koodali

Saturday, June 13, 2015

ఆంధ్రప్రదేశ్..తెలంగాణా..

ఆంధ్రా వాళ్లు విదేశాల్లో చాలామంది  ఉన్నారు. అక్కడ ఎంతో కష్టపడి అభివృద్ధి లోకి వస్తారు..ఆ దేశాల అభివృద్ధిలో భాగస్వామ్యులవుతారు.

ఆంధ్రా వాళ్లు పరాయి రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అక్కడి అభివృద్ధి పనులలో ఆంధ్రుల పాత్ర ఎక్కువగానే ఉందట.  ఉదా.. గుజరాత్ లో సోలార్ విద్యుత్ అభివృద్ధి చెందటంలో ఆంధ్ర వాళ్ల పాత్ర ముఖ్యమైనదని వార్తలు వచ్చాయి.


 నిజమే, ఆంధ్ర వాళ్ళు ఇతర ప్రాంతాల అభివృద్ధిలో ఎంతో కృషి చేయటం బాగానే ఉంది. మరి సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటంలో ఎందుకు కృషి చేయరో అర్ధం కావటం లేదు.


 ఇక్కడ సౌకర్యాలు లేవంటారు. వేరొక దగ్గరకు వెళ్లి అష్టకష్టాలు పడి పైకి  రావటానికి ఇష్టపడతారు కానీ, సొంత రాష్ట్రం అభివృద్ధి చెందటానికి వాళ్లకు ఉత్సాహం లేకపోవటం చాలా బాధాకరం.


 ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వనరులు ఉన్నాయి. డెల్టా భూములున్నాయి. సముద్రప్రాంతం ఉంది. పోర్టులు అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే ఎంత బాగుంటుంది.


ఆంధ్రుల కష్టంతో  తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్న వాళ్లు కొందరు  ఆంధ్రులను తిడుతుంటే బాధగా అనిపించటం లేదా ? మన ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవాలనే ఆరాటం కలగటం లేదా? ఆత్మాభిమానం అనిపించటం లేదా? 


వీటన్నింటికీ ముఖ్యకారణం..ఆంధ్రులకు తమ ప్రాంతం అంటే చిన్నచూపు ఎక్కువ అనిపిస్తుంది. మాతృభాష అంటే మమకారం అంతగా ఉండదు, ఐకమత్యం కూడా తక్కువే.అనిపిస్తుంది.

................

ఉమ్మడిరాష్ట్రంలో ఆంధ్రప్రాంతము నిరాదరణకు గురయ్యింది.


 డెల్టాభూములు, ఎన్నోవనరులు, సముద్రతీరం, అరకు వంటి శీతల ప్రదేశాలు, ఉండి కూడా  ఏ అభివృద్ధి జరగలేదు. ఆంధ్రప్రాంతం వాళ్లు చాలామంది  తమ పెట్టుబడులను హైదరాబాద్ ప్రాంతం వద్ద పెట్టడం జరిగింది. 


గత ప్రభుత్వాలు  ఆంధ్రప్రాంతాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్నే అభివృద్ధి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు.  మన రాజధానే కదా అనుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది...ఇదంతా మా ప్రాంతం, మీ రాజధాని కాదు పొమ్మన్నారు.

......................

ఇప్పుడు రాజధాని లేక లోటు రెవెన్యూతో నడిరోడ్దు మీద ఉన్నాము. విభజన సందర్భంగా పార్టీలు  పార్లమెంట్ సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారు. 


ప్రత్యేక హోదానూ ఇస్తాము, రాయలసీమ, ఉత్తరాంధ్రా అభివృద్ధి చేస్తాము, రాజధాని కట్టిస్తాము..అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు.


రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రులకు అన్యాయం చేసాయి.. అని జాతీయపార్టీలను తిడుతున్నాము కానీ, 


  విభజనకు ముఖ్య కారకులు సాటి తెలుగువాళ్ళే కదా!

..................

ఎలాగైతేనేమి రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ  వాళ్ళు మిగులు ఆదాయంతో ఉన్నారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్నారు.


 మరి ఇంతకాలమూ..ఆంధ్రాదోపిడీ వల్ల తెలంగాణా వెనుకబడిపోయింది..అన్నారు. విభజన జరిగిన వెంటనే ధనిక రాష్ట్రంగా మారిపోయింది కాబోలు. 


 తెలంగాణా సంపదను ఆంధ్రావాళ్లు దోచుకోవటమే నిజమయితే, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో పేద రాష్ట్రంగా ఎందుకు ఉంటుంది. దోచుకున్న సొమ్ముతో మిగులు రాష్ట్రంగానే ఉండేది కదా !

