koodali

Wednesday, June 14, 2017

పిల్లలు విలువైన వాళ్ళు కారా ?

 
ఈ రోజుల్లో  చాలామంది పెద్దవాళ్ళు ఉపాధి కొరకు బైటకు వెళ్ళటం వల చిన్నపిల్లలను వేరే వారి వద్ద ఉంచి వెళ్తున్నారు.

 బయటివాళ్ళు పిల్లలను జాగ్రత్తగా చూడనూవచ్చు లేక కొందరు సరిగ్గా చూడకపోనూ వచ్చు.

**************
 పిల్లలను బయటివారి వద్ద ఉంచి వెళ్ళటం గురించి ఈ మధ్య ఒక వీడియో గురించి విన్నాను.

అందులో విషయమేమిటంటే, ..అమ్మా! విలువైన నగలు బయట వారి వద్ద  ఉంచి వెళ్తారా ? అని అడిగితే..

 ఒక తల్లి ఏమంటుందంటే, విలువైన వాటిని  పని వారి వద్ద, బయటవారి వద్ద ఎలా ఉంచుతాము? అంటుందట.

  ..అయితే,  పిల్లలు విలువైన వాళ్ళు  కారా  అమ్మా? అంటారట.


ఈ వీడియోను నేను చూడలేదు. వీడియోలో విషయాల గురించి ఎవరో చెబుతుంటే విన్నాను. అందువల్ల డైలాగులు ఉన్నవి ఉన్నట్లు రాయలేకపోయాను.
వీడియో  తయారు చేసిన  వారికి ధన్యవాదాలు.

***************

వస్తువుల విషయంలోనే ఎంతో జాగ్రత్తగా ఉంటున్నప్పుడు.. పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కదా!

పెద్దవాళ్లు తమ కష్టాల గురించీ, హక్కుల గురించి గట్టిగా మాట్లాడగలరు.

పిల్లలు తమ కష్టాల గురించీ, హక్కుల గురించి  మాట్లాడలేరు కదా!


  పెద్దవాళ్ళ హక్కుల గురించి  మాట్లాడే పెద్దమనుషులు ..మరి , చిన్నపిల్లలు  కూడా బాధపడకుండా వారిని  దగ్గరుండి పెంచాలని తల్లితండ్రులకు కూడా చెప్పవచ్చు కదా!
 
***************
 ఈ రోజుల్లో చాలా దారుణాలు వింటున్నాము. అందర్నీ నమ్మి, చిన్నపిల్లలను వారి వద్ద ఉంచే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.


పిల్లలు బాధపడుతుంటే తరువాత ఎంత డబ్బు ఉన్నా ఫలితమేముంటుంది.


పిల్లలకు తల్లితండ్రి వద్ద పెరగాలని ఉంటుంది. అది పిల్లల హక్కు.
 
పిల్లలు ఎదిగే వయస్సులో చక్కటి పౌష్టికారాన్ని ఇస్తూ, అనారోగ్యం వస్తే దగ్గరుండి చూసుకుంటూ, ఏది తప్పో, ఏది ఒప్పో చెపుతూ  పిల్లలను చక్కటి శారీరిక, మానసిక ఆరోగ్యంతో పెంచటం పెద్దవారి  బాధ్యత. 


కెరీర్ మరియు డబ్బు సంపాదనే ముఖ్యం కాదు.

No comments:

Post a Comment