంటిపరిస్థితులు, పరిసరాలలోని వ్యక్తుల ప్రభావం,  జీవితంలో ఎదురైన సంఘటనలు,  నేర్చుకున్న విషయాలు, సోషల్ మీడియా నుంచి విన్నవి, చూసినవి..ఇలా ఎన్నో కారణాలు ప్రవర్తన పై ప్రభావాన్ని చూపిస్తాయి. 

* అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఒకరినొకరు గౌరవించాలని చిన్నతనం నుంచి ఇంటా బయటా నేర్పించాలి.

*************************
 
ఈ రోజుల్లో సెల్ఫోన్లు వచ్చాక అందరికి చాలా విషయాలను బాగా చూడటానికి వీలు కలిగింది.అందువల్ల, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 ....................

స్త్రీలపట్ల అత్యాచారాలు జరగకూడదు. మద్యపానము, మత్తుమందుల వాడకం, అసభ్యకర, అశ్లీలత ఉండే చిత్రాలు, దృశ్యాలు, రచనలు..వీటిపట్ల తగిన చర్యలు తీసుకోవాలి.

 అసభ్యత లేకుండా చూడటానికి సెన్సార్ బోర్డ్ ని ఏర్పాటు చేసారు. తమ లోపలి శరీరభాగాలు కనిపించేలా అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని బహిరంగంగా అందరికి కనిపించటం అసభ్యత కాదా...

సమాజంలో.. మత్తుమందులు, అసభ్యకరచిత్రాలు, రచనలు ..ఇలాంటివాటిని ఆపటానికి గట్టిచర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.   

 సమాజంలో ఎన్నో సమస్యలుండగా, స్త్రీలు అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని బయట తిరిగితే మాత్రం తప్పేమిటంటూ.... కొందరు  ప్రదర్శనలు చేయటం బాధాకరం.

 .......................

మగవాళ్ళు కూడా సంస్కారంతో ప్రవర్తించాలి. అందమైన స్త్రీ కనిపిస్తే , వాళ్లపట్ల అగౌరవంగా ఆలోచించకూడదు,  ప్రవర్తించకూడదు. స్త్రీలు కూడా సంస్కారంతో ప్రవర్తించాలి.  

మన వాళ్ళను, ఇతరులు గౌరవించాలని మనం కోరుకున్నట్లే, మనమూ ఇతరులతో గౌరవంగా ఉండాలి.

 ................. 

సమాజంలో కొన్ని సంఘటనలలో.. స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతుంటే, కొన్నిసంఘటనలలో.. వివాహితులైన స్త్రీలు, పురుషులు తాము ఇష్టపడే అక్రమసంబంధాలతో ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివాటివల్ల ఎన్నోకుటుంబాల్లో గొడవలు జరుగుతాయి.

...........................

యూట్యూబ్లో కనిపించే ఆశ్లీల రచనలు ఎంతో అసభ్యంగా ఉంటాయి. మనం వాటిని క్లిక్ చేసి చూడకపోయినా, యూట్యూబ్ సెర్చ్ చేసేటప్పుడు అవి కూడా కొంతభాగం కనిపిస్తాయి... వీటిని ఆపే విధంగా కూడా గట్టిచర్యలు తీసుకోవాలి.

 
సమాజానికి చెడుచేసే విధంగా ప్రవర్తించేవాళ్ళు దైవము వేసే శిక్షనుండి తప్పించుకోలేరు.
..................

ప్రజలు..పాపభీతి, నైతిక విలువలను పాటించటం వంటివి పాటించాలి..ఎంతగా మంచి చెప్పినా వినకుండా చెడ్డగా ప్రవర్తించే వారిని, తప్పులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. 

* నైతికవిలువలను పాటించే ప్రజలున్న చోట మంచిగా ఉంటుంది. 

................

 marikonni vishayaalu...

 ఈ రోజుల్లో కొందరు స్త్రీలు స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. సాటి స్త్రీలను కూడా ఇబ్బందిపెడుతున్నారు. పురుషులు కూడా తమ స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. విడాకులు ఎక్కువయ్యాయి.

అక్రమసంబంధాలు ఉన్నవాళ్ళ వల్ల.. వారిని వివాహం చేసుకున్న పురుషులు స్త్రీలు ఇద్దరికి ఇబ్బందే.  కొందరు స్త్రీలు, పురుషులు తమ అక్రమసంబంధాలకు అడ్డుగా ఉన్నారని సొంత పిల్లల్ని కూడా కొట్టిన వార్తలను విన్నాము.

 స్త్రీల పట్ల గృహహింస జరగకుండా రక్షణ కొరకు కొన్ని చట్టాలు చేసారు. అయితే, కొందరు స్త్రీలు ఈ చట్టాలను చూపి, తాము చెప్పినట్లు వినకపోతే, భర్త అత్తింటి వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు వింటున్నాము.
 
వివాహమైన పిల్లలకు, పెద్దవాళ్ళకు  సరిగ్గా పడకపోతే , ఒకే ఇంట్లో కాకుండా పక్కపక్క ఇళ్ళలో ఉండవచ్చు...ఎవరి ప్రైవసి వారికుంటుంది. అవసరమైనప్పుడు ఒకరికొకరు సాయపడవచ్చు. అలా కుదరదు అంటే, ఒకే ఊరిలో దూరంగా ఉండవచ్చు. ఇంకా కాదంటే, వేరే ఊళ్లలో ఉండవచ్చు.

భార్యాభర్తకు పడనప్పుడు సాధ్యమైనంతలో సర్దుబాట్లు చేసుకుంటూ జీవించటానికి ప్రయత్నించాలి. పిల్లలుంటే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి.
  
 ఇంకా భరించలేని పరిస్థితి ఉంటే.. కేసులు, గొడవలు కాకుండా, మధ్యవర్తులను (సైకాలజిస్టులు..)ఉంచి మాట్లాడుకుని విడిపోవటం తప్ప ఏం చేయగలరు?

పిల్లలకు తల్లితండ్రి ఇద్దరితో కలసి ఉండాలని ఉంటుంది. పిల్లలు అమ్మనాన్నతో కలసి తమ ఇంట్లో జీవించాలనుకుంటారు. అయితే, ఈరోజుల్లో కొందరు పేరెంట్స్ విడాకుల తరువాత వేరే వివాహం చేసుకుంటున్నారు.

పిల్లలకు తల్లి దగ్గర వేరేనాన్న, తండ్రి దగ్గర వేరే తల్లి ఉంటారు. పిల్లలకు ఇది బాధగా ఉంటుంది. అయితే, పెద్దవాళ్ళ హక్కుల గురించే అందరూ మాట్లాడతారు కానీ, పిల్లల హక్కులు, వారి ఆశల గురించి ఎంతమంది తల్లితండ్రి ఆలోచిస్తున్నారు?

ఇక పిల్లలు వాళ్ల అమ్మమ్మతాత లేక నాన్నమ్మతాత లేక హాస్టల్స్లో ఉండవలసి ఉంటుంది. వాళ్లు అప్పటికే వృద్ధులు అయి వాళ్ళకు ఎక్కువ ఓపిక ఉండదు.ఇక ఆ పిల్లలను ఏం సరిగ్గా చూసుకోగలరో?

 ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు ఉద్యోగాల వల్ల పనివత్తిడి బాగాపెరిగింది. అలసిపోయి చిన్న మాటకే గొడవలు పెరుగుతున్నాయి. 
 
దురదృష్టం ఏమిటంటే, అమ్మాయి అబ్బాయి తరపు పెద్దవాళ్ళు కూడా కొందరు పంతాలు, పట్టింపులకు పోయి గొడవలు పెంచుతున్నారు.

 కొందరు ఫ్రెండ్స్, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు కూడా ఎందుకు తగ్గాలి, ఎందుకు సర్దుకుపోవాలంటూ గొడవలు పెంచుతున్నారు. 

అప్పటివరకు పిల్లల్ని చదువులని హాస్టల్స్లో వేసిన వాళ్ళుకూడా పిల్లలకు వివాహాలు చేసాక, మా అమ్మాయి కష్టపడిపోతోందని అమ్మాయి అమ్మనాన్న, మా అబ్బాయి కష్టపడిపోతున్నాడంటూ అబ్బాయి అమ్మానాన్న వచ్చేస్తారు. 
 
పెద్దవాళ్ళయిన పిల్లల గురించి వాళ్ల తల్లితండ్రి అంత మాట్లాడుతున్నప్పుడు, తాము విడిపోతే తమ చిన్నపిల్లలు కష్టపడతారు కదా..అని విడిపోవాలని అనుకునే వాళ్లు ఆలోచించాలి కదా.

పాతవ్యవస్థలోనూ ఇప్పటి వ్యవస్థలోను కొన్ని సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి.ఇప్పడు కుటుంబవ్యవస్థ ప్రమాదంలో ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు....
కుటుంబవ్యవస్థను  బాగుచేసుకోవాలి.
 
 
 
 

Friday, January 12, 2018

సులువుగా చక్కలు వత్తే పద్ధతి ...


 
చాలామంది బియ్యం పిండితో చెక్కలు వంటకాన్ని  తయారుచేస్తారు.  అయితే,  పల్చగా వత్తడం  చాలా కష్టంగా ఉంటుంది. 

 చెక్కలు తేలికగా  తయారుచేయాలంటే   ఒక  పద్ధతి ఉంది.  

రెండు ప్లాస్టిక్   షీట్స్  మరియు  ఒక చిన్న గిన్నె  తీసుకోవాలి.   

చెక్కలు చేసే పిండిని చిన్న ముద్దలుగా  చేసి  ఒక ప్లాస్టిక్  షీట్ పైన దూరదూరంగా పెట్టాలి. 

 ఇంకొక ప్లాస్టిక్ కవర్ తీసుకుని పిండి ముద్దలపై పరచాలి. 

చిన్న గిన్నె తీసుకుని   గిన్నె అడుగు భాగంతో  ముద్దలను పలుచగా వత్తాలి. 

అప్పుడు చెక్కలన్నీ ఒకే షేప్ లో పలుచగా వస్తాయి.  అప్పుడు వాటిని నూనెలో వేయించి తీసుకోవాలి.


 చెక్కల పిండిని చేతితో వత్తడం కన్నా,   ప్లాస్టిక్ కవర్ పైన..   ఇంకొక   ప్లాస్టిక్ కవర్  వేసి ... గిన్నె అడుగు భాగంతో  వత్తడం తేలిక. 


చెక్కలపిండిలో  శనగపప్పు బద్దలు వేసినప్పుడు చేతితో కొంచెం వత్తవలసి వస్తుందేమో కానీ..... 

పెసరపప్పు బద్దలు వేస్తే   గిన్నె అడుగుభాగంతో వత్తడం  పద్ధతిలో  చెక్కలు పల్చగా వస్తాయి.
 
చేతి చెక్కలు పొడుగుగా చేతితో చేయటం రానివాళ్ళు  పిండిని గుండ్రంగా కాకుండా, పొడుగుగా అంటే గొట్టాలుగా చేసి పూరి ప్రెస్సర్ పైన పెట్టి, మరీ పల్చగా వత్తకుండా కొద్దిగా నొక్కి, నూనెలో వేయించుకోవచ్చు.
.......... 
చక్కలు, కారప్పూస వంటి పిండివంటలలో వెన్న  వేయకుండా ఇంకోరకంగా చేయవచ్చు.

 పావు కప్పు నూనెలో అరకప్పు నీళ్లు పోసి,  మిక్సీ చిన్న జార్ లో తిప్పితే వెన్నలా అవుతుంది. దీనిని వెన్న కు బదులుగా పిండిలో కలిపితే కారప్పూస, చక్కలు బాగా వస్తాయి. 

 మిక్సీ జార్ శుభ్రం చేయడానికి.. కొద్దిగా సర్ఫ్ లో నీళ్ళు పోసి మిక్సి జార్లో వేసి తిప్పితే జార్ శుభ్రమవుతుంది.



Thursday, January 11, 2018

చక్కగా ప్రేమ గా...

 
కొందరు  దైవకీర్తనలు చాలా చక్కగా భక్తితో పాడుకుంటారు.. ఆడంబరత్వం లేకుండా..చక్కగా ప్రేమ
తో   పాడుకుంటారు.
 
లింక్ ఇక్కడ ఇస్తున్నానండి.. 
 
Oka Pilupulo Pilichite Palukuthavata - Srirangam Gopalaratnam
Sudha Y

 ***********
 
 " శ్రీ పార్వతీ పరమేశ్వరుల పరిణయ గాథ!! "
Gullapalli Rajyalakshmi
 
******

 సంగీతం తెలియకపోయినా భక్తికీర్తనలు పాడుకోవచ్చు. భజనలు చేసుకోవచ్చు. 
 
దైవం పట్ల ప్రేమ ఉంటే చాలు. అనేక సందేహాలతో సతమతమవకుండా, బోలెడు డబ్బు ఖర్చు లేకుండా కూడా  దైవాన్ని స్మరించుకోవచ్చు.. ఆరాధించుకోవచ్చు.
 
 ************
 
 ఒక లింక్ ఆసక్తి ఉన్నవారు చదవవచ్చండి.

Thursday, March 23, 2017
 ..........................
 
marikonni vishayamulu..
 
ప్రతిపనికి కొన్ని విధి విధానాలు తప్పక ఉంటాయి. అయితే, వాటిని అతిగా పెంచుకుంటే అసలుకే ఇబ్బందిగా ఉంటుంది.ప్రతిదానికి వందల నియమాలను చెబితే, అన్నీ పాటించాలంటే చాలా కష్టం.

ఉదా.. బొట్టు పెట్టుకోవాలన్నా కూడా ఫలానా వేలుతో పెట్టుకుంటే ఈ ఫలితం అని చెబుతారు.
ఇలా ప్రతిదానికి వందల నియమాలను చెబితే, అన్నీ పాటించాలంటే చాలా కష్టం.

దైవంతో స్వేచ్చగా మనసు విప్పి ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది. దైవపూజకు కూడా భయపడేలా ఎన్నో నియమాలు పెంచేసారు.

