koodali

Friday, October 27, 2017

పూజ మధ్యలో ...


నేను వీలు కుదిరినంతలో దైవ నామముల స్తోత్రాన్ని చదువుకుంటాను. 


అలా పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకూడదని, లేవటం జరిగితే , మళ్లీ మొదటనుంచి చదవాలన్నట్లుగా ఎవరో చెప్పగా విన్నట్లు గుర్తు. 


అయితే, పూజ వద్ద కూర్చున్నప్పుడు మధ్యలో ఫోన్ కాల్ రావటం, లేక కాలింగ్ బెల్ మోగటం జరిగినప్పుడు మధ్యలో లేవక తప్పదు. 


పూజలో కూర్చుని.. మధ్యలో ఫోన్ మోగుతుందో ? కాలింగ్ బెల్ మోగుతుందో? అనే  ఆలోచిస్తూ ఉంటే, పూజ పట్ల ధ్యాస అంతగా ఉండదు. 


ఉదయం కొద్దిసేపు పూజ చేసుకుని , తరువాత తిరిగి కొంతసేపు పూజ చేయాలనుకుంటే..


రోజువారిచర్యలో భాగంగా.. ఇంట్లో వాళ్ళు  బయటకు  వెళ్ళాక,  పూజ వద్ద కూర్చున్నప్పుడు   లాండ్ ఫోన్ మ్రోగటం, ఇరుగుపొరుగు వాళ్ళు లేక  కూరల వాళ్ళు కాలింగ్ బెల్ మ్రోగించటం జరిగితే ..ఇలాంటి  సమస్య వస్తుంది.


పూజకు కూర్చోవటానికి ముందే .. ఫోన్ ఆఫ్ చేయటం, కాలింగ్ బెల్ ఆఫ్ చేయటం ..అనేవి కుదరకపోవచ్చు. 


అలాగని పూజ మధ్యలో లేచినందువల్ల .. మళ్లీ మొదటి నుంచీ చదవాలంటే కష్టమే.  


అందువల్ల,  నాకు ఇంతే వీలవుతుంది, దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధించుకున్నాను.  


పూజలో మధ్యలో లేవవలసి వచ్చినా, తిరిగి మొదటి నుంచి చదవటంలేదు.


పూజ మొదలుపెట్టిన తరువాత స్థిరంగా కూర్చుని పూజచేసుకోవటం మంచిది. 


అయితే, అలా కుదరనప్పుడు మధ్యలో లేవవలసి వస్తే లేవక తప్పదు.


     ఎవరి శక్తిని బట్టి , వీలునుబట్టి వారు పూజ చేసుకోవటం మంచిదని నాకు అనిపించింది. 


 ఏది చేస్తే తప్పో? ఏది ఒప్పో ? అనుకుంటూ ఎన్నో సందేహాలతో సతమతమవటం కంటే , ముఖ్యంగా దైవంపై ధ్యాస ఉంచి పూజ చేసుకోవటం మంచిదనిపించింది.


 అలాగని, పూజ మధ్యలో ..అనవసరంగా ఎక్కువగా ఫోనులో మాట్లాడటం..వంటివి చేయటం సరైనది కాదు.



No comments:

Post a Comment