koodali

Wednesday, April 6, 2016

ఐ టీ తో పాటు ఇతర రంగాలను కూడా ప్రోత్సహించాలి.

ఈ రోజుల్లో ఉపాధి అవకాశాల విషయంలో గందరగోళం నెలకొని ఉంది. చాలామంది ఐటీ రంగం అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అది నిజమే కావచ్చు.


 అయితే ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువత అభిప్రాయాలను గమనిస్తే చాలామంది  తమ ఉద్యోగాల పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. 

ఐటీ ఉద్యోగాలతో జాబ్ సెక్యూరిటీ లేదని వాళ్లు అంటున్నారు.  చాలామంది  ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి ఎదుర్కుంటున్నారు. 


కొందరి విషయంలో నైట్ షిఫ్ట్ లో పనిచేయటం వలన ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి. అనారోగ్య సమస్యలూ వస్తున్నాయి. 


ఇలాంటి కారణాల వల్ల చాలామంది  ఇంజనీరింగ్ చదివిన వారు మరియు ఐటీ ఉద్యోగులు కూడా బ్యాంకింగ్ మొదలైన ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.


 బ్యాంకింగ్  రంగంలో కూడా  ఉద్యోగ వత్తిడి, బదిలీ సమస్యలు ఉన్నా కూడా జాబ్ సెక్యూరిటి ఉంటుందనే ఉద్దేశంతో  అలా ఇష్టపడుతున్నారు. 

ఇంజనీరింగ్ చదివిన వాళ్లలో చాలామంది పరిస్థితి ఇలా గందరగోళంగా తయారయ్యింది. 


ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి  ఇంజనీరింగ్ చదివిన వారికి ఉపాధి కల్పించినంత మాత్రాన నిరుద్యోగ సమస్య తీరిపోదు. దేశంలో వేరే రంగాలు ఎన్నో ఉన్నాయి.

 ఇంజనీరింగ్ చదవని వారికీ  ఉపాధి అవకాశాలు లభ్యమయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 


పాతకాలంలో  ఎన్నో వృత్తులు  ఉండేవి. కాలేజీల్లో చదువుకోకపోయినా  ఇంటిపట్టున ఉండి పెద్దవాళ్ల ద్వారా వృత్తివిద్యలు  నేర్చుకుని ఉపాధి పొందే వ్యవస్థ ఉండేది.

 అప్పుడు ఉపాధి కోసం ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఎక్కువమందికి ఉండేది కాదు.

 ఈ రోజుల్లో ఉపాధి పొందాలంటే బోలెడు డబ్బు కట్టి చదువుకోవటం.. తరువాత ఉద్యోగం వెదుక్కోవటం అనే పరిస్థితి ఉంది. 

 ఎందరో ప్రజలు సరైన ఉపాధి లభించక ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు వెళ్లటం జరుగుతోంది. 

 చాలామంది  ఉపాధి కోసం గల్ఫ్ వంటి దేశాలకు తరలివెళ్తున్నారు. వెళ్ళి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న వారూ ఉన్నారు.

 ఇలా వెళ్ళే వారిలో ఎందరో వలస కూలీలు కూడా ఉన్నారు.


ప్రజలు వేరే దగ్గరకు వలసలు పోవలసిన పరిస్థితి ఉండటం , రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండటం.. అభివృద్ధి అనిపించుకోదు.


 ప్రభుత్వాలు ..  ఐ టీ  తో  పాటు   ఇతర రంగాలను కూడా ప్రోత్సహించాలి. 

ఐటీ రంగాన్ని మాత్రమే  అభివృద్ధి చేయటం వలన నిరుద్యోగ సమస్య పరిష్కారమవదు.

 ఎవరి రాష్ట్రాన్ని వారు, ఎవరి దేశాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే  ప్రజలు  ఇతర  రాష్ట్రాలకు , ఇతర దేశాలకు వలసపోయే పరిస్థితి తగ్గుతుంది.


నల్ల డబ్బు కూడబెట్టిన ధనవంతుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు దేశానికి సంపద తిరిగి లభిస్తుంది.

 సంపద ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాలను సృష్టించుకోవచ్చు. తద్వారా నిరుద్యోగ సమస్య తీరి దేశం అభివృద్ధి చెందుతుంది. 


2 comments:

  1. ఐటీ బాంకులు లాంటి సేవా రంగాలు పరికరాల వంటివి. ఇవి ఇతర రంగాలకు చేయూత ఇస్తాయి తప్ప అవే బ్రహ్మాండమయిన విషయాలు అనుకోలేము. భారత్ లాంటి దేశం శివారు రంగాల మీద ఆధారపడలేదు. జాతీయ సంపద & ఉపాది అనే ఉభయ లక్ష్యాలను సాదించాలంటే ప్రాధమిక రంగాలు సర్వతోముఖాభివృద్ది చెందాలి.

    వ్యవసాయం లాభసాటి కావాలంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర అవకాశాలు (ఉ. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, చేనేత లాంటి చేతిపనుల ఉత్పత్తులకు మంచి ధర, జానపద కళలకు ఆదరణ వగైరా) ఎంతో అవసరం. వీటితో పాటు భూసంస్కరణ, కమతాల ఏకీకరణ, చిన్న తరహా నీటి పారుదల బలోపేతం, రైతులకు శాస్త్రీయ విధానాలలో శిక్షణ, చిరుధాన్యాలకు ప్రోత్సాహకాలు లాంటివి ఎన్నో ముఖ్యం. అదే సమయంలో పాడి పౌల్ట్రీ మత్స్యకార రంగాలను గత దురాదరణ నుండి కాపాడాలి.

    గత కొన్ని దశాబ్దాలుగా సంక్షోభంలో ఉన్న గ్రామీణ వ్యవస్తను పునరుద్దరించడం కష్టమే కానీ అసంభవం కాదు. ఇంజనీరింగ్ చదువుపై సారించిన దృష్టిలో పదో వంతు ప్రాధమిక విద్య & వృత్తి విద్యలలో చూపిస్తే బృహత్తర ఫలితాలు సాదించవచ్చు. అలాగే బుల్లెట్ రైళ్ళు బదులు పల్లె రోడ్లు వగైరా.

    ఆకలి చావులు, ఆత్మహత్యలు & ఈతి బాధలు లేని భారత దేశమే గమ్యంగా మనం పయనిస్తే రాకెట్లు ఐటీ బులెట్ రైళ్ళు వంటివి వాటంతట అవే వస్తాయి.

    ReplyDelete
  2. అవునండి ..

    ఆకలి చావులు, ఆత్మహత్యలు & ఈతి బాధలు లేని భారత దేశమే గమ్యంగా పయనించాలి.





    ReplyDelete