దాదాపు ప్రతిరోజు ఏదో ఒక పూజ అన్నట్లు చెపుతున్నారు. పూజ రోజు, మంగళవారం, శుక్రవారం.. గోళ్లు తీయటం, ఇల్లు శుభ్రం చేయటం చేయకూడదంటారు కొందరు. ఇలా అయితే, ఎప్పుడు గోళ్లు తీసుకోవాలి, ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి? 

ఇల్లు,పరిసరాలు.. శుభ్రంగా ఉంటే మహాలక్ష్మిదేవికి ఇష్టం అనికూడా చెబుతారు. గోళ్లు కత్తిరించకుండా మురికిగా వంటచేయటం, ఆహారం తినటం..ఆరోగ్యానికి మంచిది కాదు.

విధివిధానాలను అదేపనిగా పెంచి, దైవంపై ధ్యాసను ఉంచటాన్ని తగ్గించేలా చేయటం సరైనది కాదు.

 

Monday, January 8, 2018

జలుబు, దగ్గు తగ్గటానికి .........


ఈ పానకం జలుబు, దగ్గు తగ్గటానికి బాగా పనిచేస్తుందండి. మేము ఎప్పటినుండో వాడుతున్నాము. మాకు తెలిసిన వారు చెప్పారు ఈ మందు.

ధనియాలు...........750 గ్రాములు.
మిరియాలు...............25 గ్రాములు.
శొంఠి...............25 గ్రాములు.
బెల్లపు ముక్క........ ఒక చిన్న ముక్క. ...... {.తీపికి సరిపడినంత.}

శొంఠిని మెత్తగా దంచుకోవాలి. ధనియాలు, మిరియాలు పచ్చివే, వేయించకూడదు. ... బెల్లము ముక్కలు తప్పమిగతావన్ని మిక్సీలో పొడి చేసుకోవాలి. ..... పొడి మరీ మెత్తగా రాకపోయినా పరవాలేదు. ...

ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక గ్లాస్ చొప్పున నీళ్ళు తీసుకుని ఆ గ్లాస్ నీటిలో రెండు స్పూన్లు పొడి వేసి బాగా కాచాలి. ఈకషాయం అరగ్లాస్ నీళ్ళు అయ్యేవరకు కాచాలి ,



అప్పుడు బెల్లపు ముక్కలు వేసి కరిగేవరకు మరిగించాలి. ....... అప్పుడుపొయ్యి మీద నుంచి దింపి , ........ విడిగా కాచిన వేడి పాలు ఇందులో గ్లాస్ నిండా పోయాలి. 


ఆ...మర్చిపోయానండి ....ఇలా కాచగా వచ్చిన అర గ్లాస్ కషాయాన్ని జల్లెడలో వడపోసి ....అందులో కాగిన పాలు కలుపుకోవాలి........ ఇది ఒక వ్యక్తికి సరిపడిన కొలత మాత్రమే.


ఇలా రోజూ ఉదయమే ఒక గ్లాస్ త్రాగాలి. ఈ మందు త్రాగిన తరువాత 10 నిముషాలు ఏమీ  తినకుండా  గ్యాప్ ఇస్తే మంచిది. ఒక పది రోజులు త్రాగాలి.


ఈ కషాయం చిన్న మంట పైన కాగాలి. ఎందుకంటే పొడి లోని రసం (సారం) అంతా నీటిలోకి రావాలి.

..... పాలు ముందే కలిపి కాచితే బెల్లం వలన విరిగిపోవచ్చు. పాలు కలిపాక మళ్ళి కాయనవసరంలేదు. పాలు ఇష్టం లేనివాళ్ళు పాలు కలపకపోయినా పరవాలేదు. 



సుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బెల్లపు ముక్కలు వెయ్యకపోయినా పరవాలేదు. కొంతమందికి ఇది వేడిచేయవచ్చు. కాని బాగా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు చలువ చేసే పదార్ధములు తినాలి.

కొంతమందికి జలుబు,దగ్గు అప్పటికప్పుడు తగ్గకపోయినా వారం  రోజులు వాడి ఆపేసిన తరువాత నెమ్మదిగా పూర్తిగాతగ్గిపోతుంది. మళ్ళి చాలాకాలం వరకు జలుబు,దగ్గు రాదు.


 అసలు జలుబు అవి లేకపోయినా ఈ కషాయం ప్రతినెలమొదటి వారం రోజులు వాడితే మంచిది. 


ఈ రోజుల్లో స్వైన్ ఫ్లూ ఇలాంటి వాటి వల్ల జలుబు అవి లేకుండా చూసుకోవాల్సివస్తోంది కదా...

.కొంచెం చిన్న పిల్లలకయితే ఒక గ్లాస్ నీటికి ఒక స్పూన్ పౌడర్ వేస్తే సరిపోతుంది. పిల్లలు జలుబు , దగ్గుతో చాలా బాధపడుతుంటారు.


పెద్దవాళ్ళు కొంచెం ఓపికగా ఇలా కషాయం చేసి ఇస్తే వాళ్ళకు ఆ బాధ ఉండదు. ఇలా కషాయం కాయటం కష్టమనుకుంటే చ్యవన్ ప్రాశ్ వాడవచ్చు.
**************

చదువు, ఉద్యోగ రిత్యా పెద్దవాళ్లకు దూరంగా ఉండే పిల్లలకు ఈ కషాయాన్ని వాడే విధానాన్ని నేర్పించి, మందు పొడిని పంపితే, వాళ్ళు  కాచి త్రాగవచ్చు. 

అయితే, ఎలా వాడాలో సరిగ్గా నేర్పించాలి.  వరుసగా ఎక్కువ రోజులు త్రాగకూడదు.



Wednesday, January 3, 2018

కొన్ని పద్ధతులు..కొన్ని సంగతులు..


మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా  దేశంలోని కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

 మూఢనమ్మకాలకు   వ్యతిరేకంగా చర్యలు తీసుకోవటం మంచివిషయం. 

జీవితంలో దైవభక్తి, సత్ప్రవర్తన.. చాలా అవసరం. దైవకృపను పొందడానికి  మరియు చక్కటి జీవితానికి ఉపయోగపడేలా  పెద్దలు చక్కటి పూజావిధానం  మరియు  ఆచారవ్యవహారాలను తెలియజేసారు. 

అయితే,  కొందరి వల్ల కొన్ని ఆచారవ్యవహారాలలో కొన్ని  మూఢనమ్మకాలు  కూడా చేరటం  జరిగింది. 
 
సనాతనధర్మం మూఢాచారాలను ప్రోత్సహించలేదు. కొందరు మనుషులే ప్రతిదానికి భయపడుతూ మూఢనమ్మకాలను పాటించారు. వాళ్ళు ప్రతిదానికి భయపడుతూ అందరినీ భయపెడుతుంటారు.
 

దైవభక్తి పెరిగేలా  ఆచారవ్యవహారాలు  ఉండాలి . అంతేకానీ, ఆచారవ్యవహారాలంటేనే  విసుగు,  భయం కలిగే  పరిస్థితి  తెచ్చుకోవటం సరైనది కాదు.  

