koodali

Wednesday, April 20, 2016

కొన్ని ఆచారాలు.....


శ్రీశైలంలో గర్భగుడిలో శివుణ్ని అందరూ తాకి నమస్కరించుకోవచ్చు. ఇందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు.

అయితే, అన్ని శివాలయాలలోనూ గర్భగుడిలోని శివలింగాన్ని తాకటానికి  అందరికీ ప్రవేశం ఉండదు. ఒక్కొక్క దగ్గర ఒక్కో ఆచారాలు ఉన్నాయి.



 చాల దేవాలయాలలో  శనిత్రయోదశి పర్వదినాలలో  నవగ్రహాల వద్ద శనిదేవునికి మహిళలు  స్వయంగా తైలాభిషేకం చేస్తుంటారు. ఇందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు.


అయితే,  కొన్ని దేవాలయాలలో కొన్ని విశేష ఆచారాలు ఉన్నాయి.   అలా విశేష ఆచారాలు ఉండటానికి వెనుక మనకు తెలియని అనేక కారణాలు ఉండి ఉండవచ్చు.



శనిదైవానికి పూజలు చేసుకోదలచిన  భక్తులు  ఆచారాలను పాటిస్తూనే పూజలు  చేసుకునే సౌలభ్యం చాలా దేవాలయాలలో ఉంది. అలాంటి దేవాలయాలకు వెళ్లి చక్కగా శనిదేవునికి అభిషేకం పూజలు  చేసుకోవచ్చు. 



 దేవతలకు స్త్రీలు, పురుషులు అనే  తేడా ఏమీ ఉండదు.


  శబరిమలై వెళ్ళేవారిలో చాలామంది  మండలం రోజులు దీక్ష తీసుకుంటారు.  మండలదీక్ష విషయంలో పురుషులకు  సమస్య ఉండదు.


 స్త్రీలకు మండలం దీక్ష తీసుకోవటానికి నెలసరి అడ్దంకి ఉంటుంది. ఈ కారణంతో నెలసరి ఉండే స్త్రీలకు ప్రవేశం కల్పించి ఉండకపోవచ్చని  పండితులు అంటున్నారు.



ఈ మధ్య కొందరు రుతుక్రమం గురించి మాట్లాడుతూ అది ప్రకృతి సిద్ధమయినది కాబట్టి ..మైల.. అంటూ వేరుగా చూడకూడదు, నెలసరి సమయంలో కూడా దేవాలయానికి వెళ్తే తప్పేమిటి అన్నట్లు మాట్లాడుతున్నారు.



మనస్సులో దైవప్రార్ధన చేసుకోవటానికి  ఎవరికీ ఎప్పుడూ ఎటువంటి అడ్దంకీ లేదు.


అయితే, నెలసరి  సమయంలో  అలసట, చిరాకు, నీరసం  వంటి లక్షణాలు ఉంటాయి. కొంతమంది స్త్రీలలో నెలసరి సమయంలో విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది.


 ఇలాంటప్పుడు తీర్ధయాత్రలు, పూజలు చేయటానికి అలసట అనిపిస్తుంది.


బహిష్టు సమయం లో స్త్రీలు నీరసంగా ఉంటారు కాబట్టి కొంత విశ్రాంతి అవసరం. అందుకే  ఆ సమయంలో ఎక్కువ పనులు చేయకుండా మైల అంటూ కట్టడి చేసారు. ఇలాగైనా ఆ నాలుగురోజులూ స్త్రీలకు విశ్రాంతి లభిస్తుంది.


నెలసరి సమయంలో గర్భసంచి,  అండాశయం  సున్నితంగా ఉంటుంది.  ఈ సమయంలో  అదేపనిగా పనిచేస్తే గర్భసంచి జారే అవకాశం కూడా ఉంది.


ఆధునికకాలంలో స్త్రీలు నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోవటం లేదు.


ఈ రోజుల్లో చాలామంది మహిళలు  చిన్నవయస్సుకే నడుం నొప్పి, నెలసరిలో  అవకతవకలు, నీరసం.. వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.


స్త్రీల మంచి కోరి  పెద్దలు ఏర్పరిచిన  ఆచారాలలోని అసలు ఉద్దేశాన్ని గ్రహించాలి  .    


 భవిష్యత్తులో ...స్త్రీల హక్కుల పేరుతో.... నెలసరి సమయాలలోనూ దేవాలయాలలోకి ప్రవేశం కల్పించాలని ఎవరైనా మొదలుపెడితే .. అందరూ  ఖండించాలి. ఇది స్త్రీలు అందరికీ సంబంధించిన విషయం. 



4 comments:

  1. నాస్తికుడిని అయిన నేను వ్యాఖ్య రాయడం మీకు నచ్చకపోతే డిలీట్ చేయండి.

    ప్రభుత్వ ధనం తీసుకోనంతవరకు దేవాలయాలను శాసించే అధికారం ప్రభుత్వానికి ఉండకూడదు. అనాదిగా వస్తున్న ఆచారాలలో (అంటరానితనం/జంతుబలి లాంటి నేరాల మినహా) ప్రభుత్వం/పార్టీలు/కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదు.