....................

 విభజన తరువాతైనా మనశ్సాంతి ఉంటుందిలే అనుకుంటే,  విభజన తరువాత కూడా ఎప్పుడూ గొడవే. నీళ్లు, విద్యుత్.. ఆంధ్రావాళ్ళు దోచుకుంటున్నారో అని ఇంకా ఒకటే గొడవ.


రాజధానితో సహా రాష్ట్రం వచ్చినా తృప్తి లేదా ? ఇంకా ఏం కావాలి ?


విభజన హామీ అయిన ప్రత్యేక హోదా ఇవ్వమని ఆంధ్రా వాళ్లు కేంద్రాన్ని అడగటం మొదలుపెట్టగనే,  వెంటనే తెలంగాణా వాళ్లు రంగంలోకి దిగి తెలంగాణా కూడా వెనకబడి ఉంది. మాకూ ప్రత్యేక్ హోదా ఇవ్వాల్సిందే అంటారు.


 ఒక ప్రక్క ధనిక రాష్ట్రం అని చెబుతూనే.. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం తెలంగాణా కూడా పేద రాష్ట్రం అని చెప్పేస్తారు. 


ఇదంతా ఎంత ఘోరం అంటే, ఆంధ్రవాళ్ళు అభివృద్ధి చెందకూడదని కొందరు తెలంగాణా వాళ్ల అభిప్రాయంగా అనిపిస్తోంది.


మిగులు రాష్ట్రం తెలంగాణాకు ఆర్ధికంగా లోటు లేదు. హైదరాబాద్ ఆదాయంతో వాళ్లు మిగిలిన తెలంగాణా అభివృద్ధి చేసుకోవచ్చు.  ప్రత్యేక హోదా ఎందుకు?

..............

ఆంధ్రావాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మిగతా రాష్ట్రాల వాళ్లుకూడా అడుగుతారు కాబట్టి  ఇవ్వలేమేమో..అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కేంద్ర ప్రభుత్వంలో కొందరు. ఎప్పటికైనా ఇస్తాము...అంటూ మభ్యపెడుతున్నారు కొందరు.


ఆంధ్రవాళ్లు మెతకమనుషులు , వాళ్లకు ఐకమత్యం ఉండదు,  రోడ్దెక్కి గొడవలు చేయరులే  అని వాళ్ల అభిప్రాయమేమో? 


అయితే, ఆంధ్రవాళ్లకు అన్యాయం చేసిన  కాంగ్రెస్ పని ఏమయిందో అందరికీ తెలుసు.


కేంద్రం వాళ్లు ఎప్పుడు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. 


 మంచిగా అడిగితే పనులు కానప్పుడు, ఇక అప్పుడు మన హక్కుల కోసం పోరాటం చేయవలసివస్తుంది.

ప్రస్తుతానికి ఆంధ్ర వాళ్లు  ప్రత్యేక హోదా సంగతి పక్కన పెట్టి అందుకు ప్రతిఫలంగా  ఎన్నో రాయితీలను , మరెన్నో సౌకర్యాలను రాబట్టుకోవటం ప్రస్తుత పరిస్థితిలో తెలివైన పని అనిపిస్తోంది..
 

..............

కొందరు ఏమంటున్నారంటే, విభజన అనేది మాప్ మీద మాత్రమే జరిగింది. నిజంగా తెలుగు ప్రజలలో విభేదాలు లేవు అంటున్నారు. విభేదాలు లేనప్పుడు విభజన జరిగేదే  కాదు. 


 హైదరాబాద్లో ఉండే ఆంధ్రావాళ్లు కొందరు , అక్కడ తమకు ఇబ్బందులు రాకుండా ఇలాంటి మాటలు  చెబుతుంటారు.


 ఇలాంటి  వారికీ  ఒక విజ్ఞప్తి ఏమంటే.. మీ స్వంత ప్రయోజనాల కోసం ఆంధ్రరాష్ట్ర  ప్రయోజనాలను బలిచేయకండి.అని. 

.................

మరికొందరు తెలంగాణా వాళ్ళు,  ఆంధ్ర ప్రజల పట్ల మాకు కోపం లేదు. అంటారు. మీరు వేరు.. మేము వేరు అంటూ అన్యాయంగా విభజించి ఇప్పుడిలా కబుర్లు చెప్పటం ఆశ్చర్యం కదా ! 

.................... 
అయితే, తెలంగాణాలో.. డబ్బే సర్వస్వం అనుకోకుండా న్యాయానికి విలువ ఇచ్చే వ్యక్తులూ ఉన్నారు.   
.............