కొందరు ప్రజలు ఆచారవ్యవహారాలను  విపరీతధోరణితో  చేస్తున్నారు. 

  ఏం చేస్తే ఏం తప్పో ? అన్నట్లు భయపడే ధోరణి పెరుగుతోంది. 

ఇలాంటి విపరీతధోరణి ఇంకా పెరిగితే ....

నోరు అంటే ఉమ్మి ఉంటుంది, ఉమ్మిఅంటే  ఎంగిలి,  అశుచి, అంటు కాబట్టి .. నోటితో పవిత్రమైన  దైవనామాలను, మంత్రాలను పలకడం కూడా తప్పేమో ? అని కూడా ముందుముందు ఎవరికైనా సందేహాలు  కలుగుతాయేమో ? 

ఇలాంటి  పరిస్థితి రాకూడదు . 
...............
 
ఆచారవ్యవహారాల్లో క్లిష్టతను పెంచితే , అవన్నీ పాటించలేక కొందరు ప్రజలు సరళంగా ఉండే ఆచారవ్యవహారాలు గల మత పద్ధతిలోకి  మారే పరిస్థితి కూడా కలగవచ్చు.
..............
 
 మూఢత్వంతో ఆచారవ్యవహారాలను పాటించటం విషయంలో  నాకు ఏమనిపిస్తుందంటే, మూఢత్వంతో పాటించటం వల్ల వాటిని చూసి మరికొందరు అలా తయారయ్యే ప్రమాదముంది. ఇది మంచిదికాదు. ఇలాంటివి కొనసాగకుండా చేయటానికి, మూఢత్వంతో ఉన్నవారికి ఎన్నో ఆటంకాలు, పరీక్షలు ఎదురవుతాయేమోనని నాకు అనిపిస్తుంది. 
 ..
నా విషయంలో , నేను మూఢత్వంతో పాటించినప్పుడు ఆటంకాలు ఎదురయ్యాయి. మూఢత్వం తగ్గించుకుని ప్రశాంతంగా పాటించినప్పుడు చక్కగా ఉన్నదని నాకు అనిపించింది.
 
***************
  కొందరు పూజ చేసేటప్పుడు భక్తి కన్నా పూజలో ఎక్కడ పొరపాట్లు వస్తాయో ? వస్తే ఏమవుతుందో ? అనే భయంతో పూజలు చేస్తూ ఉంటారు.   కానీ ఆ భయం వల్ల  పూజకే దూరం అయ్యే పరిస్థితి రాకూడదు .

కష్టంలోనూ, సుఖం లోనూ అందరికి తోడునీడ దైవమే.  మన అందరికీ హితులు, స్నేహితులు, జన్మజన్మల బంధువు, ఆత్మ, పరమాత్మ అన్నీ దైవమే.

మనకు ఎవరైనా విసుగుతో పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టిన  దానికన్నా .....ప్రేమతో  పెట్టిన  పదార్ధాలే బాగుంటాయి.

  ఎవరైనా  భయం వల్ల ..  మనల్ని  పలకరించటం కన్నా ..... ప్రేమగా పలకరించటమే బాగుంటుందని మనకు  అనిపిస్తుంది కదా !  అలాగే , దైవాన్ని కూడా మనము ప్రేమగా ఆరాధించటమే బాగుంటుంది.

దైవం కోరుకునేది.. అందరూ పరమపదాన్ని పొంది ఎప్పటికీ పరమానందంగా ఉండాలనే.

ప్రజలు  మూఢత్వాన్ని వదిలి  దైవానికి దగ్గరకావడానికి ప్రయత్నించడం మంచిది.

***********************

మరికొన్ని విషయములు...ఈ విషయాలను కొంత కాలం తరువాత వ్రాసి పై పోస్ట్ క్రింద పోస్ట్ చేసాను. 

సమాజంలోని వారికి రకరకాల అభిప్రాయాలుంటాయి. మనం గౌరవించే వారి అభిప్రాయాలు ..మన అభిప్రాయాలు.. కొన్నిసార్లు  ఒకటిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మన అభిప్రాయాలను చెబుతాము. ఇలాంటప్పుడు ఎవరూ తప్పుగా భావించకూడదు. అందరి అభిప్రాయాలు ఒకటిగానే ఉండవు కదా..

 ఆచారవ్యవహారాల్లో రకరకాలుంటాయి. కొన్ని కుటుంబాల్లో  వారి పెద్దల నుంచి కొన్ని  పద్ధతులుంటాయి.  కొందరు ఉల్లి, వెల్లుల్లి వంటివి తినరు. కొందరు తింటారు.

 అయితే ఈమధ్య కొందరు , ఎవరైనా కూడా.. ఉల్లివెల్లుల్లి తినకూడదని చెబుతున్నారు.   

బెంగాల్లో బ్రాహ్మణులు కొందరు చేపలు తింటారట.. మన ప్రాంతాలలో శూద్రులు చాలామంది ఉల్లి, వెల్లుల్లి తింటారు..ఇలా వివిధ పద్ధతులున్నాయి.  

 ..కొన్ని ప్రత్యేకమైన పూజలు,పండుగలప్పుడు ఉల్లి, వెల్లుల్లి తినకుండా ఉండవచ్చు.  ఉల్లి, వెల్లుల్లి వాడేవారు అతిగా కాకుండా తక్కువగా వాడటం మంచిది.

  ఉల్లి, వెల్లుల్లి.. తినకూడదని వంటలో వేయకపోతే, ఇంట్లో కొందరికి కోపం రావచ్చు. కొత్తగా ఇవన్నీ ఏమిటని..గొడవలయ్యే పరిస్థితి ఉంటుంది.

 విదేశాల నుంచి వచ్చిన టమేటో, కారట్, ముల్లంగి, కాబేజ్, మిర్చి..వంటివెన్నో తింటున్నాము.

 కూరల్లో గుజ్జు(గ్రేవీ) రావటానికి,  రుచికొరకు..  కొందరు ఉల్లిపాయ బదులు కొబ్బరి, పప్పులపొడులు వాడుతారు. కొందరు కొబ్బరి ఎక్కువ తినరు. ..ఉల్లిపాయలు వాడుతారు. 

   ఉల్లి, వెల్లుల్లి,  నిల్వ పదార్ధాలు,  కారం ఎక్కువున్న పదార్ధాలు  వంటివి.. సాత్వికాహారం కాదని అంటారు.  మరి,  పండుగలప్పుడు, ఎప్పుడైనా సాత్వికాహారం తినాలనుకున్నప్పుడు  నిల్వ పచ్చళ్లు ,  ఫ్రిజ్లో నిల్వ ఉంచినవి  తినకూడదా?  అని సందేహాలు వస్తుంటాయి.

 గ్రంధాలలో రాజసికాహారం గురించి కూడా ఉంది. 

సాత్వికాహారం తింటే మంచిదే. అయితే..ఉల్లి, వెల్లుల్లి ..రాజసికఆహారమని కొందరు, తామసికాహారమని కొందరు అంటున్నారు. గుమ్మడికాయ, బంగాళాదుంప(ఆలుగడ్ద) , మినపప్పు..వంటివి..తామసికాహారమని నేను ఒక దగ్గర చదివాను. మరి, మినపప్పుతో చేసిన గారెలు, ఇడ్లి, దోసె..వంటి పదార్ధాలను చాలామంది తింటారు కదా..

