koodali

Wednesday, November 9, 2016

చిల్లర సమస్యలు....మరికొన్ని విషయాలు..


500, 1000 నోట్లు వాడకుండా రెండురోజులు జీవించలేమా ?  100, 50, 10..నోట్లు అందరివద్దా ఉంటాయి కదా!

 రెండురోజులు ఊరుకుంటే 500, 1000 నోట్లు మార్చుకోవచ్చు. 

500, 1000నోట్లు తప్ప .. వంద, వందకు తక్కువ నోట్లు లేనివారు సామాన్యులు ఎలా అవుతారు?

తెల్లడబ్బు ఎప్పుడయినా మార్చుకోవచ్చు.  నల్లడబ్బు ఉన్నవారే బ్యాంకులకెళ్లి మార్చుకోలేరు. తెల్లడబ్బు వాళ్ళకు ఇబ్బందేమీ లేదుకదా! 

************
అయితే, తెల్లడబ్బుఉన్న వాళ్ళలో కూడా కొందరికి ఇబ్బంది వచ్చే అవకాశముంది.కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు తప్పవు మరి.

***************

నిజమే, ఇంతటితో నల్లడబ్బు పూర్తిగా పోదు. దేశంలో లంచం వంటివి పోవాలి.

లంచం  ఇచ్చి పని చేయించుకునే వ్యవహారంలో  ఇతరులకు డబ్బు ఆశ చూపటం లంచమే ...అయితే... డబ్బు బదులు వస్తువులు, ఉద్యోగాలు, పదవులు ఆశచూపటం కూడా లంచమే.ఇవన్నీ కూడా మారాలి.

******************

ఈ రోజుల్లో చాలామంది ప్రజలు స్వార్ధంగా ఆలోచిస్తున్నారు. 

ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు విలాసవంతంగా జీవించటం కొరకు  ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చుపెడుతున్నారు.

వ్యాపారులు కూడా బోలెడు ధరలు పెట్టి సరుకులు అమ్ముతున్నారు. 

 ఎన్నో లక్షలు పెట్టి స్థలాలు కొనటం... రిజిస్టర్ చేసుకునేటప్పుడు తక్కువధర చూపించటం వంటివి అలవాటయిపోయాయి.

 (అయితే టాక్సులు  కొంతవరకూ తగ్గిస్తే పన్ను ఎగవేతలు తగ్గుతాయేమో?)
..........................

 10వేలకు మించిన నగదు లావాదేవీలు బ్యాంక్ ద్వారా మాత్రమే జరిగేలా చట్టం తెస్తే నల్లడబ్బు తగ్గుతుందనే వారూ ఉన్నారు.(ఇది కొంతవరకు ఉపయోగపడవచ్చు.) 

 అయితే పెరిగిన టెక్నాలజీ వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉన్నాయి.

 ఆ మధ్యన కొన్ని బ్యాంకుల వాళ్ళ వెబ్సైట్లు హ్యాకింగ్ గురవటం గురించి  బ్యాంకుల వాళ్ళు, కస్టమర్లు.. కంగారుపడటం జరిగింది.

టెక్నాలజీ వల్ల అంతా మంచే జరుగుతుందనీ చెప్పలేం.టెక్నాలజీని వాడుతూ మోసాలు చేసే వారూ ఎక్కువయ్యారు.

******************

ఏదిఏమైనా సమాజంలో సమస్యలు తగ్గాలంటే టెక్నాలజీ అవసరమే కానీ , అంతకంటే ముందు నైతికవిలువలు పెంపొందేలా చర్యలు తీసుకోవాలి. 

మనుషులలో నైతిక విలువలు పెరిగినప్పుడే నల్లడబ్బు, లంచం.. వంటి సమస్యలు తగ్గి సమాజం బాగుపడుతుంది.


No comments:

Post a Comment