ఇక నీటి సంగతి. ఆంధ్రప్రదేశ్ కైనా తెలంగాణాకైనా మరే రాష్ట్రానికైనా 
 నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. అది ఎవరి దయాదాక్షిణ్యాల మీదా ఆధారపడి వచ్చినవి కాదు.


 నదుల పరీవాహక ప్రాంతాల వారికి ఆ నీటిపై హక్కు ఉంటుంది. ఎవరి వాటాను వారు వాడుకోవటంలో తప్పు లేదు.


అయితే, ఎగువ ప్రాంతాల వాళ్లు  అన్నీ మేమే వాడుకుంటాము అంటే ఎవరూ ఒప్పుకోరు. తీర్పు చెప్పటానికి న్యాయస్థానాలున్నాయి. ప్రజలు ఎవరైనా ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్లవచ్చు.
............

తెరాసా పార్టీ వాళ్లు ఆంధ్రా వాళ్లను దొంగలు, దోపిడీదార్లు, ఇంకా చాలా రకాలుగా తిట్తారు. వాళ్లకు అభివృద్ధిపనులలో వాడుకోవటానికి ఆంధ్ర వాళ్ళ సహాయం కావాలి.అవసరం తీరిన తరువాత మళ్లీ తిట్టిపోస్తారు.


 ఉమ్మడి రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వటానికి తెలుగుదేశం పార్టీ ని వాడుకున్నారు. విభజన జరిగిన తరువాత ఆంధ్రపార్టీ ఇక్కడ ఉండటానికి వీల్లేదు ..అంటున్నారు.


 ఆంధ్రప్రజలకు  రాష్ట్ర విభజన జరగటం ఇష్టం లేకపోయినా, తెలుగుదేశం పార్టీ వాళ్లు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు. అయినా ఆంధ్రప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించారు.


 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కష్టంలో ఉంది. 
కొంతకాలం వరకు ..తెలుగుదేశం పార్టీ చాలా ఎక్కువ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించవలసి ఉంది. ఆంధ్రను అశ్రద్ధ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రజల నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంది.ఇక తరువాత మీ ఇష్టం.

............

 గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రాంతాలలో పరిస్థితి గందరగోళంగా ఉంది. 

తమిళనాడు వంటి పొరుగురాష్ట్రాలు తెలివిగా జీవిస్తున్నారు. తెలుగువాళ్లే ఇలా తయారయ్యారు.
 భవిష్యత్తులో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.

8 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete

  2. మాతృభూమిని అభివృద్ధి చేసుకుంటే ఉపాధికోసం ఎక్కడెక్కడికో వెళ్లే అవసరం అంతగా ఉండదు కదా! ఒక వేళ వెళ్లినా సొంతప్రాంతములో కూడా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేస్తే మంచిది. పరాయి వాళ్లు ఎప్పుడయినా తరిమేస్తే మాతృభూమిలో మనకంటూ ఒక స్థానం ఉంటుంది.

    ఆంధ్రవాళ్ళు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడం వల్ల వాళ్లకు, నగరానికి, తెలంగాణాకు లాభం జరిగింది. ఆంధ్రవాళ్ళు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టి ఉంటే వాళ్ళకు ,ఆంధ్రకు కూడా లాభం జరిగేది.

    తెలంగాణా ఆదాయం ఆంధ్రాలో ఖర్చు చేసేవారు అని మీరు పదేపదే అంటున్నారు. ఈ విషయం గురించి నా అభిప్రాయాలు పై టపాలో స్పష్టంగా చెప్పినా కూడా , మీ వాదననే మీరు వినిపిస్తున్నారు.
    .
    తెలంగాణా ఆదాయంతో బ్రతికే అవసరం ఆంధ్రాకు లేదు. ఆంధ్రాలో ఎన్నో వనరులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాను అభివృద్ధి చేయకుండా అణచివేసారు.

    ఆంధ్ర వాళ్ళు ప్రత్యేక హోదా అడిగితే దానిని వ్యతిరేకించే హక్కు ఇతరులకు ఉందంటున్నారు. మరి మీరు తెలంగాణా అడిగినప్పుడు దానిని వ్యతిరేకించే హక్కు ఆంధ్రులకు లేదన్నారు కదా!

    తెలంగాణా వారు కూడా ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తున్నారు అని మీకు తెలియదు కాబోలు.

    రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు హామీలు ఇచ్చినవారికి ఇవన్నీ తెలియదా? బీహారుకు కూడా ఇవ్వమనండి ఎవరు వద్దన్నారు. అవన్నీ అమలుచేయలేనప్పుడు హామీలు ఇవ్వటం దేనికి ?