నిల్వ ఉన్న ఆహారం తామసికాహారం అంటున్నారు. చాలామంది స్త్రీలు, ఉదయం వండగా మిగిలిన అన్నం, కూరలు..రాత్రికి తింటారు.. ఆహారం వృధాకాకుండా అలా తింటారు..

రాజసిక, తామసిక ఆహారాన్ని తినటం మానేయాలంటే..ఉల్లి, వెల్లుల్లితో పాటు..మినపప్పుతో వండిన వంటలు, ఆలుగడ్ద, కాఫీ, టీలు, నూనెలో బాగా వేయించిన పిండివంటలు, నిల్వ పచ్చళ్ళు,  చద్దనం, వండినిలువ ఉన్న కూరలు..ఇలాంటివెన్నో తినకూడదు...మరి ఇవన్నీ మానేయాలంటే ఎంతమంది పాటించగలరు? 

  ఎవరినీ బాధపెట్టాలని ఇవన్నీ వ్రాయలేదండి. అందరూ అన్నీ పాటించాలంటే చాలా కష్టం అవుతుంది. మొదటినుంచి ఉల్లి, వెల్లుల్లి అలవాటులేని వారి ఇళ్ళలో ఇబ్బంది ఉండదు కానీ..ఉల్లి, వెల్లుల్లి తినే వారి కుటుంబాల్లో అవి మానేయాలంటే కష్టం అవుతుంది. అందువల్ల ఇలా వ్రాయవలసి వచ్చింది.

 ఉల్లి, వెల్లుల్లి తినకూడదనటానికి మనకు తెలియని కారణాలు కూడా ఉంటాయేమో...

సంప్రదాయబద్ధంగా ఎన్నో నియమాలను పాటిస్తూ  జీవితం గడిపేవారు.. వేదాలను నేర్చుకున్నవారు..ఇలాంటి వారు ఎన్నో నియమాలను పాటిస్తారు. ఎవరి ఆచారం ప్రకారం వారు ఆహారాన్ని తీసుకోవచ్చు.... అందరూ అలాగే పాటించాలంటే చాలామంది పాటించలేరు.

పూజలు చేసేవాళ్లు ఉల్లి, వెల్లుల్లి తినకూడదని పెద్దవాళ్లు తెలియజేసారు. అందువల్ల తినకుండా ఉంటే మంచిది. కుదరనివాళ్లు వీలున్నంతలో కొంతవరకైనా ప్రయత్నించవచ్చు.
........................................ 
అందరిలో సాత్విక..రాజస..తామస గుణాలు మూడూ ఉంటాయి.
అయితే, తామసాహారాన్ని తింటే తామసగుణాలు కొంత ఎక్కువ అవుతాయంటారు. సాత్వికాహారాన్ని తీసుకునేవారిలో కూడా కొన్నిసార్లు పరిస్థితిని బట్టి కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. 
 
ఉదా.. సాత్వికాహారమే తీసుకునే వ్యక్తి అయినా కూడా, బాగా ఆకలితో నీరసించి ఉన్నప్పుడు కోపం వచ్చే అవకాశముంది.

పూజలు చేసేవారు ఉల్లి, వెల్లుల్లి ..వంటివి తినకూడదంటారు. మరి పాతకాలంలో క్షత్రియులు కూడా ఉల్లి, వెల్లుల్లి..వంటివి తినేవారు కాదేమో?
.................................. 
 
 సమాజంలో వివిధ వృత్తులవారున్నారు..  చద్దన్నం తిని ఉదయానే పనికి వెళ్ళేవారుంటారు.  నాకు తెలిసినంతలో..కాయకష్టం చేసేవారికి   కొంతమోతాదులో తీసుకునే మినుములు..వంటివి బలాన్ని కలుగజేస్తాయి. రాజసిక, తామసిక ఆహారాలను ఎక్కువగా తినకూడదు కానీ, కొంతవరకూ తింటారు కదా.. 

  కొద్దిగా నిల్వ ఉన్న అంబలి.. వంటివి ఆరోగ్యానికి మంచిదని,   బి12 వంటివి లభిస్తాయని కొందరు అంటున్నారు.

రజోగుణం వంటివి పెరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  రజోగుణం, తమోగుణం అంటే..హింస మరియు  అభ్యంతరకరమైన  సంభాషణలు, దృశ్యాలు వంటివాటి   జోలికి అనవసరంగా పోకూడదు.
  అయితే, జీవితంలో కొంత రజోగుణం, తమోగుణం కూడా ఉంటుంది. సాధ్యమయినంతలో  సత్వగుణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఈ విషయాలలో చాలా సందేహాలు కలుగుతాయి. ఏం చేయాలో? ఏం చేయకూడదో? దైవానికి మాత్రమే సరిగ్గా తెలుస్తుంది..దైవమే దారి చూపాలి.

కొందరికి గొప్పమంత్రాలను పఠించటానికి నోరు తిరగదు. అలాంటప్పుడు, దైవనామాన్ని  స్మరించుకుని
కూడా తరించవచ్చు. 

నిష్కామకర్మయోగం ఎంతో గొప్పది.ఆసక్తి ఉన్నవారు లింక్ వద్ద చదవవచ్చండి.

  link..

ఓం ..నిష్కామ కర్మ యోగం అద్భుతమైన మార్గం..

****************
 అనేక విషయాల వల్ల   తామసగుణం పెరిగే పరిస్థితి ఉంది.

ఆహారం గురించిన  విషయాలు మహాభారతంలో భీష్ముల వారు తెలియజేసినవి ఉన్నాయి.


link..
పాపాలు చేసే వారి పట్ల అంటరానితనాన్ని పాటించాలని..

 **********

గ్రంధాలలో ఒక కధ ఉంటుంది. ఒక ముని ఒకరి ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత ముని ఆ ఇంట్లో ఒక వస్తువును దొంగిలించి పట్టుకుపోతారు. తాను అలా ఎందుకు చేసాను? అని ముని ఆలోచించి దివ్యదృష్టితో గ్రహిస్తే తెలిసిదేమిటంటే, భోజనం పెట్టిన ఇంట్లో వారికి దొంగతనాలు చేసే అలవాటుందని మునికి తెలుస్తుంది. 

 పాపపు సొమ్ముతో కొన్న పదార్ధాలతో భోజనం చేయటం వల్ల, మునియొక్క మనస్సులో దొంగతనం చేయాలని బుద్ది పుడుతుందట. ఇలా ఎన్నో విధాలుగా తామసగుణం వచ్చే కలిగే అవకాశాలుంటాయి.

అయితే, చాలా విషయాలుంటాయి. ఉదా.. మునికి భోజనం పెట్టిన వారింట్లో ఎవరైనా మంచివారు కూడా ఉంటే ఏమవుతుంది? ఒకే మనిషిలో కొంత మంచి, కొంత చెడు గుణాలుంటే ఏమవుతుంది? ...

