koodali

Friday, November 4, 2016

సాయి సత్యవ్రతం గురించి నాకు ఈ విధంగా తెలిసిందండి. ...

Friday, January 7, 2011  
సాయి సత్యవ్రతం గురించి నాకు ఈ విధంగా తెలిసిందండి.


ఈ విషయం కొంతకాలం క్రితం జరిగింది. అప్పుడు మాకు చిన్నచిన్న కష్టాలు వచ్చాయి.

అప్పుడు ఒకరోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక ఎర్రరంగు కారుని వంకరటింకరగా ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నానట. ( అప్పట్లో మాకు కారు లేదు.)

తరువాత కారు ఒక దగ్గర ఆగింది. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ జరుగుతున్నట్లు కలలో కనిపించిందండి . అక్కడ శిరిడీసాయిబాబా పెద్ద విగ్రహం కూడా కనిపించింది.

అయితే ఈ కల అర్ధం నాకు తెలియలేదు.

నాకు అప్పటికి సాయిసత్యవ్రతం గురించి తెలియదు.

అప్పటికి నాకు మామూలుగా మనము చేసే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం గురించి మాత్రమే తెలుసు. మేము అన్నవరంలో కూడా ఈ వ్రతం చేసుకున్నాము.

అందుకని నేను ఏమనుకున్నానంటే, ఇదేమిటి ? కలలో సత్యనారాయణవ్రతం దగ్గర సాయిబాబా విగ్రహం కూడా కనిపించారు అనుకున్నాను.

ఆ కల అర్ధం కాక సరే ఏమైనా దేవునికి సంబంధించిన కల రావటం మంచిదే కదా ! అని సంతోషించాము.

తరువాత కొంతకాలానికి మేము శిరిడి వెళ్ళాము.

అక్కడ గుడి పరిసరాల్లో అన్నీ చూస్తోంటే , ఒక దగ్గర సాయిసత్యవ్రతం గురించిన వివరాలున్నాయి...అలా సాయిసత్యవ్రతం గురించిన వివరాలు తెలుసుకున్నాము.

నాకు నా కల గుర్తు వచ్చింది. ఆ కలకు సాయిసత్యవ్రతానికి సంబంధమున్నదేమో అని నాకు అనిపించింది.

 తరువాత దైవం దయవల్ల మేము సాయిసత్యవ్రతం ఆచరించుకున్నాము.
అంతా భగవంతుని దయ ...
..........................
 

No comments:

Post a Comment