koodali

Friday, October 20, 2017

కొందరు పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు కూడా వత్తిళ్ళ మధ్య ....

మాకు తెలిసిన ఒకామెకు తన కొడుకు విదేశాలకు వెళ్లాలని ఎంతో కోరిక. 

అయితే, ఆ అబ్బాయికి విదేశాలకు వెళ్లటం అసలే ఇష్టం లేదు.


 ఆ తల్లి నాతో ఏమన్నదంటే, పక్కింటి వాళ్ల అమ్మాయి విదేశాలకు వెళ్లి చదువుకుని, ఉద్యోగంలో చేరి తల్లితండ్రికి బోలెడు డబ్బు పంపిస్తుందట.


ఆ డబ్బుతోనే ఇక్కడ వాళ్లు పెద్ద బిల్డింగ్ కట్టారనీ, ఇంకా బోలెడు నగలు కొన్నారని చెప్పింది. 


ఆ అమ్మాయి తల్లి వేసుకు తిరిగే నగలన్నీ కూతురు విదేశాల నుంచి పంపిన సొమ్ముతో కొన్నవేనట. 


ఇవన్నీ చెప్పి, తన కొడుకు వెళ్ళటం లేదంటూ చెప్పి వాపోయింది.


నేను ఏమన్నానంటే, ఇప్పుడు విదేశాల్లో కూడా అంత తేలిగ్గా ఉద్యోగాలు దొరకటం లేదు, అయినా అక్కడ వస్తువులు ధరలు ఎక్కువగా  ఉంటాయి.


ఇండియాలో  రేట్లు  తక్కువ.
 విదేశాలలో నెలకు మూడు లక్షలు ఆదాయం వచ్చినా, ఇండియాలో నెలకు ఒక లక్ష ఆదాయం వచ్చినా ఒకటే. అని చెప్పాను.

విదేశాలలో కొందరు పిల్లలు పడుతున్న కష్టాల గురించి కూడా వార్తలు వచ్చాయి ..


 విదేశాల్లో ఈ మధ్య పరిస్థితి అంత బాగోలేదు కదా! అని చెప్పినా ఆమె అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. 


ఎంతసేపూ..విదేశాలకు వెళ్తే బోలెడు డబ్బు సంపాదించవచ్చు కదా! అంటుంది. 


మొత్తానికి ఏం చెప్పారో కానీ, ఆమె కొడుకు విదేశాలకు వెళ్ళటానికి ఒప్పుకున్నాడట.


 వెళ్ళటానికి ముందు విదేశీ భాష నేర్చుకుంటే అవకాశాలు బాగుంటాయంటూ, ఈ సంవత్సరమే ఇంజనీరింగ్ పూర్తయిన అబ్బాయిని విదేశీభాష నేర్చుకోవటం కొరకు వేరే ఊర్లో చేర్పించారు.


విదేశాల్లో చదవాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్దపడాలి. 
ఒకవేళ ఏదైనా  సబ్జెక్ట్ ఫెయిల్ అయి ఇంకో సంవత్సరం చదవాలంటే మరింత డబ్బు ఖర్చవుతుంది.


తరువాత ఉద్యోగం వస్తే ఫరవాలేదు. 
ఉద్యోగం రాకుంటే,  బోలెడు డబ్బు వృధా అయిందంటూ సూటిపోటి మాటలు అంటే పిల్లలు తట్టుకోలేరు.

 అందువల్ల పిల్లలను విదేశాలకు పంపాలనుకునేవారు ముందే అన్నివిషయాలను అర్ధం చేసుకోవాలి. అంతేకాని, 
ఇరుగుపొరుగుతో పోల్చి పిల్లలపై ఒత్తిడి తేవటం సరైనది కాదు.

***********

అయితే కొందరు పిల్లలేమో పెద్దవాళ్లు వెళ్ళమనకపోయినా , 


విదేశాలకు వెళ్ళటం మాకూ ఇష్టం లేదు  కానీ , ఇక్కడ పెద్దగా అవకాశాలు లేవు కాబట్టి , కొంతకాలం విదేశాలకు వెళ్ళి వస్తాం. అని అంటారు.అది వేరే విషయం.  


***************

ఈ రోజుల్లో ఎంత చదివినా ఉద్యోగాలు లభించటం కష్టంగా ఉంది.


 అయితే, ఉద్యోగం లేక ఇంటి పట్టున ఉండే పిల్లల పట్ల కొందరు తల్లితండ్రులు తమకు తెలియకుండానే పిల్లలు బాధపడేలా మాట్లాడతారు.


 ఇంకా ఉద్యోగం రాలేదు, తిని ఇంట్లో ఖాళీగా కూర్చోకుంటే ఏదైనా పనికోసం గట్టిగా ప్రయత్నించవచ్చు కదా! అంటారు. 


ఇలా అనటం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారని కొందరు తల్లితండ్రి సమర్ధించుకుంటారు. 


అసలే ఉద్యోగాలు లేక పిల్లలు బాధపడుతుంటే తల్లితండ్రి కూడా అలా ప్రవర్తిస్తే  పిల్లలకు ఏం దిక్కు ?


****** ********

ఈ రోజుల్లో కొందరు పొత్తిళ్ళలో ఉన్న పిల్లలు కూడా 
త్తిళ్ళ మధ్య పెరుగుతున్నారంటే అతిశయోక్తి లేదు.

 ఉదా..ఈ రోజుల్లో చాలామంది  పసిపిల్లలు, తల్లి వద్ద పెరగవలసిన సమయంలో బాటిల్ పాలు త్రాగుతూ ఎక్కువ సమయం బేబీ కేర్ సెంటర్లలో పెరుగుతున్నారు.


మాకు తెలిసిన ఒక అమ్మాయి డెలివరి తరువాత నెలలోపే కెరీర్ ముఖ్యం.. అంటూ పసిపాపను పెద్దవాళ్ళ వద్ద వదిలి విదేశాలకు వెళ్ళి జాబ్లో చేరిపోయింది.


 ఆ పెద్దవాళ్లు ఇంటి పనిలో సహాయం కొరకు కొందరు సహాయకులను నియమించుకున్నారు.సహాయకులు రానిరోజున ఇబ్బంది ఉంటుంది. 

*************
ఒకవేళ పెద్దవాళ్ళు అనారోగ్య పరిస్థితిలో ఉంటే పిల్లల్ని  బేబీ కేర్ సెంటర్లలో పెంచుతారు కాబోలు. 

ఏంటో పాపం ఈ రోజుల్లో చాలామంది పిల్లల పరిస్థితి ఇలాగైపోయింది.


*************

పెద్దవాళ్ళను పిల్లలు సరిగ్గా చూడాలంటూ చట్టాలున్నాయి.  


మరి, చిన్నపిల్లలను పెద్దవాళ్ళు  దగ్గరుండి సరిగ్గా చూసుకోవాలంటూ చట్టాలు లేవా?


పెద్దవాళ్ళు తమ హక్కుల గురించి మాట్లాడతారు. 


 బాల్యంలో  తల్లితండ్రి ఆలనాపాలనాతో పెరిగే హక్కు పిల్లలకూ ఉంటుంది కదా! 


తల్లితండ్రి.. కెరీర్ కు, సంపాదనకు  మొదటి ప్రాధాన్యత, పిల్లల పెంపకానికి రెండో ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా.. పిల్లల పెంపకానికి చక్కటి ప్రాధాన్యతనివ్వాలి. 


పిల్లలు అందరూ చక్కగా హాయిగా  ఉండాలి.





No comments:

Post a Comment