  పాపపు సొమ్ముతో మంచి పనులు చేస్తే.. కొంత మంచి, కొంత చెడు ఫలితాలుంటాయా? చేసిన పాపాన్ని బట్టి, ఎక్కువ..తక్కువ..చెడు.. ఫలితాలుంటాయా? ఇలా చాలా సందేహాలు, విషయాలుంటాయి.

 ధర్మసూక్ష్మాలు, ధర్మవ్యవస్థ చాలా క్లిష్టమైనవి.  ఏది ఎందుకు జరుగుతుందో..తెలుసుకోవటం చాలా కష్టం. సర్వాంతర్యామి అయిన దైవానికి మాత్రమే అంతా తెలుస్తుంది.
 

*********

స్త్రీలు..గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టకూడదంటున్నారు. వంటకు కొబ్బరికాయ, గుమ్మడికాయ  కొట్టాలంటే సమయానికి పురుషులు ఇంట్లో లేకపొతే ఇక వాటిని వాయిదా వేయాలి. ఇలా ప్రతిదానికి అడ్డుకట్టలు వేస్తే కొబ్బరి, గుమ్మడి.. వంటివి వాడకం తగ్గించే పరిస్థితి ఉంటుంది.

అన్నీ తగ్గించుకుంటూ పోతే హిందువులు పోషహాకారం  లోపంతో బలహీనులయ్యే పరిస్థితి రావచ్చు. అందువల్ల, పరిస్థితిని బట్టి ఆలోచించుకుని చేయాలి. . గుమ్మడి, కొబ్బరికాయను కొట్టడం వెనుక ఇంకా ఏమైనా కారణాలుంటాయేమో నాకు అంతగా తెలియదు..

కేరళలో కొందరు హిందు స్త్రీలు కొబ్బరికాయను వారే కొడతారు. తెలుగువాళ్లలో కూడా పూజలప్పుడు స్త్రీలు కొబ్బరికాయను కొడతారు. మరి, స్త్రీలు కొబ్బరికాయ కొట్టకూడదంటూ కొందరు ఎందుకు చెబుతున్నారో? తెలియటం లేదు.

***************

ఈమధ్యన కొందరు చాలావిషయాలను చెబుతున్నారు. విన్నవాళ్ళకు ఏంచేయాలో అర్ధం కాదు.

ఉదా..కొబ్బరికాయను కడిగి దేవుని వద్ద కొట్టకూడదంటూ కొందరు చెబుతున్నారు. కొన్నిసార్లు  మార్కెట్లో కొబ్బరికాయలు ఉంచే ప్రదేశం అంత శుచిగా ఉండకపోవచ్చు..కాయకొట్టినప్పుడు నీటితోపాటు మురికి కూడా క్రిందకు దిగుతుందికదా..ఆ నీటిని దేవునికి సమర్పించటం బాగుండదనే అభిప్రాయంతో కాయలను కొట్టేముందు కడగాలనిపిస్తుంది. 

  అందువల్ల కాయలను కడిగి, తడి కొంత ఆరినతరువాత కొట్టవచ్చు. ఇంటివద్ద కొబ్బరిచెట్టు ఉండి కాయలు శుభ్రంగా ఉంటే కడగకుండానే కొట్టుకోవచ్చు. నేను చాలాసార్లు కొబ్బరికాయను కడిగి దేవునికి కొడుతుంటాను.

*******************

  నెలసరిలో పక్కన కూర్చోవటం అనే ఆచారాన్ని పాతకాలంలో చెప్పినట్లు పాటించాలంటే, స్త్రీలు ఖచ్చితంగా పక్కన కూర్చోవాలి. అంతేకానీ స్కూల్స్ కు, ఉద్యోగాలకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళి నెలసరి మైలను అందరికీ కలపకూడదు.

 ఈ రోజుల్లో స్కూల్స్, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్ళక తప్పదు కదా..అంటారు కొందరు. మరి,తప్పనిపరిస్థితిలో కొందరు స్త్రీలు ఇంట్లో వంట చేయకతప్పదు .

ఇతరుల అంటుముట్టు గురించి మనకు తెలియనప్పుడు..బయటకు వెళ్ళి వారిని ముట్టుకున్నా తప్పు లేదంటారు కొందరు. తెలియకపోవటం ఏముంది..బయటకు వెళ్ళినా, ఒక బస్సు ఎక్కినా..ఎందరో స్త్రీలుంటారు. వారిలో ఖచ్చితంగా కొందరు నెలసరిలో ఉన్నవాళ్లుంటారు.

 ఎప్పుడైనా బస్సులో దేవాలయానికి వెళ్ళినప్పుడు, బస్సులో ఎందరో కాలేజ్ పిల్లలు, ఉద్యోగానికి వెళ్లే స్త్రీలు ఉంటారు. వీళ్లలో కొందరైనా నెలసరి ఉన్నవాళ్లు ఉంటారు కదా..వీళ్లను ముట్టుకుని దేవాలయానికి వెళ్ళవలసి వస్తోంది.. అనిపిస్తుంది.

కొందరు స్త్రీలు తప్పనిపరిస్థితిలో బయట ఉద్యోగాలకు వెళ్తారు. భర్త కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఇల్లు గడవటానికి డబ్బు లేక, ఉద్యోగాలకు వెళ్లే స్త్రీలు కూడా ఉంటారు. అలాంటప్పుడు  కూడా బయటకు వెళ్ళక తప్పదు.

 అవసరాలు, పరిస్థితులను బట్టి , గ్రంధాలలో చెప్పినవాటిని కొన్నింటిని కాలానుగుణంగా మార్చుకుంటున్నారు..

అయితే, నెలసరి విషయంలో గట్టిగా చెప్పాలనుకునేవారు..నెలసరిలో ఉన్నవారు వంట చేయకూడదని చెప్పటం మాత్రమే కాకుండా, నెలసరిలో ఉన్న వారు బయటకు వెళ్లకూడదని కూడా చెప్పగలగాలి. 

ఈ రోజుల్లో ఆడవారు నెలసరిలో బయటకెళ్ళి  కలిపేసి.. ఇంటికొచ్చి పక్కన కూర్చుంటే అది సరైన పద్ధతి అవుతుందా?

 మనం పాటించినా, పాటించకపోయినా గ్రంధాలలో ఉన్న విషయాలను (ప్రక్షిప్తాలు లేకుండా)  చెపితే,  తెలుసుకుని, ఆలోచించుకుని.. పాటించడానికి  ప్రయత్నిస్తారు. పాటించడానికి కుదరని వాళ్ళు పాటించలేరు. 

 అంతేకానీ, ఈ రోజుల్లో చాలామంది స్త్రీలకు బయటకు వెళ్ళకుండా కుదరదు కాబట్టి, ఆ విషయంలో పాటించటం గురించి గట్టిగా చెప్పకుండా, వంటచేస్తే మాత్రం కష్టాలొస్తాయని భయపెడితే ఎలా?

  నెలసరిలో ఇంట్లో ఎవరైనా సాయం చేసే పరిస్థితి ఉంటే, పక్కన కూర్చుని విశ్రాంతి తీసుకుంటే మంచిది. అయితే, కుదరనప్పుడు ఏం చేయగలరు? కొన్ని జాగ్రత్తలు తీసుకుని వంట చేస్తారు.