    ఫలానా గుడి యొక్క ఆచారాలు శాస్త్రీయమా కాదా అన్న చర్చ అనవసరం. గుళ్ళు ఉన్నది భక్తుల సౌకర్యార్ధం తప్ప మిగిలిన వారి కొరకు కాదు. ఆచారాల వలన భక్తులకు ఇబ్బంది ఉంటె వారే పెద్దలతో చర్చించవచ్చు కానీ బయట వారి ప్రమేయం ఉండరాదు.

    దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉ. మహిళా కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన "ఒకే పని, ఒకే కూలి" దొరకడం లేదు. పట్టణాలలో మహిళలకు భద్రత కరువయింది. మరో పక్క బీదాబిక్కీ అప్పుడే పుట్టిన ఆడపిల్లలను అమ్ముకునే దౌర్భాగ్యపరిస్తితి. ఇటువంటి జీవన్మరణ సమస్యలను వదిలేసి శని సింగనాపురం గర్భగుడి ప్రవేశం, గుళ్ళలో పాశ్చాత్య దుస్తుల అనుమతి వంటి వాటికి పాకులాడితే స్త్రీలకూ ఒరిగేది ఏమీ లేదు.

    నా భాష కటువుగా ఉంటె మన్నించండి.

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    ..............

    దురదృష్టం ఏమిటంటే.. ఈ రోజుల్లో కొన్ని దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు తీసుకోవటానికి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    దేవాలయాల ఆదాయంపై వచ్చే వడ్డీతో దేవాలయాలే ( దేవాలయాల ద్వారా..) ప్రజలకు తక్కువ ధరకు విద్య, వైద్యం, ఆహారం అందిస్తే బాగుంటుంది.

    (పూర్వకాలంలో దేవాలయాలలో ఉచిత విద్య, వైద్యం, ఆహారం ..అందించే విధానాలు ఉండేవంటారు.)
    ..................


    మీరన్నట్లు..అనాదిగా వస్తున్న ఆచారాలలో (అంటరానితనం/జంతుబలి లాంటి నేరాల మినహా) అనవసర జోక్యాలు ఉండకూడదు.

    ఫలానా గుడి యొక్క ఆచారాలు శాస్త్రీయమా కాదా అన్న చర్చ అనవసరం. గుళ్ళు ఉన్నది భక్తుల సౌకర్యార్ధం తప్ప మిగిలిన వారి కొరకు కాదు. ఆచారాల వలన భక్తులకు ఇబ్బంది ఉంటె వారే పెద్దలతో చర్చించవచ్చు కానీ బయట వారి ప్రమేయం ఉండరాదు.


    దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉ. మహిళా కార్మికులకు చట్టప్రకారం రావాల్సిన "ఒకే పని, ఒకే కూలి" దొరకడం లేదు. పట్టణాలలో మహిళలకు భద్రత కరువయింది. మరో పక్క బీదాబిక్కీ అప్పుడే పుట్టిన ఆడపిల్లలను అమ్ముకునే దౌర్భాగ్యపరిస్తితి. ఇటువంటి జీవన్మరణ సమస్యలను వదిలేసి శని సింగనాపురం గర్భగుడి ప్రవేశం, గుళ్ళలో పాశ్చాత్య దుస్తుల అనుమతి వంటి వాటికి పాకులాడితే స్త్రీలకూ ఒరిగేది ఏమీ లేదు.
    ..........

    మీ భాష కఠినంగా ఏమీ లేదు. అయినా కొన్ని విషయాలలో కఠినంగానే ఉండాలి.

    మన్నించాలి అనే మాటలు ఎందుకులెండి. ఆస్తికులం అని చెప్పుకుంటూ వితండవాదాలు చేస్తున్న కొందరికంటే మీరు చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. కొన్ని సార్లు కొందరు (మీరు కాదు లెండి) నేను మతపరమయిన విషయాలపై వ్యాఖ్య రాయడాన్ని తప్పు పట్టారు. అందుకే అడగాల్సి వచ్చింది.

      "ధర్మ పరిషద్" లాంటి సంస్థను ఏర్పాటు చేసి దేవాలయాల ఆజమాయిషీ వారికిస్తే బాగుంటుంది. ఇందులో పండితులు, దాతలు & భక్తుల ప్రతినిధులు ఉండాలి. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు & బాబాలు ఉండకూడదు.

      Delete
    2. మీరన్నట్లు..అనాదిగా వస్తున్న ఆచారాలలో (అంటరానితనం/జంతుబలి లాంటి నేరాల మినహా) అనవసర జోక్యాలు ఉండకూడదు.
      ................
      అయితే, ఇప్పుడు ఏమనిపిస్తుందంటే...

      కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చి గొడవలు జరుగుతున్నప్పుడు పెద్దమనుషులు సమస్యల పరిష్కారానికి ప్రయత్నించవచ్చు...

      అయితే , ఆ రంగాలలో నిపుణులు అయిన వారి సలహాలను కూడా తీసుకుని సరైన కోణాలనుంచి ఆలోచించి సమస్యలను పరిష్కరించటం కొరకు ప్రయత్నించాలి.

      Delete