koodali

Monday, April 18, 2016

ఇది వివక్ష కాదా ?


దేవాలయంలో అందరూ సమానమే.. పేద, ధనిక, సామాన్యులు, వీఐపీలు..అంటూ తారతమ్యాలు  ఉండకూడదు  అంటారు. 

 ఈ ప్రకారం చూస్తే  అందరూ సాధారణ క్యూలైన్ లోనే వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి.

 అయితే, కొన్ని దేవాలయాలలో సాధారణ క్యూలైన్ తో పాటు రకరకాల ఖరీదుల టికెట్స్  ఉంటాయి. ఎవరి ఆర్ధిక స్తోమతను బట్టి వారు టికెట్ తీసుకుని  దర్శనం చేసుకుంటున్నారు.  వీఐపీలకు స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి.


 పేదభక్తులు సాధారణ క్యూలైన్లో గంటల తరబడి నిలుచుని  పిల్లలతో నీరసంగా వేచి చూస్తూ ఉంటే.... విఐపిలు  మరియు  ఎక్కువ డబ్బు పెట్టి టికెట్ కొనుక్కున్నవారు   సునాయాసంగా వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు. ఇది వివక్ష అనిపించటం లేదా  ? 


ఇవన్నీ ఇలా జరగటానికి అనేక విషయాలుంటాయి.  అనారోగ్యంతో ఉన్నవారు, చంటి పిల్లలు ఉన్నవారు,  వయసు పైబడ్ద వారు...వీరి విషయంలో ధనిక, పేద, సాధారణ, వీఐపీ అనే తేడా లేకుండా శీఘ్రదర్శనం కల్పించవచ్చు.


 మిగతావారు సాధారణ క్యూలైన్లోనే వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అయితే  ఇలా జరగటానికి ఒప్పుకునేవారు ఎంతమంది ఉంటారు ?


 ఎక్కువ సమయం క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకోవాలంటే చాలామందికి కష్టమే. ఎక్కువమంది టికెట్ కొనుక్కుని త్వరగా దర్శనం చేసుకోవటానికే ఇష్టపడతారు. 

వివక్ష తొలగాలంటూ  నీతులు చెప్పటం తేలికే. ఆచరించటం కష్టం.

 మరి .. ఈ విషయంలో  ఏం  చేయాలి ?



No comments:

Post a Comment