****** ************

ప్రజలకు ఒకదాని తర్వాత ఒకటిగా సందేహాలు వస్తుంటాయి..

కొబ్బరి చిప్పలో దీపం... ఎండు కొబ్బరి చిప్పా? పచ్చి కొబ్బరి చిప్పా? అంటూ సందేహాలు. మట్టిప్రమిద వాడినవి మళ్ళీ వాడచ్చా? లేక ఎప్పటికప్పుడు కొత్తవి వాడాలా?  ఇలా అంతులేని సందేహాలు..

అయినా, అనేక  సందేహాలతోనే జీవితం గడపటం భక్తి అంటారా? అనేక సందేహాలతో కాకుండా,  దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించడానికి ప్రాముఖ్యతను ఇస్తే దైవకృప లభిస్తుంది.

   *********** **********

 సామాన్యంగా ఎవరైనా స్నానం చేసేముందే ఇల్లు, వాకిలి ఊడ్చి స్నానం చేస్తారు. దుమ్ము, మురికి అంటుకుంటుంది కాబట్టి అలా చేయటమే సరైనది. ఈ మధ్య కొందరు ఏమంటున్నారంటే, స్నానం చేసి ఇల్లువాకిలి ఊడ్చాలంటున్నారు. మరికొందరయితే స్నానం చేసి ఊడ్చి, ఊడ్చినతరువాత మరల స్నానం చేయాలని కూడా అంటున్నారు. అన్ని సార్లు స్నానాలు చేసి నీటిని వృధా చేయటం అనేది మహాపాపం. ఇవన్నీ వింటుంటే హిందువులకు ఇక దైవమే దిక్కు అనిపిస్తోంది.

 హిందువులను అయోమయానికి గురి చేసి, విసుగు కలిగించి మతాలు మార్చడానికి  కొందరు ప్రయత్నిస్తున్నారేమో? అని అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

  పాతకాలంలో హిందువులలో మూఢాచారాలు పెరగటం వల్ల, ఆ మూఢాచారాల వల్ల ఎందరో హిందువులు బాధలను అనుభవించారు. ఆ పాపం తగిలి భారతదేశం విదేశీ పాలనలో కొన్నాళ్లు ఉండవలసి వచ్చిందేమో? అని నాకు అనిపిస్తుంది. విదేశీయుల రాకతో విదేశీమతాలు ఇక్కడికి వచ్చి, ఇప్పటికీ ఆ ప్రభావం చాలా ఉంది.

 సమాజంలో మూఢాచారాలు వ్యాప్తి చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేయటం తప్పు. 

పండుగ అంటే ప్రజలను ప్రశాంతంగా ఉండనీయకుండా, అలాచేయకూడదు..ఇలానే చేయాలి.. అంటూ ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ మూఢాచారాలు వ్యాప్తి చేసేవారికి పాపం తగిలే అవకాశం లేకపోలేదు. కొన్ని నియమాలను పాటించటం సరైనదే..అలాగని అతి చేస్తే అన్నింటినీ వదిలేసే ప్రమాదం ఉంది.

నేను ఎవరి పట్లా కోపంతో ఇవన్నీ వ్రాయలేదండి. ఎందరో ఎన్నో గొప్ప విషయాలను చక్కగా  తెలియజేస్తున్నారు. వాటిని విని ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాము. అవి ఎందరికో ఉపయోగపడుతున్నాయి. 

 అయితే, కొన్ని విషయాలను పాటించటంలో సందేహాలు కలుగుతున్నాయి. కొన్ని పద్ధతులను పాటించాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది.

 పద్ధతులు ఎక్కువైతే దైవం గురించి ఆలోచించటం కన్నా, పద్ధతులను సరిగ్గా పాటిస్తున్నామా? లేదా? అనే దాని గురించి ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది. 

అందువల్ల కొన్ని పద్ధతులను పాటించి.. దైవంపట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. పాటించే శ్రద్ధ ఉన్నవారు అన్నీ పాటించవచ్చు. ఎవరి శక్తి వారిది.

కొన్ని విషయాలను అందరూ తప్పక పాటించాలి. ఉదా..పాపాలు చేయకూడదు ..వంటివి   పాటించటం కష్టంగా ఉన్నా కూడా.. అందరూ
పాటించడానికి ప్రయత్నించాలి.  

  దైవభక్తి కలిగి ఉండటం, నీతిగా, నిజాయితీగా జీవించటం గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకానీ, ప్రతిదానికి అనేక సందేహాలతో ఉంటే, ఇక దైవం పట్ల ధ్యాస ఎప్పుడు ఉంటుంది?

చాలావిషయాలను పాటించలేక నాకు తోచినట్లు దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుందని ఎన్నోసార్లు అనిపించింది....పాటించకపోతే కష్టాలొస్తాయని చెబుతుంటే, భయపడి అవన్నీ పాటించలేక మతాన్ని వదిలేసే వారు ఉండరా?

 ఈ రోజుల్లో కొందరు హిందువులు మతం మారుతున్నారు. ఆచారవ్యవహారాలు పాటించలేక మతం ఎందుకు మారుతారంటూ కొందరు అంటున్నారు. ఎందుకు మారరు? కొందరు సాంప్రదాయ కుటుంబాల వాళ్ళు కూడా మతం  మారుతున్నారు...ఇలాంటివి గమనించి బాధనిపించి, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు  కొంత  పట్టువిడుపుతో ఉండాలని అంటున్నాను.

  తరతరాలనుంచి కొన్ని  గ్రంధాలలో కొన్ని  మార్పులుచేర్పులు జరగటం వల్ల కూడా అనేక విషయాల్లో అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా,  కొందరు ఎవరికితోచింది వారు చెబుతున్నారు. కొందరు పరస్పర విరుద్ధంగా చెబుతున్నారు. ఇలాంటప్పుడు, తరతరాల నుంచి గ్రంధాలలో ఎన్ని ప్రక్షిప్తాలు చేరాయో?

 అందువల్ల, జీవితంలో ఏది ఎలా చేయాలో సరిగ్గా తెలియనప్పుడు దైవాన్ని ప్రార్ధించుకోవాలి. మన ప్రవర్తన బట్టి మనకు ఫలితాలు లభిస్తాయి. సరైన విధంగా జీవించేలా మంచిబుద్ధిని ప్రసాదించమని అందరూ దైవాన్ని ప్రార్ధించుకోవాలి.

***********
 
ఒక సినిమాలో ఒక బామ్మగారు తన మనుమరాలితో.. తనకు ఇష్టం లేకపోయినా  జీవితంలో ఎన్నో కట్టుబాట్లను పాటించి విసిగిపోయానని, తాను ఏమీ సుఖపడలేదని, తన మనుమరాలైనా ఎటన్నా పోయి, వేరేవారిని ఎవరినైనా వివాహం చేసుకుని సుఖంగా ఉండమని..సలహా ఇస్తారట. ఆ సినిమా నేను చూడలేదు కాబట్టి, డైలాగులు అక్కడ ఉన్నదున్నట్లు వ్రాయలేకపోయాను. ఒక దగ్గర రివ్యూ చదివాను.

