koodali

Friday, April 1, 2016

రాష్ట్ర విభజన .... తరువాత..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు విద్యాసంస్థలను మరియు కొన్ని నిర్మాణాలను  ఏర్పాటు చేయటంలో సహకరిస్తోంది. నిధులను ఇస్తోంది. ఇందుకు వారికి కృతజ్ఞతలు. 
...........................

ఝై ఘొత్తిముక్కల గారు..
రాష్ట్ర విభజన .... తరువాత..  టపా గురించి మీరు వ్రాసిన వ్యాఖ్యకు  నిన్ననే సమాధానం రాద్దామనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల వీలు కుదరలేదు. ఈ రోజు రాస్తున్నాను.

   హైదరాబాద్ తో కూడిన తెలంగాణా ఏర్పడిన తరువాత మీరు సంతోషంగా ఉండవచ్చు కదా !  హైదరాబాద్ ఆదాయం తో తెలంగాణా మిగతా భాగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.

 రాజధాని కూడా లేక  ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు ఇవ్వకూడదని  మీరు  అనటం దారుణం.

రాజధాని ఉన్న బీహార్ కే స్పెషల్ పాకేజ్ పేరిట  చాలా నిధులు కేటాయించారు.అప్పుడు ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు కదా! 

రాజధాని కూడా లేక ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇస్తుంటేనే అభ్యంతరం చెబుతారేమిటి ?

ఆర్ధికంగా వెనుకబడి ఉన్న కారణంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వవచ్చు. 

  ఇవ్వలేమనుకుంటే రాజధానికి ఎక్కువ నిధులు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక పాకేజి, పన్నుల రాయితీల వంటివి ఇవ్వాలి. 

ఆంధ్రప్రదేశ్ కు డిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని కూడా బీజేపీ వారు హామీ ఇచ్చారు.

 సమైక్యాంధ్రప్రదేశ్లో ఆంధ్ర భాగం అభివృద్ధి చెందలేదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సరైన ఆదాయం లేదు.

ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోకుండా తమ పెట్టుబడులను కూడా హైదరాబాద్ వద్దే కేంద్రీకరించి తప్పు చేసారు. అందుకు తగ్గ శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నారు.

ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్న విషయాలే.
..................

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి బిల్లులో పెట్టలేదని, పేపర్ మీద మాత్రమే పెట్టారని బీజేపీ వారు అంటున్నారు.  

 అయితే, చట్టసభలో ..  అప్పటి ప్రధానమంత్రి 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామంటే బీజేపీ వాళ్లు 10 సంవత్సరాలు ఇవ్వాలన్నారు. 

ఎన్నికలప్పుడు, తరువాత  కూడా ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ వాళ్ళు చాలాసార్లు చెప్పారు .

 అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ  చట్టసభలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలుపరచి  న్యాయం చేయవలసి ఉంది.
.................

మీరు వ్రాసిన వ్యాఖ్యకు సంబంధించి, హామీల గురించి మీ సందేహాలు  తీరటం కొరకు ..ఇక్కడ కొన్ని లింక్స్ కూడా ఇస్తున్నాను. 

(ఈ లింక్స్ ఇవ్వవచ్చో లేదో నాకు తెలియదు. ఎవరికైనా  ఏమైనా అభ్యంతరాలుంటే దయచేసి తెలియజేయగలరు.)


Search Results


ఈ క్రింద లింక్ వద్ద విడియోలు కూడా ఉన్నాయి . ..... 


Grant Special category status to Andhra Pradesh - Change.org




Special Economic Status for AP, if not special category - The ...







3 comments:

  1. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలకు కొంతకాలం పన్ను రాయితీలు కల్పిస్తే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి. రాష్ట్రం తన కాళ్ళమీద తాను నిలబడగలుగుతుంది. ఇందువల్ల కేంద్రానికీ కొంత భారం తగ్గే అవకాశం ఉంది.

    ReplyDelete
  2. Jai Gottimukkala గారు..ఈ టపా గురించి మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయాలు నావి. ప్రస్తుతానికి చర్చించాలనుకోవటం లేదు.

    ReplyDelete