koodali

Tuesday, March 11, 2014

Ragging




 Ragging.................




దయచేసి  క్రింది  వ్యాఖ్యలు  ( comments )  చదవండి ..... 









5 comments:

  1. I surprised..such videos in it blog..why ..any reason..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఇలాంటి ర్యాగింగ్ సంఘటనలు ఈ మధ్యనే మన రాష్ట్రంలో కూడా జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చూసి నాకు చాలా బాధ కలిగింది.

      ర్యాగింగ్ వల్ల ఎందరో పిల్లలు బాధలను అనుభవిస్తున్నారు.

      పిల్లల బాధను పట్టించుకుని ర్యాగింగ్ కు చక్కటి పరిష్కారం గురించి పెద్దవాళ్ళు ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ దృశ్యాలను వేశాను.

      ఈ రోజుల్లో ఎందరు పిల్లలు ర్యాగింగ్ బారిన పడి బాధలను అనుభవిస్తున్నారో పెద్దవాళ్ళు తెలుసుకోవాలి.

      ఇలాంటి దృశ్యాలు చూడటానికే మనకు ఒళ్ళు జలదరిస్తే ర్యాగింగ్ రాక్షసుల బారిన పడిన..... సున్నితమనస్తత్వాలు గల పిల్లలు అనుభవించే వేదనను అందరూ అర్ధం చేసుకోవాలనే ఈ తాపత్రయం.

      ర్యాగింగ్ పాల్పడేవారి పట్ల కఠినచర్యలు తీసుకోవాలి. టీనేజ్ పిల్లలు ఇతరులను వేధించటానికి అనేక కారణాలుంటాయని మానసికవేత్తలు అంటున్నారు.


      ఈ రోజుల్లో టెక్నాలజీ ద్వారా తేలికగా అందుబాటులోకి వచ్చిన అసభ్యకరమైన దృశ్యాలు, హింసను ప్రేరేపించే దృశ్యాల ప్రభావం కూడా వ్యక్తులపై గణనీయంగా ఉంటోంది.


      విపరీతంగా పెరిగిన చదువుల వత్తిడి, కుటుంబంలో ఆప్యాయత లోపించటం....వంటి కారణాల వల్ల కూడా పిల్లలలో ఇతరులను వేధించి సంతోషించే మనస్తత్వం పెరుగుతోందని అంటున్నారు.

      పిల్లలు ఇలా తయారవకుండా చక్కటి ప్రవర్తనతో పెరిగేలా అందరూ శ్రద్ధ వహించాలి.

      పిల్లలను సాధ్యమయినంత వరకూ హాస్టల్స్లో వేయకుండా పెద్దవాళ్ళు దగ్గరుండి చదివించుకుంటే మంచిదనిపిస్తుంది.

      Delete

  2. ఈ దృశ్యాలను వేయటానికి నేను ఎంతో ఆలోచించాను. చాలా ఇబ్బందిగా అనిపించింది.

    కళ్ళకు కట్టినట్లు చూపిస్తే పెద్దవాళ్ళకు విషయాలు అర్ధమవుతాయని వేయవలసి వచ్చిందండి.

    మీ వ్యాఖ్యను చదివిన తరువాత ఈ దృశ్యాలను తీసివేస్తున్నాను.

    ReplyDelete
  3. ధన్యవాదములు..ఒకసారి మా అమ్మాయి తను చదివే కాళ్ళేజిలో మేనేజ్మెంటు వారు బహిరంగంగా రాగింగ్ చెయ్యకుండా నిరోధించడము వలన బాత్ రూముల్లో రాగింగ్ చేస్తున్నరని చెప్పింది ..
    నేను కాలేజీ వారికి ఫోన్ చేసి నేను ఫలానా టి.వీ చానల్ నుండి మాట్లాడుతున్నాను అని జరుతున్న విషయం చెప్పి ఒకవేళ తగు జాగ్రత్తలు తీసుకోక పోతే విజువల్స్ ని చానల్లో చూపిస్తానని చెప్పాను ..
    అప్పుడు పిల్లలనే కమిటీ గా వేసి బాత్ రూముల్లో కూడా నిఘా పెట్టి అరికట్టారు..మా పాప ఇంటికొచ్చి డాడీ ఎవరో టీ.వీ వాళ్ళు ఫోన్ చేసారట ..అని చెప్పి ప్రశాంతంగా రోజూ కాలేజ్ కి వెళ్ళేది..
    ఇలా చిన్న చిన్న ఉపాయాలతో వీటిని అరికట్టవచ్చు..కాని కొంత మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లాడు ఎవర్నీ రాగింగ్ చెయ్యలేకపోవడాన్ని అవహేళనగా చేసి మాట్లాడతారు..ఇదీ నేటి సమాజ స్థితి..

    ReplyDelete

  4. మీరు చాలా మంచిపని చేసారు. మనసుంటే మార్గాలూ ఉంటాయి. ఎన్నో ఉపాయాలూ ఉంటాయి.

    ఇంకా, సమాజంలో నైతిక విలువలను పెంపొందించటం ద్వారా వీటిని అరికట్టే ప్రయత్నం చేయవచ్చు.

    ( కొంత మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లాడు ఎవర్నీ రాగింగ్ చెయ్యలేకపోవడాన్ని అవహేళనగా చేసి మాట్లాడతారు..ఇదీ నేటి సమాజ స్థితి..)

    నిజమేనండి, యువత తప్పుదారి పట్టడానికి ఇలాంటి పేరెంట్స్ చాలావరకూ కారణం.

    ReplyDelete