**************

   ఆచారవ్యవహారాలు అంటే  విసుగు వచ్చే పరిస్థితి  ఉండకూడదు.  హిందువుల్లో కొందరు నచ్చినానచ్చకపోయినా తప్పనిపరిస్థితిలో భయంతో పాటిస్తున్నారు.

   ఆధునికకాలంలో కొందరు స్వదేశంలో ఉన్నవారు, కొందరు విదేశాలకు వెళ్లిన వారూ చాలా పద్ధతులను వదిలేస్తున్నారు. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులను సరళం చేసుకోవాలి.

అలాగని ఆచారవ్యవహారాలన్నీ వదిలేయమని నా అభిప్రాయం కాదు. ప్రాచీనులు ఎంతో విజ్ఞానంతో ఎన్నో మంచివిషయాలను మన ఆచారవ్యవహారాల్లో పొందుపరిచారు. అయితే, మారిన కాలమానపరిస్థితులను బట్టి  పూర్తిగా పాటించటం అందరికి కుదరకపోవచ్చు.
 
 కొందరు స్వార్ధపరులు, తెలిసీతెలియని వారి వల్ల కాలక్రమేణా కొన్ని ప్రక్షిప్తాలు .. మూఢాచారాలు కూడా ప్రవేశించాయి. ఇవన్నీ గమనించుకుని విచక్షణతో.. వివేకంతో ప్రవర్తించాలి.

కొన్ని పద్ధతులను పాటించటంలో కొంత కష్టం ఉండవచ్చు. జీవితంలో ఏదైనా పాటించాలంటే కొంతైనా కష్టపడాలి. ఒకపెద్ద చదువు చదవాలన్నా ఎంతో కష్టపడాలి.
 
అలాగే కొన్ని ఆచారవ్యవహారాలు కష్టంగా ఉన్నాకూడా, మన మంచికొరకు పాటించాలి. అయితే, అతి కాకూడదు. విపరీతమైన కష్టం ఉంటే.. అందరూ తట్టుకోలేరు. అందువల్ల, ఎవరి శక్తిని బట్టి వారు పాటించవచ్చు. 

*************

 పుణ్యం రావాలన్నా..పాపం పోవాలన్నా ..దైవభక్తి కలిగి, ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నించాలి. 

ఉపవాసాలు ఉండటం.. వంటివి కూడా పాటించవచ్చు. . ఉపవాసాలు  అతిగా చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
  
దైవస్మరణ చేయటం, కష్టాలలో ఉన్నవారికి సాయం చేయటం, దానధర్మాలు చేయటం..వంటివాటి ద్వారా పుణ్యాన్ని పొంది..పాపకర్మల భారాన్ని తగ్గించుకోవచ్చు.

 ఎక్కువ డబ్బుసాయం చేయలేనప్పుడు, కష్టాలలో ఉన్నవారికి కొంత సేవ చేయటం, శ్రమదానం చేయటం, గోసేవ,  పశుపక్ష్యాదులను ఆదుకోవటం...వంటివాటి ద్వారా  పుణ్యాన్ని పొంది..పాపకర్మల భారాన్ని తగ్గించుకోవచ్చు. 

కొందరు, దైవకీర్తనలు, భక్తిపాటలను..చక్కగా భక్తితో పాడుకుంటారు.. ఆడంబరత్వం లేకుండా ప్రేమతో పాడుకుంటారు. సంగీతం తెలియకపోయినా భక్తికీర్తనలు పాడుకోవచ్చు. భజనలు చేసుకోవచ్చు...ఇలా కూడా  పుణ్యాన్ని పొంది..పాపకర్మల భారాన్ని తగ్గించుకోవచ్చు. 

 దైవం పట్ల ప్రేమ ఉంటే చాలు. అనేక సందేహాలతో సతమతమవకుండా, బోలెడు డబ్బు ఖర్చు లేకుండా కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు..ఆరాధించుకోవచ్చు.

  దైవభక్తి కలిగి..ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తే, దైవకృపను పొందవచ్చు. సందేహాలు వస్తే..దైవాన్ని ప్రార్ధించుకోవచ్చు.

 *************************

ఆసక్తి ఉన్నవారు  కొన్ని విషయాలను లింక్ వద్ద చూడవచ్చండి..

 link.... ఆచారవ్యవహారాలు ...మరి కొన్ని విషయములు.....

 

 

Monday, January 1, 2018

అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి...








 

Add caption
అందరికి.. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి.

**********************************

konni vishayamulu...
 

 బ్రహ్మాండంలో భూమితో పాటు ఎన్నో లోకాలు ఉంటాయంటారు. ఆ లోకాల్లో పాపాలు చేసే జీవులు ఆ పాప ఫలితాలను, పుణ్యం చేస్తే పుణ్య ఫలితాలను అనుభవించటానికి భూమిపై కూడా జీవులుగా జన్మించటం జరుగుతుందేమో?

మనుషుల్లో శాంతితో ఉన్నభావాలు పెరిగితే ప్రపంచం శాంతిగా ఉంటుంది. మనుషుల్లో హింసతో కూడిన భావాలు పెరిగితే ప్రపంచంలో హింస ఎక్కువగా ఉంటుంది. 
  
తమ పాపపుణ్యకర్మల ప్రకారం మనుషులు  నరకాన్ని, స్వర్గాన్ని అనుభవించి..మిగిలిన కొంత కర్మతో తరువాత జన్మలలో మొక్కలు, క్రిమికీటకాదులుగానో, పశుపక్ష్యాదులుగానో,మనుషులుగానో జన్మిస్తారేమో.. అనిపిస్తుంది.

 ఎక్కువ పాపాలు చేసిన జీవులు క్రిమికీటకాదులు, పశుపక్ష్యాదులుగా జన్మించి, అందులో కొన్ని జీవులు సాటి జీవుల ద్వారా చంపబడతాయేమో?
 
 కొంత పుణ్యం చేసుకున్న జీవులు పశుపక్ష్యాదులుగా జన్మించినా కూడా, మనుషులు వాటిని చక్కగా పెంచి బాగా చూస్తారేమో? 
 
(ఉదా.. ఇళ్ళలో పెంచుకునే పెంపుడుజీవులు..)కొందరు కొంతకాలం వాటిని పెంచి, చంపి తినేవాళ్లూ ఉంటారు.

మనుషులైనా, ఇతరజీవులైనా కష్టాలు పడుతుంటే, వాటి కర్మ అవి అనుభవించనీ..అని వదిలేయటం సరైనపని కాదు. చేతనైనంతలో ఆదుకుంటే పుణ్యం వస్తుంది.
 
 
భూమి ఒక పరీక్షాలోకం  అనిపిస్తుంది. ఎలాంటిపరిస్థితిలోనైనా, దైవాన్ని నమ్మి సత్ప్రవర్తనతో జీవించిన వారికి ఉత్తమగతి 
లభిస్తుంది.
................
నాకు తోచినంతలో వ్రాసాను. ఏమైనా పొరపాట్లు ఉంటే, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.