koodali

Wednesday, June 7, 2017

చాలామంది మనుషుల మనస్సుల కల్తీ పెరిగిన ఈ రోజుల్లో ..


 
ఈ రోజుల్లో కల్తీల సమస్య ఎక్కువగా ఉంది.

చాలామంది మనుషుల మనస్సులలోనే స్వచ్చత తగ్గి, మనస్సుల కల్తీ పెరిగిన ఈ రోజుల్లో పరిస్థితి ఇలా కాక ఇంకెలా ఉంటుంది ? 

  చాలామంది లో డబ్బు యావ బాగా పెరిగింది. ఇలాంటి ప్రపంచంలో  ఇతరులను దోచుకోవటం, అన్యాయం, అధర్మం, మోసం, కల్తీలు వంటివి పెరుగుతాయి. 


  మనుషుల స్వభావాలు మంచిగా మారనంత కాలం సమాజంలో కల్తీలు, అవినీతి, అక్రమాలు, లంచాలు, నేరాలు, ఘోరాలు ..వంటివి జరుగుతూనే ఉంటాయి.


ఈ రోజుల్లో కుటుంబవ్యవస్థ, చదువు, ఉద్యోగాలు, సంస్కృతి.... ఎన్నో మార్పులు చెందాయి.

 చదువులు, ఉద్యోగాలు...వంటి కారణాల వల్ల ..పిల్లలు, పెద్దవాళ్ళు  ఎవరికి వారు విడిగా ఉండవలసి రావటం  జరుగుతోంది.బయట వండినవి తినవలసి వస్తోంది. ఏది కల్తీనో ఏది కాదో తెలుసుకోవటం కష్టంగా ఉంది.

చెడ్దపనులు చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. అయితే,సమాజంలో మంచి మార్పు రావాలంటే మనుషులు నైతిక విలువలను పాటించాలి.

చాలామంది పెద్దవాళ్ళు కెరీర్ మరియు డబ్బు సంపాదనే ముఖ్యంగా భావిస్తున్నారు.  తమ పిల్లలు కూడా బాగా చదివి, బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు .

పెద్దవాళ్ళు కెరీర్, డబ్బు సంపాదనే ధ్యేయం కాకుండా పిల్లలను ఆదర్శంగా పెంచి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి.

 నైతిక విలువలు కలిగిన వాళ్ళు కల్తీలు చేయరు. ఇంకొకరి సొమ్ముకు ఆశపడరు. ఇతరులను పీడించరు. ప్రపంచంలో ఉన్నవన్నీ తమకే చెందాలని అత్యాశ  చెందరు.ఇలాంటి మనుషులున్న ప్రపంచం చక్కగా ఉంటుంది.
 
అభివృద్ధి అంటే నైతికవిలువలున్న మనుషులు సంఖ్య పెరగటం. అంతేకానీ, నైతిక విలువలను పాటించటం తగ్గి..సౌకర్యాలు పెరగటం అభివృద్ధి కాదు. 


No comments:

Post a Comment