    ఆంధ్రవాళ్లకు ఇచ్చిన హామీ గురించి మాట్లాడితే అడ్దుపడుతున్నారు. మరి తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మీరు డిమాండ్ చేయలేదా ?

    నదీజలాల పంపిణీ విషయం అడగటానికి కోర్టు కాకపోతే ట్రిబ్యునల్ ఉంటుంది.

    ఆంధ్రాకు నీరు ఇచ్చామని చెబుతున్నారు. నాగార్జునసాగర్ నిర్మాణం కావటానికి ఆంధ్రాకు చెందిన ముక్త్యాల రాజా గారు ఎంతో కృషి చేసారు. నాగార్జునసాగర్ నీరు అందరూ వాడుకుంటున్నారంటే వారి కృషి ఎంతో ఉంది. వారు సొంత ఆస్తిని కూడా ఖర్చుచేసారట. అయినా వారి గురించి తెలంగాణా వారు చెప్పుకోరు.

    (ఈ విషయాల గురించి తెలుసుకోవాలంటే నాగార్జున సాగర్ డాం గురించి లింక్ వద్ద చూడవచ్చు.)


    నేతలు తిట్టుకుంటుంటే ప్రజలకు నష్టమే. రాష్ట్రాలను అభివృద్ధి చేయకుండా ఒకరినొకరు ఆధిపత్యపోరాటాలలో మునిగిఉంటే ప్రజలకు నష్టం కాదా ?

    తెలంగాణా వచ్చిన తరువాత కూడా ఇరు రాష్ట్రాల మధ్యా ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అంతా ప్రశాంతంగా ఉన్నట్లు మీకు అనిపించటమే ఆశ్చర్యం. ఇప్పుడు జరుగుతున్న గొడవలు గొడవలు కాదా ?

    ReplyDelete
    Replies
    1. నందికొండ ప్రాజెక్టు[మార్చు]
      చరిత్ర[మార్చు]
      ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్" ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజా అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. కె. ఎల్. రావు ద్వారా పూర్వం హైదరాబాదు నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. 'నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై మాచెర్ల దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.


      నాటిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్ధాపన చేసారు

      శంకుస్థాపన ఫలకం.
      మద్రాసు ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో నందికొండ ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. 1952లో ఖోస్లా కమిటీ నందికొండ డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. విజయవాడ నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.

      ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు ఢిల్లీలో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య మొదలగు పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను 1952లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి. గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబర్ 10న (మన్మధ నామ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు) అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది.

      నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. నార్ల వెంకటేశ్వర రావు మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.

      బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.

      Delete
    2. Nagarjuna Sagar Dam - Wikipedia, the free encyclopedia

      Nagarjuna Sagar Dam ..అంటే నందికొండ ప్రాజెక్టు.

      Delete
  3. ఆంధ్ర..తెలంగాణా గురించి మనకు ఎన్నో చర్చలు జరిగాయి. ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉన్నప్పుడు ఎంత వాదించినా ఫలితం ఉండబోదు. మీ అభిప్రాయాలు మీవి..నా అభిప్రాయాలు నావి.

    నా అభిప్రాయాలను బ్లాగ్ లో వ్రాసుకుంటున్నాను. ఈ విషయాల గురించి చర్చ వద్దండి.

    ReplyDelete
  4. what you have written is dignified and correct

    ReplyDelete
  5. కృతజ్ఞతలండి.

    ReplyDelete
  6. ఒక పక్క ఆంధ్ర అభివ్రుద్ది చెందిపొతుందేమో అని బాధ, ఒక పక్క విదిపోయి నష్టపొయారని పేరు వస్తుందన్న భయం, భవిష్యత్ పై పెద్దగా లేని హోప్స్,
    పెట్టుబడిదారులకి నమ్మకం కోల్పోయేలా చేసిన వీళ్ళ ద్వేష పూరిత మాటలు, దూరంగా ఉన్న విదేశాలకి ఐతే మన గురించి తెలీదనుకుంటూ పెట్టుబడి కోసం తిరుగుళ్ళు,
    ఎవడి కష్ట్టాన్నొ పెరిగిన పదింతల ఆదాయాన్ని పంచుకుంటున్న ఉద్యమ వీరులు ,
    మరింత దిగజారిన మిగతా జిల్లాల ప్రజల పరిస్థితి, ఐదేళ్ళ తర్వాత ప్రజలందరి కష్టాలు తీరిపోతాయంటు మేకపోతు గంభీరాలు.

    lets wait and see.

    ReplyDelete